![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ లో నటిస్తున్న తాజా చిత్రం `భీమ్లా నాయక్`. మాలీవుడ్ బ్లాక్ బస్టర్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్ గా రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామాలో రానా దగ్గుబాటి మరో హీరోగా నటిస్తున్నారు. పవన్ కి జోడీగా నిత్యా మీనన్ నటిస్తుండగా.. రానాకి జంటగా ఐశ్వర్యా రాజేశ్ దర్శనమివ్వనున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ బాణీలు అందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. గతంలో ఇదే సంక్రాంతి సీజన్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన `నాయక్` (2013) చిత్రం విడుదలైంది. ఆ సినిమాకి కూడా తమన్ నే సంగీత దర్శకుడు. అంతేకాదు, సంక్రాంతి సీజన్ లో చరణ్ - తమన్ కాంబినేషన్ పరంగా ఇదే ఫస్ట్ రిలీజ్. అప్పట్లో ఈ సినిమా మంచి విజయం సాధించింది. కట్ చేస్తే.. ఇప్పుడదే పొంగల్ బరిలో పవన్ - తమన్ కాంబినేషన్ లో రూపొందిన `భీమ్లా నాయక్` రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్ లో `వకీల్ సాబ్` తెరకెక్కినా.. సంక్రాంతి సీజన్ లో థియేటర్స్ లోకి వస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. మరి.. కొణిదెల అబ్బాయ్ కాంబినేషన్ లో చేసిన `నాయక్`తో సంక్రాంతి సక్సెస్ అందుకున్న తమన్.. కొణిదెల బాబాయ్ కాంబినేషన్ తోనూ అదే బాట పడుతాడేమో చూడాలి.
![]() |
![]() |