![]() |
![]() |

బోర్డర్లో ఇండో-చైనీస్ వార్, బుల్లి బుల్లి స్మార్ట్ మొబైల్స్‌లో సోషల్ మీడియా యాప్స్ టిక్ టాక్, హలో మీద పడుతోంది. ముఖ్యంగా ఈ రెండు యాప్స్ మీద బ్యాన్ చైనీస్ ప్రొడక్ట్స్, బ్యాన్ చైనీస్ యాప్స్ ఉద్యమ సెగ తీవ్రంగా పడుతోంది. చైనీస్ ప్రొడక్ట్స్ ఉపయోగం వల్ల చైనా కంపెనీలు లాభపడుతున్నాయని, తద్వారా చైనాకు డబ్బులు వెళ్లడంతో మనపై యుద్ధానికి అవసరమైన ఆయుధాలు సమకూర్చుకుంటోందనే అభిప్రాయం చాలామందిలో నెలకొంది.
హలో, టిక్ టాక్‌లో తన అకౌంట్స్ డిలీట్ చేస్తున్నట్టు ప్రముఖ సంగీత దర్శకుడు జిబ్రాన్ తెలిపారు. మరి, 'మీ సంగతేంటి?' అని ఆయన ప్రేక్షకులను ప్రశ్నించారు. బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా సైతం టిక్ టాక్‌లో తన అకౌంట్ డిలీట్ చేశాడు. హలో, టిక్ టాక్... రెండూ చైనీస్ కంపెనీలే. ఈ రెండిటిలో యాక్టివ్ యూజర్స్ సంఖ్యకు వస్తే భారతీయులు ఎక్కువ. ఇప్పుడు వారిలో చాలామంది అకౌంట్స్ డిలీట్ చేస్తున్నారు. కొందరు పోస్టులు చేయడం మానేస్తున్నారు. దాంతో 'హలో'... 'టిక్ టాక్'కి బ్యాడ్ టైమ్ నడుస్తోంది. చైనీస్ ప్రొడక్ట్స్ వద్దని కేంద్రమంత్రులు చెబుతున్న నేపథ్యంలో, ఒకవేళ ప్రధాని గనుక చైనీస్ యాప్స్ మీద బ్యాన్ విధిస్తే రెండు కంపెనీలు తీవ్రంగా నష్టపోతాయి.
![]() |
![]() |