మేని చాయ మెరుపు తీగ
.jpg)
మేని చాయ మెరుపు తీగ
మల్లె పూల మాల చుట్టి
జాలువారు జడను గుచ్చి
పట్టు చీర పమిట తెచ్చి
పిడికెడంత నడుముచుట్టి
పూల సజ్జ చేతబట్టి
గందం మెడను చుట్టి
నాగవల్లి నడకతోడ
చిరు చెమటల మోముతోడ
హంస నడక నడుస్తుంటే
చక్కనైన చిన్నోడు
చెలికాడిని అన్నాడు
చిర్రెత్తిన చిన్నది
చిర్రు బుర్రు లాడుతుంటే
చూడతరమా ఆ అందం
ఆపతరమా ఆ సుగంధం
మీగడ త్రినాధ రావు
విశాఖపట్నం
9848826150





లో_నువ్వైనా_telugu_love_kavithalu1_large.png)




