![]() |
![]() |

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటిస్తోన్న సినిమా షూటింగ్ ఈరోజు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. జూన్ 1న ఈ సినిమా లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్‌గా శ్రీలీలను ఎంపిక చేశారు. దానికి సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను దసరా రోజున చేశారు. నిజానికి ఆమె కంటే ముందు నాయికగా ఏజెంట్ ఫేమ్ సాక్షి వైద్యను ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి.
రామోజీ ఫిల్మ్‌సిటీలో వేసిన సెట్స్‌లో రామ్, ఫైటర్స్‌పై బోయపాటి ఓ హై-ఆక్టేన్ యాక్షన్ ఎపిసోడ్‌తో రెగ్యులర్ షూట్‌ను మొదలుపెట్టాడు. #BOYAPATIRAPO అనే హ్యాష్‌ట్యాగ్ పోస్టర్‌ను షేర్ చేసిన రామ్, "And it begins!" అని ట్వీట్ చేశాడు. ఈ మూవీకి టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్‌లో ఒకడైన తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. భారీ యాక్షన్ డ్రామాలకు పేరుపడిన బోయపాటి.. అదే తరహాలో రామ్‌తోనూ యాక్షన్ డ్రామాను తీస్తున్నాడు. ఈ మూవీలో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయని సమాచారం.
ఇప్పటివరకూ రామ్ చేసిన సినిమాలు ఒకెత్తయితే, ఈ మూవీ ఇంకో ఎత్తు అవుతుందని యూనిట్ మెంబర్స్ చెప్తున్న మాట. 'అఖండ' లాంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత బోయపాటి తీస్తున్న సినిమా కావడంతో BOYAPATIRAPO మూవీపై అంచనాలు భారీగానే వెల్లువెత్తుతున్నాయి. మునుపటి మూవీ 'ది వారియర్' బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటంతో ఈ సినిమాపై రామ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు.

![]() |
![]() |