![]() |
![]() |

అభినయానికి ఆస్కారమున్న పాత్రల్లో అలరించే ఈ తరం కథానాయికల్లో కేరళ కుట్టి కీర్తి సురేశ్ ఒకరు. ఒకవైపు హీరోయిన్ గా నటిస్తూనే.. మరోవైపు సూపర్ స్టార్ రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవి వంటి సీనియర్ హీరోలకు చెల్లెలి పాత్రల్లోనూ దర్శనమిస్తోంది కీర్తి.
ఇదిలా ఉంటే, ఆ మధ్య `మహానటి` (2018), `పెంగ్విన్` (2020) చిత్రాల్లో తల్లి పాత్రల్లో ఆకట్టుకున్న కీర్తి సురేశ్.. తాజాగా మరో సినిమాలో అమ్మగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఆ వివరాల్లోకి వెళితే.. యువ కథానాయకుడు శర్వానంద్ - యువ దర్శకుడు కృష్ణ చైతన్య కాంబినేషన్ లో ఓ సినిమా రానుందని సమాచారం. ఇందులో శర్వానంద్ కి జోడీగా నటించనున్న కీర్తి సురేశ్.. కథానుసారం తల్లి పాత్రలో కనిపించనుందట. పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న రోల్ కావడంతో ఈ పాత్ర చేయడానికి కీర్తి వెంటనే ఓకే చెప్పిందని బజ్. మరి.. తల్లి పాత్రలో కీర్తి సురేశ్ మరోమారు మురిపిస్తుందేమో చూడాలి.
కాగా, సూపర్ స్టార్ మహేశ్ బాబుకి జోడీగా కీర్తి సురేశ్ నటిస్తున్న `సర్కారు వారి పాట` చిత్రీకరణ తుది దశలో ఉంది. వేసవి కానుకగా మే 12న ఈ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ కానుంది. పరశురామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్నాడు.
![]() |
![]() |