Home  »  News  »  బాలయ్య హెల్త్ అప్‌డేట్ ఇచ్చిన నారా బ్రహ్మణి.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్.!

Updated : Jul 25, 2026

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తన కొత్త సినిమా 'NBK111' షూటింగ్ లో భాగంగా యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో ఆయన మోకాలికి గాయమైంది. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన చిత్ర యూనిట్ సభ్యులు ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆయనను వెంటనే హైదరాబాద్ లోని ఒక ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్య బృందం ఆయనకు పరీక్షలు నిర్వహించి, మోకాలి సర్జరీ తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఈ వార్త బయటకు రావడంతో నందమూరి అభిమానుల్లో కొంత ఆందోళన వ్యక్తమైంది. 

అభిమానుల ఆందోళనను, సోషల్ మీడియాలో వస్తున్న రకరకాల ఊహాగానాలను పటాపంచలు చేస్తూ బాలకృష్ణ పెద్ద కుమార్తె నారా బ్రహ్మణి సోషల్ మీడియా వేదికగా బాలయ్య హెల్త్ అప్‌డేట్‌ను పంచుకున్నారు. నాన్నగారి మోకాలి సర్జరీ విజయవంతమైందని, వైద్యుల పర్యవేక్షణలో ఆయన సురక్షితంగా ఉన్నారని ఆమె ప్రకటించారు. అంతేకాకుండా, సర్జరీ ముగిసిన వెంటనే ఆయన తన పాత ఎనర్జీని తిరిగి పొందారని, మళ్లీ ఎప్పటిలాగే పూర్తి చురుకుదనంతో కనిపిస్తున్నారని వెల్లడించారు. ఈ సమయంలో నందమూరి కుటుంబానికి అండగా నిలిచి, బాలయ్య త్వరగా కోలుకోవాలని అపారమైన ప్రేమను కురిపించిన ప్రతి ఒక్క అభిమానికి, శ్రేయోభిలాషికి ఆమె హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. అభిమానులు చూపించిన ఈ అనురాగానికి, వారి ప్రార్థనలకు తమ కుటుంబం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని బ్రహ్మణి ఎమోషనల్ గా రాసుకొచ్చారు.

నారా బ్రహ్మణి ఇచ్చిన ఈ అధికారిక ప్రకటనతో నందమూరి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలోనే ఉన్న బాలకృష్ణ, మరొక 3 నుంచి 4 రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని ఆసుపత్రి వర్గాల సమాచారం. పూర్తిగా కోలుకోవడానికి వైద్యులు ఆయనకు కనీసం 1 నెల రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. 

 

 

Nandamuri Balakrishna, Heath Update, Nara Brahmani

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.