![]() |
![]() |

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద స్టార్ హీరోయిన్ 'శ్రీదేవి'(Sridevi)కి ఉన్న చరిష్మా తెలిసిందే. తన అద్భుతమైన నటనతో, డాన్సులతో స్టార్ హీరోలకి ధీటుగా కొన్ని లక్షల మంది అభిమానుల్ని సంపాదించుకుంది. పోస్టర్ పై శ్రీదేవి బొమ్మ కనపడితే చాలు ప్రేక్షకులు థియేటర్స్ కి పోటెత్తే వారు. దీన్ని బట్టి ఆమె ప్రభావాన్ని అర్ధం చేసుకోవచ్చు. 1996 లో ప్రముఖ బాలీవుడ్ నిర్మాత 'బోణికపూర్'(Boney kapoor)ని వివాహం చేసుకోగా, వీరువురికి జాన్వీ కపూర్, ఖుషి కపూర్ పిల్లలు.
రీసెంట్ గా 'బోణికపూర్' చెన్నై హైకోర్ట్ లో పిటిషన్ వేసాడు. సదరు పిటిషన్ లో 'శ్రీదేవి ఎంతో కష్టపడి '1988 ఏప్రిల్ లో చెన్నైకి చెందిన 'మొదలియార్' అనే వ్యక్తి దగ్గర్నుంచి కొంత స్థిరాస్తిని కొనుగోలు చేసింది ఆస్తికి సంబంధించిన పత్రాలన్నీ పరిశీలించడంతో పాటు, మొదలియార్ ముగ్గురు కుమార్తెలు,ఇద్దరు కూతుళ్ళకి సంబంధించిన వారసత్వ దృవీకరణ పత్రాన్ని కూడా శ్రీదేవి పొందింది. కానీ ఇప్పుడు మొదలియార్ రెండో భార్య కుమారులు ఆస్తిలో వాటా ఉందంటూ 'తాంబరం' తహసీల్దార్ కార్యాలయంలో అప్పీల్ చేసారు.ప్రభుత్వ అధికారుల నిర్ణయంతో ఆస్థి హక్కులని చట్ట విరుద్ధంగా సొంతం చేసుకున్నారు.
మోస పూరితమైన పత్రాలని రద్దు చేసి మాకు న్యాయం చెయ్యాలి. తన భార్య బతికి ఉండగానే మొదలియార్ రెండో వివాహం చేసుకున్నాడని బోణి కపూర్ పిటిషన్ లో పేర్కొన్నాడు. దీనిపై విచారించిన హైకోర్టు నాలుగు వారాల్లోగా, పూర్తి వివరాలు తెలియచేయాలని సంబంధిత తహశీల్ధార్ ని ఆదేశించింది. శ్రీదేవి సినీ ప్రస్థానం చెన్నై లో ప్రారంభమైన విషయం తెలిసిందే.
![]() |
![]() |