![]() |
![]() |

ధురంధర్(Dhurandhar)సిరీస్ కోసం రణవీర్ సింగ్(Ranveer Singh),ఆదిత్య ధర్(Aditya Dhar), అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, జియో స్టూడియోస్ నే కాదండి. ఇంకో వ్యక్తి కూడా పుట్టాడండి.. ఆయనే జమీల్ జమాలీ. అరే వెంటనే మీ ముఖాల్లో నవ్వు వచ్చేస్తుంది కాదు. వస్తుదండి.. అంతలా రాజకీయనాయకుడు, ఎంఎల్ఏ, మినిస్టర్ జమీల్ జమాలీ క్యారక్టర్ లో సీనియర్ యాక్టర్ రాకేష్ బేడీ విజృంభించి చేసాడు. ధురంధర్ 2 సిరీస్ మొత్తంపై ప్రేక్షకుల ముఖాల్లో నవ్వులు కూడా విసిరేది జమీల్ జమాలీ వల్లనే. ఇప్పుడు ధురంధర్ 2 మేకర్స్ తన ముఖంలో నవ్వులు పూయించారు. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం
రాకేష్ బేడీకి రెండు పార్ధులకి కలిపి 50 లక్షల రూపాయల రెమ్యునరేషన్ కి ఖాయం చేసుకున్నారు. అయితే ధురంధర్ సాధించిన చారిత్రాత్మక విజయానికి సదరు రెమ్యునరేషన్ తక్కువగా భావించి 50 లక్షలకి అదనంగా కోటి రూపాయలని అందచేశారు. దీంతో ఫ్యాన్స్, నెటిజెన్స్ రాకేష్ బేడీ కి కంగ్రాట్స్ చెప్తూ పార్టీ లేదా పుష్ప అనే కామెంట్స్ తో సోషల్ మీడియా ముఖంలో కూడా నవ్వులు పూయిస్తున్నారు.
Also read: Tollywood Trending: టుడే టాలీవుడ్ ట్రెండింగ్
ఈ వార్తపై రాకేష్ బేడీ తనదైన శైలిలో సరదాగా స్పందించారు. "నా అకౌంట్‌లో ఇంకా ఆ డబ్బు పడలేదు, ఎవరైనా ఉంటే ఇప్పించండి" అంటూ తనదైన స్టైల్లో జోక్ చేసాడు 1976 లో 'డొంగా' అనే షార్ట్ ఫిలింతో నటనావృత్తిలోకి అడుగుపెట్టిన రాకేష్ బేడీ ఇప్పటి వరకు సుమారు 150 చిత్రాల వరకు చేసాడు. దేశ రాజధాని ఢిల్లీ స్వస్థలం.

![]() |
![]() |