![]() |
![]() |

2024 సంక్రాంతి సీజన్ పై పలు సినిమాలు కర్చీఫ్ వేశాయి. సంక్రాంతి పోరుకి సిద్ధమంటూ 'గుంటూరు కారం', 'హనుమాన్', 'ఈగల్', 'ఫ్యామిలీ స్టార్', 'సైంధవ్', 'నా సామి రంగ' ఇలా పలు మూవీ టీమ్స్ ప్రకటించాయి. అయితే వీటిలో చివరికి నిలిచే సినిమాలు ఎన్నో అనే అనుమానం అందరిలో ఉంది. అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే పొంగల్ పోరు నుంచి 'ఫ్యామిలీ స్టార్' తప్పుకుంది. ఇప్పుడు ఆ లిస్టులో మరో రెండు సినిమాలు చేరినట్లు తెలుస్తోంది.
'గుంటూరు కారం', 'హనుమాన్', 'సైంధవ్' సినిమాల థియేట్రికల్ బిజినెస్ ఇప్పటికే పూర్తయింది. ఆ చిత్రాల ప్రచార కార్యక్రమాల్లో కూడా వేగం పెరిగింది. అయితే 'ఈగల్', 'నా సామి రంగ' సినిమాల బిజినెస్ మాత్రం ఇంకా క్లోజ్ కాలేదని, ఈ రెండు చిత్రాలు సంక్రాంతికి రావడం అనుమానమేనని అంటున్నారు. అదే జరిగితే 'గుంటూరు కారం'కి అదృష్టమని చెప్పొచ్చు.
సంక్రాంతి అనేది సినిమాలకు అతి పెద్ద సీజన్. ఆ టైంలో ప్రేక్షకులు కనీసం రెండు సినిమాలను ఆదరిస్తుంటారు. మిగతా టైంతో పోలిస్తే కలెక్షన్లు కూడా కాస్త ఎక్కువ వస్తాయి. అందుకే సంక్రాంతికి రావడానికి మేకర్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. అలా అని ఎక్కువ సినిమాలు విడుదలైనా థియేటర్ల సమస్య తలెత్తుతుంది. 2024 సంక్రాంతికి పలు సినిమాలు వస్తుండటంతో అలాంటి సమస్య తలెత్తే అవకాశముంది అనుకున్నారంతా. అయితే ఇప్పుడు ఒక్కొక్కటిగా సినిమాలు వాయిదా పడుతుండటం 'గుంటూరు కారం'కి కలిసొచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కావల్సినన్ని థియేటర్లు దొరుకుతాయి. పైగా మెజారిటీ ప్రేక్షకుల మొదటి ఆప్షన్ కూడా గుంటూరు కారమే అవుతుంది.
![]() |
![]() |