![]() |
![]() |

సింహ, లెజెండ్, అఖండ వంటి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ తర్వాత.. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'అఖండ-2'. 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల కావాల్సిన ఈ మూవీ, వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే దసరాకు సినిమా రానప్పటికీ.. అదిరిపోయే సర్ ప్రైజ్ ఉన్నట్లు తెలుస్తోంది. (Akhanda 2)
దసరా కానుకగా 'అఖండ-2' నుంచి ప్రత్యేక టీజర్ ను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ టీజర్ తోనే మూవీ రిలీజ్ డేట్ ని కూడా రివీల్ చేయబోతున్నారట. 'అఖండ-2'ని డిసెంబర్ లో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్ 4 లేదా 5న ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.
2021 లో అఖండ సినిమా డిసెంబర్ మొదటి వారంలోనే విడుదలైంది. నాలుగేళ్ళ తర్వాత దానికి సీక్వెల్ గా వస్తున్న 'అఖండ-2' కూడా డిసెంబర్ మొదటి వారంలోనే విడుదల కానుండటం విశేషం.
![]() |
![]() |