![]() |
![]() |
.webp)
చిన్నారి పెళ్లి కూతురు అవికా గోర్(avika gor) కి ప్రధాన మంత్రి మోడీ(modi)ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. వియత్నం దేశ ప్రధాని ఫామ్ మిన్ చిన్ వస్తున్నారు మీరు కూడా రావాలని అవతల వ్యక్తి చెప్పాడు. పీఎం ఆఫీస్ నుంచి నాకు ఫోన్ రావడం ఏంటి! పక్కా ఫేక్ కాల్ అనుకుంది.మరి చివరకి ఏం జరిగిందో చూద్దాం.
వియత్నాం ప్రధాని ఫామ్ మిన్ చిన్ ఆగస్టు మొదటి వారం ఇండియా టూర్ కి వచ్చిన విషయం అందరకి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోడీ కార్యాలయంలో విందుని కూడా ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వివిధ రంగాలకి చెందిన సెలబ్రిటీలకి కూడా ఆహ్వానాలు వెళ్లాయి. అందులో అవికా కూడా ఒకటి. ఇండియన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ప్రతినిధిగా అవికా పార్టిసిపేట్ చేసింది. దీంతో అతి చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీ తరుపున పాల్గొన్న హీరోయిన్ గా ఒక అరుదైన ఘనతని కూడా సాధించిందని చెప్పవచ్చు. లేటెస్ట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో అవికా గోర్ ఈ విషయాన్ని వెల్లడి చేసింది. అలాగే ఇంకొన్ని ఆసక్తి కార విషయాల్ని కూడా ప్రేక్షకులతో పంచుకుంది.

ముందు ఈ కార్యక్రమానికి రావాలని ఫోన్ వస్తే అది ఫేక్ కాల్ అనుకున్నాను. మెయిల్ వచ్చిన తర్వాత కానీ అర్ధం కాలేదు నిజమని. ఆ తర్వాత కూడా ప్రోగ్రాం ని స్కిప్ చేయాలని అనిపించింది. ఎందుకంటే ఇద్దరు ప్రధాన మంత్రుల కార్యక్రమం అంటే మాటలు కాదు కదా. ఆ తర్వాత నాన్న చెప్పిన ధైర్యంతో వెళ్లానని చెప్పుకొచ్చింది. అదే విధంగా అలా వెళ్లడం ద్వారా నటిగా సరైన దారిలోనే ఉన్నానని అర్ధమైందని, చాలా కాన్ఫిడెన్స్ వచ్చిందని కూడా తెలిపింది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ అవికా ఫుల్ బిజీగా ఉంది.
![]() |
![]() |