LATEST NEWS
  బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి విజయభేరి మోగించింది. ప్రస్తుతానికి 199 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. మరో 4 స్థానాల్లో లీడ్‌లో ఉంది. దాదాపు 203 సీట్లు గెలిచే అవకాశం ఉంది. బీజేపీ 90 స్థానాల్లో గెలిచి అతి పెద్ద పార్టీగా అవతరించింది. జేడీయూ 82 సీట్లు గెలిచాయి. మరో మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎల్‌జేపీ 18 స్థానాల్లో గెలిచి మరో స్థానంలో లీడ్‌లో కొనసాగుతుంది. మరోవైపు మహాగఠ్‌ బంధన్‌ కూటమి 35  స్థానాల్లో గెలిచి మరో స్థానంలో ఆధిక్యంలో ఉంది.  ఆర్జేడీ 23 స్థానాల్లో గెలిచి మరో స్థానంలో లీడ్‌లో ఉంది. కాంగ్రెస్ ఐదు స్థానల్లో గెలిచి మరో స్థానంలో ఆధిక్యంలో ఉంది. రెండు దశాబ్దాలకు పైగా బీహార్‌లో బలీయమైన రాజకీయ శక్తిగా ఉన్న ఆర్జేడీ ఓటు బ్యాంకు క్రమంగా తగ్గుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ప్రస్తుత ఎన్నికల్లోనూ అన్ని పార్టీల కంటే ఆర్జేడీ ఓటు బ్యాంకు ఎక్కువగా నమోదైంది. తాజా ఫలితాల్లో ఆర్జేడీకి 22.9 శాతం ఓట్లు రాగా, బీజేపీకి 20.1 శాతం, జేడీయూకు 19.24 శాతం ఓట్లు వచ్చాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అలీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్ధి ప్రముఖ జానపద గాయని మైథిలీ ఠాకూర్ విజయం సాధించారు. అతి చిన్న వయస్సులో ఆమె బీహార్ అసెంబ్లీకి ఎన్నికైన రికార్డు సృష్టించారు. అలీనగర్ నుంచి ఆమె తన సమీప ఆర్జేడీ అభ్యర్థి బినోద్ మిశ్రాపై 11,730 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.రాఘోపూర్ నియోజక వర్గం నుంచి బరిలోకి దిగిన రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జేడీ) నేత తేజస్వీ యాదవ్ విజయం సాధించారు. 1,04,065 ఓట్లు సాధించిన ఆయన.. ప్రత్యర్థి బీజేపీ నేత సతీశ్ కుమార్‌పై 14,532 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
  బీహార్ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వన్  లోక్ జ‌న‌శ‌క్తి పార్టీ దూసుకెళ్తుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 29 స్థానాల్లో పోటీ చేసిన ఎల్‌‌జేపీ 19 స్థానాల్లో ముందంజలో ఉంది. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే పోత్తులో భాగంగా పోటీ చేసిన 5  ఐదు ఎంపీలు విజయం సాధించి పట్టు నిలుపుకున్నాది. సరిగ్గా ఐదేళ్ల కిందట దారుణ పరాజయాన్ని చవిచూశారు.  2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 130 సీట్లు పైగా పోటీ చేసి కేవలం ఒకేఒక స్ధానంలో గెలిచారు. బాబాయ్‌తో విభేధాలు 2021లో పార్టీ చీలిక తర్వాత తట్టుకుని నిలబడ్డారు. ఈ విజయాన్ని ఏపీలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ జనసేన విజయంతో పోలుస్తున్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి దూసుకెళ్తోంది. ఎన్డీయేలోని కీలక పార్టీలైన బీజేపీ 43 స్థానాల్లో విజయం సాధించింది. ప్రస్తుతం మరో 49  స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. జేడీయూ 17 స్థానాల్లో గెలిచి మరో 61 స్థానాల్లో లీడ్‌లో ఉంది.  మహాగఠ్‌బంధన్ 31 సీట్లలో ముందంజలో ఉంది.విపక్ష ఆర్జేడీ 26, కాంగ్రెస్ 3, వామపక్షాలు 2 సీట్లలో గెలుపును ఖాయం చేసుకోగా, తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీ ఖాతా కూడా తెరిచే అవకాశాలు కనిపించడం లేదు. ఏఐఎంఐఎం 6, ఇతరుల ఒక స్థానంలో అధిక్యంలో ఉంది.నితీష్ కుమార్ వరుసగా తొమ్మిదో సారి బిహార్ సీఎంగా పగ్గాలు చేపట్టడానికి మార్గం సుగమమైంది. నితీష్ ప్రణాణస్వీకారానికి ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ వస్తారని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్‌లో ఎన్డీయే 205 సీట్లలో జయకేతనం ఎగురవేసింది.  
అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడిందన్న సామెత చందంగా తయారైంది ప్రశాంత్ కిశోర్ పరిస్థితి. ఎన్నికల వ్యూహకర్తగా దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రశాంత్ కిశోర్ గత రెండు దశాబ్దాలుగా అనేక పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించి తన వ్యూహాలు, ప్రణాళికలతో  ఆయా పార్టీలు అధికారంలోకి వచ్చేలా చేశారు. 2014 ఎన్నికలలో కేంద్రంలో మోడీ నాయకత్వంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడానికీ, అలాగే 2019లో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికార పగ్గాలు చేపట్టడానికి ప్రశాంత్ కిశోర్ వ్యూహాలే కారణం. అలాగే పశ్చిమ బెంగాల్ లో మమత సర్కార్ కొలువుదీరడానికీ ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలే కారణం అనడంలో సందేహం లేదు. అయితే ఆయన స్వయంగా ఒక రాజకీయ పార్టీ స్థాపించి తన సొంత రాష్ట్రం బీహార్ లో పోటీ చేస్తే.. పాపం ఘోర పరాజయమే ఎదురైంది.  జనసురాజ్ పార్టీ స్థాపించి స్వరాష్ట్రంలో కింగ్ లేదా కనీసం కింగ్ మేకర్ గానైనా నిలుద్దామన్న ప్రశాంత్ కిశోర్ ఆశలకు బీహార్ జనం గండి కొట్టారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలోని మొత్తం నియోజకవర్గాలలో తన పార్టీ అభ్యర్థులను నిలబెట్టిన ప్రశాంత్ కిశోర్ వారిలో కనీసం ఒక్కరిని కూడా గెలిపించుకోలేకపోయారు.  రాష్టరంలోని మొత్తం 243 స్థానాల్లో జనసురాజ్ అభ్యర్థులు నిలబడినా ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయారు. సోంత పార్టీ జన సురాజ్ కు ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు ఇసుమంతైనా పని చేయలేదు.   అనేక పార్టీలకు విజయం అందించిన ప్రశాంత్ కిషోర్ సొంత రాజకీయ ప్రస్థానం తొలి అడుగులోనే చతికిల పడిందని నెట్టింట సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి.  
బీహార్‌లో ఎన్డీయే కూటమి భారీ, చారిత్రక విజయం ముంగిట నిలవడం పట్ల  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో పాటు బీజేపీ, జనతాదళ్ (యునైటెడ్) తరఫున గెలుపొందిన, ఆధిక్యంలో ఉన్న అభ్యర్థులందరికీ ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ  వికసిత భారత్ దార్శనికతకు, ఎన్డీయే ప్రగతిశీల పాలనకు ప్రజలు మరోసారి మద్దతు పలికారని సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా ఆయన పోస్టు చేశారు.  బీహార్‌లో ఎన్డీయే సాధించిన ఈ అద్భుతమైన విజయం, కూటమి అందిస్తున్న ప్రగతిశీల పాలనపై ప్రజలకు ఉన్న అపార విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు.    ఈ సందర్భంగా ఆయన నితీశ్ కుమార్‌కు, బీజేపీ, జేడీయూ విజేతలకు   శుభాకాంక్షలు తెలిపారు.  తన పోస్టుకు చంద్రబాబు నరేంద్రమోడీ, నితీష్ కుమార్ పేర్లను కలుపుsp ఎన్ఎఎన్ఐ (NaNi)  #NaNiLandslideInBihar అనే హ్యాష్‌ట్యాగ్‌ను జతచేశారు.  జాతీయ రాజకీయాల్లో కీలకమైన బీహార్ ఎన్నికల ఫలితాలపై ఎన్డీయే మిత్రపక్ష నేతగా చంద్రబాబు స్పందించారు.  
  బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఘోర పరాజయంపై బీజేపీ సైటైర్లు సంధించింది. ఎక్కడ ఎన్నికలు జరిగిన ఓటములకు చిహ్నంగా రాహుల్ గాంధీ మారారని బీజేపీ నేత అమిత్‌ మాలవీయ విమర్శించారు. గత రెండు దశాబ్దాలలో జరిగిన ఎన్నికల్లో రాహుల్ 95 సార్లు ఓడిపోయారని తెలిపారు. 2004 నుంచి  2025 వరకు జరిగిన వివిధ ఎన్నికల్లో కాంగ్రెస్  ఓడిపోయిన  మ్యాప్‌ను కూడా మాలవీయ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. మరో ఎన్నిక, మరో ఓటమి ఎలక్షన్  ఓటముల్లో స్థిరత్వానికి అవార్డులు ఉంటే మొత్తం రాహుల్‌కే వస్తాయి అని అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు.    బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే  కూటమి దుందుభి మోగించింది. ఆధిక్యంలో మ్యాజిక్‌ ఫిగర్‌ (122)ను దాటేసి, 192 స్థానాల్లో ముందంజలో ఉంది. మరోవైపు మహాగఠ్‌ బంధన్‌ కూటమి 46 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 84  జేడీయూ 78 ఎల్‌జేపీ 20 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. విపక్ష కూటమి మహాగఠ్‌బంధన్‌లో ప్రధాన పార్టీ ఆర్జేడీ 32 సీట్లలో ముందంజలో ఉండగా కాంగ్రెస్‌ కేవలం నాలుగు స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. బిహార్‌లో మొత్తంగా 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
ALSO ON TELUGUONE N E W S
Nandamuri Balakrishna exuded strong confidence regarding his forthcoming spiritual blockbuster, Akhanda 2. Directed by Boyapati Srinu and produced lavishly by 14 Reels Plus, the film’s first single, Thaandavam, was launched at PVR Juhu, Mumbai. Speaking at the event, music director Thaman highlighted his successful partnership with NBK, noting their four consecutive hits beginning with the first Akhanda. He boldly predicted a minimum collection of ₹250 crores for this sequel, stating their prior films had already achieved ₹100 crores successively. Director Boyapati Srinu emphasized his enduring collaboration with Balakrishna, asserting that each of their four ventures has surpassed the previous, projecting Akhanda 2 as their ultimate success. He praised NBK's mesmerizing ability to captivate audiences and signaled a continued working relationship. NBK proudly declared that the nation will cherish Akhanda 2, which illuminates the values of Haindava Santana Dharma. He urged parents to take their children to the cinema, fostering an appreciation for the Vedas' magnificence.  Reflecting on the demanding shoot, which spanned 130 days across challenging, sub-zero locations globally, he expressed immense pride in the commitment shown. Presented by Tejaswini Nandamuri M as a Pan-India spectacle, Akhanda 2 is set for release on December 5th, carrying immense anticipation Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  నందమూరి బాలకృష్ణ అభిమానులతో పాటు, సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న తాండవం మొదలైంది. 'అఖండ-2' సినిమా నుండి మొదటి గీతం 'తాండవం' విడుదలైంది. (Akhanda 2 Thaandavam)   సింహ, లెజెండ్, అఖండ వంటి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'అఖండ-2'. 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 5న పాన్ ఇండియా భాషల్లో విడుదల కానుంది.    అసలే బాలయ్య-బోయపాటి కాంబో, దానికి తోడు అఖండ సీక్వెల్ కావడంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఆ అంచనాలను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళేలా ఫస్ట్ సింగిల్ 'తాండవం' రిలీజ్ అయింది.     అఖండ విజయంలో తమన్ సంగీతం కీలక పాత్ర పోషించింది. ఆయన పాటలు, నేపథ్య సంగీతం సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళాయి. ఇప్పుడు 'అఖండ-2'కి అంతకు మించిన మ్యాజిక్ చేయబోతున్నాడని 'తాండవం' సాంగ్ తో క్లారిటీ వచ్చింది.   తమన్ స్వరపరిచిన 'అఖండ తాండవం' సాంగ్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. "ఖండ ఖండ ఖండిత.. దండ యోగ మండిత" అంటూ కళ్యాణ్ చక్రవర్తి అందించిన సాహిత్యం ఎంతో పవర్ ఫుల్ గా ఉంది. ఆ మ్యూజిక్, లిరిక్స్ కి తగ్గట్టుగానే.. గాయకులు శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్ తమ గాత్రంతో పాటకు ప్రాణం పోశారు.   ఇక లిరికల్ వీడియోలో బాలకృష్ణ కనిపించిన తీరు అద్భుతం. త్రిశూలం చేత పట్టి రౌద్ర రసం పలికించిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక్క మాటలో చెప్పాలంటే శివ తాండవం ఆడారని చెప్పవచ్చు.   'అఖండ తాండవం' సాంగ్ లిరికల్ వీడియో చూస్తుంటే.. బాలకృష్ణ, బోయపాటి, తమన్ త్రయం మరోసారి బాక్సాఫీస్ దగ్గర తాండవం ఆడటం ఖాయమనిపిస్తోంది.    
The highly-anticipated sequel, Akhanda 2 Thandaavam, continues the successful collaboration between 'God of Masses' Nandamuri Balakrishna and director Boyapati Srinu. Produced by 14 Reels Plus, the film rides on significant fan buzz, hoping to replicate the devotional-action success of its predecessor. The movie's first single, also titled "Thandaavam," was unveiled recently in Mumbai, aiming for a pan-Indian impact. The track, composed by Thaman, attempts to capture both the divinity of Lord Shiva and Balakrishna's signature mass appeal. While the song heavily leans into the established mood of the Akhanda franchise, it effectively uses the powerful vocals of Shankar Mahadevan, Kailash Kher, and Deepak Blue to enhance its spiritual-action theme. Director Boyapati Srinu ensures Balakrishna's on-screen presence maintains a similar, fervent intensity, positioning the star as a vessel of divine power amidst stylishly aggressive action sequences. Thaman’s composition and Kalyan Chakravarthy’s lyrics deliver the expected devotional-mass energy. The single serves as a solid, if predictable, first offering for the film, which is presented by Tejaswini Nandamuri M. Akhanda 2 Thandaavam is scheduled for a worldwide release on December 5th.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.    
    -థియేటర్స్ లో శివ సందడి -కోమటిరెడ్డి వెంకటరెడ్డి ట్వీట్ వైరల్  -సోషల్ మీడియాలో వైరల్      ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ వద్ద కింగ్ నాగార్జున 'శివ'(Shiva)రీ రిలీజ్ తో సందడి చేస్తున్నాడు. అభిమానులతో పాటు ప్రేక్షకులు థియేటర్స్ కి భారీగా పోటెత్తడంతో థియేటర్స్ కలకలలాడుతున్నాయి. ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. శివ రీ రిలీజ్ సందర్భంగా చిరంజీవి(Chiranjeevi)అల్లుఅర్జున్, ఎన్టీఆర్, రాజమౌళి,ప్రభాస్, మహేష్ బాబు వంటి వారు నాగార్జున కి బెస్ట్ విషెస్ చెప్పిన విషయం తెలిసిందే.   రీసెంట్ గా తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి  కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy venkat reddy)ఎక్స్ వేదికగా స్పందిస్తు 'శివ మూవీ తెలుగు సినీ పరిశ్రమని పూర్తిగా కొత్త దిశలో నడిపించింది.నాగార్జున నటన, స్టైల్, స్క్రీన్ ప్రెజన్స్ అన్ని తరాల వారికి కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. ఏఎన్ఆర్ గారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తు ఇండస్ట్రీ పురోగతికి నాగార్జున చేసిన కృషి అద్భుతం. శివ తర్వాత అన్నమయ్య, రామదాసు, షిర్డీ సాయి వంటి విభిన్న సినిమాలు చేసి అభిమానుల్లో, ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసాడు. నాగార్జున ప్రభావం ముందు తరం హీరోలపై ఖచ్చితంగా ఉంటుందని ట్వీట్ చేసాడు. సదరు ట్వీట్ కి నాగార్జున కూడా స్పందిస్తు టైం ఉంటే సినిమా చూడాలని కోరాడు.   Also read:   ప్రీ రిలీజ్ బిజినెస్ లో జననాయగన్ రికార్డు  
  కమెడియన్ లు హీరోలుగా మారడం అనేది చూస్తుంటాం. ఆలీ, సునీల్ వంటి కమెడియన్స్ హీరోలుగా హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు మరో కమెడియన్ కూడా హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.   ఈ జనరేషన్ కమెడియన్స్ లో తనదైన కామెడీ టైమింగ్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు సత్య. ముఖ్యంగా 'మత్తు వదలరా' సినిమాలో అతని కామెడీకి ఎందరో ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటిది ఇప్పుడు ఆ చిత్ర దర్శకుడి సినిమాతోనే సత్య హీరోగా మారుతుండటం విశేషం.   'మత్తు వదలరా' ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్ ఓ సినిమా నిర్మిస్తోంది. ఇందులో సత్య హీరోగా నటిస్తున్నాడు.   సత్య హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయాన్ని తెలుపుతూ మొదట అనౌన్స్ మెంట్ వీడియో రిలీజ్ చేశారు. మనీ సినిమాలోని బ్రహ్మానందం పాత్రను స్ఫూర్తిగా తీసుకొని చేసిన ఆ వీడియోలో.. కమెడియన్ గా బాగానే ఉందిగా లైఫ్, ఈ టైములో హీరో అవ్వడం అవసరమా? అన్నట్టుగా ఫ్రెండ్స్ మాట్లాడతారు. నాకేం తక్కువ.. డైరెక్టర్, ప్రొడ్యూసర్ దొరికితే హీరో అయ్యి చూపిస్తానని సత్య అంటాడు.    అనౌన్స్ మెంట్ వీడియోతో ఆకట్టుకున్న టీం.. తాజాగా టైటిల్ ని రివీల్ చేస్తూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ చిత్రానికి 'జెట్లీ' అనే టైటిల్ ఖరారు చేశారు. ఇక పోస్టర్ లో ఫ్లయిట్ మీద నాన్ చాక్ పట్టుకొని బ్రూస్ లీ లాగా సత్య ఫోజ్ ఇవ్వడం ఫన్నీగా ఉంది.   'జెట్లీ' షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. కమెడియన్ నుండి కామెడీ హీరోగా మారుతున్న సత్య.. ఈ సినిమాతో ఏ స్థాయిలో అలరిస్తాడో చూడాలి.    
Pop Icon Miley Cyrus has finally released her much-anticipated song, Dream As One, from the upcoming film, Avatar: Fire and Ash. The singer took to her social media to share a clip of the soul-stirring song.  Sharing her sentiment, the singer wrote, "Writing this song with Mark Ronson and Andrew Wyatt came straight from the heart. Every lyric remembers where we’ve been, reflects where we are, and holds hope for what’s ahead for all of us. It was an honor to create something so personal for a film that connects so deeply with people around the world." With Avatar: Fire and Ash, James Cameron takes audiences back to Pandora in an immersive new adventure with Marine turned Na’vi leader Jake Sully (Sam Worthington), Na’vi warrior Neytiri (Zoe Saldaña), and the Sully family.  The film, which has a screenplay by James Cameron & Rick Jaffa & Amanda Silver, and a story by James Cameron & Rick Jaffa & Amanda Silver & Josh Friedman & Shane Salerno, also stars Sigourney Weaver, Stephen Lang, Oona Chaplin, Cliff Curtis, Britain Dalton, Trinity Bliss, Jack Champion, Bailey Bass and Kate Winslet. 20th Century Studios India will release Avatar: Fire and Ash on 19th December 2025 in 6 languages, English, Hindi, Tamil, Telugu, Malayalam and Kannada.  
    -జననాయగన్ రికార్డు  -విజయ్ అభిమానుల హంగామా -ప్రీ రిలీజ్ లో రికార్డు  -మూవీ ఎలా ఉండబోతుంది     సిల్వర్ స్క్రీన్ కోసం, అభిమానుల కోసం, పాన్ ఇండియాప్రేక్షకులని రంజిప చెయ్యడం కోసం కొంత మంది స్టార్ హీరోలు ఈ భూమ్మీదకి వస్తారు. అటువంటి ఒక అరుదైన సూపర్ స్టార్ 'దళపతి విజయ్'(Vijay). తన సినీ ప్రస్థానం గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. నిత్యం విజయ్ కి సంబంధించిన సినిమాల గురించి గూగుల్ లో సెర్చ్ జరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం 'జననాయగన్' అనే మూవీ చేస్తున్నాడు. తెలుగులో 'జననాయకుడు'పేరుతో రిలీజ్ కానుంది. విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంతో పాటు జననాయగన్ నుంచి ఇప్పటికే వచ్చిన పోస్టర్స్ తో మూవీలో పొలిటికల్ సువాసనలు తారాస్థాయిలోనే ఉండనునున్నాయనే విషయం అర్ధమవుతుంది. దీంతో అభిమానులతో పాటుప్రేక్షకులు 'జననాయగన్'(Jana Nayagan)రాక కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.   జనరల్ గా విజయ్ సినిమా అంటే ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతుందనే విషయం తెలిసిందే. హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా సదరు బిజినెస్ సినిమా సినిమాకి పెరుగుతుంటుంది. ఇప్పుడు అదే తరహాలో జన నాయగన్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. సినీ ట్రేడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న కథనాల ప్రకారం తమిళనాడు ధియేటరికల్ హక్కులు 110 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ 80 కోట్లు, ఆడియో రైట్స్ 35 కోట్లు, ఓటీటీ హక్కులని అమెజాన్ ప్రైమ్ 120 కోట్లకి పొందినట్టుగా టాక్. తెలుగు, కన్నడ రిలీజ్ హక్కుల విషయంలో ఎలాంటి న్యూస్ రాకపోయినా, భారీ రేట్స్ నే దక్కించుకోవడం ఖాయం. దీంతో ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారానే దగ్గర దగ్గరగా 350 కోట్లు దాకా వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. మూవీ బడ్జెట్ అయితే సుమారు  300 కోట్లు అనే ప్రచారం ఎప్పట్నుంచో ఉంది.    also read:  త్రివిక్రమ్ నిర్మాతగా కాంతార తరహాలో కొరగజ్జ.. ఎక్కడి దైవమో తెలుసా!    ఇప్పుడు జననాయగాన్ ప్రీ రిలీజ్ బిజినెస్ న్యూస్ సోషల్ మీడియాలో రావడంతో ఫ్యాన్స్ సంబరాలు చేస్తుకుంటున్నారు. మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యి 1000 కోట్లు వసూలు చేస్తుందనే కామెంట్స్ కూడా చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి కానుకగా జనవరి 9 న థియేటర్స్ లో అడుగుపెట్టనుంది. ప్రమోషన్స్ కూడా త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ స్పీచ్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. విజయ్ సరసన పూజాహెగ్డే జత కట్టింది, మమిత భైజు మరో కీలక పాత్రలో కనిపిస్తుంది. KVN ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్.  హెచ్ వినోద్ దర్శకుడు.   
    -కొరగజ్జ కథ ఏంటి? -త్రివిక్రమ్ ఏం చెప్తున్నాడు -తుళునాడు నేపధ్యం ఏంటి -భారీ అంచనాలు    కన్నడ సినీ సీమలో తెరకెక్కిన కాంతార,కాంతార చాప్టర్ 1(Kantara Chapter 1)సృష్టించిన ప్రభంజనం అందరకి తెలిసిందే. ఇప్పట్లో ఆ రెండు చిత్రాల తాలూకు ప్రభావాన్ని పాన్ ఇండియా ప్రేక్షకులు మర్చిపోవడం అనేది కొంచం కష్టమే. ఇప్పుడు కాంతార తరహాలోనే మరో సాంస్కృతిక ఆధారిత మూవీ 'కొరగజ్జ' (koragajja)పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు రావడానికి వడివడిగా ముస్తాబవుతోంది. కర్ణాటక లోని తులునాడు ప్రాంతంలో అత్యంత పవిత్రంగా పూజించబడే దైవమే కొరగజ్జ. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలకి మంచి పేరు వచ్చింది. దీంతో కొరగజ్జ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. త్రివిక్రమ్(Trivikram)సినిమాస్, సక్సెస్ ఫిల్మ్స్ బ్యానర్లపై త్రివిక్రమ్ నిర్మిస్తుండగా సుధీర్ అత్తవర్(Sudheer Attavar)దర్శకుడు. గోపీసుందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.   రీసెంట్ గా మంగళూరులో ఆడియో లాంఛ్ కార్యక్రమం జరిగింది. నటీనటులందరు కొరగజ్జ సంప్రదాయ గెట‌ప్‌లతో కనిపించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత త్రివిక్రమ్ మాట్లాడుతు ఇప్పటికే  విడుదల చేసిన పోస్టర్, 3D మోషన్ పోస్టర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. కంటెంట్ అందరినీ సర్‌ప్రైజ్ చేస్తుంది. త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని తెలిపారు. దర్శకుడు సుధీర్ అత్తవర్ మాట్లాడుతు 'కన్నడ పరిశ్రమలో పాన్ వరల్డ్ సినిమాలు దశాబ్దాల క్రితమే వచ్చాయి. ‘నాగరహోలి’13 భాషల్లో విడుదలైంది. 'కాంతార’కూడా ఒక గొప్ప కల్చరల్ ప్రెజెంటేషన్. ఇప్పడు మా నుంచి ‘కొరగజ్జ' రాబోతోంది. తులునాడు సంస్కృతి, పూజా సంప్రదాయాన్ని మరో కోణంలో చూపించే ప్రయత్నం చేశామని చెప్పుకొచ్చారు.    also Read:  కాంత లో ప్రధాన హైలెట్స్ ఇవే అంటున్న ప్రేక్షకులు    సందీప్ సొపర్‌కర్, శృతి, భవ్య కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.ప్రస్తుతం 'కొరగజ్జ' పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మరి కాంతార సిరీస్ తరహాలోనే 'కొరగజ్జ' కూడా పాన్ ఇండియా వ్యాప్తంగా సంచలనం సాదిస్తుందేమో చూడాలి.  
  - సంక్రాంతి బరిలో ముగ్గురు టాలీవుడ్ హీరోలు - అఖండ2 పోస్ట్‌పోన్ అనే వార్తలో నిజమెంత? - రాజాసాబ్ మళ్లీ పోస్ట్‌పోన్ అవుతుందా?   గత కొంతకాలంగా స్టార్‌ హీరోల సినిమాలేవీ అనుకున్న టైమ్‌కి రిలీజ్‌ అవ్వడం లేదు. ఒక రిలీజ్‌ డేట్‌ ఎనౌన్స్‌ చేసిన తర్వాత ఆ డేట్‌కే సినిమా రిలీజ్‌ అవుతుందన్న గ్యారెంటీ లేదు. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు.. అనేక సార్లు సినిమా రిలీజ్‌ని వాయిదా వేస్తున్నారు. దానికి అనేక కారణాలు ఉండవచ్చు. అయితే దాని వల్ల ఆ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి సన్నగిల్లే అవకాశం కూడా ఉంది అనేది ట్రేడ్‌ వర్గాల అభిప్రాయం. గతంలో వాయిదాల మీద వాయిదాలు పడ్డ సినిమాలు హిట్‌ అయిన సందర్భాలు చాలా తక్కువ. ప్రస్తుతం వాయిదా పడుతున్న సినిమాలన్నీ భారీ బడ్జెట్‌లో నిర్మించిన సినిమాలు కావడంతో ఈ చర్చకు ప్రాధాన్యం పెరిగింది.   ఇప్పుడు రెండు పాన్‌ ఇండియా సినిమాల రిలీజ్‌లు అయోమయంలో పడినట్టు తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘అఖండ2’ చిత్రాన్ని మొదట సెప్టెంబర్‌ 25న రిలీజ్‌ చెయ్యాలని ప్లాన్‌ చేశారు. కానీ, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ ఇంకా పెండింగ్‌ ఉన్న కారణంగా డిసెంబర్‌ 5న సినిమాను రిలీజ్‌ చేయబోతున్నట్టు ప్రకటించారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కంప్లీట్‌ అయింది. అయితే ఇప్పుడు గ్రాఫిక్‌ వర్క్‌ ఇంకా జరుగుతోందని తెలుస్తోంది. దీంతో రిలీజ్‌ డేట్‌ మీద కూడా సందేహాలు వస్తున్నాయి. ఎందుకంటే మరో 20 రోజులు మాత్రమే టైమ్‌ ఉంది. కానీ, ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించి ఎలా ప్రమోషన్స్‌ స్టార్ట్‌ చెయ్యలేదు. దీన్ని బట్టి ‘అఖండ2’ మరోసారి పోస్ట్‌ పోన్‌ అవుతుందన్న వార్తకు బలం చేకూరింది.    ఇక ప్రభాస్‌, మారుతి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘రాజాసాబ్‌’ చిత్రం పరిస్థితి కూడా అదే. మొదట ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 5న రిలీజ్‌ చేయబోతున్నట్టు మొదట ప్రకటించారు. ఆ తర్వాత జనవరి 9న సంక్రాంతి కానుకగా సినిమాను రిలీజ్‌ చేస్తున్నట్టు ఒక ట్రైలర్‌ ద్వారా తెలిపారు. ఇప్పుడు ‘అఖండ2’ చిత్రాన్ని సంక్రాంతికి తీసుకురావాలనే ఆలోచనలో మేకర్స్‌ ఉన్నట్టు సమాచారం. అదే జరిగితే ‘అఖండ2’, ‘రాజాసాబ్‌’ చిత్రాల మధ్య భారీ పోటీ నెలకొనే అవకాశం ఉంది.    మరో పక్క మెగాస్టార్‌ చిరంజీవి, అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్రాన్ని జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంటే సంక్రాంతికి మూడు భారీ సినిమాలు బరిలో ఉండబోతున్నాయని మాట వినిపిస్తోంది. అయితే ‘అఖండ2’ రిలీజ్‌ వాయిదా పడుతుందని వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్‌ ప్రారంభమయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాను డిసెంబర్‌ 5న విడుదల చేస్తారనేది తాజా సమాచారం. సంక్రాంతికి చిరంజీవి, అనిల్‌ రావిపూడి సినిమా తప్పకుండా ఉంటుంది. మరి రాజాసాబ్‌ సినిమా రిలీజ్‌ మరోసారి వాయిదా పడుతుందనే వార్తల్లో ఎంత నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది. 
  తారాగణం: విక్రాంత్‌, చాందిని చౌదరి, మురళీధర్ గౌడ్, వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, అభినవ్ గోమఠం, జీవన్ కుమార్, శ్రీలక్ష్మి, హర్షవర్ధన్ తదితరులు సంగీతం: సునీల్‌ కశ్యప్‌ డీఓపీ: మహి రెడ్డి పండుగుల ఎడిటర్: సాయి కృష్ణ గణాల మాటలు: కళ్యాణ్ రాఘవ్ కథ, స్క్రీన్ ప్లే: సంజీవ్ రెడ్డి, షేక్ దావూద్ జి దర్శకత్వం: సంజీవ్ రెడ్డి నిర్మాతలు: మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్‌ రెడ్డి బ్యానర్స్: మధుర ఎంటర్‌టైన్‌మెంట్‌, నిర్వి ఆర్ట్స్‌ విడుదల తేదీ: నవంబర్ 14, 2025   ఇటీవల ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన చిన్న సినిమాలలో సంతాన ప్రాప్తిరస్తు ఒకటి. పెళ్ళయ్యి పిల్లలు పుట్టకపోతే ఆ జంట ఎదుర్కొనే ఇబ్బందుల నుండి పుట్టే హాస్యం, భావోద్వేగాలతో దీనిని తెరకెక్కించారు. విక్రాంత్‌, చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఏ మేరకు మెప్పించింది అనేది రివ్యూలో చూద్దాం. (Santhana Prapthirasthu Review)   కథ: చిన్నతనంలోనే తల్లిదండ్రులను దూరం చేసుకున్న చైతన్య(విక్రాంత్‌), హైదరాబాద్ లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుంటాడు. అక్క కుటుంబం ఫారెన్ లో సెటిల్ అవుతుంది. దీంతో ఆఫీస్, ఫ్రెండ్సే ప్రపంచంగా బ్రతుకుతుంటాడు. అలాంటి చైతన్య.. గ్రూప్స్ ఎగ్జామ్ కోసం హైదరాబాద్ కి వచ్చిన వరంగల్ అమ్మాయి కళ్యాణి(చాందిని చౌదరి)ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. ఆమెతో కలిసి జీవితాన్ని పంచుకోవాలి అనుకుంటాడు. మొదట్లో కళ్యాణి చైతన్యను పట్టించుకోదు. కానీ, అనుకోకుండా జరిగిన ఒక సంఘటన ఇద్దరినీ దగ్గర చేస్తుంది. అలా ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అయితే రిటైర్డ్ టీచర్ అయిన కళ్యాణి తండ్రి ఈశ్వర్ రావు(మురళీధర్ గౌడ్) వారి ప్రేమకు అడ్డు చెబుతాడు. అప్పటికే చైతన్యను ఒకసారి కలిసి.. అతని అలవాట్లు, పద్ధతి నచ్చకపోవడంతో.. వారి పెళ్ళికి నిరాకరిస్తాడు. అయితే పెద్దలకు ఇష్టం లేకుండా పెళ్ళి చేసుకున్నా, పిల్లలు పుడితే వాళ్ళే దగ్గరవుతురన్నా నమ్మకంతో..  ఈశ్వర్ రావుకి చెప్పకుండా వెళ్ళిపోయి చైతన్య, కళ్యాణి పెళ్ళి చేసుకుంటారు. కూతురిపై అమితమైన ప్రేమ ఉన్న ఈశ్వర్ రావు.. కొద్దిరోజులకే కూతుర్ని వెతుక్కుంటూ వస్తాడు. చైతన్య జీవితంలో ఇక అంతా సాఫీగా జరుగుతుంది అనుకుంటున్న టైంలో ఊహించని షాకులు ఎదురవుతాయి. స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉండటంతో పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువని డాక్టర్లు చెబుతారు. మరోవైపు, కళ్యాణిని తన నుండి దూరం చేసి.. రెండో పెళ్ళి చేయాలనే లక్ష్యంతో ఈశ్వర్ రావు వచ్చాడని తెలుస్తుంది. ఇవి చైతన్య జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయి? అతని నుండి కళ్యాణి దూరంగా వెళ్లిపోయే పరిస్థితి ఎందుకు వస్తుంది? చివరికి ఏం జరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.   విశ్లేషణ: కథగా చూసుకుంటే సంతాన ప్రాప్తిరస్తు పెద్ద కథేమీ కాదు. నిజానికి ఇలాంటి రొమాంటిక్ కామెడీ సినిమాలకు లేదా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కి పెద్ద కథ కూడా అవసరంలేదు. సింపుల్ స్టోరీలను బ్యూటిఫుల్ గా చెప్పగలిగితే చాలు. సన్నివేశాలలో, సంభాషణలలో కొత్తదనం ఉండేలా చూసుకోవాలి. ఎంటర్టైన్మెంట్ అందిస్తూనే ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా చేసి.. ఆడియన్స్ కి బోర్ కొట్టకుండా చేయాలి. కానీ, సంతాన ప్రాప్తిరస్తు విషయంలో అలాంటి మ్యాజిక్ జరగలేదు. స్టోరీ లైన్ బాగానే ఉంది. కామెడీకి, ఎమోషన్ కి మంచి స్కోప్ ఉంది. అందుకు తగ్గట్టే ఈ సినిమాలో ఆ రెండూ ఉన్నాయి. కానీ, కామెడీ థియేటర్ లో కూర్చున్న ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా లేదు. ఇక ఎమోషన్.. థియేటర్ నుండి బయటకు వచ్చాక గుర్తుంచుకునేలా లేదు. దానికి కారణం రైటింగ్ పొడిపొడిగా ఉండటం. అసలు కథలోకి వెళ్ళడానికి చాలా సమయం తీసుకున్నారు. ఫస్ట్ హాఫ్ ఎక్కువగా హీరో పాత్ర పరిచయం, ఆఫీస్ సెటప్, హీరోయిన్ తో ప్రేమ సన్నివేశాలతోనే నడిచింది. ఈ క్రమంలో వచ్చే కామెడీ అంతగా వర్కౌట్ కాలేదు. ప్రేమ కథలోనూ కొత్తదనం లేదు. ఇంటర్వెల్ ఎపిసోడ్ బాగానే ఉంది. సెకండాఫ్ లో ఫన్ కి, డ్రామాకి బోలెడంత స్కోప్ ఉందనే ఆశని కలిగించింది. అయితే ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే కాస్త బెటరే కానీ, సెకండాఫ్ కూడా గొప్పగా లేదు. వెన్నెల కిషోర్ ట్రాక్ అంతో ఇంతో పరవాలేదు. పతాక సన్నివేశాలు మాత్రం బాగున్నాయి. ఆ ఎమోషన్ కి తగ్గట్టుగా క్లైమాక్స్ సంభాషణలు బాగానే కుదిరాయి.  ఒక విషయంలో మాత్రం మూవీ టీంని అభినందించాలి. సంతానం కలగకపోవడం, అందునా హీరోకి స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉండటం అనేది చాలా సున్నితమైన అంశం. దానిని జాగ్రత్తగా డీల్ చేయాలి. ఏ మాత్రం గీత దాటినా.. నిజ జీవితంలో అలాంటి సమస్యను ఎదుర్కొంటున్న వారిని బాధపెట్టిన వారవుతారు. అలాగే, కొన్ని సీన్స్ హద్దు దాటితే ఫ్యామిలీ ఆడియన్స్ ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఆ విషయంలో మాత్రం.. టీంని మెచ్చుకోవాలి. గీత దాటకుండా బ్యాలెన్స్డ్ గానే సినిమాని నడిపే ప్రయత్నం చేశారు.   నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు: చైతన్య పాత్రలో విక్రాంత్‌ బాగానే రాణించాడు. భర్త, తండ్రి ప్రేమ మధ్యలో నలిగిపోయే కళ్యాణి పాత్రలో చాందిని తన సహజ నటనతో మెప్పించింది. కూతురు మీద అతి ప్రేమ చూపించే తండ్రి పాత్రలో మురళీధర్ గౌడ్ తన మార్క్ చూపించారు. డాక్టర్ భ్రమరంగా వెన్నెల కిషోర్, హీరో ఫ్రెండ్ గా అభినవ్ గోమఠం, చిన్నపాటి దాదా జాక్ రెడ్డిగా తరుణ్ భాస్కర్ అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశారు. హర్షవర్ధన్, జీవన్ కుమార్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. రచయితగా దర్శకుడు సంజీవ్ రెడ్డి పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఆసక్తికరంగా కథనాన్ని, కొత్తదనంతో సన్నివేశాలను రాసుకోలేకపోయారు. సునీల్‌ కశ్యప్‌ సంగీతం పరవాలేదు. మహి రెడ్డి పండుగుల కెమెరా పనితనం ఆకట్టుకుంది. ఎడిటింగ్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది. ఎమోషనల్ సీన్స్ లో డైలాగ్స్ ఓకే కానీ, కామెడీ సీన్స్ లో ఆ పంచ్ లేదు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో చాలా సీన్స్ డైలాగ్స్ తో నిండిపోయాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.   ఫైనల్ గా... సంతాన ప్రాప్తిరస్తులో.. కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది. కానీ, అది తగిన మోతాదులో లేదు. ఈ సినిమా భాషలోనే చెప్పాలంటే కౌంట్ సరిపోలేదు.    రేటింగ్: 2.25/5   Disclaimer: Views expressed in this review are personal opinions of the reviewer and organisation doesn't take any liability. Viewers discretion is advised before commenting or reacting to this review.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  వివాహం అనేది ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ఉండాలనే చేసుకుంటారు.  కానీ దురదృష్టం కొద్ది పెళ్ళి చేసుకున్న జంటలు అన్నీ కలిసి ఉండటం జరగదు. కుటుంబ కారణాలు కావచ్చు, వ్యక్తిగత కారణాలు కావచ్చు, వేరే ఇతర కారణాలు కూడా కావచ్చు.  నేటికాలంలో భార్యాభర్తలు విడిపోవడానికి చాలా రకాలుగా కారణాలు ఉంటున్నాయి. అయితే భార్యాభర్తలు  మాత్రమే చేసే కొన్ని మిస్టేక్స్ ఉంటాయి.  వీటి వల్ల భార్యాభర్తల బంధం బలహీనపడి విడిపోవడానికి దారి తీస్తుంది. భార్యాభర్తలు విడిపోవడానికి కారణం అయ్యే ఆ మిస్టేక్స్ ఏంటో తెలుసుకుంటే.. ఆ తప్పులు జరగకుండా జాగ్రత్త పడవచ్చు.  తద్వారా భార్యాభర్తల బంధం పదిలంగా ఉంచుకోవచ్చు. ఇవి మాట్లాడకూడదు.. భార్యాభర్తలలో ఏవరైనా లేకా ఇద్దరూ అయినా వివాహానికి ముందు వేరే వ్యక్తులను ప్రేమించి ఉండవచ్చు.  కొందరు తమ వివాహం సమయంలో నిజాయితీగా ఉండాలనుకుని తమ గత ప్రేమ విషయాన్ని చెబుతుంటారు.  అయితే వారు నిజాయితీగా తమ ప్రేమ గురించి చెప్పిన తరువాత  మాజీ ప్రియుడు లేదా ప్రియురాలి గురించి  పదే పదే మాట్లాడటం, ఏదైనా సమయం లేదా  సందర్బంలో మాజీ వ్యకులతో పోల్చి అసహనం వ్యక్తం చేయడం వంటివి చేయకూడదు. ఇలా చేస్తే బార్యాభర్తల బంధం దెబ్బతింటుంది. ఎందుకంటే ఎవరూ ఇలా పోలికలు పెట్టి మాట్లాడటం గురించి సహించరు. చిన్న విషయాలు, గొడవలు.. భార్యాభర్తలు చిన్న చిన్న విషయాలకే ఒకరితో మరొకరు గొడవ పెట్టుకుంటే లేదా ఎటువంటి కారణం లేకుండా  కోపాన్ని, అసహనాన్ని చూపిస్తుంటే ఆ బంధం ఎక్కువకాలం నిలవడం కష్టమవుతుంది. అందుకే భార్యాభర్తలు మిగతా సమయాలలో ఎలా ఉన్నా ఒకరి పక్కన ఒకరు ఉన్నప్పుడు ఓపికగా, ప్రశాంతంగా ఉండాలి. అబద్దాలు.. భార్యాభర్తలు ఒకరితో మరొకరు పదే పదే అబద్ధం చెబితే  సంబంధం బెడిసికొట్టే అవకాశం ఉంది. ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి,  నిజాన్నే మాట్లాడాలి.  ఎప్పుడైనా అబద్దం అనేది చెబితే భాగస్వామిని బాధపెట్టకూడదనే ఉద్దేశంతో చెప్పాలి తప్ప..  మోసం చేసే ఉద్దేశంతో చెప్పకూడదు.  భాగస్వామిని మోసం చేయడం వల్ల భార్యాభర్తల  బంధం ఒక్క క్షణంలో నాశనం అవుతుంది. తప్పులు, క్షమాపణ.. భార్యాభర్తల మధ్య గొడవలు, వాదనలు వచ్చినట్టే తప్పులు కూడా జరుగుతాయి.  భార్యాభర్తలలో ఎవరైనా సరే.. తప్పు చేస్తే మరొకరు క్షమించడానికి సిద్దంగా ఉండరు. జరిగిన తప్పు గురించి పదే పదే సమయం,  సందర్భం వచ్చిన ప్రతి సారి నిందిస్తూ, తిట్టుకుంటూ ఉంటారు.  కానీ ఇది చాలా కాలం పాటు కొనసాగితే అది  సంబందాన్ని దెబ్బతీస్తుంది. ఇలా గొడవ చేస్తుంటే ఏ లైప్ పార్ట్నర్ కూడా కలిసి ఉండాలని అనుకోరు. ఫలితంగా ఇద్దరూ విడిపోయే అవకాశాలు పెరుగుతాయి. అందుకే  ఏ తప్పును ఎక్కువ కాలం మనసులో పెట్టుకుని ఉండకూడదు.  తప్పు జరగగానే దాని గురించి మాట్లాడుకుని, ఆరోగ్యకర సంభాషణలతో పరిష్కరించుకుని, దాని గురించి వదిలేయాలి.                              *రూపశ్రీ.  
  నేటి బిజీ జీవితాల్లో అందరినీ సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించడం వల్ల మనల్ని మనం కోల్పోవడం, మనకు మనం ప్రాధాన్యత ఇచ్చుకోవడం తగ్గుతుంది. ఇతరులు ఏదైనా అడిగినప్పుడు చాలామంది  నో చెప్పాలనుకుంటారు. కానీ చివరికి సరే అని చెబుతుంటారు. నో చెబితే ఎదుటివారు ఏమనుకుంటారో అనే ఫీలింగ్ ఒకటైతే.. మనం కాకపోతే ఎవరు సహాయం చేస్తారు అనే మంచితనం కూడా ఇలా సరే అని చెప్పడానికి కారణం అవుతుంది.  కానీ ఇలా సరే అని చెప్పిన తరువాత చాలామంది ఆ పని పూర్తీ చేయడంలో చాలా అలసిపోతారు,  తమ మీద తాము చిరాకు పడతారు, నేనెప్పుడూ ఇంతే ఇలా తప్పు  చేస్తుంటాను అని అసంతృప్తి కలిగిస్తుంది. కానీ ప్రతి ఒక్కరూ సరిహద్దులు నిర్ణయించుకోవడం చాలా ముఖ్యం. సరిహద్దులు నిర్ణయించుకోవడం అంటే ఇతరులను దూరం పెట్టడం లేదా దూరం చేసుకోవడం అస్సలు కాదు.. తమను తాము గౌరవించుకుంటూ ఇతరులను కూడా గౌరవించేలా చేసేది ఇలా సరిహద్దులు నిర్ణయించుకోవడమే..  సరిగ్గా సరిహద్దులను నిర్ణయించినప్పుడు సంబంధాలు బలపడతాయి. అపరాధ భావన  లేదా తప్పు చేసిన ఫీలింగ్ లేకుండా ఎవరికైనా నో చెప్పాలంటే కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిందే.. దేని వల్ల ఎక్కువ అలసిపోతున్నాం, చిరాకు వడుతున్నాం,  ఒత్తిడి గురవుతున్నాం అనే విషయాలు ఆలోచించి అర్థం చేసుకోవాలి. ఇలా అర్థం చేసుకుంటే ఏది ముఖ్యం,  ఏది ముఖ్యం కాదు.. అనే విషయాలు అర్థం చేసుకోవచ్చు.  ఇది ఎవరికైనా ఏ విషయానికి నో చెప్పాలి,  దేనికి చెప్పకూడదు  అని నిర్ణయించుకోవడంలో సహాయపడుతుంది. ఎవరైనా ఏదైనా సహాయం అడిగినప్పుడు దాని విషయంలో పరిమితులు,  సామర్థ్యం మొదలైనవి మొహమాటం లేకుండా చెప్పాలి.  షో-ఆఫ్ చేయడానికి చాలామంది తమ గురించి కొండంత చెప్పుకుని తరువాత ఇబ్బంది పడుతుంటారు. అందుకే తమ గురించి తాము ఎక్కువ చెప్పుకోకూడదు. ఇలా చేస్తే ఇండైరెక్ట్ గా నో చెప్పినట్టు అవుతుంది. ఇతరులు ఏదైనా అడిగినప్పుడు ఆ పని చేసే సామర్థ్యం లేదా సమయం లేనప్పుడు అదే విషయాన్ని చెప్పాలి.  అంతేకానీ ఎదుటివారికి అనవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వకూడదు. ఇది అపార్థాలకు,  తగాదాలకు దారి తీసే అవకాశం ఉంటుంది. ఎవరికైనా దేని గురించి అయినా కారణాలు చెప్పే బదులు,  తాము ఉన్న పరిస్థితులు, చుట్టూ ఉన్న వాతావరణం వంటివి వివరించి చెప్పాలి.  ఇది ఎదుటి వ్యక్తిని బాధపడకుండా ఉంచుతుంది. ఎదుటివారు సరిహద్దులను మరచిపోయి అన్ని విషయాలను, పనులను సహాయం అడుగుతుంటే.. అలాంటి వారికి సున్నితంగానే సరిహద్దును గుర్తు చేయాలి.  సాధ్యమైనంత వరకే సమయాన్ని ఇవ్వాలి కానీ ఇతరుల కోసమే పూర్తీ సమయాన్ని వెచ్చించకూడదు. ఎదుటివారి దృష్టిలో ఎప్పుడూ తటస్థంగానే ఉండాలి.  అంచనాలు పెరుగుతూ ఉంటే వారి దృష్టిలో ఆశించడం కూడా పెరుగుతుంది. ఎవరి అవసరాలు వారికి ముఖ్యమని ఎదుటివారికి అర్థమయ్యేలా చేస్తుండాలి. ఇలా ఉంటే ఎదుటివారు కూడా ఏ విషయం అడగాలి, ఏది అడగకూడదు  అనే విషయం అర్థం చేసుకోగలుగుతారు. సొంత పనులు వదులుకుని మరీ ఇతరుల కోసం పాకులాడకూడదు.  ఎవరికోసం ఖర్చయ్యే సమయం అయినా సరే.. ఎన్ని కారణాలు చూపించినా  ఒక్క సెకెను కూడా తిరిగి తెచ్చుకోలేం. కాబట్టి సొంత పనుల తర్వాతే ఇతరుల పనులు చేసివ్వాలి.  ఇది స్వార్థం అని చాలామంది అనుకుంటారు. కానీ మనం బాగుంటేనే.. ఇతరుల కోసం మనం చేసే పనులకు గౌరవం ఉంటుంది.                                  *రూపశ్రీ
  ప్రతి వ్యక్తి గౌరవంగా ఉండాలని అనుకంటాడు.  తను ఎక్కడ ఉంటే అక్కడ తనకు గౌరవం లభిస్తుంది అంటే ఆ వ్యక్తి వ్యక్తిత్వపరంగా ఉన్నతంగా ఉన్నట్టే లెక్క.  కానీ చాలా మంది వ్యక్తిత్వ పరంగా సరిగా లేకుండా.. నలుగురు గౌరవం ఇవ్వడం లేదని వాపోతుంటారు.  అయితే అందరూ గౌరవం ఇవ్వాలంటే ప్రతి వ్యక్తి కొన్ని నియమాలు పాటించాలి. ఈ నియమాలు పాటిస్తే అందరూ ఆటోమేటిక్ గా గౌరవం ఇస్తారు.  నలుగురిలో ఎప్పుడూ గౌరవాన్ని ఇస్తూ వ్యక్తిని హుందాగా ఉంచే ఆ 5 నియమాలు ఏంటో తెలుసుకుంటే.. పిలుపు.. ఎవరిని అయినా, దేనికైనా పిలవడం లేదా పలకరించడం చాలా కామన్.  ఏదేనా పని కోసం కావచ్చు,  సహాయం కోసం కావచ్చు.  ఎవరిని అయినా సరే.. రెండు కంటే ఎక్కువ సార్లు పిలవకూడదు.  పదే పదే ఎక్కువ సార్లు పిలవడం వల్ల వ్యక్తుల దృష్టిలో చిన్నతనంగా మారతాము.  దీని వల్ల వ్యక్తిత్వం కూడా పలుచబడుతుంది.  సమయం కేటాయించగలిగే వారు లేదా తోడుగా ఉండగలం అనుకునేవారు అయితే ఎక్కువ సార్లు అడిగించుకోకుండానే వచ్చేస్తారు. కానీ రాలేదంటే.. వారు ఏదైనా సమస్యలో ఉండాలి, లేదంటే వారికి వచ్చే ఉద్దేశం లేక రాకపోయి ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎవరినీ దేనికోసం ఎక్కువసార్లు పిలవకూడదు. సలహాలు, సూచనలు.. కొందరికి అత్యుత్సాహం ఉంటుంది.  పక్కన ఉన్నవారు అయినా తెలిసిన వారు అయినా స్నేహితులు అయినా, కుటుంబ సభ్యులు అయినా.. ఇలా ఎవరైనా సరే.. వారు ఏదైనా ఇబ్బంది లేదా సమస్యలో ఉన్నట్టు కనిపిస్తే ఊరికే ఉండలేరు.  తమ తెలివి తేటలు ఉపయోగించి ఏదో ఒక సలహా లేదా సూచన ఇస్తూనే ఉంటారు. ఎదుటివారు తాము చెప్పింది యాక్సెప్ట్ చేసేవరకు ఏదో ఒకటి చెప్పడం చేస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల ఎదుటివారి దృష్టిలో గౌరవం ఉండదు.  అందుకే ఎదుటివారు తమకు తాము అడిగేవరకు ఎవరికీ ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వకూడదు. వినడం.. ఎదుటివారు ఏదైనా చెప్పేటప్పుడు వినాలంటే చాలామంది చాలా బోర్ ఫీలవుతారు. అదొక టైం వేస్ట్ పని అన్నట్టు ఫీలయ్యేవారు, ఎదుటివారు చెప్పింది వినడం పెద్ద తలనొప్పి అనుకునేవారు ఎక్కువ. కానీ ఎదుటివారు ఏదైనా చెప్పేటప్పుడు శ్రద్దగా వెంటే వారు చెప్పే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనివల్ల వారికి తిరిగి సమాధానం చెప్పాలంటే ఎక్కువ సేపు మాట్లాడాల్సిన అవసరం ఉండదు.  అందుకే ఎక్కువ వినాలి,  తక్కువ మాట్లాడాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు. ప్లానింగ్స్.. ఏదైనా పని చేయడానికి ప్లానింగ్ గా ఉండటం చాలామంది కామన్ గా చేసేపని.  అయితే ప్లానింగ్ అనుకోగానే దాన్ని అందరికీ వివరించి చెప్పడం,  ఆ పని తర్వాత ఏం జరుగుతుంది,  దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి.. మొదలైన విషయాలన్నీ చాలామంది పూస గుచ్చినట్టు వివరించి చెప్పేస్తుంటారు.  దీనివల్ల అనుకున్న పనులు జరగకపోయినా,  అసలు పనులు మొదలు పెట్టలేకపోయినా చాలా అవమానం ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే చేయబోయే పనుల గురించి ఎవరికీ చెప్పకూడదు.  పనులు పూర్తయ్యే దాక ఎవరికీ చెప్పకూడదు. సంతోషం.. సంతోషంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అలాగే.. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకునేవారు కూడా ఉంటారు.  అందుకే చాలామంది తమ చుట్టూ ఉన్నవారిని సంతోషంగా ఉండటం కోసం చాలా సతమతం అవుతుంటారు. ఈ క్రమంలో తమ ప్రాధాన్యతలు కోల్పోవడం, తమ పనులు మానుకోవడం వంటివి కూడా చేస్తారు. కానీ అందరినీ సంతోషంగా ఉంచడం అసాధ్యం  అనే విషయాన్ని గ్రహించాలి.  అందరినీ సంతోషంగా ఉంచడం ఒక్కరి పనే కాదని,  ఎవరి సంతోషాన్ని వారు నిలబెట్టుకోవాలని తెలుసుకోవాలి.  ఇలా ఉంటే అందరూ గౌరవిస్తారు.                                              *రూపశ్రీ.
  మూత్రపిండాలు మానవ శరీరంలో ఒక భాగం. ఇవి 24 గంటలు నిశ్శబ్దంగా తమ విధులు నిర్వర్తిస్తాయి.  మూత్రపిండాలు  శరీరం నుండి విషాన్ని,  అదనపు నీటిని తొలగిస్తాయి. రక్తపోటును నియంత్రిస్తాయి.   ఖనిజాల సమతుల్యతను కాపాడుతాయి. కానీ మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే  శరీరంలో అనేక లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. చాలా మంది వీటిని పట్టించుకోరు. ఈ లక్షణాలను సకాలంలో గుర్తించకపోతే అవి తీవ్రమైన అనారోగ్యంగా డవలప్ అవుతాయి.  ప్రపంచ జనాభాలో దాదాపు 10 శాతం మంది ఏదో ఒక రకమైన మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారని,  వీటి కారణంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది మరణిస్తున్నారని ఆరోగ్య నివేదికలు చెబుతున్నాయి. మూత్రపిండాలు సరిగా పని చేయకపోతే ఏ లక్షణాలు కనిపిస్తాయో తెలుసుకుంటే.. లక్షణాలు.. కిడ్నీ సమస్యలు తరచుగా చాలా చిన్న లక్షణాలతో మొదలవుతాయి. కానీ వాటిని పట్టించుకోకపోతే చాలా పెద్ద సమస్యగా మారతాయి.   అలసట,బలహీనత.. ఎప్పుడూ అలసట, కాళ్ళలో లేదా కళ్ళ కింద వాపు, మూత్రం రంగు లేదా పరిమాణంలో మార్పులు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా చర్మం పొడిబారడం, చర్మం దురదగా ఉండటం  మొదలైనవన్నీ మూత్రపిండాలు బలహీనపడుతున్నాయనడానికి సంకేతాలు. ఎప్పుడూ  అలసట లేదా బలహీనత అనేవి శరీరంలో విషపదార్థాలు పేరుకుపోతున్నాయని,  మూత్రపిండాలు వాటిని సరిగ్గా తొలగించలేకపోతున్నాయని అర్థం. బాగా  నిద్రపోయిన  తర్వాత కూడా  అలసిపోయినట్లు అనిపించడాన్ని , అస్సలు  తేలికగా తీసుకోకూడదు.  శరీరంలో వాపు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. మూత్రపిండాలు అదనపు ద్రవాన్ని తొలగించలేనప్పుడు అది శరీరంలోని కొన్ని భాగాలలో పేరుకుపోవడం మొదలుపెడుతుంది. ఇది మొదట పాదాలు, చేతులు లేదా ముఖంలో కనిపిస్తుంది. దీనిని వైద్య పరిభాషలో ఎడెమా అంటారు. మూత్రంలో మార్పులు.. మూత్రపిండాల సమస్యలకు చాలా స్పష్టమైన సంకేతం. ముదురు రంగు మూత్రం, మూత్రంలో నురుగు లేదా బుడగలు, తరచుగా మూత్రవిసర్జన లేదా మంట వంటివి మూత్రపిండాల సమస్యను సూచిస్తాయి. శ్వాస ఆడకపోవడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా మూత్రపిండాల వైఫల్యాలు ఎదుర్కునే చాలామందిలో ఉండే లక్షణం. మూత్రపిండాలు శరీరం నుండి అదనపు ద్రవాన్ని తొలగించలేనప్పుడు ఆ ద్రవం ఊపిరితిత్తులకు చేరుకుంటుంది.  శ్వాస తీసుకోవడం కష్టతరం చేస్తుంది. చాలా మంది ఇలాంటి సమస్య వచ్చినప్పుడు  గుండె లేదా ఊపిరితిత్తుల సమస్య అనుకుంటారు. కానీ అసలు కారణం మూత్రపిండాల సమస్య. పొడి, దురద చర్మం.. మూత్రపిండాలు రక్తం నుండి అవసరమైన ఖనిజాలు,  వ్యర్థ ఉత్పత్తులను ఫిల్టర్ చేయలేకపోవడం వల్ల పొడి చర్మం,  దురద వంటి సమస్యలు వస్తాయి. ఇది శరీరంలో ఖనిజ అసమతుల్యతకు కారణమవుతుంది. ఇది చర్మాన్ని పొడిగా, దురదగా చేస్తుంది. మూత్రపిండాల వ్యాధి సమస్యలు ముదిరే కొద్ది ఈ సమస్య బయటకు కనిపిస్తుంది. పై లక్షణాలు ఏవైనా  కనిపిస్తే ఆలస్యం చేయకుండా  వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. ముందుగా గుర్తించడం వల్ల వ్యాధిని నివారించడమే కాకుండా మూత్రపిండాల పనితీరును కూడా గణనీయంగా కాపాడుకోవచ్చు. మూత్రపిండాల ఆరోగ్యానికి సమతుల్య,  ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం  చాలా ముఖ్యం. ఉప్పు తీసుకోవడం తగ్గించాలి.  అధిక సోడియం రక్తపోటును పెంచుతుంది,  మూత్రపిండాలను దెబ్బతీస్తుంది. ఆపిల్, బెర్రీలు, ద్రాక్ష, కాలీఫ్లవర్, క్యాబేజీ,  క్యాప్సికం వంటి పొటాషియం తక్కువగా ఉన్న పండ్లు,  కూరగాయలు మూత్రపిండాల సమస్యలు రాకుండా చేయడం లేదా, మూత్ర పిండాలను సంరక్షించడం చేస్తాయి. అందుకే వీటిని తీసుకోవాలి. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు వాపును తగ్గిస్తాయి,  మూత్రపిండాల ఒత్తిడిని తగ్గిస్తాయి.  చేపలు, కాయధాన్యాలు లేదా గుడ్డులోని తెల్లసొన వంటి లీన్ ప్రోటీన్ లను  తీసుకోవాలి. రెడ్ మీట్,  ప్రాసెస్ చేసిన ఆహారాలను నివారించాలి.  వీటిలోని ప్రిజర్వేటివ్‌లు మూత్రపిండాలు  ఎక్కువగా పని చేయడానికి కారణం అవుతాయి. ప్రతి చిన్న సమస్యకు అధికంగా  మందులు వాడటం, ముఖ్యంగా నొప్పి నివారణ మందులు, మూత్రపిండాలను దెబ్బతీస్తాయి. వైద్యుల సలహా లేకుండా  పదే పదే పెయిన్ కిల్లర్స్ తీసుకోకూడదు.                             *రూపశ్రీ గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  మందులు వాడటం నేటి కాలంలో చాలా సహజం అయిపోయింది. చిన్న సమస్య నుండి, పెద్ద ఆరోగ్య సమస్య వరకు ప్రతి సమస్య తగ్గడానికి మందులు వాడుతుంటారు.  ఇందులో టాబ్లెట్లు, ఇంజెక్షన్లు  ఉంటాయి. కొందరు వైద్యుల సలహాతో మందులు వాడితే.. మరికొందరు సొంతంగా మందులు కొని అడపాదడపా వాడుతూనే ఉంటారు. అయితే మందులను ఎక్కువ కాలం వాడితే ఎవ్వరూ ఊహించనంత డేంజర్ సమస్య ఎదురవుతుందని చాలామందికి తెలియదు. ఏదైనా ఆరోగ్య సమస్య కారణంగా మందులను ఎక్కువ కాలం వాడటం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు క్రమంగా తగ్గుతాయట.  ఈ లోపం శరీరం లోపల పెరుగుతూనే ఉంటుందని, దీని కారణంగా అలసట,  రోగనిరోధక శక్తి తగ్గడం, ఎముకలు బలహీన పడటం.. వంటి అనేక సమస్యలకు కారణమవుతుందట.  అసలు ఏ మందులు వాడటం వల్ల ఇలాంటి సమస్య ఎదురవుతుంది? ఎక్కువ కాలం మందులు వాడాల్సి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తెలుసుకుంటే.. ఆస్ప్రిన్ ఆస్ప్రిన్ శరీరం విటమిన్ సి శోషణను తగ్గిస్తుంది. దీని వలన విటమిన్ సి క్రమంగా క్షీణిస్తుంది. దీర్ఘకాలిక ఆస్ప్రిన్ వాడకం వల్ల ఐరన్ నిల్వలు కూడా తగ్గుతాయి.  రోజుకు 100 mg తక్కువ మోతాదులో ఆస్ప్రిన్ తీసుకునే 65 ఏళ్లు పైబడిన వారిలో రక్తహీనత ప్రమాదం 20 శాతం పెరిగిందని ఒక అధ్యయనం తేల్చింది. టైలెనాల్, ఎసిటమైనోఫెన్ గ్లూటాతియోన్ శరీరంలోని ప్రధాన యాంటీఆక్సిడెంట్. ఇది కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. టైలెనాల్ వంటి మందులు దాని స్థాయిలను తగ్గిస్తాయి, కాలేయం దెబ్బతినే ప్రమాదాన్ని పెంచుతాయి. తక్కువ గ్లూటాతియోన్ స్థాయిలు వృద్ధాప్యం, మధుమేహం, ఇన్ఫెక్షన్లు,  బలహీనమైన రోగనిరోధక పనితీరు వంటి సమస్యలకు కారణం అవుతుంది. గర్భనిరోధక మాత్రలు గర్భనిరోధక మాత్రలను నిరంతరం ఉపయోగించడం వల్ల శరీరంలో ఫోలిక్ యాసిడ్, బి2, బి6, బి12, విటమిన్ సి, విటమిన్ ఇ, మెగ్నీషియం, సెలీనియం,  జింక్ వంటి అనేక విటమిన్లు,  ఖనిజాలు క్షీణిస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ఈ లోపం చాలా తీవ్రంగా ఉంటుంది. చాలా మంది మహిళలు సప్లిమెంట్లను తీసుకోవలసి వస్తుంది. దీనికి గల కారణాలపై స్పష్టత లేదు.. కానీ ఈ మాత్రలలోని ఈస్ట్రోజెన్,  ప్రొజెస్టెరాన్ శరీర పోషక ప్రక్రియలను ప్రభావితం చేస్తాయని నమ్ముతారు. మెట్‌ఫార్మిన్ మధుమేహం ఉన్నవారికి సూచించబడే మెట్‌ఫార్మిన్, పేగులో విటమిన్ బి12 శోషణను తగ్గిస్తుంది. ఎక్కువకాలం  ఉపయోగించడం వల్ల విటమిన్ బి12 లోపానికి దారితీస్తుంది. ఇది నరాల దెబ్బతినే ప్రమాదాన్ని పెంచుతుంది. యాంటాసిడ్లు యాంటాసిడ్లు కడుపులోని ఆమ్లాన్ని తగ్గిస్తాయి. కానీ ఇదే ఆమ్లం ఆహారం నుండి విటమిన్ బి12 విడుదలకు సహాయపడుతుంది. దీర్ఘకాలిక యాంటాసిడ్ వాడకం వల్ల కాల్షియం, పొటాషియం,  జింక్ లోపాలు కూడా ఏర్పడతాయి, దీనివల్ల ఎముకలు బలహీనపడతాయి,  కండరాల పట్టు తగ్గుతుంది. స్టాటిన్స్ స్టాటిన్ మందులు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి,  గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ అవి కండరాల శక్తి ఉత్పత్తికి అవసరమైన కోఎంజైమ్ Q10 ను  తగ్గిస్తాయి. ఈ లోపం కండరాల నొప్పి, బలహీనత,  వాపుకు కారణమవుతుంది. యాంటీబయాటిక్స్ యాంటీబయాటిక్స్ హానికరమైన బ్యాక్టీరియాను చంపుతాయి. కానీ అవి మంచి గట్ బాక్టీరియాకు కూడా హాని చేస్తాయి. ఇది గట్ సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఊబకాయం, అలెర్జీలు, జీర్ణ సమస్యలు,   రోగనిరోధక శక్తి తగ్గడానికి దారితీస్తుంది. స్టెరాయిడ్స్ స్టెరాయిడ్లు శరీర ఖనిజ సమతుల్యతను అనేక విధాలుగా దెబ్బతీస్తాయి.  కాల్షియం శోషణను తగ్గిస్తాయి, ఎముకలు బలహీనపడటానికి దారితీస్తాయి,  విటమిన్ డి పనితీరును కూడా తగ్గిస్తాయి. ఇది మెగ్నీషియం,  పొటాషియం స్థాయిలను తగ్గిస్తుంది.  బలహీనత, అలసట,  తిమ్మిరికి దారితీస్తుంది. దీర్ఘకాలిక స్టెరాయిడ్ వాడకం కూడా బి విటమిన్ల ప్రభావాన్ని తగ్గిస్తుంది. నరాల పనితీరును ప్రభావితం చేస్తుంది. జాగ్రత్త.. ఎక్కువ కాలంగా ఏవైనా మందులు వాడుతుంటే, వాటితో పాటు ఏ విటమిన్ లేదా మినరల్ సప్లిమెంట్లు తీసుకోవాలో  వైద్యుడిని లేదా డైటీషియన్‌ను అడగాలి. ఈ సాధారణ జాగ్రత్తలు అలసట, రక్తహీనత, ఎముకల నష్టం,  హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలను నివారించడంలో సహాయపడతాయి.                               *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
ఆహారమే ఆరోగ్యానికి ఔషదంగా పనిచేస్తుంది.  భారతీయ ఆయుర్వేదం చాలా వరకు ఆరోగ్య సమస్యలకు ఆహారాన్నే ఔషదంగా సూచిస్తుంది. బోలెడు రకాల వంటకాలు,  దేశ విదేశీ రుచులు ఎప్పుడు కావాలంటే అప్పుడు లభించే నేటికాలంలో ఆహారం దగ్గర కంట్రోల్ లో ఉండటం కాసింత కష్టమైన పనే.. కానీ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునేవారు, డైటింగ్ చేస్తున్నవారు..  బయట ఫంక్షన్లు,  పార్టీలు,  శుభకార్యాలు,  ఫ్రెండ్స్ తో లంచ్, డిన్నర్ వంటివి చేసేవారు ఆహారం దగ్గర కంట్రోల్ ఉండలేకపోతున్నాం అని బాధపడుతూ ఉంటారు.  అలా బాధపడక్కర్లేకుండా బయట తినేటప్పుడు అతిగా తినడాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలుసుకుంటే.. హెల్తీ ఫుడ్స్.. వేయించిన, క్రిస్పీ లేదా క్రీమీ వంటకాలకు బదులుగా గ్రిల్ చేసిన, బేక్ చేసిన, ఆవిరి మీద ఉడికించిన లేదా ఉడికించిన వంటకాలను ఎంచుకోవాలి. వంట చేసిన విధానం మీద ఆ వంటలో ఉండే కేలరీలు డిసైడ్ అవుతాయి. గ్రిల్ చేసిన లేదా ఆవిరి మీద ఉడికించిన ఆహారాలకు తక్కువ నూనె అవసరం అవుతుంది.  వేయించిన లేదా క్రీమీ ఆహారాలలో ఎక్కువ ఫ్యాట్  ఉంటుంది. అందుకే  రెస్టారెంట్లలో వేయించిన ఆహారాల కంటే గ్రిల్ చేసిన లేదా కాల్చిన,  స్టీమ్ చేసిన  ఆహారాన్ని ఎంచుకోవడం మేలు. డ్రింక్స్ వద్దు.. రెస్టారెంట్‌లో భోజనం చేసేటప్పుడు అతిగా తినకుండా ఉండటానికి డ్రింక్స్ కు  బదులుగా నీటిని మాత్రమే తీసుకోవాలి. బయట భోజనం చేసేటప్పుడు కూల్ డ్రింక్స్  లేదా జ్యూస్‌లు ఆర్డర్ చేయడం చాలా కామన్. కానీ ఇవి  కేలరీలు పెరగడానికి కారణం అవుతాయి. అందుకే కూల్ డ్రింక్స్, జ్యూస్ ల కంటే నీరు మాత్రమే తీసుకోవడం మేలు. హెల్తీ ఛాయిస్.. రెస్టారెంట్లలో ఫ్రైస్ లేదా చిప్స్ కు బదులుగా కూరగాయలు లేదా సలాడ్ ఎంచుకోవాలి. చాలా వంటకాలు అధిక కేలరీల కలిగిన  సైడ్ డిష్ లతో కాంబినేషన్ గా ఉంటాయి.  ఇలాంటి వాటిని హెల్తీ  ఛాయిస్ గా మార్చుకోవాలి. ప్రోటీన్ ఫుడ్..  బయటకు వెళ్లి ఆహారం తీసుకున్నా.. ఆ ఆహారం ప్రధానంగా ప్రోటీన్ ఆహారమై ఉండేలా చూసుకోవాలి. దీని కోసం చికెన్, టర్కీ లేదా చేప వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను ఎంచుకోవచ్చు. ఈ ఆహారాలు కడుపు నింపడమే కాకుండా ఎక్కువసేపు శక్తిని,  హెల్తీ ఫ్యాట్స్ ను కూడా అందిస్తాయి. పోర్షన్.. చాలావరకు రెస్టారెంట్లలో ఆర్డర్ చేసే ఆహారం పెద్ద మొత్తంలో ఉంటుంది.  బిర్యానీ,  మండీ.. లాంటి వాటి జోలికి వెళ్లకుండా ప్లేట్ మీల్స్ టైప్ లో ఆహారాన్ని ఆర్డర్ చేసుకుని సింపుల్ గా తక్కువగా తినడం మంచిది. ఒకవేళ పెద్ద మొత్తంలో ఆహారం ఆర్డర్ చేయాల్సి వచ్చినా సొంతంగా వడ్డించుకోకుండా ఎవరితోనైనా ఆహారాన్ని వడ్డించమనాలి. దీని వల్ల ఎక్కువ ప్లేట్ లో పెట్టుకోకుండా ఉంటారు.  ఆహారం లిమిట్ లోనే ఉంటుంది. నెమ్మది.. బయట తినేటప్పుడు నెమ్మదిగా తినడం చాలా ఇంపార్టెంట్. ఏవో పనులు ఉన్నాయనో లేదా అందరూ వేగంగా తింటున్నారనో ఆహారాన్ని సరిగా నమలకుండా వేగంగా తింటే జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయి. నిదానంగా తింటే ఆహారం కూడా ఎక్కువగా కాకుండా సరిపడినంత తినవచ్చు. ఆహారం ఎంత బాగా నమిలితే అంత బాగా కడుపు నిండిన ఫీల్ ఉంటుంది.                          *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...