![]() |
![]() |

కథానాయకుడిగా అల్లు అర్జున్ ఇప్పటివరకు 19 చిత్రాలతో సందడి చేశాడు. అయితే, ఇంతవరకు క్రిస్మస్ సీజన్ లో తన సినిమాతో పలకరించిన సందర్భం లేదు. కట్ చేస్తే.. త్వరలో ఆ ముచ్చట తీరనుందట.
ఆ వివరాల్లోకి వెళితే.. నాన్ - బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నమోదైన `అల వైకుంఠపురములో` తరువాత బన్నీ హీరోగా నటిస్తున్న చిత్రం `పుష్ప`. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ని బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్నారు. ఇందులో పుష్పరాజ్ గా నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో దర్శనమివ్వనున్నాడు బన్నీ. అంతేకాదు.. తన కెరీర్ లో ఫస్ట్ టైమ్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ తోనే పాన్ - ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో `పుష్ప` రిలీజ్ కానుంది.
ఇదిలా ఉంటే.. `పుష్ప`ని తొలుత ఆగస్టు 13న విడుదల చేయాలని యూనిట్ భావించింది. అయితే, కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా ఇప్పుడా ప్లానింగ్ మారింది. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. క్రిస్మస్ సీజన్ లో అంటే డిసెంబర్ మూడో వారంలో లేదా నాలుగో వారంలో `పుష్ప` ఫస్ట్ పార్ట్ ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలిసింది. అదే గనుక నిజమైతే.. క్రిస్మస్ సీజన్ లో రిలీజయ్యే బన్నీ ఫస్ట్ ఫిల్మ్ `పుష్ప`నే అవుతుంది. చూద్దాం.. ఏం జరుగుతుందో?
![]() |
![]() |