![]() |
![]() |

కారవాన్‌లో హీరోయిన్ ఒంటరిగా ఉన్నప్పుడు, ఒక వ్యక్తి సడెన్ గా లోపలికి వచ్చి షర్ట్ విప్పేస్తే ఎలా ఉంటుంది? ఊహించడానికే భయంగా ఉంది కదా? ఇలాంటి చేదు అనుభవమే మన టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్‌కు ఎదురైంది.
ఎన్నో సక్సెస్ ఫుల్ మూవీస్ తో రెండు దశాబ్దాలుగా కోట్లాదిమంది గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది కాజల్ అగర్వాల్. పెళ్లి చేసుకుని, మాతృత్వపు తీపిని ఆస్వాదించిన తర్వాత కూడా.. 'భగవంత్ కేసరి'తో రీఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఇటీవల 'ది ఇండియా స్టోరీ'తో ప్రేక్షకులను పలకరించిన కాజల్ చేతిలో 'NBK 111', 'రామాయణ' వంటి పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.
అయితే రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కాజల్ తనకు ఎదురైన ఒక చేదు సంఘటనను గుర్తుచేసుకుంటూ ఆవేదన వ్యక్తం చేసింది. కొద్దిరోజుల క్రితం ఒక సెట్‌లో షూటింగ్ పూర్తి చేసుకున్న కాజల్, రిలాక్స్ అవ్వడానికి తన కారవాన్‌లోకి వెళ్లి ఒంటరిగా రెస్ట్ తీసుకుంటోంది. సరిగ్గా అదే సమయంలో ఊహించని సంఘటన ఎదురైంది.
ఎలాంటి పర్మిషన్ అడగకుండా.. ఆ సినిమాకి పనిచేస్తున్న ఒక అసిస్టెంట్ డైరెక్టర్ హఠాత్తుగా కాజల్ కారవాన్‌లోకి దూసుకొచ్చాడు. అసలు ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే, ఆ వ్యక్తి కాజల్ ముందే తన షర్ట్ విప్పేశాడు. అతను చేసిన పనికి కాజల్ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుంది. తీరా చూస్తే, అతడు తన ఛాతీపై 'కాజల్' పేరును పెద్ద టాటూగా వేయించుకుని.. "చూడండి మేడమ్, మీరంటే నాకు ఎంత అభిమానమో!" అంటూ చూపించాడట.
అభిమానం చూపించడంలో తప్పు లేదు, కానీ ఒక మహిళ ఒంటరిగా ఉన్న సమయాన్ని చూసి, ఆమె ప్రైవేట్ స్పేస్‌లోకి అనుమతి లేకుండా ప్రవేశించి, అలా షర్ట్ విప్పడం ఎంతవరకు సమంజసం?. ఆ నిమిషంలో కాజల్ ఎంత భయానికి గురైందో ఆమె మాటల్లోనే అర్థమవుతోంది.
"నా పేరును పచ్చబొట్టుగా వేయించుకున్నందుకు ఒక నటిగా నాకు సంతోషమే, కానీ అనుమతి లేకుండా నా వ్యక్తిగత గదిలోకి రావడం ఏమాత్రం సరైన పద్ధతి కాదు" అని కాజల్ అతనికి సున్నితంగానే హెచ్చరిస్తూ చెప్పిందట.
సెలబ్రిటీల ప్రైవసీ, ముఖ్యంగా షూటింగ్ సెట్లలో కారవాన్ల వద్ద హీరోయిన్ల భద్రత ఎంత ప్రమాదంలో ఉందో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది.
Kajal Aggarwal, Caravan Incident, Assistant Director
![]() |
![]() |