![]() |
![]() |

నటసింహం నందమూరి బాలకృష్ణతో అత్యధిక చిత్రాలు చేసిన దర్శకుడిగా ఎ. కోదండరామిరెడ్డికి ప్రత్యేక స్థానముంది. అలాంటి.. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాల్లో `ముద్దుల మొగుడు` ఒకటి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలయ్యకి జోడీగా మీనా నటించగా రవళి (ద్విపాత్రాభినయం), లక్ష్మి, కైకాల సత్యనారాయణ, పుండరీకాక్షయ్య, కోట శ్రీనివాస రావు, చలపతి రావు, శ్రీహరి, బ్రహ్మానందం, సుధాకర్, మల్లికార్జున రావు, రాజ్ కుమార్, రాజా రవీంద్ర, వినోద్, సుత్తి వేలు, ఉత్తేజ్, అన్నపూర్ణ, అనూజ, రాగిణి, వై. విజయ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
కోటి సంగీతమందించిన ఈ చిత్రానికి వేటూరి సుందరరామ్మూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి, భువనచంద్ర సాహిత్యమందించారు. మ్యూజికల్ హిట్ గా నిలిచిన ఈ సినిమాలో.. ``రావే రాజహంసలా``, ``చిగురాకు చిలక పలికే``, ``మైనా మైనా ఓ మైనా``, ``ఓ ముద్దుగుమ్మ``, ``విన్నారా సిత్రాలు``, ``అరె గిలి గిలి`` ఇలా పాటలన్నీ ఆకట్టుకున్నాయి. రమా ఫిలింస్ పతాకంపై కె. నాగేశ్వరరావు నిర్మించిన `ముద్దుల మొగుడు`.. 1997 ఏప్రిల్ 25న జనం ముందు నిలిచింది. నేటితో ఈ చిత్రం 25 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |