![]() |
![]() |
.webp)
ఈ రోజు తమిళ ప్రజల ఆరాధ్య దైవం తమిళ సినిమా రంగానికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు తెచ్చిన రజనీ కాంత్ పుట్టిన రోజు. అభిమానులందరు తలైవా అని పిలుచుకునే రజనీ ఈ రోజు తో 74 వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాడు.ఈ సందర్భంగా తమిళ సినిమా రంగానికి చెందిన వాళ్ళే కాకుండా ఇతర బాషా నటులు కూడా ట్విటర్ వేదికగా రజనీ కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పుడు ఈ కోవలో తమిళ అగ్ర హీరోలలో ఒకరు రజనీకి బర్త్ డే విషెస్ చెప్పడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది.
ప్రముఖ నటుడు ధనుష్ రజనీ పెద్ద కూతురు సౌందర్య ని వివాహం ఆడిన విషయం అందరికి తెలిసిందే. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆ తర్వాత కొన్ని కారణాలవల్ల పరస్పర అంగీకారంతో ఇద్దరు విడిపోయారు. అలా విడిపోయిన కానీ ధనుష్ కి రజనీ మీద ఉన్న అభిమానంలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. ఈ రోజు రజనీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా ధనుష్ తన ట్విట్టర్ లో హ్యాపీ బర్త్ డే తలైవా అంటు రజనీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. అలాగే తన గురువుకి దైవానికి అభివాదం చేస్తున్నట్టు నమస్కారం సింబల్స్ ని కూడా ధనుష్ పోస్ట్ చేసాడు..ఇప్పుడు ఆ పోస్ట్ చూసిన రజనీ అండ్ ధనుష్ ఫాన్స్ ఫుల్ ఖుషీతో ఉన్నారు. రజనీ కాంత్ తన మావయ్య అయినా కూడా ధనుష్ ఏ రోజు కూడా మావయ్య అని పిలిచేవాడు కాదు. తలైవా అనే పిలిచేవాడు. ధనుష్ కి రజనీ అంటే అంత అభిమానం.

అలాగే రజనీ సినిమా రిలీజ్ అయిన రోజు ధనుష్ కి పండగ రోజు అని చెప్పవచ్చు. ఫస్ట్ డే బెనిఫిట్ షో కి వెళ్తాడు. రజనీని దేవుడిలా కొలిచే ధనుష్ తాను సినిమాల్లోకి రావడానికి కారణం రజినీనే అని చాలా సార్లు చెప్పాడు. అలాగే రజనీ అభిమానులు కూడా సోషల్ మీడియా లో రజనీ కి బర్త్ డే విషెస్ చెప్తూ నానా హంగామా చేస్తున్నారు. అలాగే రజని స్టైల్ కి చెందిన ఎడిట్ వీడియోలుని కూడా పోస్ట్ చేస్తున్నారు.
![]() |
![]() |