![]() |
![]() |

మాస్ మహారాజ్ రవితేజ కథానాయకుడిగా తాజాగా ఓ చిత్రం తెరకెక్కించడానికి దర్శకుడు రమేష్ వర్మ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. నవరాత్రుల సందర్భంగా ఈ నెల 18న పూజా కార్యక్రమాలతో సినిమాను లాంఛనంగా ప్రారంభించనున్నారని తెలిసింది. 'క్రాక్' చిత్రీకరణ పూర్తి చేసిన వెంటనే రవితేజ ఈ సినిమా చిత్రీకరణ మొదలు పెడతారని తెలిసింది.
గతంలో రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ 'వీర' సినిమా చేశారు. అది ఆశించిన ఫలితం ఇవ్వలేదు. పల్లెటూరిలో, పట్నంలో... గెటప్ పరంగా రెండు వెరియేషన్లు ఉన్న క్యారెక్టర్ రవితేజ చేశారు. కొత్త సినిమాలో రెండు పాత్రలు చేస్తున్నారని తెలిసింది. ఈసారి రవితేజతో దర్శకుడు ద్విపాత్రాభినయం చేయిస్తున్నారట. సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారట.
ఓ కథానాయికగా 'ఇస్మార్ట్ శంకర్', 'మిస్టర్ మజ్ను' సినిమాల్లో నటించిన నిధీ అగర్వాల్, మరో కథానాయికగా 'మజ్ను', 'అజ్ఞాతవాసి', 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాల్లో నటించిన అనూ ఇమ్మాన్యుయేల్ ఎంపిక అయినట్టు ఫిల్మ్ నగర్ టాక్.
![]() |
![]() |