![]() |
![]() |

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తోన్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'సర్కారు వారి పాట' షూటింగ్ చివరి దశలో ఉంది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. షూటింగ్‌లో బాగంగా ఒక మాస్ సాంగ్‌ని భారీ సెట్‌లో చిత్రీకరిస్తున్నారు. దీంతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.
ఈ మూవీకి తమన్ చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ను అందించారు. ఇప్పటికి రెండు పాటలు విడుదలై సూపర్ హిట్స్ గా నిలిచాయి. ప్రస్తుతం మహేశ్ బాబు, కీర్తి సురేష్ , డ్యాన్సర్లపై మాస్ సాంగ్‌ను తీస్తున్నారు. శేఖర్ మాస్టర్ ఈ పాటకి కొరియోగ్రఫీ చేస్తున్నారు. షూటింగ్ లో బాగంగా యూనిట్ లొకేషన్ స్టిల్స్ ని విడుదల చేశారు. రెడ్ కర్చీఫ్ కట్టుకొని ఉన్న మహేష్ కాళ్లను మాత్రమే ఇందులో కనిపించారు. ఈ పాట కోసం ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ భారీ సెట్‌ని వేశారు.
మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ కథానాయిక. ఆర్ మధి సినిమాటోగ్రఫర్ గా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్‌గా, ఎ.ఎస్. ప్రకాశ్ ఆర్ట్ డైరెక్టర్ గా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. భారీ అంచనాలు నెలకొన్న 'సర్కారు వారి పాట' మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

![]() |
![]() |