![]() |
![]() |

టాలీవుడ్ టాప్ స్టార్స్‌లో రామ్‌చరణ్ ఒకరు. ఆయన కేవలం యాక్టర్‌గానే కాకుండా, ప్రొడ్యూసర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. మిగతా నటులకు ఏం జరుగుతోందో గమనిస్తూ, తన ప్లాన్స్‌ను ఆయన అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఉదాహరణకు అల్లు అర్జున్ హీరోగా నటించిన 'నాపేరు సూర్య' బాక్సాఫీస్ దగ్గర ఫ్లాపవడానికి ఆ సినిమాని డైరెక్ట్ చేసిన విధానం ఓ కారణమని విశ్లేషకులు తేల్చారు. దాన్ని రూపొందించింది వక్కంతం వంశీ. రచయిత అయిన వక్కంతంకు దర్శకుడిగా అదే తొలి చిత్రం. అలాగే మరికొంతమంది నూతన దర్శకులు కూడా బిగ్ స్టార్స్‌తో హిట్లను అందించలేకపోయారు. ఒకప్పుడు బిగ్ స్టార్స్ కొత్త దర్శకుల్ని ప్రోత్సహించారు. ఆ సినిమాలు ఆడాయి కూడా. కానీ ఇప్పుడు ట్రెండ్ మారినట్లు కనిపిస్తోంది. ఏ బిగ్ స్టార్ కూడా కొత్త డైరెక్టర్‌తో పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు. రామ్‌చరణ్ కూడా డెబ్యూ డైరెక్టర్లతో పనిచేయకూడదని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది.
అందిన సమాచారం ప్రకారం యువి క్రియేషన్స్ బ్యానర్‌లో రామ్‌చరణ్ ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు. దానికి ఓ కొత్త దర్శకుడు పనిచేయాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ రద్దయింది. చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి సైతం కుమారుడికి 'రీమేక్స్ అయినా చేయి కానీ, కొత్త దర్శకులతో ప్రయోగాలు చేయొద్ద'ని సలహా ఇచ్చారనేది ఇన్‌సైడర్స్ నుంచి వినిపిస్తున్న మాట.
రామ్‌చరణ్ ఇటీవలే 'ఆర్ఆర్ఆర్' మూవీ షూటింగ్‌ను కంప్లీట్ చేశాడు. రాజమౌళి డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ మరో హీరోగా నటిస్తుండగా, అలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవ్‌గణ్, శ్రియ కీలక పాత్రలు చేస్తున్నారు. అక్టోబర్ 13న ఈ సినిమాను విడుదల చేస్తామని ఇదివరకు నిర్మాతలు ప్రకటించినప్పటికీ, ప్రస్తుతం ఆ తేదీకి విడుదలయ్యే అవకాశం లేదనీ, 2022 జనవరి మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉందనీ వినిపిస్తోంది.
ఇప్పుడు రామ్‌చరణ్ దేశంలోని అగ్ర దర్శకుల్లో ఒకరిగా గుర్తింపుపొందిన శంకర్ డైరెక్షన్‌లో నటిస్తున్నాడు. ఆ సినిమా నేడే పూజా కార్యక్రమాలతో మొదలైంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న 50వ చిత్రంగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఇది తెరకెక్కబోతోంది. ఈ మూవీలో కియారా అద్వానీ నాయిక. ఈలోగా తండ్రి చిరంజీవి టైటిల్ రోల్ చేస్తోన్న ఆచార్య సినిమాని పూర్తి చేయనున్నాడు చరణ్. దాన్ని టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్‌లో ఒకరైన కొరటాల శివ రూపొందిస్తున్నాడు. ఇలా అందరూ అగ్ర దర్శకులతోనే వర్క్ చేస్తున్నాడు చరణ్.
![]() |
![]() |