![]() |
![]() |

పొగరుబోతు అత్తకి గుణపాఠం చెప్పే ఓ అల్లుడి కథతో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ `అనసూయమ్మ గారి అల్లుడు`. నటసింహం నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ లో నటించిన ఈ సినిమాలో అత్త అనసూయమ్మగా `ఊర్వశి` శారద దర్శనమివ్వగా. . బాలకృష్ణ కి జంటగా భానుప్రియ నటించింది. జగ్గయ్య, రావుగోపాలరావు, నూతన్ ప్రసాద్, చలపతిరావు, హేమసుందర్, అన్నపూర్ణ, రమాప్రభ, డబ్బింగ్ జానకి ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు. అగ్ర దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి రూపొందించిన ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ కథ, సంభాషణలు సమకూర్చారు. బాలయ్య - కోదండరామి రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కిన మొదటి సినిమా ఇదే కావడం విశేషం.
చక్రవర్తి బాణీలు కట్టిన `అనసూయమ్మ గారి అల్లుడు`కి వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యమందించారు. ``అత్తా అనసూయమ్మ``, ``భామ భామ``, ``ఇంక ముద్దుల``, ``తళుకు తాంబూలమిస్తా``, ``తొలిరేయి`` - ఇలా ఇందులోని పాటలన్నీ మాస్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాయి. తమిళంలో `వైరాగ్యం` (ప్రభు, రాధ, షావుకారు జానకి) పేరుతో ఈ సినిమా రీమేక్ అయింది. రామకృష్ణ సినీ స్టూడియోస్ పతాకంపై నందమూరి హరికృష్ణ నిర్మించిన `అనసూయమ్మ గారి అల్లుడు`.. 1986 జూలై 2న విడుదలై ఘనవిజయం సాధించింది. నేటితో ఈ చిత్రం 36 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |