![]() |
![]() |

ఫిబ్రవరి 25 న విడుదల కావాల్సిన 'గని' మూవీ 'భీమ్లా నాయక్' ఎంట్రీతో వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ కొత్త విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. మార్చ్ లో విడుదల అవుతుందనుకున్న ఈ సినిమా ఏప్రిల్ కి వెళ్ళిపోయింది.
'భీమ్లా నాయక్' ఫిబ్రవరి 25 న విడుదల కావడం కష్టమనే వార్తల నేపథ్యంలో.. 'గని' సినిమాతో వరుణ్ తేజ్, 'ఆడవాళ్ళు మీకు జోహార్లు'తో శర్వానంద్, 'సెబాస్టియన్'తో కిరణ్ అబ్బవరం అదే తేదీకి ప్రేక్షకులను పలకరించాలని అనుకున్నారు. అయితే ఊహించని విధంగా 'ఫిబ్రవరి 25 నే భీమ్లా నాయక్ విడుదల' అని ప్రకటన రావడంతో 'ఆడవాళ్ళు మీకు జోహార్లు', 'సెబాస్టియన్' మార్చి 4 కి వెళ్లిపోయాయి. 'గని'ని కూడా వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు కానీ కొత్త విడుదల తేదీని ప్రకటించలేదు. గని కూడా మార్చి 4 కి వచ్చే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ గని ఏప్రిల్ కి వెళ్ళిపోయింది. ఏప్రిల్ 8 న గనిని విడుదల చేస్తునట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు.
రినైసన్స్ పిక్చర్స్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై సిద్ధు ముద్దా, అల్లు బాబీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు.
![]() |
![]() |