![]() |
![]() |

మహేష్,వెంకటేష్ ల సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో సీత పాత్రలో చాలా చక్కగా నటించిన అచ్చ తెలుగు అమ్మాయి అంజలి.ఇప్పటివరకు తమిళంలో ముప్పయ్యి కి పైగా సినిమాల్లో నటించిన అంజలి తెలుగులో మసాలా, గీతాంజలి,డిక్టేటర్,వకీల్ సాబ్ లాంటి చిత్రాల్లో నటించి తన నటనతో అందర్ని మెప్పించింది. తాజాగా ఆమె చెప్పిన మాటలు వైరల్ గా మారాయి.
అంజలి ఒక బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకొని విదేశాల్లో సెటిల్ అయ్యిందనే వార్తలు ఇటీవల తరచు వినపడుతున్నాయి. దీంతో ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతు నాకు ఇండస్ట్రీ లో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఎవరిని కలిసినా వాళ్లకి నాకు లింక్ అంటగడుతున్నారు. ఒక సారి నాకు హీరో జై కి ఎఫైర్ ని అంటగట్టారు. ఇప్పుడు ఒక బిసినెస్ మాన్ ని పెళ్లి చేసుకున్నానని అంటు రూమర్స్ పుట్టిస్తున్నారు అని చెప్పింది. అంతే కాకుండా అలాంటి వాళ్ళని చూస్తుంటే తనకి నవ్వొస్తు ఉంటుందని ఒక వేళ నేను పెళ్లి చేసుకోవలసి వస్తే అందరి చెప్పే చేసుంటాను అని కూడా ఆమె చెప్పింది.
అంజలి ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ కలయికలో వస్తున్న గేమ్ చేంజర్ అండ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీల్లో చేస్తుంది. అలాగే తాను డ్యూయల్ రోల్ పోషించి 2014 లో వచ్చి సంచలన విజయాన్ని సాధించిన గీతాంజలి సీక్వెల్ లోను అంజలి నటిస్తుంది.
![]() |
![]() |