![]() |
![]() |

ఇటీవల ఓ యాడ్ షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) గాయపడిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి ఆయన కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. యాడ్ షూటింగ్ లో ఎన్టీఆర్ కి స్వల్ప గాయమైందని, వైద్యుల సూచన మేరకు రెండు వారాలు విశ్రాంతి తీసుకుంటారని ఆ ప్రకటనలో ఉంది. దీంతో ఎన్టీఆర్ ఆరోజు నుంచి రెస్ట్ తీసుకుంటున్నాడని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇప్పుడొక సంచలన వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లో కొడుతోంది.
యాడ్ షూటింగ్ కోసం హైదరాబాద్ లోని ఒక స్టూడియోలో ప్రత్యేక సెటప్ చేశారట. ఎన్టీఆర్ కి గాయం కాకుండా ఉండుంటే, ఆ రోజు షూటింగ్ పూర్తయ్యేది. కానీ, అనుకోకుండా ఆయన గాయపడి రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఈ రెండు వారాలు స్టూడియోలో సెటప్ అలాగే ఉంచితే.. రెంట్ చెల్లించాల్సి ఉంటుంది. అందుకే యాడ్ మేకర్స్ కి అదనపు భారం కాకూడదని భావించిన ఎన్టీఆర్.. నొప్పితోనే ఆ మరుసటి రోజు వెళ్ళి, షూటింగ్ ని పూర్తి చేశాడట. ఎన్టీఆర్ డెడికేషన్ చూసి టీం ఫిదా అయిందట.
సినీ సెలబ్రిటీలు హెల్త్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటారు. ఏదైనా చిన్న గాయమైతే విశ్రాంతి తీసుకోవడానికి మొగ్గు చూపుతారు. అయితే ఎన్టీఆర్ మాత్రం.. తన వల్ల అదనపు భారం పడకూడదని, నొప్పితోనే యాడ్ షూటింగ్ లో పాల్గొన్నాడు. దీంతో ఎన్టీఆర్ పై నెటిజెన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
![]() |
![]() |