![]() |
![]() |

అభిమానులతో పాటు సినీ ప్రియుల్లో 'మాస్ మహారాజా రవితేజ(Raviteja),శ్రీలీల(Sreeleela)ల 'మాస్ జాతర'(Mass Jathara),తేజ సజ్జ(Teja Sajja)దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని 'మిరాయ్' పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ రెండు చిత్రాలు దేనికవే డిఫరెంట్ సబ్జెట్స్ కావడంతో పాటు అగ్ర నిర్మాణ సంస్థలు సితార ఎంటర్ టైన్ మెంట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత భారీ వ్యయంతో నిర్మించాయి. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు కూడా హైప్ ని పెంచాయి. మాస్ జాతర ఆగస్టు 27 న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ రిలీజ్ డేట్ ని వాయిదా వేస్తు చిత్ర బృందం అధికారంగా ప్రకటించింది. 'మిరాయ్' సెప్టెంబర్ 5 న విడుదల కావాల్సి ఉండగా, సెప్టెంబర్ 12 కి వాయిదా పడింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇటీవల కార్మికుల చేసిన సమ్మె వలన చివరి దశ పనులకి అంతరాయం ఏర్పడటంతో వాయిదా పడ్డాయి. దీంతో ఘాటీ, మదరాసి చిత్రాలకి ప్లస్ గా మారనుంది.
ఘాటీ చిత్రానికి 'క్రిష్' దర్శకత్వం వహించాడు. హరిహరవీరమల్లు తర్వాత 'క్రిష్'(Krish)ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించాడు. 2023 లో వచ్చిన మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి తర్వాత ఘాటీతో అనుష్క(Anushka)సిల్వర్ స్క్రీన్ పై మెరవనుంది. క్రిష్, అనుష్క కి ఇప్పుడు హిట్ చాలా అవసరం.ప్రచార చిత్రాలు కూడా బాగున్నాయి. ఈ క్రమంలో మాస్ జాతర, మిరాయ్ వాయిదాపడటంతో ఎక్కువ సంఖ్యలో థియేటర్స్ దొరుకుతాయి. దీంతో ఘాటీ కలెక్షన్స్ పరంగా మంచి వసూళ్ళని రాబట్టే అవకాశం ఉంది.
అమరన్ తర్వాత శివ కార్తికేయన్ ఎంతో ప్రెస్టేజియస్ట్ గా తీసుకొని చేసిన మూవీ 'మదరాసి'. సెప్టెంబర్ 5 నే పాన్ ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మురుగదాస్ దర్శకుడు కావడంతో పాటు, ప్రచార చిత్రాలు ఒక రేంజ్ లో ఉండటంతో మదరాసి పై అందరిలోను భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఘాటీ ఒక్కటే రిలీజ్ ఉండటంతో మదరాసి కి కూడా ఎక్కువ థియేటర్స్ దొరికే ఛాన్స్ ఉంది.. ఘాటీ, మదరాసి చిత్రాలకి సినీ సర్కిల్స్ నుంచి మంచి రిపోర్ట్ వస్తుంది.

![]() |
![]() |