LATEST NEWS
ఆజాదీ కా అమృతోత్సవ్ లో భాగంగా భీమవరంలో అల్లూరి సీతారారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమం ప్రాముఖ్యతను ఏపీలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం పూర్తిగా రాజకీయం చేసేసింది. తెలుగు ఖ్యాతికి రాజకీయ మకిలి పట్టించిన ఘనతను సొంతం చేసుకుంది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ఎవరికి పుట్టిన బిడ్డరా ఎక్కెక్కి ఏడుస్తోందన్న చందంగా ఎవరి దృష్టినీ ఆకర్షించని, ఎవరూ పట్టించుకోని కార్యక్రమంలా సాగింది. ప్రధాని మోడీ వచ్చి అల్లూరి 30 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించి, అనంతరం బహిరంగ సభలో ప్రసంగించినా అదేదో వైసీపీకి చెందిన సొంత వ్యవహారంగానే రాష్ట్ర ప్రజలు భావించారంటే ఆ తప్పు జగన్ సర్కార్ దేనని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలకు అతీతంగా నిర్వహాస్తున్నామంటూ ఘనంగా ప్రకటించినా ఆచరణలో మాత్రం ఈ కార్యక్రమాన్ని తన సొంత ఆధిపత్యం చాటుకోవడానికీ, తన రాజకీయ ప్రత్యర్థులను అవమానించడానికే జగన్ ఉపయోగించు కున్నారన్న విమర్శలు అన్ని వర్గాల నుంచీ వెల్లువెత్తుతున్నాయి. చివరికి వైసీపీ శ్రేణులు కూడా తెలుగు జాతి గర్వించేలా నిర్వహించాల్సిన ఈ కార్యక్రమాన్ని జగన్ సర్కార్ అతి జోక్యం వల్ల   ఒక గల్లీ కార్యక్రమంగా మిగిలిపోయిందని బాహాటంగానే అంటున్నారు. స్వాతంత్ర సమరయోధులలో అల్లూరిది ఒక ప్రత్యేక అధ్యాయం. తెలుగుజాతి పౌరుషాగ్ని రగిలించిన గొప్ప వ్యక్తిత్వం. కుల, మత, వర్గ, ప్రాంతీయ బేధాలకు అతీతంగా తెలుగువారంతా అల్లూరిని తమ గుండెల్లో కొలువుంచుకున్నారు. అటువంటి మహనీయుని 125వ జయంతి కార్యక్రమాన్ని జగన్ సర్కార్ రాజకీయం చేసి సాదాసీదాగా నిర్వహించేలా చేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎవరికీ ఆజాదీ కా అమృతోత్సవం కార్యక్రమం కనిపించలేదు. మన్యం వీరుడు అల్లూరి 125వ జయంతి స్ఫూర్తి గోచరించలేదు. ప్రొటోకాల్ ను, కోర్టు తీర్పులనూ కూడా లెక్క చేయకుండా జగన్ ను విమర్శిస్తున్నారన్న ఏకైక కారణంతో నర్సాపురం ఎంపి రఘురామకృష్ణం రాజును హాజరు కాకుండా నియంత్రించడానికి జగన్ ప్రభుత్వం పడిన తాపత్రయం మాత్రమే కనిపించింది. అదే హైలైట్ అయ్యింది. మిగిలిన అన్నీ సోదిలోకి కూడా లేకుండా పోయాయి. ఆఖరికి ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమానికి హాజరై అల్లూరి విగ్రహాన్ని ఆవిష్క రించిన ప్రధాన అంశం కూడా డమ్మీగా మారిపోయింది.  ఈ కార్యక్రమాన్ని రాజకీయ ప్రత్యర్థులను అవమానించేందుకే జగన్ సర్కార్ ఉపయోగించుకుంది. ఇది రాజకీయ ప్రత్యర్థుల ఆరోపణ మాత్రమే కాదు. ప్రతి తెలుగువాడి భావన కూడా. ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన ఈ కార్యక్రమంలో బీజేపీ, వైసీపీ నేతల వినా మరెవరూ కనిపించలేదు. ఆహ్వానం పంపామని వైసీపీ చెబుతున్న తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి పేరు ఆహ్వానితుల జాబితాలో లేనే లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా ఆహ్వానం లేఖ వచ్చినా ఆయన పేరు లేదని కలెక్టర్ విస్పష్టంగా చెప్పేశారు. దీంతో పిలిచి అవమానించారని అచ్చెన్నాయుడు అన్నారు. జనసేన పరిస్థితి అదే. రాష్ట్రంలో మిత్రపక్షం అయినా సరే జగన్ సర్కార్ పై జనసేనాని విమర్శలు చేయడమే ఆ పార్టీ నేతలకూ, అధినేతకూ కూడా ఆహ్వానం అందకపోవడానికి కారణమని సామాన్యులు సైతం గుర్తించేశారంటే జగన్ సర్కార్ ఎంత బాహాటంగా తన రాజకీయ వైరాన్ని ప్రదర్శించిందో అవగతమౌతుంది.   ఇక మరో ప్రధానమైన అంశం ఏమిటంటే మోడీ పర్యటన ముగించుకుని వెళుతుండగా ఎగిరిన నల్ల బెలూన్లు. ఒక వైపు మోడీ హెలికాప్టర్ మరో వైపు నల్ల బెలూన్లు సమాంతరంగా ఎగిరాయి. ప్రధాని పర్యటన సందర్భంగా ఈ స్థాయి నిరసన వ్యక్తం అవ్వడమంటే అది  పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే. రాజకీయ ప్రత్యర్థులను ఈ కార్యక్రమానికి రాకుండా చేయడంపై పెట్టిన దృష్టి మోడీ పర్యటన సందర్భంగా భద్రతపై పెట్టలేదన్నది స్పష్టమౌతోంది. ప్రధాని పర్యటన సందర్భంగా స్ధానికంగా నిరసనల అవకాశంపై పూర్తి స్థాయిలో సమాచారం సేకరించి, నిరసనలు వ్యక్తం కాకుండా చూడాల్సిన బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదీ, రాష్ట్ర పోలీసు, నిఘా శాఖలదే అనడంలో సందేహం లేదు. అందుకే మోడీ హెలికాప్టర్ కు సమాంతరంగా నల్ల బెలూన్ల నిరసన రాష్ట్ర ప్రభుత్వ వైఫలమేనని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖంగా చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే ఏపీలో మోదీ పర్యటనకు వ్యతిరేకంగా ఏ రాజకీయ పార్టీ కూడా నిరసనలకు పిలుపు నివ్వలేదు. అల్లూరి తెలుగు స్ఫూర్తి కనుక ఆ కార్యక్రమానికి ఎటువంటి అవాంతరాలూ రాకూడదనే రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు భావించాయి. తెలుగుదేశం అధినేత సహా రాజకీయ పార్టీలన్నీ అల్లూరి విగ్రహావిష్కరణను స్వాగతించాయి. ఒక్క వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు మాత్రమే మోడీ పర్యటన సందర్బంగా నల్ల జెండాలతో నిరసన తెలుపుతామని ప్రకటించారు.  నల్ల బెలూన్లు ఎగిరాయి. అయితే పోలీసులు మాత్రం ఇది కాంగ్రెస్ నేత పని అని  చెబుతున్నారు.  అయితే ప్రధాని పర్యటనలో ఎలాంటి భద్రతా లోపం లేదని ఏపీ పోలీసులు చెబుతున్నారు. ఎవరో నల్ల బెలూన్లు ఎగరేస్తే భద్రతా లోపం అవుతుందా అని ప్రశ్నిస్తున్నారు. 
బీజేపీ ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి సారించిందనడానికి హైదరాబాద్ వేదికగా జరిగిన ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిదర్శనంగా నిలిచాయి. దక్షిణాది రాష్ట్రాలలో పడుతూనో, లేస్తూనో కర్నాటకలో బీజేపీ కాలూనగలిగింది. ఆ రాష్ట్రం వినా బీజేపీకి దక్షిణాదిలో పెద్దగా పట్టు లేదనే చెప్పాలి. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఆ పార్టీది శబ్ద గాంభీర్యమే కానీ క్షేత్ర స్థాయిలో ఆ పార్టీ బలం కానీ, బలగం కానీ దాదాపు శూన్యమే అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఆ పార్టీ ఆశలన్నీ ఇప్పుడు తెలంగాణపైనే. ఇన్నేళ్లుగా బీజేపీలో దక్షిణాదికి పెద్దగా ప్రాధాన్యం దక్కిన దాఖలాలు లేవు. దక్షిణాది నాయకులంటే ఆ పార్టీలో జాతీయ స్థాయికి ఎదిగిన వాళ్లను వేళ్ల మీద లెక్కంచేంత మందే ఉంటారు. అయితే జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఆ పార్టీ అగ్రనేతల తీరు ఇప్పటి దాకా ఒకెత్తు ఇకపై ఒకెత్తు అన్నట్లుగా ఉంది. ఉత్తరాదిని ఏలేస్తున్నాం అని భావిస్తున్న బీజేపీ ఇప్పుడు దక్షిణాదిలో వేళ్లూనుకోవాలన్న ప్రయత్నాలకు ఇక్కడి నేతలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అనివార్యమైన పరిస్థితి ఎదురైంది.  అందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల నేతలకూ ప్రాధాన్యత ఇచ్చారు.  జాతీయ కార్యనిర్వాహక కమిటీలో 50 మంది ప్రత్యేక ఆహ్వానితులు, 179 మంది శాశ్వత ఆహ్వానితులు ఉంటారు. వీరిలో ముఖ్యమంత్రులు, డిప్యూటీ ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, జాతీయ వక్తలు, జాతీయ మోర్చా అధ్యక్షులు, స్టేట్ ప్రభారిస్, సాహ్ ప్రభారిస్, రాష్ర్ట అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఉంటారు. ఈ కమిటీలో ఏపీ నుంచి కన్నా లక్షినారాయణ, తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, జి. వివేక్ వెంకటస్వామి, గరికపాటి మోహన్ రావులకు స్థానం కల్పించారు. జాతీయ ఆఫీసు బేరర్లలో తెంలగాణ నుంచి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ మంత్రి పురందేశ్వరికి చోటు కల్పించారు. జాతీయ కార్యదర్శిగా ఆంధ్రప్రదేశ్ నుంచి సత్యకుమార్, ప్రత్యేక ఆహ్వానితులుగా తెలంగాణ నుంచి విజయశాంతి, ఈటల రాజేందర్ కు చోటు దక్కింది. గతంలో ఎన్నడూ తెలుగు రాష్ట్రాల నేతలకు ఈ స్థాయిలో జాతీయ కార్యవర్గంలో చోటు లభించిన దాఖలాలు లేవు. అన్నిటికీ మించి ఈటలకు పార్టీలో చేరికల సమన్వయ కమిటీ బాధ్యతలు అప్పగించడాన్ని ఇక్కడ ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. వామపక్ష భావజాలం నేపథ్యం ఉన్న ఈటల బీజేపీలో ఇమడ లేకపోతున్నారనీ, పార్టీలో ఆయన ఉక్కపోతకు గురౌతున్నారనీ, త్వరలో పార్టీని వీడే అవకాశాలున్నాయనీ గతంలో వార్తలు వచ్చాయి.  అయితే వాటిని ఈటల ఖండించారనుకోండి అది వేరే సంగతి. కానీ పరిశీలకులు మాత్రం ఈటల బీజేపీలో హ్యాపీగా లేరని పలు సందర్భాలలో విశ్లేషణలు చేశారు. అయితే బీజేపీలో ఈటలకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని గత కొద్ది కాలంగా కమలం శ్రేణులు చెబుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈటలకు పార్టీలో చేరికల సమన్వయ కమిటీ బాధ్యతలు అప్పగించడం సముచిత స్థానం ఇచ్చినట్లేనా అన్న ప్రశ్న రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది. ఎందుకంటే తెలంగాణలో బీజేపీ గూటికి చేరే వారే తక్కువగా ఉన్నారు. ఈటల కమలం గూటికి చేరిన తరువాత బీజేపీ తీర్ధం పుచ్చుకున్న వారంతా ఈటలకు గతంలో సన్నిహితులే. ఈటల వల్లే వారు కమలం గూటికి చేరారని చెప్పవచ్చు. హుజూరాబాద్ గెలుపులో బీజేపీకి ఎలా భాగస్వామ్యం లేదన్న ప్రచారం జరుగుతోందో.. ఇటీవలి కాలంలో అంటే ఈటల చేరిక తరువాత తెలంగాణలో కమలం తీర్థం పుచ్చుకున్న వారంతా ఈటల వల్లనే పార్టీలో చేరారన్న ప్రచారం జరుగుతోంది.   చివరాఖరికి కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ గూటికి చేరడంలో కూడా ఈటలే కారణమని అంటున్నారు. మరో వైపు తెలంగాణలో కాంగ్రెస్ లోకి చేరికలు జోరందుకుంటున్నాయి. దీంతో బీజేపీలోకి కూడా వలసలు పెరుగుతున్నాయని చాటాల్సిన అవసరాన్ని బీజేపీ గుర్తించింది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న ఈటల రాజేందర్ కు ఉద్యమ కారుల్లో మంచి పట్టు ఉంది. అలాగే టీఆర్ ఎస్ క్యాడర్ లో కూడా ఈటలకు మంచి గుర్తింపు ఉంది. ఆ కారణంగానే ఈటలకు పార్టీలో చేరికల సమన్వయ కమిటీ బాధ్యతలు అప్పగించారని ప్రచారం జరుగుతోంది. ఈటలకు ఆ కమిటీ బాధ్యతలు అప్పగించడం కమలానికి అవసరం తప్ప ఆ బాధ్యతల వల్ల ఈటలకు కొత్తగా ఒరిగేది ఏమీ లేదన్న వాదనా వినిపిస్తోంది. ఈటలకు తెలంగాణ సమాజంలో ఉన్న గుర్తింపు, పట్టును పార్టీకి ఉపయోగించుకోవాలన్న తపన, తాపత్రయం తప్ప ఈటలకు బీజేపీ ఇచ్చిన ప్రత్యేక గౌరవం ఏముందని ఆయన అభిమానులు బాహాటంగానే విమర్శిస్తున్నారు.  ఈ విషయంలో ఈటల ఎలా స్పందిస్తారన్నది చూడాల్సి ఉంది. హై కమాండ్ మెప్పుపొందేలా పార్టీలోకి చేరికలను ప్రోత్సహించి తన పట్టు పెంచుకుంటారా లేక సమన్వయ కమిటీ బాధ్యతలు తన స్థాయికి తగ్గ గుర్తింపు కాదని అసంతృప్తితో ఉదాశీనంగా ఉంటారా వేచి చూడాల్సిందే.
నిజం. బీజేపీలో జోష్ పెరిగింది. జాతీయ కార్యవర్గ సమావేశాలు విజయవంతగా నిర్వహించడమే కాకుండా.. బహిరంగ సభను ఆ స్థాయిలో సక్సెస్ చేయడంతో  పార్టీ జాతీయ  నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వం పై విశ్వాసం మరింతగా పెరిగింది. ముఖ్యంగా బహిరంగ సభ ఆ స్థాయిలో సక్సెస్ అవుతుందనికానీ, అంత పెద్ద ఎత్తున జనసమీకరణ సాధ్యమవుతుందని కానీ, ప్రధాని నరేంద్ర మోడీ సహా పార్టీ పెద్దలు ఎవరూ ఉహించలేదు. అందుకే, ప్రధాని నరేంద్ర మోడీ, ఉబ్బి తబ్బిబై పోయారు. వేదిక మీదనే, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్’ను భుజం తట్టి మరీ అభినందించారు.  అయితే, ఇప్పడు ఆ అభినందనే పార్టీలో లుకలుకలు సృష్టించిందా, అంటే, అవుననే అంటున్నారు పార్టీ పెద్దలు, పరిశీలకులు.నిజానికి బీజేపీలో గత కొంత కాలంగా సంజయ్ కేంద్రంగా అప్పుడప్పుడు లుకలుకలు బయటపడుతూనే ఉన్నాయి. అలాగే, పాత కొత్త నాయకుల వివాదం కూడా ఎప్పటినుంచో వుంది. ఆ కారణంగానే నాగం జనార్ధన రెడ్డి, మొత్కుపల్లి నరసింహులు ఎక్కువకాలం పార్టీలో ఉండలేక పోయారు. మరోవంక పార్టీలో కొనసాగుతున్న బయటి నేతల్లోనూ అసంతృప్తి అప్పుడప్పుడు బయట పడుతూనే వుంది.  దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన రావు అయితే, సంజయ్ వ్యవహార శైలిపై బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తపరిచారు. అలాగే, పార్టీలో పాత కాపులు కొత్తగా చేరిన నాయకుల మధ్య రోజురోజుకు దూరం రుగుతోందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.  హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్’ కూడా ఒకటి రెండు సందర్భాలలో ఈ విషయంలో తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్త పరిచారు.ఎంతోకాలంగా పార్టీలో ఉన్న నాయకులకు, కొత్తగా చేరిన నేతలకు మధ్య సహజంగానే కొంత వ్యత్యాసం ఉంటుంది. అందులోనూ భావజాల పునాదులపై నిర్మాణమైన పార్టీలో ఇలాంటి దూరం ఇంకొంత ఎక్కువగానే ఉంటుంది. అయితే. పార్టీ ఎదగాలన్నా, ఎన్నికల్లో గెలవలన్నా, క్షేత్ర స్థాయిలో పట్టున్న నాయకులకు కలుపుకు పోవడం అవసరమని ఈటల గతంలోనే బహిరంగంగా తమ అసంతృప్తిని వ్యక్తపరిచారు.  అయితే, జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా, అంతకు ముందు కూడా పార్టీ జాతీయ నాయకత్వం ఈటల ఇవ్వవలసిన గౌరవం ఇచ్చిందని, పార్టీలో మొదటి నుంచి ఉన్న నాయకులకు ఇచ్చిన గౌరవమే ఈటలకు ఇస్తోంది పార్టీ నేతలు అంటున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో, రాజకీయ తీర్మానంలో భాగంగా తెలంగాణ రాజకీయ పరిస్తితులపై  ప్రసంగించే అవకాశం, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఈటల రాజేందర్’ కు ఇచ్చారని, అలాగే, బహిరంగ్ సభలో అవకాశం కూడా ఈటలలకు దక్కిందని అంటున్నారు.   అదలా ఉంటే, అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ..ఇప్పడు బండి సంజయ్ ని ప్రధాని మోడీ అభినందించడం దేనికి సంకేతం అనే చర్చమొదలైంది. మరో వంక ఎన్నికలు ఎప్పుదు వచ్చినా విజయం బీజేపీదే, అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించిన నేపధ్యంలో, ‘నిజ్జంగానే’ బీజేపే అధికారంలోకి వస్తే, ముఖ్యమంత్రి ఎవరు? అనే ప్రశ్న తెరమీదకు వచ్చింది. నిజానికి గతంలోనూ తుక్కుగూడలో ఏర్పాటు చేసిన సభలో హోం మంత్రి అమిత్ షా.. కేసీఆర్‌ను ఎదుర్కోవడానికి మోడీ అవసరం లేదని.. ఇందుకు బండి సంజయ్ సరిపోతారని సంజయ్ సామర్ధ్యంపై విశ్వాసం ప్రకటించారు . ఇప్పడు, మోడీ మరింత ఉత్సాహంగా భుజం తట్టడంతో మరోసారి పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరనే విషయంలో చర్చ మొదలైనట్లు తెలుస్తోంది.  అయితే పార్టీ సీనియర్ నాయకులు మాత్రం, బీజేపీలో నాయకుల మధ్య పోటీ ఉంటుంది. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధాని అభ్యర్ధి ఎవరన్న విషయంలో పార్టీలో చాలా  పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పార్టీ సీనియర్ నాయకుడు అద్వానీ, అప్పటి ప్రతిపక్ష నేత   సుష్మా స్వరాజ్ సహా చాలా మంది నేతలు పోటీ పడ్డారు. చివరకు పార్టీ మోడీ పేరు ఖరారు చేసిన తర్వాత, అక్కడక్కడ లుకలుకలు వినిపిచినా, పార్టీ అనూహ్య విజయం సాధించడంతో, అందరూ సర్దుకు పోయారని గుర్తు చేస్తున్నారు.  అదే విధంగా, తాజాగా మహారాష్టలో మాజే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌’ను కాదని శివసేన చీలిక వర్గం నాయకుడు ఏక్’నాథ్ షిండే’కు అవకాశం ఇచ్చిన విషయాన్ని సీనియర్లు గుర్తు చేస్తున్నారు. బీజేపీ సన్యాసుల మఠం కాదు.పార్టీ నాయకులకు పదవుల మీద ఆశలు ఉండవు అని అనలేము. ఎవరైనా అలా అనుకుంటే అది ఆత్మ వంచనే అవుతుందని, అయితే వ్యక్తిగత పదవుల కంటే పార్టీకి, పార్టీ కంటే దేశానికీ పెద్ద పీట వేయడం(దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్, వ్యక్తీ లాస్ట్) నేతలు ఫాలో అవుతారని పార్టీ సీనియర్ నాయకులు  అంటున్నారు. అయితే, ఆలు లేదు చూలు లేదు, అప్పుడే ముఖ్యమంత్రి ఎవరన్న చర్చ అనవసరమని, సమయం వచ్చినప్పుడు పార్టీ జాతీయ నాయకత్వం ఆ విషయం  చూసుకుంటుందని అంటున్నారు. అలాగే, ఇప్పటి నుంచే ముఖ్యమంత్రి ఎవరు? అనేంత వరకు వెళితే, అది మొదటికే మోసం అవుతుందని అంటున్నారు. అయితే, పార్టీలో  లుకలుకలు అయితే మొదలయ్యాయి, అందులో సందేహం లేదని పరిశీలకులు అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో స్టార్టప్ ల ర్యాంకింగ్ లో ఏపీ దేశంలోనే చిట్ట చివరి స్థానంలో నిలిచింది. ఇది ఏ రాజకీయ పార్టీయో చేసిన విమర్శ కాదు. కేంద్రం ఇచ్చిన ర్యాంకింగ్. ఔను స్వయంగా కేంద్రం ప్రకటించిన ర్యాంకింగ్స్ లోనే ఏపీ దేశంలోనే చిట్ట చివరి స్థానంలో నిలిచింది. దేశంలో స్టార్టప్ ల ఎకో సిస్టమ్ లలో ఏ రాష్ట్రం మెరుగ్గా ఉంది అన్న అంశంపై కేంద్రం ఇచ్చిన ర్యాంకింగ్ లలో ఏపీకి వచ్చిన ర్యాంక్ ఇది. ఈ ర్యాంకింగ్స్ లో ఏపీ కన్నా బీహార్ మెరుగ్గా ఉంది. మరి అగ్ర స్థానంలో ఉన్నరాష్ట్రం ఏమిటంటారా అది గుజరాత్. రెండో స్థానంలో కర్నాటక నిలిచింది. స్టార్టప్ ల విషయంలో  రెండు కేటగరీల్లో కేంద్రం ఈ ర్యాంకులను ప్రకటించింది. కోటి కన్నా ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలను ఏ కేటగిరీలో చేర్చింది. కోటి కన్నా తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలను బి కేటగిరిలో చేర్చింది. ఏ కేటగిరిలో స్టార్టప్ ల విషయంలో గుజరాత్ తొలి ర్యాంక్ సాధించగా, ఆ తరువాతి స్థానాలలో వరుసగా కర్నాటక, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, అసోం, బీహార్ లు నిలిచాయి. ఎప్పుడో 2020 నాటి పరిస్థితిని ప్రమాణికంగా తీసుకుని ఈవోడీబీ (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో ఏపీ అగ్రస్థానంలో నిలిచిందంటూ సొంత భుజాలను చరిచేసుకుంటూ విపరీతంగా ప్రచారం చేసుకున్న జగన్ సర్కార్ కు ఇప్పుడు స్టార్టప్ ల విషయంలో వచ్చిన తాజా ర్యాంకింగ్ కు ఏం సమాధానం చెబుతుందో చూడాలంటూ నెట్టింట విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. రాష్ట్రంలో 2019 వరకూ తెలుగుదేశం అధికారంలో ఉంది. అంతకు ముందు వరుసగా మూడేళ్ల పాటు ఈవోడీబీ ర్యాంకింగ్స్ లో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. అంటే తెలుగుదేశం అధికారంలో ఉన్నఐదేళ్లలో వరుసగా నాలుగేళ్లు ఏపీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ ముందు వరుసలో ఉంది. ఆ ప్రతిఫలమే 2020లో ఈవోడీబీ ర్యాంకింగ్స్ లో ఏపీకి తొలి స్థానం. అందులో వైసీపీ ఘనత ఏమీ లేదు. తాజాగా స్టార్టప్ లకు వాతావరణం బాగున్న రాష్ట్రాలలో ఏపీ సాధించిన చిట్ట చివరి స్థానం ఘనత మాత్రం పూర్తిగా జగన్ సర్కార్ దేనని పారిశ్రామిక రంగ నిపుణులు అంటున్నారు. ఏపీ కంటే బీహారే బెటరని కేంద్రం ఇచ్చిన ర్యాంకింగ్స్ లోనే రుజువైందని పేర్కొంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా తొలి ఐదేళ్లు పారిశ్రామికంగా ఏపీ వేగంగానే పురోగమించింది. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ మూడేళ్లలోనూ పారిశ్రామిక ప్రగతి రివర్స్ గేర్ లో నడుస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ విమర్శలన్నీ వాస్తవాలేనని తాజా ర్యాంకింగ్స్ నిర్ద్వంద్వంగా నిరూపించాయి. ఏపీలో మూమూలు వ్యాపారాలే సజావుగా సాగే పరిస్థితి లేదనీ, ఇక స్టార్టప్ లకు ఎవరు ముందుకొస్తారనీ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. 
రఘురామకృష్ణం రాజు.. తెలుగు రాష్ట్రాలలో పరిచయం అక్కర్లేని పేరు. వైసీపీ రెబల్ ఎంపీగా నిత్యం రచ్చబండ అంటూ టెలివిజన్లలో దర్శనమిచే లోక్ సభ సభ్యుడు. సొంత పార్టీ నుంచే వేధింపులు ఎదుర్కొంటున్న రఘురామకృష్ణం రాజు వైసీపీపై, ఆ పార్టీ నేతలపై విమర్శలెన్ని చేసినా.. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి, రఘురామకృష్ణం రాజు మధ్య ట్వీట్ వార్ మాత్రం ఏపీ వ్యాప్తంగా ఎప్పుడూ హాట్ టాపికే. రఘురామకృష్ణం రాజుపై విజయ సాయి ట్వీట్లలో ఉపయోగించే భాష అభ్యంతరకరం. ఒక్కో సారి రఘురామ కృష్ణం రాజు కూడా ఆ భాషను అనుకరించడానికి ప్రయత్నిస్తుంటారు. ఆ వెంటనే నాలుక కరుచుకుని నా సంస్కారం అది కాదు. రెచ్చగొట్టడం వల్లే ఆ భాష ఉపయోగించానంటూ వివరణలూ ఇచ్చుకుంటారు. అదలా ఉంచితే.. తాజాగా రఘురామకృష్ణం రాజు విజయసాయి తండ్రి హంతకుడంటూ రివీల్ చేసి సంచలనం సృష్టించారు. విజయసాయి తండ్రి 1945లో హత్య చేశారని వెల్లడించారు. అది కూడా ఎవరినో కాదు సొంత అన్ననే అని వెల్లడించారు. విజయసాయి తండ్రి సుందరరామిరెడ్డి ఆ హత్య చేసిన సమయంలో మైనర్ అనీ అందుకే ఆయన జైల్లో చదువుకున్నారనీ రఘురామ వెల్లడించారు. విజయసాయి తండ్రి సుందరరామిరెడ్డి తన సొంత అన్నను మరో సోదరుడితో కలిసి చేసిన హత్య లో ఉరి శిక్ష పడిందని వెల్లడించారు.   సొంత కుటుంబసభ్యుడినే  హత్య చేసిన తండ్రి క్రిమినెల్ మెంటాలిటీయే విజయసాయిది కూడా అని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. తాను బయటపెట్టినవన్నీ వాస్తవాలేననీ. ఒక వేళ నేను అవాస్తవాలు చెబితే వాస్తవం ఏమిటో బయటపెట్టి  విజయసాయిరెడ్డి తనపై డిఫమేషన్ కేసు పెట్టొచ్చని రఘురామ సవాల్ చేశారు. 
ALSO ON TELUGUONE N E W S
యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్, మాలీవుడ్ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ మ‌రోమారు జ‌ట్టుక‌ట్ట‌నున్నారా? అవున‌న్న‌దే ఫిల్మ్ న‌గ‌ర్ బ‌జ్. ఆ వివ‌రాల్లోకి వెళితే.. `ఆర్ ఆర్ ఆర్` వంటి సంచ‌ల‌న చిత్రం త‌రువాత తార‌క్.. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో త‌న త‌దుప‌రి సినిమాని చేయ‌బోతున్నారు. `ఎన్టీఆర్ 30` అనే వ‌ర్కింగ్ టైటిల్ తో రూపొంద‌నున్న ఈ ప్రాజెక్ట్.. పాన్ - ఇండియా స్థాయిలో ఎంట‌ర్టైన్ చేయ‌నుంది. అద‌య్యేలోపు `కేజీఎఫ్` కెప్టెన్ ప్ర‌శాంత్ నీల్ నిర్దేశ‌క‌త్వంలో `ఎన్టీఆర్ 31`ని సెట్స్ పైకి తీసుకెళ్ళ‌నున్నారు `ఆది` స్టార్. కాగా, ఈ భారీ బ‌డ్జెట్ మూవీలో లోక నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ ఓ స్పెష‌ల్ రోల్ లో క‌నిపిస్తార‌ని ఆ మ‌ధ్య జోరుగా ప్ర‌చారం సాగింది. లేటెస్ట్ టాక్ ఏంటంటే.. ఇప్పుడా పాత్ర‌లో మోహ‌న్ లాల్ న‌టించే అవ‌కాశ‌ముంద‌ని స‌మాచారం. అదే గ‌నుక నిజ‌మైతే.. `జ‌న‌తా గ్యారేజ్` (2016) అనంత‌రం తార‌క్, లాల్ ఇంకోసారి క‌లిసి న‌టించే సినిమా ఇదే అవుతుంది. త్వ‌ర‌లోనే `ఎన్టీఆర్ 31`లో మోహ‌న్ లాల్ ఎంట్రీపై క్లారిటీ రానుంది. మ‌రి.. తార‌క్, మోహ‌న్ లాల్ కాంబో మ‌రోమారు సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి.  
  ప‌దిహేడేళ్ల వ‌య‌సులోనే టీవీ న‌టిగా కెరీర్‌ను ప్రారంభించిన ప్రాచీ దేశాయ్‌కు మంచి పాపులారిటీయే ఉంది. 2008లో 'రాక్ ఆన్' మూవీతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ప్రాచీ, ఇటీవ‌ల రాధికా ఆప్టే, విక్రాంత్ మాసేతో క‌లిసి 'ఫోరెన్సిక్' మూవీలో క‌నిపించింది. నాగ‌చైత‌న్య మెయిన్ లీడ్‌గా న‌టిస్తోన్న 'దూత' వెబ్ సిరీస్ ద్వారా ఆమె తెలుగు ప్రేక్ష‌కుల‌కు త్వ‌ర‌లో ప‌రిచ‌యం కానున్న‌ది. ఇటీవ‌ల స‌మంత‌తో విడిపోయిన‌ప్ప‌ట్నుంచీ నాగ‌చైత‌న్య త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తూ వ‌స్తున్నాడు.  లేటెస్ట్‌గా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో అత‌నితో క‌లిసి ప‌నిచేయ‌డం అద్భుతంగా ఉంద‌ని చెప్పిన ప్రాచీ దేశాయ్‌, "నా జీవితంలో నేను క‌లిసిన అత్యంత విన‌య‌శీలురైన న‌టుల్లో ఆయ‌న ఒక‌రు. ఆయ‌న‌ మంచి వ్య‌క్తి మాత్ర‌మే కాదు, న‌మ్మ‌శ‌క్యం కానంత స‌హ‌న‌శీలి కూడా" అని ప్ర‌శంసించింది. "ఆయ‌న చాలా చాలా మ‌ర్యాద‌స్తుడు. అదే ఒక వ్య‌క్తి గురించి చాలా చెబుతుంది. తెలుగులో నా తొలి స‌హ‌న‌టుడు ఆయ‌న కావ‌డం పెద్ద వ‌రం" అని చెప్పింది ప్రాచీ. "మీకు ఒక భాష బాగా తెలిసిన‌ప్పుడు, అవ‌త‌లి వ్య‌క్తికి ఆ భాష ఏమీ అర్థం కాన‌ప్పుడు, అది ఆయ‌న‌ బాధ్య‌త కాక‌పోయినా, ఒక టీమ్ ప్లేయ‌ర్‌గా నాకు చాలా స‌పోర్ట్‌నిచ్చాడు. ఒక‌సారి మేం ఒక పెద్ద సీన్ చేస్తున్నాం. దాన‌ర్థం ఏంటో నాకు తెలుసు, ఎందుకంటే నేను హోమ్‌వ‌ర్క్ చేశాను. పుంఖాను పుంఖాలుగా, పేజీల కొద్దీ డైలాగ్స్ ఉన్న‌ప్పుడు ఏ లైన్‌కు అర్థం ఏమిట‌నేది మ‌న‌కు తెలీదు. నా క్లోజ‌ప్ తీసేట‌ప్పుడు, మొత్తం డైలాగ్‌ని ఆయ‌న నాకు ఇంగ్లిష్‌లో చెప్పాడు. దాంతో నా బెస్ట్ ఎబిలిటీతో దానికి త‌గ్గ‌ట్లుగా న‌టించాను" అని చెప్పుకొచ్చింది ప్రాచీ దేశాయ్‌. నాగ‌చైత‌న్య తొలిసారి డిజిట‌ల్ వ‌ర‌ల్డ్‌కు ప‌రిచ‌య‌మ‌వుతున్న 'దూత' సిరీస్‌ను విక్ర‌మ్ కె. కుమార్ డైరెక్ట్ చేస్తుండ‌గా, పార్వ‌తి తిరువోతు, ప్రియా భ‌వాని శంక‌ర్‌, ప్రాచీ దేశాయ్‌, త‌రుణ్ భాస్క‌ర్ కీల‌క పాత్ర‌లు చేస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియాలో స్ట్రీమింగ్ కానున్న‌ది.
Superstar Mahesh Babu recently announced a massive pan-India film directed by SS Rajamouli. Rajamouli is currently working on the script for this action adventure film. Rajamouli, on the other hand, is also working on pre-production.   Veteran writer Vijayendra Prasad recently revealed the interesting details about this ambitious project. He said "Rajamouli and I are presently brainstorming, and have not locked any story idea yet.”   This clears that the it takes more time to start the project. Rajamouli has already stated that he will write a strong storyline for the film. With the film still in in the works, Mahesh Babu is preparing to start his next film with another director, Trivikram, in the meantime.
Butterfly, starring Anupama Parameswaran, will be released directly to the audience via OTT. The makers appear to be attempting to bring the film closer to the audience through Disney Hotstar. The official announcement will be made shortly. The producers will soon announce the premiere date for the streaming.   Many film personalities advised the makers that the film Butterfly should be released directly in OTT because small films are failing in theatres. The makers appear to have decided to go the OTT route. Ghanta Satish Babu directed this film. He wrote the screenplay and the story for this film. Ravi Prakash Bodapati, Prasad Thiruvallur, and Pradeep Nallimelli produced the film.   The film is a collection of amusing situations that occur in an apartment. The story of this suspense film revolves around a mother. The teaser for this film has already been released, which has heightened interest in the film.
  సీనియ‌ర్ ఫిల్మ్ జ‌ర్న‌లిస్ట్ గుడిపూడి శ్రీ‌హ‌రి (88) క‌న్నుమూశారు. సోమ‌వారం రాత్రి 2 గంట‌ల‌కు (తెల్ల‌వారితే మంగ‌ళ‌వారం) హైద‌రాబాద్‌లోని త‌మ నివాసంలో ఆయ‌న తుదిశ్వాస విడిచారు. కొన్నేళ్లుగా వృద్ధాప్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటూ ఇంటివ‌ద్దే ఉంటున్న ఆయ‌న గ‌త‌వారం ఇంట్లోనే కింద‌ప‌డిపోవ‌డంతో తుంటి ఎముక విరిగింది. నిమ్స్‌లో విజ‌య‌వంతంగా స‌ర్జ‌రీ అయిన‌ప్ప‌టికీ, త‌ర్వాత ఆరోగ్య స‌మ‌స్య‌లు ఎదుర్కొన్నారు. 2021 న‌వంబ‌ర్‌లో త‌న శ్రీ‌మ‌తి ల‌క్ష్మి మృతి చెందాక‌, ఆయ‌న బాగా కుంగిపోయిన‌ట్లు స‌న్నిహితులు తెలిపారు. ఆయ‌న‌కు ఓ కుమార్తె, ఓ కుమారుడు ఉన్నారు. కుమారుడు శ్రీ‌రామ్ స్వ‌దేశానికి వ‌చ్చాక అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌నున్నాయి. సినీ విమ‌ర్శ‌కులుగా, విశ్లేష‌కులుగా, విల‌క్ష‌ణ ర‌చ‌యిత‌గా సుమారు ఐదు ద‌శాబ్దాల కాలం ఆయ‌న పాత్రికేయ రంగానికి త‌న సేవ‌లు అందించారు. ఈనాడు దిన‌ప‌త్రిక‌లో 25 సంవ‌త్స‌రాల పాటు నిర్విరామంగా ఆయ‌న నిర్వ‌హించిన‌ 'హ‌రివిల్లు' అనే శీర్షిక ఎంతో ప్ర‌జాద‌ర‌ణ పొందింది. సాంస్కృతిక రంగానికి చెందిన ఎంతోమంది క‌ళాకారుల‌ను ఆయ‌న త‌న వ్యాసాల ద్వారా వెలుగులోకి తెచ్చారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన శ్రీ‌హ‌రి ద హిందూ, ఈనాడు వార్తా ప‌త్రిక‌ల్లో కంట్రిబ్యూట‌ర్‌గా 1968లో జ‌ర్న‌లిస్ట్ జీవితాన్ని ప్రారంభించారు. 20 సంవ‌త్స‌రాల పాటు హైద‌రాబాద్‌లోని ఆల్ ఇండియా రేడియోలో న్యూస్ బ్రాడ్‌క్యాస్ట‌ర్‌గా ప‌నిచేశారు. 125 సంవ‌త్స‌రాల చ‌రిత్ర క‌లిగిన నాట‌క కుటుంబం సుర‌భి గురించి ద హిందూలో ఆయ‌న రాసిన వ్యాసం కేంద్ర సంగీత నాట‌క అకాడ‌మీ దృష్టికి వెళ్లి, ఆ బృందానికి ఆర్థిక సాయం కొన‌సాగించేందుకు దోహ‌దం చేసింది. తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌పై ఆయ‌న రాసిన పుస్త‌కం అంద‌రి ప్ర‌శంస‌ల్నీ అందుకుంది. నేష‌న‌ల్ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్‌కు చెందిన స్క్రిప్ట్ క‌మిటీలో స‌భ్యునిగా కూడా ఆయ‌న గౌర‌వం అందుకున్నారు. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్‌కు అధ్య‌క్షునిగా వ్య‌వ‌హ‌రించారు.
నందమూరి కళ్యాణ్ రామ్ టైటిల్ రోల్ పోషిస్తున్న లేటెస్ట్ మూవీ 'బింబిసార'. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కె.హరికృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకి మ‌ల్లిడి వ‌శిష్ఠ్ దర్శకుడు. ఆగష్టు 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ ఫాంటసీ యాక్ష‌న్ ఫిల్మ్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. రేపు(జులై 5న) కళ్యాణ్ రామ్ పుట్టినరోజు కానుకగా 'బింబిసార' ట్రైలర్ ను ఈరోజు సాయంత్రం విడుదల చేశారు. ట్రావెల్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ విజువల్ వండర్ లా ఉంది. 'బింబిసార' పాత్రలో కళ్యాణ్ రామ్ అదరగొట్టాడు. ఇక కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇదిలా ఉంటే హైదరాబాద్ లో జరిగిన 'బింబిసార' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కళ్యాణ్ రామ్ ఆసక్తికర విషయాన్ని రివీల్ చేశాడు. 'బింబిసార' ఫ్రాంచైజ్ నుంచి కనీసం నాలుగు భాగాలు వస్తాయని అన్నాడు. సెకండ్ పార్ట్ వచ్చే ఏడాది ఆగష్టు లో విడుదలవుతుందని తెలిపాడు. అలాగే ఇటీవల డైరెక్టర్ వ‌శిష్ఠ్ తో ఓ స్టోరీ డిస్కషన్ జరిగిందని.. అంతా అనుకున్నట్లు జరిగితే ఒక పార్ట్ లో తాను, తమ్ముడు తారక్(జూనియర్ ఎన్టీఆర్) కలిసి నటిస్తామని కళ్యాణ్ రామ్ చెప్పాడు.
ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ యాక్టర్స్ లో గోపీచంద్ ఒకడు. విలన్ గా, హీరోగా ఇలా ఏ పాత్ర చేసినా దానికి పూర్తి న్యాయం చేయగలిగే గోపీచంద్ తన కెరీర్ లో పలు విజయాలను అందుకున్నాడు. అయితే కొంతకాలంగా వరుస పరాజయాలను పొందుతూ సరైన విజయం కోసం ఎదురుచూసున్నాడు. తన తర్వాత వచ్చిన యాక్టర్స్ సినిమా సినిమాకి తమ మార్కెట్ పెంచుకుంటూ పోతుంటే.. గోపీచంద్ మాత్రం చాలా వెనకపడిపోతున్నాడు. నిజం చెప్పాలంటే సినిమా సినిమాకి దిగిపోతున్నాడు. టాలెంట్ ఉన్నప్పటికీ సినిమాల ఎంపిక విషయంలో చేస్తున్న తప్పులే గోపీచంద్ కి ఈ పరిస్థితి రావడానికి కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 'తొలివలపు'(2001) సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమైన గోపీచంద్ మొదటి చిత్రంతో అంతగా ప్రభావం చూపలేకపోయాడు. ఆ తర్వాత విలన్ గా నటించిన 'జయం', 'నిజం', 'వర్షం' సినిమాలతో మాస్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దాంతో హీరోగా వరుస అవకాశాలు అందిపుచ్చుకున్నాడు. 'యజ్ఞం'(2004), 'ఆంధ్రుడు'(2005), 'రణం'(2006) ఇలా వరుస యాక్షన్ సినిమాలతో మాస్ హీరో ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. అదే జోష్ లో 'లక్ష్యం'(2007), 'శౌర్యం'(2008) వంటి హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా హీరోగా కెరీర్ స్టార్టింగ్ లో ఏడాదికో హిట్ అందుకున్న గోపీచంద్ 2009 నుంచి తడబడ్డాడు. అప్పటినుంచి ఇప్పటిదాకా ఈ 13 ఏళ్లలో 15 సినిమాల్లో హీరోగా నటించగా 2014 లో వచ్చిన 'లౌక్యం' మాత్రమే సాలిడ్ విజయాన్ని అందుకుంది. కొన్ని సినిమాలు పర్లేదు అనిపించుకున్నా కమర్షియల్ ఫెయిల్యూర్స్ గా మిగిలాయి. మెజారిటీ సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఇక ఎన్నో అంచనాల మధ్య రీసెంట్ గా విడుదలైన 'పక్కా కమర్షియల్' కూడా గోపీచంద్ ని ప్లాప్స్ నుంచి బయటపడేయకపోయింది. మారుతి డైరెక్ట్ చేసిన ఈ మూవీకి నెగటివ్ టాక్ రావడమే కాకుండా.. గోపీచంద్ గత చిత్రాలతో పోల్చితే తక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ సినిమా ఫుల్ రన్ లో వలర్డ్ వైడ్ గా రూ.10 కోట్ల షేర్ రాబడితే గొప్ప అనేది ట్రేడ్ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. గోపీచంద్ లో టాలెంట్ కి కొదవలేదు. కథలు, దర్శకుల ఎంపికలో చేస్తున్న తప్పుల కారణంగానే గోపీచంద్ వెనక పడుతున్నాడు. గోపీచంద్ కి స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు పడకపోవడం కూడా కాస్త మైనస్ అయింది. రాజమౌళి, వీవీ వినాయక్ లాంటి దర్శకులతో అప్పట్లో గోపీచంద్ కి ఒక్క యాక్షన్ ఫిల్మ్ పడుంటే హీరోగా తన రేంజ్ మరో స్థాయికి వెళ్ళుండేది. పూరి జగన్నాథ్ 'గోలీమార్' చేసినప్పటికీ అది గోపీచంద్ కెరీర్ కి హెల్ప్ అవ్వలేదు. ప్రస్తుతం వీవీ వినాయక్ జోరు తగ్గింది. రాజమౌళి పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు కాబట్టి గోపీచంద్ తో సినిమా చేసే అవకాశం లేదు. ఇటీవల మళ్ళీ విలన్ గా నటించడానికి సిద్ధమని గోపీచంద్ ప్రకటించాడు. విలన్ గా ఏమైనా రాజమౌళి సినిమాలో అవకాశమొస్తుందేమో చూడాలి. అయితే ఇప్పుడు గోపీచంద్ హీరోగా నిలబడాలంటే అనిల్ రావిపూడి లాంటి దర్శకుడితో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ పడితే బాగుంటుంది. ఎందుకంటే గోపీచంద్ ప్రయోగాలు చేసిన దానికంటే యాక్షన్ సినిమాలకే ఎక్కువ ఆదరణ లభించింది. అలా అని 'పక్కా కమర్షియల్' లాంటి పసలేని కథాకథనాలతో సినిమా చేస్తే ప్రేక్షకుల తిరస్కరణ తప్పదు. ఇప్పటికైనా గోపీచంద్ సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి. లేదంటే తావరలో అప్పట్లో గోపీచంద్ అనే హీరో ఉండేవాడు అని చెప్పుకునే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం లేదు. కాగా ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ ఓ సినిమా చేస్తున్నాడు. 'లక్ష్యం', 'లౌక్యం' తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. అయితే ప్రస్తుతం శ్రీవాస్ కూడా ఫ్లాప్స్ లో ఉన్నాడు. మరి ఈ సినిమా వీరి కాంబోలో హ్యాట్రిక్ హిట్ గా నిలుస్తుందో.. లేక ఇద్దరి ఖాతాలో ఫ్లాప్ గా మిగిలిపోతుందో చూడాలి.
  చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తోన్న 'గాడ్‌ఫాద‌ర్‌'లో ఆయ‌న ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది. మోహ‌న్‌రాజా డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీని కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సోమ‌వారం రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో కుర్చీలో కూర్చొని దీర్ఘాలోచ‌నలో ఉన్న‌ట్లుగా క‌నిపిస్తున్నారు చిరంజీవి. క‌ళ్ల‌కు గాగుల్స్ పెట్టుకొని న‌డివ‌య‌సు వ్య‌క్తి రూపంలో ఉన్నారాయ‌న‌. ఈ మూవీకి ఒరిజిన‌ల్ అయిన మ‌ల‌యాళం సినిమా 'లూసిఫ‌ర్‌'లో ఇదే రోల్‌ను చేసిన మోహ‌న్‌లాల్ ఎప్పుడూ వైట్ అండ్ వైట్ లుక్‌లో క‌నిపిస్తారు. అదీ కూడా వైట్ ష‌ర్ట్‌, వైట్ లుంగీలోనే క‌నిపిస్తారు. రీమేక్‌లో అందుకు భిన్న‌మైన ఆహార్యాన్ని చిరంజీవి మెయిన్‌టైన్ చేస్తున్న‌ట్లు ఊహించ‌వ‌చ్చు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ చిత్రంతో టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఈ చిత్రంలో ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించే విధంగా ఇద్ద‌రు స్టార్ల‌పై ఓ స్పెష‌ల్  సాంగ్ వుంది. ఈ డ్యాన్స్ నంబర్‌కు ప్రభుదేవా కొరియోగ్రఫీ చేయగా, ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. లేడీ సూప‌ర్‌స్టార్‌ నయనతార కీలక పాత్రలో నటిస్తుండగా, స్టార్ డైరెక్ట‌ర్‌ పూరి జగన్నాథ్‌ అతిధి పాత్రలో కనిపించనున్నారు. సత్యదేవ్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. టాప్ టెక్నికల్‌ టీమ్‌ గాడ్ ఫాదర్  కోసం పని చేస్తున్నారు. పాపుల‌ర్‌ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందిస్తుండగా, అనేక బాలీవుడ్ హిట్ చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసిన సురేష్ సెల్వరాజన్ ఈ చిత్రానికి ఆర్ట్‌వర్క్‌ అందిస్తున్నారు. ఆర్‌బి చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల సురేఖ సమర్పిస్తున్నారు.
Godfather, the highly anticipated film starring Megastar Chiranjeevi and directed by Mohan Raja and produced on a grand scale by Konidela Production Company and Super Good Films, is nearing completion.   The film Godfather has generated a lot of excitement since its announcement, as the Telugu audience, particularly Mega fans, have been eagerly anticipating the Megastar's look and avatar in the film. After months of waiting, the first look at Godfather is finally released today.   In the first look of Godfather, Chiranjeevi appears to be a royal. Chiru is seen arriving in a car for a party gathering in the first glimpse, which was also released. He is helped by Sunil. The makers also added a tagline to the first glimpse to elevate the megastar to the role of Godfather. The tagline reads, "The boss is here to rule forever."   Salman Khan, the Bollywood superstar, plays an important role. The two megastars will be featured in an atom bombing swinging song in the film. Prabhu Deva choreographed this spectacular dance sequence, and SS Thaman composed the music.   Nayanthara will play a vital role, and Puri Jagannadh will play a key role. Satya Dev also has a full-length role in the film. The camera is handled by master cinematographer Nirav Shah, while the art director is Suresh Selvarajan.The film is produced jointly by RB Choudary and NV Prasad, while Konidela Surekha is presenting it.
  రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరో గా నటిస్తున్న 'లైగర్' సినిమా బోల్డ్ పోస్టర్ ఇటీవలే విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పలు విమర్శలు, ప్రశంసల మధ్య ఈ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కింది. పాన్ ఇండియా సినిమా గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కోసం విజయ్ అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 25 వ తేదీన రాబోతున్న ఈ సినిమాకి పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించగా, అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది.  ఈ బోల్డ్ పోస్టర్ తో ప్రమోషన్స్ కి తెరలేపిన చిత్ర బృందం ఇకపై జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించనుంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ పోస్టర్ కి లేడీ అభిమానుల దగ్గరినుంచి మరింత ఆదరణ దక్కింది. 'సెక్సీయెస్ట్ పోస్టర్ ఎవర్' అని ట్విట్టర్ ట్రెండ్ చేసి అభిమానులు ఈ సినిమా క్రేజ్ ను మరింతగా పెంచారు. సినిమా నేపథ్యానికి తగ్గ పోస్టర్ ను విడుదల చేసి అక్కడే ప్రేక్షకుల మనసు గెలుచుకుంది చిత్ర బృందం. అయితే అక్కడితోనే అభిమానులు ఆగిపోలేదు. ఈ పోస్టర్ వచ్చి రెండు రోజులు అవుతున్నా ఇంకా పోస్టర్ ను ప్రమోట్ చేస్తున్నారు. కొంతమంది లేడీ అభిమానులు సినిమాపై ఉన్న ఇష్టమో లేదా విజయ్ మీద ఉన్న ఇష్టమో తెలీదు కానీ వారి వారి సోషల్ మీడియా హ్యాండిల్స్ లో దేవరకొండ పేరును జోడించడం విశేషం. దీన్ని బట్టి విజయ్ దేవరకొండకు అమ్మాయిల్లో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. హీరోయిన్స్ లలో కూడా విజయ్ కి క్రేజ్ వేరే లెవెల్ లో ఉంది. పలువురు బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్స్ ఈ బోల్డ్ పోస్టర్ ను తమ తమ సోషల్ మీడియా లో పోస్ట్ చేసి ఆయనపై వారికున్న ఇష్టాన్ని చాటుకున్నారు. మరి ఇదే జోష్ కొనసాగితే ఆగస్టులో రిలీజ్ కాబోయే ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి భారీ రికార్డులను ఏర్పరచడం ఖాయం. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్ ను, పాటలను విడుదల చేయడానికి స‌న్నాహాలు చేస్తున్నారు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్ష తరహ పాలనా వ్యవస్థ వైపుగా పాప్వులు కదుపు తున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రానున్న రెండు మూడు నెలల్లో జరగనునన్న  నాలుగు రాష్ట్రాల,పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల శాసన సభలకు జరిగే ఎన్నికల్లో  బీజేపీ కి ఆశించిన ఫలితాలు  వస్తే ... ఇక ఆ తర్వాత అధ్యక్ష తరహ పాలనా వ్యవస్థ వైపుగా పావులు మరింత వేగంగా కడులుతాయని అంటున్నారు.నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం. ఈ ఎన్నికలలో విజయం సాధించడం కోసం, అన్నిరాజకీయ పార్టీలు ఎప్పటినుంచో  సన్నాహాలు చేసుకుంటున్నాయి.అయితే,కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, అందరికంటే మిన్నగా, ఎట్టి పరిస్థితులలోనూ ఒక్క కేరళ తప్పించి మిగిలిన మూడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో సొంత ప్రభుత్వం కాదంటే  తమ చెప్పు చేతల్లో ఉండే ప్రభుత్వాలు ఏర్పడాలని, అందుకోసం ఎందాకా అయినా వెళ్లేందుకు సిద్దం అన్న సంకేతాలను ఇస్తోంది.  పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్నతృణమూల్ కాంగ్రెస్’ను పూర్తిగా తుడచి పెట్టేస్తోంది, తెర వెంక ఏమి చేస్తోందో ఏమో గానీ, తెరమీద చూస్తే, తృణమూల్ ఎంపీలు, ఎమ్మెల్ల్యేలు, మంత్రులు చివరకు తృణమూల్ అధినాయకురాలు, ముఖ్యమంత్రి మమత బెనెర్జీ సొంత మనుషులు, ఇంటి మనుషులు, కుటుంబ సభ్యులు బారులుతీరి మరీ కమలదళంలో చేరిపోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నడ్డా, మరో పది మందివరకు కేంద్ర మంత్రులు, విధ రాష్టాల ముఖ్యమంత్రులు ఇలా ఒకరి వెంట ఒకరు, పస్చిమ బెంగాల్ పై దండయాత్ర చేస్తున్నారు. మమతా బెనర్జీ అంతటి గడుసు పిండాన్ని ఒక్కరి బిక్కిరి చేస్తున్నారు. అంతిమ ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది ఎలా ఉన్నా, ప్రస్తుతానికి అయితే పశ్చిమబెంగాల్ కమల దళం ఖాతాలో చేరినట్లే  అన్న అభిప్రాయమే వ్యక్తమౌతోంది.  అలాగే ఇటీవల పుదుచ్చేరిలో ఏమి జరిగిందో చూశాం, మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న సమయంలో, అధికార కాంగ్రెస్ పార్టీ  ఎమ్మెల్యేలు వరస పెట్టి రాజీనామా చేయడం,ఆవెంటనే ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రభుత్వం కుప్ప కూలిపోవడం, అదే సమయంలో అంతే వేగంగా లెఫ్ట్’నెంట్ గవర్నర్’ కిరణ బేడీ ఉద్వాసన, ఆమె స్థానంలో తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్’కు అదనపు బాధ్యతలు అప్పగించడం, ఆమె సిఫార్సు మేరకు, రాష్ట్రపతి పాలన విధించడం అన్నీ  చక చకా జరిగి పోయాయి. గతంలో కర్ణాటక, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలలో బీజేపీ రాజీనామాల రూటులో కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చి అధికారాన్ని ఎగరేసుకు పోయినా, రాజస్థాన్’లో అలాంటి విఫల ప్రయత్నం చేసిందన్నా కొంతవరకు అర్థం చేసుకోవచ్చునుకానీ, నిండా నాలుగు పుంజీల సభ్యులు లేని పుదుచ్చేరిలో అది కూడా మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో ఇంతటి తెలివి తక్కువ పరువు తక్కవ పని బీజేపీ ఎందుకు చేసింది,అనేది అనేక మందిలో ఉన్న సందేహం. అయితే అందరూ అనుకుంటున్నట్లుగా బీజేపీ నాయకత్వం తెలివి తక్కువగా, పరువు తక్కువ పనులు చేయడం లేదు. పార్టీ లోగుట్లు, అంతర్గత వ్యవహారాలు తెలిసిన అంతరంగికుల సమాచారం ప్రకారం, సంఘ్ పరివార్ సిద్దాంతానికి కార్యరూపం ఇచ్చే వ్యూహంలో భాగంగానే బీజేపీ నాయకత్వం అడుగులు చేస్తోంది. అంతిమ లక్ష్యం, అంతిమ గమ్యం చేరుకోవడంలో ఐడియాలజీ విషయంలో కొంచెం కాంప్రమైజ్’ అయినా ఫర్వాలేదని, ఇటీవల పార్టీ అంతర్గత సమావేశాల్లో సర్దుబాటు ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని కూడా లోపలి సమాచారం.  అయితే ఇక్కడ బీజేపీ ముందున్న అంతిమ లక్ష్యం ఏమిటి,అంటే, ఆర్టికల్ 370 రద్దు నుంచి, పాక్ ఆక్రమిత కాశ్మీర్’ తిరిగి భారత దేశంలో కలుపుకోవడం వరకు, ట్రిపుల్ తలాక్ నుంచి ఉమ్మడి పౌర స్మృతి వరకు ... రామ మందిరం నిర్మాణం మొదలు, అధ్యక్ష తరహ పాలన వరకు పార్టీ మూల సిద్ధాంతానికి సంబందించిన అన్ని అంశాలకు సంబందించిన లక్ష్యాలు ఇందులో ఉన్నాయి. గడచిన ఆరేడు సంవత్సరాలలో ఇందులో కొన్ని సాఫల్య మయ్యాయి.  ఇక ఇప్పుడు, కమల నాధులు,జమిల ఎన్నికల మీదుగా అధ్యక్ష తరహ పాలన లక్ష్యంగా పావులు కదుపుతోందని విశ్వసనీయ సమాచారం. నిజానికి అధ్యక్ష తరహ పాలనకు, ఆదాయ తరహ పాలనా వ్యవస్థకు,బీజేపీ, సంఘ్ పరివార్ సిద్దాంత కర్తలు మొదలు సామాన్య కార్యకర్తలు మొదలు అందరూ అనుకూలమే. అందుకే ఎప్పటి నుంచో పార్టీ వేదికల మీద, బయట కూడా ఇలాంటి చర్చ జరుగుతూనే  ఉంది.  నిజానికి ఒక్క బీజేపీలోనే కాదు,ఇతర పార్టీలలోనూ చాలా కాలంగా అధ్యక్ష తరహ పాలనపై  చర్చ జరుగుతోంది. రాజకీయ పార్టీలలో ఇప్పడు చర్చ జరగడంకాదు,రాజ్యాంగ సభలోనూ ఆ దిశగా చర్చ జరిగింది. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్, కూడా “అధ్యక్ష తరహా పాలనలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుంది. కాకపోతే జవాబుదారీతనమే కొరవడుతుంది” అంటూ ఎప్పుడోనే తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.అలాగే రాజ్యాంగసభ చర్చల్లో పాల్గొన్న వల్లభాయ్‌ పటేల్‌ కూడా దేశాధ్యక్షుడు, గవర్నర్‌ పోస్టులకు ప్రత్యక్ష ఎన్నికలు జరగాలని సూచించారు. ఇక బీజేపీ విషయం అయితే చెప్పనే అక్కర లేదు. బీజేపీ, ఆ పార్టీ సిద్ధాంతకర్తలు మొదటి నుంచీ అధ్యక్ష వ్యవస్థకే మొగ్గు చూపుతున్నారు. బీజేపీ సిద్ధాంత కర్త దీనదయాళ్‌.. అధ్యక్ష వ్యవస్థను సమర్థించారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి 1998లో చేసిన ప్రసంగంలో.. అధ్యక్ష వ్యవస్థ గురించి ఆలోచించాలని చెప్పారు. రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ సీనియర్‌ నేత లాల్‌ కృష్ణ ఆడ్వాణీ కూడా దేశంలో అధ్యక్ష తరహ పాలనకు మద్దతుగా ఉపన్యాసాలు చేశారు.వ్యాసాలు రాశారు.    అలాగే  కాంగ్రెస్ పార్టీ ఏక చత్రాధిపత్యానికి గండిపడిన తర్వాత సుమారు మూడు దశాబ్దాల పాటు సాగిన సంకీర్ణ యుగంలో,అస్థిర ప్రభుత్వాలు సక్రమంగా పాలన సాగించలేని పరిస్థితులు ఏర్పడిన సమయంలోనూ, అధ్యక్ష తరహ పాలన గురించి చర్చ జరిగింది. ఆ నేపధ్యంలో 2014 లో మోడీ నాయకత్వంలో తొలిసారిగా బీజేపీ సారధ్యంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. ఆ ఎన్నికలలో మోడీ అధ్యక్ష తరహ ఎన్నికల పచారామ్ సాగించారు. ఆ 2019 ఎన్నికల ప్రచారంతో పాటుగా పరిపాలన కూడా అదే తరహాలో పీఎంఓ, ప్రధాన మంత్రి కార్యాలయం సెంట్రిక్’గా పరిపాలన సాగుతోందని ,ఇది కూడా అందుకు మరో సంకేతమని అంటున్నారు.  ఇక ప్రస్తుతానికి వస్తే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సంఘ పరివార్, ప్రస్తుత పార్లమెంటరీ ప్రజాసామ్య వ్యవస్థ స్థానంలో  అధ్యక్ష తరహ వ్యవస్థను తెచ్చేందుకు ఇంతకంటే మంచి సమయం మరొకటి ఉందని భావిస్తున్నారు. పరిపాలన వ్యవస్థలో మార్పులు తీసుకు రావాలంటే అందుకు రాజ్యాంగ సవరణ అవసరం అవుతుంది. రాజ్యంగ సవరణకు రాజ్యాంగంలోని 368 అధికరణం ప్రకారం, ప్రభుత్వం లేదా సభ్యులు ప్రవేశ పెట్టె తీర్మానానికి పార్లమెంట్ ఉభయ సభలు మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోదించడంతో పాటుగా మొత్తం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల శాసన సభలలో సగం శాసన సభలు ఆమోదించ వలసి ఉంటుంది. అందుకే, బీజేపీ సాధ్యమైన మేరకు రాష్రాలను గెలుచుకుని, తద్వారా రాజ్యాంగ సవరణ, అందుకు కొనసాగింపుగా అధ్యక్ష తరహ పాలనకు శ్రీకారం చుట్టాలని చూస్తోంది.  ఇప్పటికే బీజేపీ 12  రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మరో ఆరు రాష్ట్రాలలో మిత్ర పక్షాలతో కలిసి ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వలున్నాయి... ఇక ..పార్లమెంట్ ఉభయ సభలో సొంత బలం కొంత తగ్గినా, మేనేజ్ చేయగల సమర్ధులున్నారు .. సో .. ఇదే అందుకు మంచి సమయమని కమలనాధులు భావిస్తున్నారు. రాజ్యాంగ సవరణ అనుకున్నది అనుకున్నట్లు సాగితే, 2022 చివరిలో అధ్యక్ష పదవికీ, ఎంచుకున్న అధ్యక్ష తరహ పాలనకు అనుగుణంగా పార్లమెంట్ ,శాసన సభలకు  జమిలి ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత నరేంద్ర మోడీ అధ్యక్షుడిగా, అమిత్ షా ప్రధానిగా ... కొత్త పాలన వస్తుంది. అయితే, ఇదులో చాలా అయితే గియితే లున్నాయి. రాజ్యాంగ సవరణ సహా, ఇంకా చాలా చిక్కుముళ్ళు ఉన్నాయని అవన్నీ విడతేస్తేనే గానీ, మోడీ ఆలోచనలు కార్యరూపం దాల్చవని న్యాయ కోవిదులు అంటున్నారు. నిజానికి గతంలోనే సుప్రీం కోర్టు రాజ్యంగ ధర్మాసనం రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని మార్చే వీలు లేదని పేర్కొందని, కాబట్టి  మోడీ అలోచన కార్యరూపం  దాల్చడం అంతసులభం కాదన్నమాట కూడా వినవస్తోంది.
అమరావతిని అడ్రస్ లేకుండా చేసేందుకు సీఎం జగన్ రెడ్డి చేయని ప్రయత్నం లేదు. . ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి జై కొట్టిన మడమ తిప్పని నేత.. పవర్ లోకి వచ్చాకా  రాజధాని విషయంలో కంప్లీట్ యూ టర్న్ తీసుకున్నారు. రాజధానిని మూడు ముక్కలు చేశారు. ఆంధ్రుల కలల సౌధాన్ని కుప్పకూలుస్తూ.. అమరావతిని కేవలం శాసన రాజధానికే పరిమితం చేశారు. అక్కడి ఆకాశ హర్మాలు, విశాల రోడ్లను ఎక్కడికక్కడే వదిలేశారు. రాజధాని కోసం రైతులు ఉవ్వెత్తున ఉద్యమం చేస్తున్నా.. ఏమాత్రం కనికరం చూపించలేదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అలాంటిది సడెన్ గా జగన్ మనసు మారినట్టుంది. ఏపీ కేబినెట్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 50 శాతం నిర్మాణం పూర్తయి.. పెండింగ్‌లో ఉన్న భవనాలను పూర్తి చేయాలని సర్కారు నిర్ణయించింది. అందుకు  3వేల కోట్ల బ్యాంక్ గ్యారంటీ ఇచ్చేందకు ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పటికీ ప్రారంభం కానీ, కొద్దిగా ప్రారంభమైన భవనాల నిర్మాణాలపై ఇంజనీరింగ్ నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకోవాలని కేబినెట్‌ అభిప్రాయ పడింది.  జగన్ తీసుకున్న తాజా నిర్ణయం ఏపీలో సంచలనంగా మారింది. చంద్రబాబుకు క్రెడిట్ వస్తుందని అమరావతి లాంటి అద్భుత రాజధానిని కాలరాసే ప్రయత్నం చేసిన జగన్ రెడ్డిలో సడెన్ గా ఇంతటి ఛేంజ్ చూసి అంతా అవాక్కవుతున్నారు. అసంపూర్తి భవనాల నిర్మాణం పూర్తైతే.. అమరావతికి కొత్త అందం వస్తుంది. డిమాండ్ పెరుగుతుంది. ఇక విశాఖతో పనేముంది? అమరావతిలో భవనాలను పూర్తి చేస్తున్నారంటే.. ఇక విశాఖలో రాజధాని అంశాన్ని పక్కకు పెట్టేసినట్టేనా? లేక తాత్కాలికంగా ఆపుతారా? ఆలస్యం చేస్తారా? అనే చర్చ జరుగుతోంది. అందుకే జగన్ నిర్ణయంపై అమరావతి రైతులు సైతం ఈ నిర్ణయాన్ని నమ్మలేకపోతున్నారు.  అయితే హైకోర్టులో రాజధాని నిర్మాణం వ్యవహారాలపై విచారణ షెడ్యూల్ వచ్చింది. త్వరలోనే కోర్టుకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది. అమరావతి భవనాల నిర్మాణంపై సర్కారు తీరుపై గతంలో హైకోర్టు పలుమార్లు అక్షింతలు వేసింది. కోర్టు ఎంత చెప్పినా సర్కారులో కదలిక రాలేదు. భవనాలు పూర్తి చేయడంపై ఉలుకూ పలుకూ లేదు. ఈ సారి విచారణ సందర్భంగా హైకోర్టుకు అమరావతి భవనాలపై ప్రభుత్వ నిర్ణయమేంటో చెప్పక తప్పని పరిస్థితి. అందుకే, కేబినెట్ లో అంపూర్తి భవనాలు పూర్తయ్యేలా పాజిటివ్ నిర్ణయం తీసుకొని.. ఆ విషయాన్ని కోర్టు ద్రుష్టికి తీసుకెళ్లనుంది సర్కారు. అమరావతి రోడ్ల విషయంలోనూ ఇప్పటికే రివ్యూ కూడా నిర్వహించారు సీఎం జగన్.  ప్రభుత్వ పాజిటివ్ దృక్పదంతో.. భవన నిర్మాణాలు పూర్తైతే.. ఇక అమరావతికి డిమాండ్ అమాంతం పెరగడం ఖాయం. అదే జరిగితే.. ఇక విశాఖపట్నంతో పెద్దగా అవసరం ఉండకపోవచ్చు. ఆకర్షణీయమైన రోడ్లు, భవనాలతో అమరావతి అసలైన రాజధానిగా నిలిచే అవకాశాలున్నాయి. అటు, కేంద్రం సైతం మూడు రాజధానుల విషయంలో జగన్ కు ఇప్పటికే హితబోధ చేసినట్టు సమాచారం. ఇటు హైకోర్టు సైతం కేపిటల్స్ ను తిరష్కరించే అవకాశాలే ఎక్కువ అనేది న్యాయ నిపుణుల మాట. ఇలా ఎలా చూసినా.. భవిష్యత్ లో అమరావతికి మళ్లీ మంచి రోజులు వస్తాయనే ఆశ అక్కడి ప్రజల్లో.  సీఎం జగన్ తాజా నిర్ణయంతో వారి ఆశలు మరింత చిగురిస్తున్నాయి. తమ కలల రాజధాని కోసం మరింతగా పరితపిస్తున్నారు అమరావతి ప్రజలు. 
భారతదేశం మొత్తం రథయాత్ర పేరుతో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే పూరీ జగన్నాథుని రథోత్సవం ప్రస్తుతం జరుగుతోంది. ఒడిశా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన వెలసిన పూరీ క్షేత్రం శ్రీకృష్ణుణ్ణి ఆరాధించే వాళ్లకు ఎంతో పవిత్రమైనది. చార్ ధామ్ యాత్రలో ఉన్న ప్రముఖ నాలుగు క్షేత్రాలలో ఒకటైన పూరి జగన్నాథుని రథోత్సవం ప్రత్యేకత, విశేషాలు మొదలైన వాటి గురించి తెలుసుకున్న కొద్దీ ఇంకా తెలుసుకోవాలని ఉంటుంది. పూరీ క్షేత్రంలో ఎన్నో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. వాటిలో రథయాత్రకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. జగన్నాథుడు బలభద్రుడు, సుభద్రలతో కలసి ఇక్కడ రథాల మీద ఉరేగడం చాలా కన్నుల పండుగగా ఉంటుంది. రథం సుమారు 45 అడుగుల ఎత్తు, 35 చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంటుంది. దీనికి ఏడు అడుగుల వ్యాసం కలిగిన 16 చక్రాలు ఉంటాయి. దాదాపు నాలుగు వేల మంది భక్తులు కలిసి ఈ రథాన్ని లాగుతారు. ఇక్కడి గొప్ప ప్రత్యేకత ఏమిటంటే ప్రతి సంవత్సరం కొత్త రథాన్ని తయారుచేసి ఆ రథాల్లోనే రథోత్సవం జరుపుతారు. రథోత్సవాలు ఎక్కడ జరిగినా మూలవిగ్రహాలు వేరు, ఊరేగింపు విగ్రహాలు వేరు ఉంటాయి. కానీ పూరీ క్షేత్రంలో అలా కాకుండా  మూలవిగ్రహాలనే ఊరేగింపు చేస్తారు. కొత్త రాథాలపై మూల మూర్తులను చూడటం ఇక్కడే సాధ్యం. అందుకే పూరీ రథయాత్రకు ఇంత విశిష్టత ఏర్పడింది. ఆషాడ శుద్ధ విదియ రోజున సంవత్సరం నుండి మూలమూర్తిగా పూజలందుకుంటున్న జగన్నాథుణ్ణి, బలభద్రుణ్ణి, సుభద్రని గర్భాలయంలో నుండి బయటకు తీసుకుని వస్తారు. అథిత్యం గుండిచా వేదిక!! పూరీజగన్నాథ ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో గుండిచా ఆలయం ఉంటుంది. ఇది పూరీ ఆలయాన్ని  నిర్మించిన ఇంద్రద్యుమ్నుడి భార్య గుండిచా కట్టించినది. పూరీ ప్రధాన గుంది నుండి మూడు కిలోమీటర్లు రథం మీద వెళ్లి గుండిచా ఆలయంలో రత్న సింహాసనం మీద కొలువవుతాడు జగన్నాథుడు. రథం ప్రత్యేకత!! అంతా ఎక్కువభాగం రథాల్లోనే ఉంది ప్రత్యేకత. రథం తయారీ కోసం 1072 వృక్ష భాగాలను పూరీకి తరలిస్తారు. అక్షయతృతీయ రోజు 125 మంది ఈ 1072 బాగాలను 2188 ముక్కలుగా చేస్తారు. వీటిలో 832 ముక్కలు జగన్నాధుడి రథం కోసం, 763 భాగాలు బలభద్రుడి రథం కోసం, మిగిలిన 593 భాగాలను సుభద్ర రథం కోసం కేటాయిస్తారు. వాటితో రథాలను తయారుచేయడం మొదలు పెడతారు. ఆషాడ పాడ్యమి నాటికి వీటి నిర్మాణం పూర్తవుతుంది. జగన్నాధుడి రథం 16 చక్రాలతో 45 అడుగుల ఎత్తుతో అన్నిటి కంటే పెద్దగా ఉంటుంది. ఎర్రటిచారలు ఉన్న పసుపు వస్త్రంతో దీన్ని కప్పుతారు. దీన్ని నందిఘోష అంటారు. బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అని, సుభద్ర రథాన్ని పద్మధ్వజం అని అంటారు. తిరుగు ప్రయాణం!! రథాల మీద ఊరేగుతూ గుండిచా ఆలయాన్ని చేరుకున్న ఆతరువాత వారం రోజుల పాటు అక్కడే గడుపుతారు జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర ముగ్గురూ, వారం రోజుల తరువాత దశమి రోజు తిరిగి పూరీ ప్రధాన ఆలయానికి వెళతారు. దశమి తరువాత ఏకాదశి రోజున స్వామి వార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. మళ్ళీ ద్వాదశి రోజున విగ్రహాలను తిరిగి గర్భగుడిలోకి తీసుకెళ్లిపోతారు. దీంతో రథయాత్ర ముగుస్తుంది. ఆసక్తికర విషయాలు!! జగన్నాథుని రథోత్సవం జరిగేటప్పుడు రథాన్ని లాగుతున్నప్పుడు రథానికి ఏ అడ్డు వచ్చినా దాని ప్రయాణం ఆగదు. మనుషులు రథం కింద పడినా వేరే ఇతర సమస్యలు వచ్చినా కూడా రథాన్ని ఆపరు.  రథాలను, మూలవిగ్రహాలను మొత్తం చెక్కతోనే తయారుచేస్తారు. ఇది ఎంతో విశిష్టమైన వేప చెట్ల నుండి తయారుచేస్తారు. చాలామంది రథానికి ఉపాయోగించే కలప గురించి, ప్రతి సంవత్సరం కొత్త రథాల గురించి వినగానే అన్ని చెట్లను నరికేస్తున్నారా అని కొంచెం వ్యతిరేకత చూపిస్తారు. కానీ నిజానికి రథాల కోసం ఎంతో ప్రత్యేకంగా వృక్షాలను పెంచుతారు. వాటినే రథాల కోసం వినియోగిస్తారు.  8, 11, 19 సంవత్సరాలకు ఒకసారి మూలమూర్తుల విగ్రహాలను కూడా మార్పులు చేస్తారు. కొత్త చెక్క విగ్రహాలను తయారుచేసి, పాత వాటిని శాస్త్రోక్తంగా ఖర్మకాండలు జరుపుతారు. మనిషి జనన మరణాలకు ఇది గొప్ప సందేశాన్ని ఇస్తుందని కొందరి అభిప్రాయం. ◆ వెంకటేష్ పువ్వాడ.
అనగనగా ఓ రెండు గుర్రాలు ఉండేవి. దేవతా గుర్రాలంటే మాటలా! పాలరాతి తెలుపుతో, నురగలాంటి జూలుతో మహా అందంగా ఉండేవి. వాయువేగంతో ముల్లోకాలూ చుట్టిపారేసేవి. జనం ఆ గుర్రాలను చూసినప్పుడల్లా ముక్కున వేలేసుకునేవారు. అంత అందమైన గుర్రాలను చూడటంతో తమ జన్మ ధన్యమైపోయిందని మురిసిపోయేవారు. కానీ ఆ గుర్రాల మనసులో ఏదో చింత! రెండు గుర్రాలనీ అంతా సమానంగా చూస్తున్నారు. రెండూ అందమైనవే అనీ, రెండూ వేగమైనవే అనీ పొగుడుతున్నారు. ‘అలా జరగడానికి వీల్లేదు! ఈ ప్రపంచంలో అన్ని గుర్రాలకంటే నేనే అందంగా ఉండాలి,’ అన్న ఆలోచన రెండు గుర్రాలలోనూ కలిగింది. అంతే వాటిలో ఒక గుర్రం నిదానంగా దేవుడి దగ్గరకి చేరింది.   ‘భగవంతుడా! నన్ను ఇంత అందంగా అద్భుతంగా సృష్టించినందుకు కృతజ్ఞతలు. దేవతా గుర్రంగా నా జన్మ ధన్యమైపోయింది. కానీ నాదో చిన్న కోరిక,’ అంది ఆ గుర్రం. దాని మనసులో మాట గ్రహించినట్లుగా భగవంతుడు ఓ చిరునవ్వు నవ్వి- ‘నువ్వు దేవతా గుర్రానికి. నీ కోరికని తీర్చాల్సిందే! ఏం కావాలో కోరుకో!’ అన్నాడు. ‘నేను అందంగా ఉన్న మాట నిజమే కానీ ఇంకాస్త అందంగా ఉంటే బాగుండు అన్న దుగ్థ నన్ను తెగ వేధిస్తోంది. ఆలోచించి చూస్తే నాలో చాలా అవకరాలే కనిపిస్తున్నాయి. అవన్నీ సరైపోయి నేను ఇంకా అందంగా ఉండేట్లు ఆశీర్వదించండి స్వామీ!’ అని వేడుకుంది.   ‘ సరే! నీలో నీకు ఏ లక్షణాలు లోపాలుగా కనిపిస్తున్నాయో చెప్పు. అవన్నీ సరిదిద్దుతాను,’ అంటూ అభయమిచ్చాడు భగవంతుడు. దాంతో ఆ గుర్రం తనలో తనకి లోపాలుగా తోచిన లక్షణాలన్నింటినీ ఏకరవు పెట్టడం మొదలుపెట్టింది. ‘ఈ తల చూసారా! మరీ మెడకి అంటుకుపోయినట్లుగా ఉంది. అది ఇంకాస్త పొడవు ఉంటే బాగుంటుంది. ముక్కు కూడా మరీ సన్నగా ఉందేమో అని నా అనుమానం. ఇక కాళ్లు ఇంకాస్త పొడవుంటే భలే ఉంటుంది. దయచేసి ఇవన్నీ సరిదిద్దురూ!’ అంది గుర్రం. ‘తథాస్తు! రేపు ఉదయం నువ్వు లేచి చూసుకునే సరికి ఈ లోపాలేవీ లేని సరికొత్త రూపం నీకు వస్తుంది,’ అన్నాడు భగవంతుడు.   మొదటి గుర్రం సంతోషంగా భగవంతుని దగ్గర సెలవు తీసుకుంది. అది అలా వెళ్లిందో లేదో రెండో గుర్రం భగవంతుడి దగ్గరకు చేరుకుంది. ‘హే భగవాన్‌! ఆ గుర్రం తన అందాన్ని పెంచుకోవాలనే కోరికతోనే నీ దగ్గరకి వచ్చిందని నాకు తెలుసు. ఎలాగైనా ప్రపంచంలోనే గొప్ప గుర్రం అనిపించుకోవాలని దాని తపన. దాని అత్యాశని మీరు అణచాల్సిందే! అది తనలోని అందం మెరుగుపడేందుకు ఏ లక్షణాలనైతే కోరుకొందో... అవి నాలో మరింత ఎక్కువగా ఉండేలా వరం ఇవ్వండి,’ అని వేడుకుంది. ‘అయ్యో అదెంత భాగ్యం! అసలే నువ్వు దేవతా గుర్రానివి. నీ కోరికను తీర్చాల్సిందే! రేపు ఉదయం నువ్వు లేచి చూసుకునేసరికి ఆ లక్షణాలన్నీ నీలో కనిపిస్తాయి. తథాస్తు!’ అంటూ నవ్వాడు భగవంతుడు.   ఆ రాత్రి గుర్రాలకి సరిగా నిద్రపట్టనే లేదు. ఎప్పుడెప్పుడ తెల్లవారుతుందా... నిబిడీకృతమైన తమ అందాన్ని ఎప్పుడెప్పుడు చూసుకుంటామా అన్న ఉద్విగ్నతతో ఆ రాత్రిని గడిపాయి. ఎప్పుడో అర్ధరాత్రి వాటికి మాగన్నుగా నిద్రపట్టింది. తెల్లవారాక చూసుకుంటే ఆ రెండు గుర్రాలకీ తమ కోరిక నెరవేరిన విషయం తెలిసిపోయింది. కాకపోతే... మొదటిగుర్రం కోరుకున్న లక్షణాల కారణంగా అది అచ్చు ఒంటెలా మారిపోయింది. మొదటి గుర్రం కోరుకున్న లక్షణాల మోతాదు తనలో మరింతగా ఉండాలని కోరుకోవడంతో రెండో గుర్రం జిరాఫీలా మారిపోయింది!!!   తమ శరీరాల వంక చూసుకున్న గుర్రాలు రెండూ లబోదిబోమంటూ భగవంతుడి దగ్గరకు పరుగులెత్తాయి. ఆయనను చూస్తూనే ‘ఏమిటీ మాకీ అన్యాయం!’ అంటూ ఆక్రోశించాయి.   ‘మీరు కోరుకున్న వరాన్ని యథాతథంగా తీర్చాను. ఇది అన్యాయం ఎలా అవుతుంది? ఆగమేఘాల మీద పరుగులు తీసే దేవతాశ్వాలు ఎలా ఉండాలో, మిమ్మల్ని అలా పుట్టించాను. కానీ మీకు మీ శరీరం పట్ల కానీ, దానిని అందించిన నా పట్ల కానీ నమ్మకం లేదు. అదే అసలైన అన్యాయం. మీరు నిజంగా నన్ను ఏదన్నా కోరుకోవాలని అనుకుంటే... ఎలాంటి నిస్సత్తువా దరిచేరకుండా బలిష్టంగా ఉండాలనో, కోరుకున్న గమ్యాలని సమర్థంగా చేరుకోవాలనో అడగాల్సింది! కానీ మీరు పైపై మెరుగులకే ప్రాధాన్యతని ఇచ్చారు. ఇక ఫలితం అనుభవించండి. ఇక నుంచీ మీరు దేవతా అశ్వాలు కాదు. ఒకరేమో ఒంటెలాగా ఎడారుల్లో తిరుగుతూ నానా బరువులూ మోయాల్సి ఉంటుంది. మరొకరేమో చిటారుకొమ్మ మీద దొరికే ఆహారంతో తృప్తిపడుతూ అడవులలో కాలం గడపాల్సి వస్తుంది. పోండి!,’ అనేశాడు భగవంతుడు. అదీ విషయం! (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)   - నిర్జర.
ఈ రోజుల్లో ఒత్తిడి లేనిది ఎవరికి? ఈ పోటీ ప్రపంచంతో పరుగులెత్తే జీవితంలో అందరూ ఒత్తిడికి లోనయ్యేవారే! కొంతవరకూ ఈ ఒత్తిడి అవసరమే కూడా! కానీ తలకెత్తుకున్న ఒత్తిడి ఓ పట్టాన దిగిరాకపోతే మాత్రం కష్టం. మనసుకి భారమైన ఒత్తిడితో శరీరానికి కూడా నష్టం. ఏ జీవితం కోసమైతే మనం ఇంతగా ఒత్తిడికి లోనవుతున్నాయో, ఆ జీవితాన్నే నరకంగా మార్చేసే రోగాలన్నీ ఒత్తిడితో వచ్చేస్తాయి. అందుకే అనవసరమైన ఒత్తిడిని నివారించుకునేందుకు, తరుణోపాయాలను కూడా వెతుక్కోవాల్సి ఉంటుంది. వాటిలో కొన్ని ఇవిగో...   రాసుకుని పక్కన పెట్టేయండి! చిత్రంగా అనిపించినా, ఈ చిట్కా తప్పకుండా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. మనం ఏదన్నా సమస్యని ఎదుర్కొన్నప్పుడు దాని గురించి నిరంతరం ఆలోచిస్తూనే ఉంటాము. దాని పరిష్కరించడం కోసమో, దాన్నుంచి బయటపడటం కోసమో మన మెదడు తెగ వేడెక్కిపోతూ ఉంటుంది. అందుకనే ఇక ఈ సమస్య గురించి ఇప్పుడు, ఇంతకుమించి ఆలోచించి ఉపయోగం లేదనుకున్నప్పుడు దాన్ని ఒక చోట రాసుకుని పక్కన పెడితే సరిపోతుంది. ఆ సమస్యను మర్నాడు చూసుకుంటే సరిపోతుంది.   అంకెలూ పనిచేస్తాయి అంకెలు లెక్కపెట్టడం అనే ఆలోచన పాతచింతకాయ పచ్చడిలా కనిపించవచ్చు. కానీ ఒకో అంకె లెక్కపెట్టేకొద్దీ మరింత నిదానంగా ఊపిరి తీసుకోవడం అనే ప్రక్రియను జోడిస్తే, ఒత్తిడి ఇట్టే మాయమవుతుందట. అలా నిదానంగా ఊపిరి పీల్చుకోవడం వల్ల ఊపిరితిత్తుల నిండా ప్రాణవాయువు చేరుతుంది. దీని వల్ల రక్తపోటులో అప్పటికప్పుడే మార్పులు గమనించవచ్చునంటున్నారు వైద్యలు. ఇలా పీల్చుకునే ఊపిరిని నోటి ద్వారా వదలడం వల్ల మరింత ఉపయోగం ఉంటుందని అంటున్నారు.   ఊహకు రెక్కలివ్వండి ప్రకృతికీ ప్రశాంతతకూ అవినాభావ సంబంధం ఉంది. ప్రకృతి కళ్ల ముందుంటే తల్లి ఒడిలో ఉన్నంత భరోసా ఉంటుంది. అందుకే ఒత్తిడిగా ఉన్నప్పుడు వీలైతే కాస్త పచ్చని వాతావరణంలో తిరిగేందుకు ప్రయత్నించండి. అదీ కాదంటే కిటికీలోంచి బయట ఉన్న ప్రకృతిని గమనించండి. అది కూడా వీలుకాకపోతే, ఒక్క నిమిషం కళ్లు మూసుకొని మీరు ప్రకృతి ఒడిలో ఉన్నట్లు భావించుకోండి. కొండలూ, మబ్బులూ, జలపాతాలూ, పక్షులూ, చెట్లూ... అన్నీ మీ కళ్ల ఎదుటే ఉన్నట్లుగా ఊహించుకోండి. మీలోంచి ఒత్తిడి ఎలా మాయమవుతుందో చూడండి!   కండరాలకు విశ్రాంతినివ్వండి! మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు శరీరం కూడా ఒత్తిడికి లోనవుతుంది. కండరాలన్నీ బిగుసుకుంటాయి. తల భారంగా మారిపోతుంది. కండరాలను బిగించి వదలడం, మెడని అటూ ఇటూ తిప్పడం వంటి చిన్నపాటి వ్యాయామాలతో శరీరం కాస్త తేలికపడుతుంది. చేతులకీ, మెడకీ చేసుకునే చిన్నపాటి మసాజ్ వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. ఏదన్నా యోగాసనంలో కాసేపు కూర్చునే అలవాటు ఉన్నా ప్రయోజనమే!   నీటిలో గడపండి నీటికీ మన శరీరానికీ అవినాభావ సంబంధం ఉంది. నీరు తగలగానే మన శరీరానికి కొత్త ఉత్సాహం వస్తుంది. అందుకనే స్నానమో, కాళ్లూ చేతులూ కడుక్కోవడమో చేస్తే కాస్త ఉపశమనంగా ఉంటుంది. ఒత్తిడి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు మొహం మీద నీళ్లు చల్లుకోవడం, షవర్ కింద కాసేపు నిల్చోవడంతో మనసు తేలికపడుతుంది. ఇంకా మాట్లాడితే ఈత కొట్టే అవకాశం, అలవాటు ఉంటే కనుక ఒత్తిడి ఆ ఈతకొలనులోనే మాయమైపోతుంది.   ఒత్తిడి అనేది వ్యక్తిగతమైనది. కాబట్టి ఎవరి అనుభవానికీ, ఆలోచనకూ తగినట్లుగా ఒత్తిడిని నివారించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరు తమకి ఇష్టమైన సంగీతాన్ని వింటూ ఒత్తిడిని మర్చిపోతే, మరికొందరు కాసేపు స్నేహితుల మధ్య గడిపి ఒత్తిడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుంటారు. ఎవరు ఏ పద్ధతిని అనుసరించినా, ఒత్తిడి నుంచి దూరంగా ఉండటం మాత్రం... మనకూ, మన కుటుంబానికీ చాలా అవసరం!    
మన ఆరోగ్యానికి సంబందించిన ఔషదాలలో మూత్రం ఒకటి. మూత్రం తో చికిత్చ చిచి అని అంటున్నారు కదా. మీరు అవునన్నా కాదన్నా మూత్రం తో చికిత్చ ఉందని ప్రముఖ నాడి పతి వైద్యులు డాక్టర్ కృష్ణం రాజు గారు తెలుగు వన్ హెల్త్ కు వివరించారు. మనకు అనారోగ్యం వస్తే ఎక్కడి కైనా వెళ్లి మందు తెచ్చు కుంటాము.ఆ మందు వేసుకున్నాకే రోగం తగ్గిందని భావిస్తాము.లేదా కొన్ని సందర్భాలలో ఆ మందువల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. ఖచ్చితంగా మనశరీర తత్వానికి సరిపడుతుందా అన్నదే ప్రశ్న?  అయితే మన ఆరోగ్యానికి శరీరానికి ఖచ్చితంగా సరిపడే మందు మనశరీరం లోనే ఉంది అని అంటున్నారు నాడి వైద్యులు డాక్టర్ కృష్ణం రాజు. దానినే మూత్ర చికిత్చ.చిచి ఇదేం చికిత్చ అని మాత్రం అనుకోకండి సుమా ఇది అక్షరాలా నిజం.మన పూర్వీకులు మనకు అందించిన చికిత్చ గా ఏర్కొన్నారు.కృష్ణం రాజు.మన శరీరంలో జరిగే ప్రక్రియ ప్రకారం మనం నిద్రపోయే సమయం లో విష పదార్ధాలు వ్యర్ధ పదార్ధాలు కణాలతో పోరాడి వాటిని తొలగిస్తుంది.అలాగే ప్రత్యేక అవసరాలకు సరైన ఔషదాన్ని తయారు చేసుకుంటుంది.అదే మనకు అధిక మోతాదులో ఉదయం లేవగానే పోసే మూత్రం లో ఉంటుంది.ఈ రకం గా ఉదయాన్నే మొదటి సారి విడుదల అయ్యే మూత్రాన్ని తాగడం ద్వారా మనశరీరం యొక్క అవసరాలు,లవణాలు,వగైరా లభిస్తాయని ఇదే మూత్ర చికిత్చ యొక్క మూల సిద్దాంతం గా పేర్కొన్నారు.దీనిగురించి మరింత వివరంగా తెలుసుకుందాం. మూత్ర చికిత్చకు మూలాధారం ఏమిటి?.. మూత్ర చికిత్చ గురించి శివపురాణం లో,మహాభారాతం లో బైబుల్ లోనూ మతగ్రంధాలలో ఈ మూత్రము జీవామృత మని  వ్రాయ బడిందని అంటున్నారు.శివపురాణం లో దానిని మూత్రం తాగే విధానం చాలా బాగా తెల్పబదిందని కృష్ణం రాజు పేర్కొన్నారు.ఇందుకు ఉదాహరణగా పూర్వాకాలం లో నేరస్తులు మూత్రం తాగడం వల్ల వారిని పోలీసులు తీవ్రంగా హింసించినా ఏమి అనిపించేది కాదు.అలా కొన్ని రోజులు ఏ ఆహారం  తీసుకోకపోయినా వారు అలాగే దృడంగా ఆరోగ్యంగా ఉండగలిగే వారని అలాగే దీని ఆధారంగానే దీర్ఘకాలం ఉపవాసం ఉన్నా రంటే దానికి కారణం మూత్రం తాగడమే అని  పేర్కొన్నారు.ఎవరి మూత్రం వారే తాగమని భారత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయి సెలవిచ్చారని వారి మూత్రాన్ని వారే  4౦ ఏళ్ళు తాగారని కృష్ణం రాజు గుర్తుచేశారు. అలా మూత్రాన్ని తాగుతూ 1౦౦ సంవత్సరాలు తీసుకుంటూనే ఉన్నరన్న విషయం దేశప్రజలకు బహుశా గుర్తుండి ఉండవచ్చని డాక్టర్ కృష్ణం రాజు పేర్కొన్నారు.ఎవరి మూత్రం వారే సేవించడం సెల్ఫ్ యురిన్ తాగడం మంచది అన్న అంశం పై యు ఎస్ ఏ కు చెందినా డాక్టర్ బీ బ్రైసు చార్టర్ రాసిన పుస్తకాలాలో ఈ అంశాన్ని ప్రస్తావించారని పేర్కొన్నారు.శాస్త్రీయం గా నిరూపితమైందని కృష్ణం రాజు వాడుతున్నారు.  స్వయం గా మూత్రాన్ని ఎలా వాడాలి?... ఉదయం నిద్ర లేవగానే మొదటి సారి విడుదల చేసిన మూత్రం లో కొన్ని చుక్కలు పోనివ్వాలి. అప్పుడు ఒక శుభ్రంగా ఉన్న గ్లాసులోమూత్రాన్ని పట్టి త్రాగాలి.దీనిని ఇన్ టేక్ అప్లికేషన్ అని అంటారు దీనిని ఎక్స్  టర్నల్ అంటే పై పూతగా కూడా వాడచ్చుఅని అంటున్నారు కృష్ణం రాజు.ఇందుకు ఉదాహరణగా వాడవచ్చనిఅంటే ఎక్కడైనా రక్త శ్రావం అవుతున్నప్పుడు లేదా చర్మ సంబంధిత సమస్యలు కంటి సమస్యలు,ఫేషియల్ అనేక సమస్యలకు సెల్ఫ్ యురిన్ స్వీయ మూత్రం వాడవచ్చని కృష్ణం రాజు విశ్లేషించారు. అసలు మూత్రం సేవిస్తే వచ్చే ఫలితాలు... ఎవరి మూత్రాని వారు తాగడం వల్ల ఆశ్చర్య కరమైన ఫలితాలు వచ్చాయని అంటున్నారు డాక్టర్ కృష్ణం రాజు. మీరు స్వీయ మూత్రం వినియోగించే ముందు ముందుగా దానిని దయ చేసి పరీక్షించాలని సూచించారు.ఎందుకంటే మనం వాడే మందుకు తినే తిండికి ఎక్కడైనా కాలుష్యం లేదావిష తుల్య మైతే ప్రామాదమని.ముఖ్యంగా డయాబెటిస్ వ్యాధితో బాధపడే వారు ఇతర చికిత్సలకు మందులు  వాడుతున్న వారు సెల్ఫ్ యురిన్ అంటే స్వీయ మూత్రం త్రగావద్దని అయితే పై పూత గా వాడవచ్చని వివరించారు.స్వీయ మూత్ర చికిత్చ వాడేందుకు ఎలాంటి ఖర్చులు,డబ్బు ఖర్చు పెట్టాల్సిన పనిలేదని అయితే మూత్రాన్ని పరీక్షించిన తరువాత మాత్రమే ఉపయోగించాలని డాక్టర్ కృష్ణం రాజు సూచించారు. .
కోవిడ్ నాల్గో వేవ్ వస్తుందని అంచనా నిజమైందా అంటే నిజమే అని రుజువు చేస్తునాయి. అని అంటున్నారు నిపుణులు.ఇందుకు ఉదాహరణగా కోవిడ్ వ్యవహారం లో ప్రపంచ వ్యాప్తంగా శరవేగంగా కేసులు పెరగడం గమనించవచ్చు అని అంటున్నారు నిపుణులు.చాలా నెలల తరువాత భారత దేశం లో లక్షకు పైగా కేసులు పెరగడాన్ని ఉదాహరణగా పేర్కొన్నారు.గత 24 గంటలలో భారత్ లో కోవిడ్ కేసులు 18,818 వెలుగు చూసాయని ఈ సంఖ్య గత నాలుగు నెలల క్రితం కన్నా ఎక్కువే అమెరికాలో ఒమైక్రాన్ నూతన వేరియంట్స్ బిఏ4 బిఏ5 కేసులు పెరగడం వెనుక కారణాలు పూర్తిగా అధ్యయనం చేస్తున్నారు.ఒమైక్రాన్ కొత్త వేరియంట్ -పేరెంట్ వేరియంట్ కన్నా చాలా తీవ్రమైనదని ఈ కారణంగానే కేసులు త్వరితగతిన పెరుగుతున్నాయని భారత్ లో మహారాష్ట్రా తమిళనాడు లో బిఏ4 బి ఏ5 కేసులు వెలుగు చూసాయి. త్వరితగతిన విస్తరిస్తున్న బిఏ4 బిఏ5... సి డి సి విడుదల చేసిన డాటా ఆధారం గా కోవిడ్ చాలా వేగంగా విస్తరిస్తోందని వేరియంట్లు చాలా సులభంగా ఇమ్యునిటీ యాంటి బాడీ లను  బురిడి కొట్టించి వ్యాపించేందుకు విస్తరించేందుకు సహకరిస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఎవరైతే వ్య్సక్సిన్ లేదా బూస్టర్ వేయించు కున్న వారిలో కోరోనా ఇన్ఫెక్షన్ సోకుతుంది కరోనా విస్తరణకు బిఏ4 బిఏ5 కారణమని నిర్ధారించారు.  బిఏ4 బిఏ5 లక్షణాలు ఎలా ఉంటాయి?ఎలా గుర్తించాలి?... బిఏ4 బిఏ5 నుండి వ్యాక్సిన్లురక్షిస్తాయా?... వైద్య నిపుణులు అనుకుంటున్నట్లు గా వ్యాక్సిన్ అందరికీ అందించాలని, వ్యాక్సిన్ అందరికీ అందేవిధంగా ప్రణాలికలు రూపొందించుకుని వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేప్పట్టిన విషయం తెలిసిందే వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల వైరస్ ప్రభావం మరింత తీవ్రం కాకుండా కొంత మేర రక్షించ వచ్చు అని అంటున్నారు  నిపుణులు. భారత్లో వస్తున్న కొత్త వేవ్ నుండి ఎలారక్షించుకోవాలి?... ఎవరైతే కోవిడ్ లక్షణాలు ఉన్నాయాని భావిస్తున్నారో వారు పరీక్షలు చేయించుకోవాలి.నూతన వేరియంట్లు గుర్తించడం మరింత సులభం అవుతుంది అని నిపుణులు అంటునారు.ఇన్ఫెక్షన్ విస్తరించకుండా నిలువరించ వచ్చు.అందుకోసం అత్యవసర చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని ప్రభుత్వాలు గుర్తించాలి.ఎప్పుడైతే మహమ్మారి ప్రారంభ మైందో అప్పుడే అప్పుడే డబ్ల్యు హెచ్ ఓ పరీక్షలు చేయించుకోవాలని ఒత్తిడి చేసింది. పరిశుభ్రత పాటించాలి... మనం ప్రతిరోజూ చేతిని శుభ్రంగా కడుక్కోవాలి ఇంటినుండి బయటికి వెళ్ళేటప్పుడు సేనితైజర్ ను వినియోగించాలి.తద్వారా కోవిడ్ విస్తరణకు అడ్డు కట్ట వేయచ్చు మన ముఖాన్ని మళ్ళీ మళ్ళీ చేతితో కడగకండి.అయితే భోజనానికి ముందు తప్పనిసరిగా చేతులు కడుక్కోండి.అని నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్ ధరించండి... చాలా పరిశోధనలలో నిరూపిత మైన అంశం ఏమిటి అంటే మాస్క్ కోవిడ్ విస్తరించకుండా సంక్రమించకుండా అప్పుతుంది.సహకరిస్తుంది. కరోనా వైరస్ నివారణలో వ్యాక్సిన్లు అందుబాటులో లేవో ఆసమయం లో మాస్క్ ప్రజలను రక్షించింది  వ్యాక్సిన్ బూస్టర్... ఇప్పటివరకూ వ్యాక్సిన్ మాత్రమే కోవిడ్ నుండి రక్షిమ్పబడే ఏకైక మార్గమని వ్యాక్సిన్ తో మాత్రమే కోవిడ్ వ్యాప్తిని సంక్రమించకుండా నివారించగలిగామని నియంత్రించ గలిగామని ఇన్ఫెక్షన్ తీవ్రం కాకుండా నిలువరించగలిగా మని నిపుణులు అభిప్రాయ పడ్డారు. కొత్త వేరియంట్ వచ్చినవారిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి... ఆరోగ్య నిపుణుల వైద్యుల వివరాల ప్రకారం ఎవరైతే సబ్ వేరియంట్ బారిన పడ్డారో వారు తీవ్ర జ్వరం,ముక్కు కారడం,లేదా ముక్కు బిగుసుకు పోయినట్లు ఉండడం,నీరసంగా అలసటగా ఉన్నట్లు అనిపిస్తుంది ఈ లక్షణాలు దాదాపు ౩-4 రోజులు ఉంటుంది లక్షనాలలో గొంతు నొప్పి,జ్వరం,ఒళ్ళు నొప్పులు,అలసటతో ప్రారంభ మౌతుంది.ఆతరువాత దగ్గు గొంతులో ఒకరక మైన ఇరి టేషన్ ఉంటుందని నిపుణులు అంటున్నారు. అయితే ఈ లక్షణాల తీవ్రత పెద్దగా ఉండదని కోవిడ్ నుండి మనం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.                                                                  
ప్రపంచం లో నానాటికి పెరిగిపోతున్న కాలుష్యం  ప్రమాద ఘంటికలు మొగిస్తోందని వాతావరణం ప్రభావం అంశం  పై శాస్త్రజ్ఞులు చేసిన పరిశోదనలో  వివిధరకాల వాతావరణాలు,   వాతావరణ కాలుష్యం వల్ల కొన్నిరకాల గుండె శ్వాస సంబంధిత వ్యాధులు వస్తున్నాయని తేల్చారు. వాతావరణం లో పేరుకు పోయిన కొన్నిరకాల అణువులు పార్టికల్స్, రసాయనాల ప్రభావం తో ఊపిరి తిత్తులలో అస్తమా  వంటి సమస్యలు మానవులను చుట్టుముడుతున్నాయని అవి ప్రాణాలను హరిస్తున్నాయని ఒక ఆధ్యయనం లో వెల్లడించారు. ప్రపంచం లో పెరుగుతున్న పట్టణీకరణ,పారిశ్రామికీకరణ ఆధునికత పేరుతో మనకు మనం గా ప్రకృతిని నాశనం చేస్తూ సృష్టిస్తున్న రసాయన వ్యర్ధాలు వివిదరకాల ఉద్ఘారాల వల్ల వాతావరణం లో మార్పులు రేడియేషన్ వల్ల పరిస్థితి మరింత దిగజారి పోతోంది అని నిపులు హెచ్చరిస్తున్నారు. గాలి కాలుష్యం, నీటి కాలుష్యం, సైతం రసాయనాల చేరికతో కాలుష్యం తన వికృత రూపాన్ని ప్రదర్శిస్తుంది. ప్రపంచం లో వెలుస్తున్న గ్రీన్ హౌస్ లు సాంకేతికత వృద్ధిలోభాగంగా పుట్టుకొస్తున్న ఉద్గారాల వల్ల భూమిపై రేడియేషన్ పెరిగి వివిద రకాల సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. --మానవులు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతి కీలక పాత్ర పోషిస్తుంది అనడం లో సందేహం లేదు. ఒక పరిశోదనలో కొన్ని ప్రాంతాలలో లేదా ప్రత్యేక ప్రాంతాలలోనివసిస్తున్న వారి ఆనారోగ్యం పాలవుతున్నారని. తద్వారా మరణాలు సంభవిస్తున్నాయని వెల్లడించారు. ---ఇందులో కొన్ని కారణాలను కారకాలను పేర్కొన్నారు.గాలి కాలుష్యం,ఇంధనం ఎక్కువగా వినియోగించడం వల్ల వచ్చే పొగల ప్రభావం  గుండె సంబంధిత సమస్యలు మరణాల సంఖ్యకు కారణం అవుతోందని నూతన పరిశోదన వెల్లడించింది. శాస్త్రజ్ఞులు చేస్తున్న వాదన లలో మన వాతావరణం లో వస్తున్న మార్పులు కాలుష్యం వల్లే మన ఆరోగ్యం పెను ప్రమాదం లో పడిందని మరణాలకు దారి తీస్తుందని పరిశోదన వెల్లడించింది.  మరణాలకు కారణాల పై  అధ్యయనం... చాలా ప్రాంతాలలో శాస్త్రజ్ఞులు చేసిన పరిశోదనలు ప్రజలకు ప్రమాదకర మైన,,రేణువులు,గాలిలో ఉండడం,రసాయనాలు, ఇతర కారకాలు ప్రమాద కరం గా మరాయని మరణాలకు గల కారణాలను అధ్యయనం తెలిపింది .గుండె సంబందిత సమస్యల వల్ల మరణాలు సంభవిస్తున్నట్లు గుర్తించారు. ఇటీవల జరిపిన ప్లాన్ వన్ వాతావరణ కాలుష్య కారకాలు మరణాలు కేవలం గుండె సంబంధిత మరణాల పై పరిశోదనలు చేయడం విశేషం. పరిశోధకులు గుండే సంబందిత మరణాలకు చాలానే కారణాలు ఉన్నాయని గాలి ఇంటిలో కాలుష్యం కూడా కారకంగా తేల్చారు. ఆరోగ్యం పై వాతావరణ ప్రభావం... చాలా రకాల కారకాలు ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తాయని ఉదాహరణకు జనటిక్స్ కీలక పాత్ర పోషిస్తుందని.కొన్నిరకాల డిజార్డర్స్ లేదా వ్యాధులకు  దారి తీస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు.ఏది ఏమైనప్పటికీ ప్రజలు వారి వ్యవహార శైలి వ్యాధులకు కారణం ఔతోందని వాతావరణం ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది అనడం లో సందేహం లేదు. డబ్ల్యు హెచ్ ఓ లెఖల ప్రకారం 24%మరణాలు కేవలం వాతావరణం కారణమని నిర్ధారించారు. డబ్ల్యు హెచ్ ఓ కొన్నిరకాల వాతావరణ వాస్తవాలు మరణాలకు  దోహదం చేశాయని ఈకింద పేర్కొన్న అంశాలు ఉన్నాయని విశ్లేషించారు. *గాలి కాలుష్యం. *నీటి కాలుష్యం. *అపరిశుభ్రత. *హానికారక రసాయనాలు. *తీవ్రమైన వాతావరణ మార్పులు ప్రభావం ఎండవేడిమి పెరగడం,అత్యధిక శీతల వాతావరణం తో తీవ్ర సమస్యలు పెరుగుతూ వస్తున్నాయి. అని నిపుణులు తేల్చారు. గాలి కాలుష్యం... గాలి కాలుష్యం అత్యంత ప్రమాదకరం.అని అది ఊపిరి తిత్తులను గుండెను ప్రభావితం చేస్తోందని పరిశోధకులు వెల్లడించారు.గాలిలో ఉండే రేణువులు శరీరంలో నుండి వ్యక్తి లోకి చేరి వారిలో మెదడు సంబంధిత సమస్యలకు కారణం అవుతోందని నిపుణులు నిర్ధారించారు. మెదడులో ఫ్లూయిడ్స్ గుర్తింపు... ఒక పరిశోదనలో కాలుష్యపు అణువులను మెదడులో ఉన్న ఫ్లూయిడ్స్ లో గుర్తించినట్లు దీనికారణం గానే బ్రెయిన్ డిజార్డర్స్ కు కారణంఅవుతున్నట్లు  నిపుణులు తెలిపారు. శాస్త్రజ్ఞులు ఎలుకల పై చేసిన పరిశోదనలో కాలుష్యపు రేణువులు మానవుల ఊపిరి తిత్తుల నుండి రక్తం లోకి చేరుతుందని ఆకారణం గా మెదడులో రక్త ప్రవాహం లో ఏదైనా సమస్య తల ఎత్తి ఉండవచ్చు అని నిపుణులు తేల్చారు.గాలి కాలుష్యం కారణంగానే ఊపిరితిత్తులు గుండె సమస్యలకు కారణమని నిర్ధారించారు. నష్ట నివారణ సాధ్యమా ? నష్ట నివారణ సాధ్య మేనా -అన్నది ఒక పెద్ద ప్రశ్న కాలుష్య నివారణ సాధ్యం కాదని నిపుణులు తేల్చారు. బెర్మింగ్ హాం విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రజ్ఞులు చైనా సంస్థలు చేసిన పరిశోదనలో వాతావరణ కాలుష్యం నుండి వచ్చిన టో క్సిన్స్ రేణువులు మెదడుకు చేరతాయని కనుగొన్నారు. 25 మంది ప్రజల పై చేసిన పరిశోదనలో సేరబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ ను పరీక్షించగా రకరకాల మానసిక సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని అందులోనూ రకరకాల టాక్సిక్స్ ఉన్నట్లు సేరబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ ౩2% రోగుల రక్తం లో ఉన్నట్లు గుర్తించారు. ఆరోగ్యంగా ఉన్నవారి వద్ద నుండి 26 రక్త్గం నమూనాలు సేకరించినట్లు ఒక వ్యక్తిలో కొన్ని రకాల టో క్సిన్స్ ఉన్నట్లు శాస్త్రజ్ఞులు గుర్తించి నట్లు తెలిపారు. పరిశోదనలు చేసిన బర్మింగ్ హాం విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ ఇసెల్ట్ లిగ్నిచ్ మాట్లాడుతూ మా పరిశోదనా జ్ఞానం వాతావరణం లో పుట్టుకొచ్చే ప్రామదకరమైన కాలుష్య ప్రభావం వల్ల గాలిద్వారా వ్యాపించే ఇతర రేణువులు పార్టికల్స్ ముఖ్యంగా మెదడు నాడీ వ్యవస్థ పైన ప్రభావం చూపించడం వల్లే మెదడు పని తీరు  బలహీన పడి  శ్వాస సంబందిత సమస్యలు శరీరాన్ని చుట్టుముట్టి సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు వెల్లడించారు. వాతావరణ కాలుష్యం ప్రధాన అంశం... పి ఎం 1౦ పార్టికల్స్ 1౦ మైక్రోన్స్ ఇందులో గాలి ద్వారా వైరస్ బ్యాక్టీరియా, పొగ, ఇతర దుమ్ము ధూళి వంటి కారకాలు ఉండవచ్చు. --పి ఎం 2.5 లో కొన్నిరకాల పార్టికల్స్ 2.5 మైక్రాన్ల లో విద్యుత్ ఉత్పదక కేంద్రాల నుండి వెలువడే ధూళి,పొగలు వాహనాల నుండి వెలువడే పొగ ఇతర రసాయనాలు ఉన్నాయని తేల్చారు. ౦.1 పార్టికల్స్ వంటివి మానవుల ఆరోగ్యం పై ప్రభావం చూపుతుందని అది శరీరంలో వీటిని ఎదుర్కొనే శక్తి అంతర్గత బద్రత లేదా ఇతర ఫారెన్  బాడీలు  రోగనిరోదక శక్తి చాలా బలహీన మౌతోంది. ఇటీవల జరిగిన పరిశోదనలో సైతం ౦.1 మైక్రన్స్ రేణువులు అక్సిడెంట్స్ ఒత్తిడి ,గుండె సంబంధిత  టాక్సీటీ కి కారణంగా తేల్చారు. రానున్న భవిష్యత్తులో ఎదురయ్యే కాలుష్య సమస్యలను ఎదుర్కోడానికి సంపూర్ణ ఆరోగ్యానికి ఇప్పటినుండే నిర్దిష్ట ప్రణాళికల అమలుకు ప్రతిఒక్కరు సిద్దం కావాలని నిపుణులు సూచిస్తున్నారు. సంపూర్ణ ఆరోగ్యానికి-అటు ప్రజలు-స్వచ్చంద సంస్థలు ఉద్యమ స్పూర్తితో ప్రయత్నం చేస్తే తప్ప కాలుష్య రహిత ప్రపంచాన్ని సృష్టించాలేమని పేర్కొన్నారు. కాలుష్య రహిత ప్రపంచానికి ప్రతిఒక్కరు కృషిచేయాలి శాస్త్రజ్ఞుల పిలుపు.