![]() |
![]() |

టాలీవుడ్ లవ్లీ కపుల్ నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తమ అభిమానులతో సరికొత్త విషయాలను పంచుకుంటారు. తాజాగా నాగచైతన్య ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఒక ఫోటో, దానికి పెట్టిన క్యాప్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తన భార్య శోభిత ప్రత్యేకంగా వంట చేసి డైనింగ్ టేబుల్ వద్ద వడ్డిస్తున్న క్షణాన్ని నాగచైతన్య తన కెమెరాలో బంధించి అభిమానులతో పంచుకున్నారు.
ఆ ఫోటోను పోస్ట్ చేస్తూ చైతూ చాలా ఫన్నీగా రాసుకొచ్చారు. "పెళ్లయిన దాదాపు రెండేళ్లకు నా భార్య నా కోసం ప్రత్యేకంగా డిన్నర్ వండింది.. బహుశా ఈ రోజు నేను ఏదో చాలా మంచి పనే చేసి ఉంటాను" అంటూ ఒక ఫన్నీ ఎమోజీని కూడా జత చేశారు. పెళ్లయి రెండేళ్లు అవుతున్నా శోభిత ఇప్పుడు వంట చేయడంపై చైతూ చేసిన ఈ సరదా వ్యాఖ్యలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
భర్త నాగచైతన్య చేసిన ఈ పోస్ట్‌పై భార్య శోభిత అంతే ఫన్నీగా స్పందించారు. "నువ్వు అసలు నన్ను ట్రోల్ చేస్తున్నావా.. లేక పొగుడుతున్నావా?" అంటూ కామెంట్ పెట్టారు. వీరిద్దరి మధ్య సాగిన ఈ క్యూట్ అండ్ ఫన్నీ సంభాషణ అభిమానులను విశేషంగా అలరిస్తోంది.
ఇక వీరిద్దరి సినీ కెరీర్ విషయానికి వస్తే, నాగచైతన్య 'తండేల్' వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత ఇప్పుడు సరికొత్త ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వృషకర్మ' అనే భారీ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నారు. మరోవైపు శోభిత ధూళిపాళ్ల పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ చిత్రం 'వెట్టువం'లో నటిస్తున్నారు.
https://www.instagram.com/p/DbLiLrizlG_/
Naga Chaitanya, Sobhita Dhulipala, Instagram, Fun
![]() |
![]() |