ఎలా చెప్పను చెలీ
.jpg)
గుప్త నిధిలా దాచా.. గుప్పెడంత నా మనసుని..
గూడుకట్టుకున్న దాని లోని మమతని..
గుండె గదిలో కొలిచా..నిలువెత్తు నీ మూర్తిని..
గువ్వలై ఎగిసే నా వలపుల దాహార్తిని..
చెలీ..
ఎదురుచూపుల కాలం పోయింది ..నీ రాకతో..
ఎదురుగానే నిలిచింది..ప్రేమ..నీ రూపుతో..
ఎన్నో ఊసులున్నాయి చెప్పాలని ఎంతో ఆశతో..
ఎలా చెప్పను..ప్రేమించానను ఒక మాటతో...
written by Boddu Mahendar




లో_నువ్వైనా_telugu_love_kavithalu1_large.png)





