![]() |
![]() |

ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' సినిమాతో హిట్ కొట్టిన డైరెక్టర్ వేణు శ్రీరామ్.. తదుపరి సినిమాను నేచురల్ స్టార్ నానితో చేయబోతున్నట్టు తెలుస్తోంది. నానిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే ఆయన ఓ కథను సిద్ధం చేశారని సమాచారం.
గతంలో నాని-వేణు శ్రీరామ్ కాంబినేషన్లో వచ్చిన 'మిడిల్ క్లాస్ అబ్బాయి' సినిమా విజయాన్ని సాధించింది. ఇప్పుడు మరోసారి నానితో సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేయాలని వేణు శ్రీరామ్ అనుకుంటున్నారట. ఇప్పటికే నాని కోసం వేణు స్టోరీ రెడీ చేశారని, స్టోరీకి నాని నుండి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందని ప్రచారం జరుగుతోంది.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మికా మందన్నను తీసుకోవాలని వేణు భావిస్తున్నారట. గతంలో నాని-రష్మిక కాంబినేషన్ లో 'దేవదాస్' మూవీ వచ్చింది. ఈ జంట వేణు శ్రీరామ్ ప్రాజెక్ట్ తో మరోసారి సందడి చేస్తుందేమో చూడాలి.
![]() |
![]() |