![]() |
![]() |
.webp)
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కొంతకాలంగా మాస్ సినిమాలతో అలరిస్తున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో మాస్ కి దగ్గరైన రామ్ అప్పటినుంచి తన రూట్ మార్చాడు. ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో రామ్ 'ది వారియర్' అనే యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీ విడుదల తేదీని తాజాగా ప్రకటించారు.
'ది వారియర్'ని ప్రపంచవ్యాప్తంగా జులై 14 న రిలీజ్ చేస్తున్నట్లు తెలుపుతూ తాజాగా ఒక పోస్టర్ ను వదిలారు. ఇందులో రామ్ రైల్వే స్టేషన్ లో కూర్చొని చేతిలో గన్ పట్టుకొని వార్ కి రెడీ అన్నట్లుగా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. 'ది వారియర్' నుంచి కొద్దిరోజుల క్రితం విడుదలైన రామ్ ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పోలీస్ యూనిఫామ్ గన్ పట్టుకొని ఉన్న రామ్ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో రామ్ రెండు షేడ్స్ ఉన్న పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నాడని తెలుస్తోంది.

శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి 'ది వారియర్' సినిమాను నిర్మిస్తున్నారు. ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్. ఇందులో ఆమె విజిల్ మహాలక్ష్మిగా అలరించనుంది. ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
![]() |
![]() |