![]() |
![]() |

ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ కు ప్రమాదం జరిగింది. న్యూజిలాండ్ లో 'కన్నప్ప' సినిమాలోని ఒక పాట చిత్రీకరణ సమయంలో ఆమె కాలికి గాయమైంది. దీంతో మేకర్స్ షూటింగ్ ని వాయిదా వేశారు.
మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తున్న పాన్ ఇండియా మూవీ 'కన్నప్ప'. విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, మోహన్ బాబు, శరత్ కుమార్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ న్యూజిలాండ్ లో జరుగుతోంది. ఈ క్రమంలో కన్నప్ప కోసం ఓ పాటను షూట్ చేస్తున్నప్పుడు కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ కాలు ఫ్రాక్చర్ అయింది. ఈ ఘటన ఆదివారం జరిగింది. మేకర్స్ ఈ పాట షూటింగ్ ని ప్రస్తుతానికి హోల్డ్‌లో ఉంచారు.
![]() |
![]() |