![]() |
![]() |
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరి చూపూ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘సలార్’పైనే ఉంది. ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఈ సినిమా రూపొందడంతో ఎక్కడా లేని హైప్ వచ్చింది సినిమాకి. సెప్టెంబర్ 28న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడి డిసెంబర్ 22కి మారడంతో ప్రభాస్ అభిమానులు కొంత నిరాశ చెందినప్పటికీ ఎంతో ఓపికగా, మరెంతో ఉత్సాహంగా డిసెంబర్ 22 కోసం ఎదురుచూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ‘సలార్’ కలెక్షన్లు కొల్లగొట్టి కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని అభిమానులు ఎంతో నమ్మకంతో ఉన్నారు.
ఇదిలా ఉండగా.. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సినిమాలో యాక్షన్ పార్ట్ ఎక్కువగా ఉండడంతో ‘సలార్’కి ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారు. సాధారణంగా హింస్, యాక్షన్ పార్ట్ ఎక్కువగా ఉన్న సినిమాలకు ఎ సర్టిఫికెట్ ఇస్తుంటారు. డిసెంబర్ 1న విడుదలై ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ‘యానిమల్’ మూవీకి కూడా ఎ సర్టిఫికెటే ఇచ్చారు. ఇటీవలి కాలంలో ఎ సర్టిఫికెట్ వచ్చిన సినిమాలు సూపర్‌హిట్ అవుతున్నాయన్న సెంటిమెంట్ కూడా ఉండడంతో తప్పకుండా ‘సలార్’ విషయంలో అది వర్కవుట్ అవుతుందని అందరూ భావిస్తున్నారు. ‘సలార్’కి వున్న క్రేజ్ దృష్ట్యా డిసెంబర్ 22న అర్థరాత్రి 12 గంటలకే ఫస్ట్ షో వేస్తారని తెలుస్తోంది. ఈ సినిమా మొదటిరోజు కలెక్షన్లతోనే కొత్త రికార్డులు క్రియేట్ చెయ్యడం ఖాయమని ట్రేడ్‌వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 55 నిమిషాలుగా ఉందని సెన్సార్ ధృవీకరించింది. సెన్సార్ రిపోర్ట్ వచ్చిన తర్వాత సినిమాకి మరింత హైప్ పెరిగింది. రెండు నెలల క్రితమే డిసెంబర్ 22ని లాక్ చేసిన ‘సలార్’ మేకర్స్ మొదటి రోజే భారీ కలెక్షన్లు రాబట్టే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు.
![]() |
![]() |