Home

»

Latest News

`దిల్` రాజు సెంటిమెంట్.. వ‌రుణ్ తేజ్ తోనూ కొన‌సాగేనా!

May 23, 2022 3:23PM

మెగా కాంపౌండ్ హీరోల‌కి క‌లిసొచ్చిన నిర్మాత‌ల్లో `దిల్` రాజు ఒక‌రు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రామ్ చ‌ర‌ణ్, అల్లు అర్జున్, వ‌రుణ్ తేజ్, సాయితేజ్.. ఇలా దాదాపుగా ఆ క్యాంప్ హీరోలంద‌రితోనూ రాజు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను నిర్మించారు. ఇక `దిల్` రాజు తాజా చిత్రం `ఎఫ్ 3`లోనూ వ‌రుణ్ తేజ్ ఓ క‌థానాయ‌కుడిగా న‌టించిన సంగ‌తి తెలిసిందే. వేస‌వి కానుక‌గా ఈ నెల 27న‌ `ఎఫ్ 3` తెర‌పైకి రాబోతోంది.

ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. గ‌తంలో ఇదే మే నెలని ల‌క్ష్యంగా చేసుకుని  మెగా కాంపౌండ్ హీరోల స‌మేతంగా రాజు కొన్ని చిత్రాల‌తో సంద‌డి చేయ‌గా.. అవి మంచి విజ‌యం సాధించాయి. ఆ వివ‌రాల్లోకి వెళితే.. అల్లు అర్జున్ తో రాజు నిర్మించిన `ఆర్య‌` (2004), `ప‌రుగు` (2008) చిత్రాలు ఇదే మే నెల‌లో జ‌నం ముందుకు రాగా, అవి విజ‌య‌ప‌థంలో ప‌య‌నించాయి. అలాగే సాయితేజ్ తో నిర్మించిన `సుప్రీమ్` (2016) కూడా స‌క్సెస్ బాట ప‌ట్టింది. మ‌రి.. వ‌రుణ్ తేజ్ విష‌యంలోనూ ఈ మే సెంటిమెంట్ కొన‌సాగుతుందేమో చూడాలి.

కాగా, `ఎఫ్ 3`ని వ‌రుస విజ‌యాల ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి తెర‌కెక్కించ‌గా.. సీనియ‌ర్ స్టార్ విక్ట‌రీ వెంక‌టేశ్ మెయిన్ హీరోగా న‌టించారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com