Home  »  News  »  'చెన్నై లవ్ స్టోరీ' బాక్సాఫీస్ ర్యాంపేజ్.. ఫస్ట్ డే ఊహించని కలెక్షన్స్.!

Updated : Jul 25, 2026

కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన తాజా రొమాంటిక్ డ్రామా 'చెన్నై లవ్ స్టోరీ' బాక్సాఫీస్ వద్ద విజృంభిస్తోంది. అంచనాలను మించి మొదటి రోజే ప్రీమియర్లు, ఫస్ట్ డే  కలెక్షన్లతో కలిపి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 12.3 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. 

లవ్ స్టోరీ జానర్‌లో ఒక యంగ్ హీరో సినిమాకి ఈ స్థాయిలో భారీ ఓపెనింగ్స్ రావడం టాలీవుడ్‌లో అరుదైన మైలురాయిగా నిలిచింది. ప్రేమకథా చిత్రాలకు యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ ఇచ్చే ఆదరణ ఎంత గొప్పదో ఈ సినిమా సాధించిన వసూళ్లు మరోసారి రుజువు చేస్తున్నాయి.

గతంలో 'బేబీ' వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తో కల్ట్ ట్రెండ్ సృష్టించిన సాయి రాజేష్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ఎస్కేఎన్, సాయి రాజేష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడు రవి నంబూరి ఈ హృద్యమైన ప్రేమకథను వెండితెరపై ఎంతో భావోద్వేగభరితంగా ఆవిష్కరించారు. కథలో ఉన్న నిజాయితీ, ఎమోషనల్ కనెక్ట్ ప్రేక్షకుల హృదయాలను తాకుతుండటంతో సినిమాకు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతమైంది.

తొలిరోజే ఏకంగా రూ. 12.3 కోట్ల గ్రాస్ సాధించి బాక్సాఫీస్ వద్ద విజృంభిస్తున్న ఈ 'చెన్నై లవ్ స్టోరీ' ఫస్ట్ వీకెండ్‌లో మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

 

Chennai Love Story, Box Office, Day 1 Collection, Kiran Abbavaram, Sri Gouri Priya

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.