![]() |
![]() |

కమెడియన్‌గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి, తరవాత పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రవితేజ వంటి స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు తీసిన నిర్మాత బండ్ల గణేష్. ఆయనకు కరోనా వచ్చినట్టు టాక్. తనకు కరోనా ఏం లేదనీ, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాననీ బండ్ల గణేష్ చెబుతున్నప్పటికీ... ఆయన కుటుంబం సహా ఆయన నివాసం ఉంటున్న గేటెడ్ కమ్యూనిటీలో ఇతర కుటుంబాలు కరోనా టెస్టులకు సిద్ధమవుతుండటం అనుమానాలకు దారి తీసింది.

సినిమా వ్యాపారం కాకుండా బండ్ల గణేష్‌కు ఇతర వ్యాపారాలు ఉన్నాయి. అందులో ఫౌల్ట్రీ బిజినెస్ మెయిన్. హైద్రాబాద్ సమీపంలోని షాద్ నగర్లో బండ్ల గణేష్‌కి ఫారమ్స్ ఉన్నాయి. ఫిలింనగర్ డౌన్లోని గేటెడ్ కమ్యూనిటీ నుండి ప్రతిరోజూ అక్కడికి వెళ్లి వస్తుంటారని సమాచారం. ఈ నేపథ్యంలో ఎందుకైనా మంచిదని టెస్టులు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని వచ్చిందట. దాంతో ఆ కమ్యూనిటీలో ఉంటున్న నాగశౌర్య ఫ్యామిలీ, ఇతర సంపన్న వర్గాలు ఆందోళన చెందుతున్నాయట.
![]() |
![]() |