ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని అధికారికంగా ఖరారు చేస్తూ పార్లమెంట్ చట్ట సవరణకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో వైసీపీ నేతల వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు  మావిగన్'  ప్రతిపాదనను సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ, రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమరావతికి ప్రత్యామ్నాయంగా మావిగన్ అంటూ కొత్త ప్రతిపాదన చేశారు.  ఈ ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వస్తున్నప్పటికీ, ఈ ప్రతిపాదన చేసిన జగన్ నెట్టింట ఓ ట్రోలింగ్ మెటీరియల్ గా మారిపోయినప్పటకీ.. వైసీపీ సీనియర్ నాయకుడు, కోఆర్డినేటర్ సజ్జల, మాజీ మంత్రి  అంబటి రాంబాబు వంటి వారు మాత్రం మావిగన్ ను భుజాలకెత్తుకున్నారు.  వీరిలో అంబటి రాంబాబు ఒక అడుగు ముందుకు వేసి మావిగన్ కు రోజురోజుకూ ప్రజాదరణ పెరుగుతోందని చెప్పుకొచ్చారు.  అమరావతి నిర్మాణం అనేది ఎప్పటికీ పూర్తికాని ప్రక్రియ అని, అది ఒక కలగానే మిగిలిపోతుందని ఈ సందర్భంగా అంబటి వ్యాఖ్యానించారు.   పార్లమెంట్ లో బిల్లు పాస్ అయితే ఏమౌతుంది.. , భవిష్యత్తులో  మా ప్రభుత్వం వచ్చి మళ్లీ సవరణలు చేస్తుందంటూ తన వాచాలత్వాన్ని అంబటి ప్రదర్శించారు. అంబటి వ్యాఖ్యలపై ఒక రాజధాని అమరావతి ప్రాంతంలోనే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.  మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో  వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్  ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.   అమరావతి రాజధానిగా స్థిరపడిందని మెజారిటీ ప్రజలు భావిస్తుంటే,  వైసీపీ మాత్రం రోజుకో మాట, పూటకో ప్రతిపాదనతో  ప్రతిష్ఠను మరింత దిగజార్చుకుంటోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.   అమరావతికి వ్యతిరేకంగా ప్రజల వద్ద మాట్లాడడానికే ఇబ్బందిగా ఉందని క్యాడర్ ఓ వైపు నెత్తీనోరూ బాబుకుంటుంటే.. ఆ పార్టీ కోఆర్డినేటర్, జగన్ ప్రభుత్వ హయాంలో ముఖ్యసలహాదారు, సకలశాఖల మంత్రిగా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి మావిగన్ ప్రతిపాదన ప్రతి పల్లెకూ చేరేలా ప్రచారం చేయాలంటూ పిలుపునివ్వడం చూస్తుంటే   జనం నుంచి వ్యక్తమౌతున్నఆగ్రహం, క్యాడర్ వ్యతిరేకత వైసీపీయులు చూడకుండా పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతున్నచందంగా వ్యవహరిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. 
ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతే అంటూ ప్రవేశపెట్టిన బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపడంతో మంగళగిరిలోని తెలుగుదేశ పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ఘనంగా వేడుకలు జరిగాయి. ఆ వేడుకలకు హాజరైన ఆంధ్రప్రదేశ్ శాసన మండలి మాజీ చైర్మన్ ఎం.ఎ.షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లు సమయంలో జరిగిన పరిణామాలపై స్పందించారు. కెమెరాలు కట్ చేసి చోటు చేసుకున్న పరిణామాలపై ఆయన తొలిసారి పెదవి విప్పారు.  ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై  చెయ్యి చేసుకున్నారని  పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో  తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు. తన దగ్గర డబ్బు లేదు కాబట్టి బతుకుదెరువు చూపిస్తామని ప్రలోభ పెట్టారని, మండలినే రద్దు చేస్తామని బెదిరించారని నాటి వైసీపీ ఘాతులకాలను వివరించారు. అయినా తనకున్న అధికారంతో మూడు రాజధానుల బిల్లు ఆమోదించలేదని షరీఫ్ సగర్వంగా చెప్పారు. నమాజ్ చేసుకుని అల్లాని ప్రార్థించుకుని 'అల్లా సత్యం వైపు ఉండేటట్లుగా నా కళ్లు తెరువు' అని కోరారన్నారు. ఎన్ని ఒత్తిడిలు ఉన్నా.. బెదిరించినా ధర్మం వైపు నిలబడాలనే అల్లా మాటలకు ఆరోజు కట్టుబడి ఉన్నా. ఆ తర్వాతా తనన న్ను చైర్మన్ స్థానం నుంచి దింపేందుకు అనేక కుట్రలు చేశారని,  ఇప్పుడు అమరావతి రాజధానిగా చట్టం చేయడం ఆనందంగా ఉందని నాడు జరిగిన సంఘటనలు గుర్తు చేసుకున్నారు 
అమరావతిని వైసీపీ నాశనం చేయాలని చూస్తే.. తాము శాసనం చేసి నిలబెట్టామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు.    అమరావతికి   పార్లమెంట్ ఉభయ సభల్లోనూ అమరావతికి చట్టబద్ధత లభించడం ప్రజా విజయమన్నారు. అమరావతిలో శుక్రవారం (ఏప్రిల్ 3) మీడియాతో మాట్లాడిన చంద్రబాబు పార్లమెంటు ఉభయ సభల్లోనూ  35 మంది వరకు ఎంపీలు అమరావతికి మద్దతుగా మాట్లాడారన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు.  రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.  శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఆధారంగా గుంటూరు - విజయవాడ మధ్య రాజధాని ఉంటే బాగుంటుందని అందరూ అన్నారని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రం మధ్యలో ఉన్న ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు చెప్పారు. ఈ ప్రాంతానికి రాజకీయ, సాంస్కృతిక ప్రాధాన్యం ఉందన్నారు. సమృద్ధిగా నీరు, సారవంతమైన భూములు ఉన్నాయన్నారు. ఆనాడు అసెంబ్లీలో వైసీపీ కూడా రాజధానిని సమర్థించిందని... కనీసం 30 వేల ఎకరాలు ఉండాలని జగన్ చెప్పారని ఈ  సందర్భంగా గుర్తు చేశారు.  
ALSO ON TELUGUONE N E W S
  -నిన్న థియేటర్స్ లోకి ల్యాండ్  -టాక్ పర్లేదు  -మరి తొలి రోజు కలెక్షన్స్ విన్నర్ ఎవరు  శుక్రవారం శోభని అందివ్వడంలో తెలుగు సినిమా తమ హామీని మరవడం జరగని పని అంటు నిన్న సెల్యులాయిడ్ పై బైకర్(Biker),రాకాస(Rakasa)అడుగుపెట్టాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ ఫ్యాన్స్, మూవీ లవర్స్, ప్రేక్షకులతో సినీ మోములుని నింపుకొని  కళకళలాడుతున్నాయి. రెండు చిత్రాలకి పర్వాలేదనే టాక్ కూడా రావడంతో  సమ్మర్ తనని ఏం చెయ్యలేదనే ధీమాతో తెలుగు సినిమా ఉంది. మరి తొలి రోజు ఆ రెండు చిత్రాలు సాధించిన కలెక్షన్స్ ని చూద్దాం. ముందుగా బైకర్ కలెక్షన్స్  ని చూసుకుంటే తొలి రోజు 2 .41 కోట్ల రూపాయిలు సాధించినట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. నెట్ పరంగా చూసుకుంటే 2 .10 కోట్లు. తెలుగులో 1850 షోస్ ప్రదర్శించగా ఆక్యుపెన్స్ పరంగా ట్వంటీ పర్శంట్ అని తెలుస్తుంది. బైకర్ లో తమిళ వాసనలు ఉండటంతో అక్కడ కూడా రిలీజ్ చేయగా 183 షోస్ తో  5 లక్షలు దక్కించుకున్నట్టుగా టాక్ .మరి చిత్ర బృందం నుంచి కలెక్షన్స్ పై అధికార పోస్టర్ రిలీజ్ చెయ్యాల్సి ఉంది. తండ్రి, కొడుకు సెంటిమెంట్ కి బైక్  రేసింగ్ నేపధ్యాన్ని జోడించి తెరకెక్కించగా శర్వానంద్, రాజశేఖర్, మాళవిక నాయర్ కీలక రోల్స్ .అభిలాష్ రెడ్డి(Abhilash Reddy)దర్శకత్వంలో యువి క్రియేషన్స్ నిర్మించింది. also read: రష్మిక అంటే పేరు కాదు బ్రాండ్.. రాయలసీమ ఫీలింగ్ ఉందని అర్ధమవుతుంది మరి రాకాస ఫస్ట్ డే కలెక్షన్స్ చూసుకుంటే తొలి రోజు వరల్డ్ వైడ్ గా 4 కోట్ల రూపాయిల గ్రాస్ ని సాధించినట్టుగా తెలుస్తుంది. స్టార్స్ లేకుండా ఆ స్థాయి కలెక్షన్స్ ని సాధించడమంటే చిత్రానికి లభిస్తున్న అదరణని అర్ధం చేసుకోవచ్చు. హర్రర్ కామెడీ కావడంతో ఓవర్ సీస్ లో రిలీజ్ చేయగా మంచి టాక్ తో దూసుకుపోతుంది. మరి తొలి రోజు కలెక్షన్స్ పై మేకర్స్ అధికార పోస్టర్ రిలీజ్ చేస్తారేమో చూద్దాం.సంగీత్ శోభన్, నయన్ సారిక , గెటప్ శ్రీను ముఖ్యమైన క్యారెక్టర్స్ లో చేయగా నీహారిక కొణిదెల నిర్మించింది. మానస శర్మ(Manasa sharma)దర్శకురాలు.  
    -హిస్టరీ రిపీట్  -అరుదైన ఘనత రష్మిక ఖాతాలోకి  -విజయ్ చెప్తుంది ఏంటి చూస్తుంటే 2026 సంవత్సరం రష్మిక(Rashmika Mandanna),విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)కోసమే వచ్చిందనిపిస్తుంది. మరి సుదీర్ఘ కాలం నుంచి కొనసాగుతున్న తమ ప్రేమ బంధాన్ని ఈ ఏడాది ఫిబ్రవరిలో   వివాహ బంధంగా మార్చుకోవడం, ప్రధానమంత్రి మోదీని సైతం కలిసి ఆశీర్వాదం తీసుకోవడం, వివాహం చాలా గ్రాండ్ గా జరగడం, రిసెప్షన్ కి చిరంజీవి మొదలుకొని తెలుగు సినిమా మొత్తం తరలి రావడం జరిగింది. ఇప్పుడు మరో రెండు అరుదైన విషయాలు జరిగాయి. అవి విన్నాక  2026 ఆ ఇద్దరిదే అని మీరు కూడా అంటారు. మరి అవేంటో చూద్దాం రష్మిక మరికొన్ని రోజుల్లో అంటే మే 23 న జపాన్ క్యాప్టిల్ టోక్యోలో జరిగే అత్యంత ప్రతిష్టాత్మక 'క్రాంచి రోల్ యానిమే అవార్డ్స్' వేడుకలకి ప్రెజెంటర్ గా హాజరు కానుంది. అంటే సదరు అవార్డ్స్ రష్మిక స్పీచ్ తోనే గ్రాండ్ గా ప్రారంభమవుతాయి. 2024 లోనే ప్రెజెంటర్ గా వెళ్లి ఆ ఘనతని అందుకున్న తొలి ఇండియన్ సినీ సెలబ్రిటీ గా నిలిచింది. ఇప్పుడు రెండో సారి వెళ్తు అరుదైన ఘనతని తన ఖాతాలో ఉంచుకున్నట్లయింది. క్రాంచి రోల్ యానిమే అవార్డ్స్ విషయానికి వస్తే  జపాన్ లో తెరకెక్కిన ఆ దేశపు యానిమేటెడ్ మూవీస్, వెబ్ సిరీస్ కి చెందిన నటీనటులకి, సాంకేతిక నిపుణలకి క్రాంచి రోల్ యానిమే అవార్డ్స్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. also read: Ramayana: ఎవరు ఆ 10000 మంది.. ఇక వార్ స్టార్ట్ అయినట్టేనా ఇక విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి 'రణబలి'(Ranabhali)అనే మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తాజా షెడ్యూల్ రాయలసీమ ప్రాంతంలోని అనంతపురంలో పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అక్కడి అభిమానులు విజయ్, రష్మిక తో ర్యాలీ లాంటిది చేసారు. అనంతరం ఫ్యాన్స్ మీట్ లో విజయ్ మాట్లాడుతు రాయలసీమకి ఎప్పడొచ్చినా నా సొంత ఇంటికి వచ్చినట్టుగా ఉంటుంది. నా లోపల సీమ ఫీలింగ్ ఉందని విజయ్ చెప్పుకొచ్చాడు.     
  -రికార్డు వ్యూస్ తో దూసుకుపోతున్న రామాయణ టీజర్  -తాజాగా ఎన్నో విషయాలు బయటకి  -నితీష్ తివారి చెప్తున్న మాటలేంటి నిన్నరిలీజైన 'రామాయణ'(Ramayana)టీజర్ తో సాక్షాత్తు ఆ అయోధ్య రాముడే మన మందు నడయాడుతున్నాడా అనిపించింది. అంతలా రామాయణ టీజర్ ప్రతి ఒక్క రామభక్తుడిని తన్మయత్వంతో ముంచెత్తుతుందని చెప్పవచ్చు. పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్న వ్యూస్ నే ఒక ఉదాహరణ. అదే టైంలో రామాయణని ప్రపంచం మెచ్చేలా చేయడానికి ఎంత కష్టపడుతున్నారో కూడా టీజర్ ద్వారా అర్ధమవుతుంది.అది నిజమే అన్నట్టుగా   రీసెంట్ గా రామాయణ దర్శకుడు నితీష్ తివారి(Nitesh Tiwari)ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు ఇండియన్ సినీ ప్రేమికులని, రామ భక్తులని విశేషంగా ఆకరిస్తున్నాయి. ఆ మాటలేంటో చూద్దాం నితీష్ తివారి మాట్లాడుతు 'సెవన్ ఇయర్స్ నుంచి రామాయణ కోసం వర్క్ చేస్తున్నాను. టీజర్ తో ఇప్పుడు లభిస్తున్న ప్రేక్షకాదరణకి కష్టానికి తగిన ప్రతి ఫలం దక్కినట్లయింది . రామాయణ కోసం వరల్డ్ వైడ్ గా 10000 మంది వర్క్ చేస్తున్నారని తెలిపాడు. దీంతో రామాయణ ని ఎంత ప్రతిష్టాత్మకంగా, ప్రాణంగా తీసుకొని తెరకెక్కిస్తున్నారో అర్ధమవుతుంది. భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో నితీష్ తివారి ఒకరు. ఇప్పటికి హయ్యస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న మూవీగా రికార్డు పొరల్లో దాగి ఉన్న ఆమీర్ ఖాన్ దంగల్ కి నితీష్ తివారీనే దర్శకుడు, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కెరీర్ కి బ్రేక్ ఇచ్చిన 'ఛిచో రె' కూడా నితీష్ తివారిదే.  2023 లో వచ్చిన 'బవాల్' తర్వాత రామాయణతో వస్తున్నాడు. Also read: Undekhi: ఇండియాలో నిజంగా జరిగిన కథ.. ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగు థ్రిల్లర్  రాముడిగా రణబీర్ కపూర్(Ranbir Kapoor)సీతమ్మ తల్లిగా సాయిపల్లవి(sai Pallavi)చేస్తుండగా, యష్(yash)రావణుడిగా చేస్తున్నాడు. రెండు భాగాలుగా తెరెక్కుతున్న రామాయణ మొదటి భాగం ఏ ఏడాది దీపావళికి, రెండవ భాగం వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ కానున్నాయి. నమిత్ మల్హోత్రా ప్రొడ్యూసర్. బాక్స్ ఆఫీస్ వద్ద రామాయణ కలెక్షన్ల సునామీని సృష్టించడం ఖాయమనే నమ్మకం అందరిలో ఉంది.      
    -థ్రిల్లర్ చిత్రాలంటే ఇష్టమా -అయితే ఏ మాత్రం మిస్ అవ్వకండి -వెంటనే చూసెయ్యండి థ్రిల్లర్ కధాంశంతో తెరకెక్కిన చిత్రాలు  చూస్తుంటే వచ్చే మజానే వేరు. అలాంటిది వాస్తవిక సంఘటనలతో కూడిన థ్రిల్లర్ అయితే ఉన్న పళంగా అన్ని పనులు మానుకొని సదరు మూవీ ముందు వాలిపోతాం. పై పెచ్చు సదరు చిత్రం ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంటే ఎవరితో మాట్లాకుండా సైలెంట్ గా గదిలోకి వెళ్లి మూవీలో లీనమవుతాం. ఇప్పుడు నేను చెప్పబోయే థ్రిల్లర్ మూవీ మీ చేత ఆ పనే చేయించబోతుంది. రెడీగా ఉండండి మరి. 2016లో పంజాబ్ లోని బటిండాలో పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తున్న అమ్మాయిని ఒక వ్యక్తి తుపాకీతో కాల్చి చంపాడు. అప్పట్లో ఈ విషయం ఎంతగానో సంచలనం సృష్టించడంతో పాటు యావత్ దేశాన్ని కుదిపేసింది. ఈ ఘటనకి కొంత కల్పిత కథని జోడించి నిర్మించిన చిత్రమే 'అన్ దేఖి'(Undekhi). ప్రతి ఎపిసోడ్ థ్రిల్లింగ్ గా సాగడంతో పాటు హత్య చుట్టూ అల్లుకున్న కథనం మిమ్మల్ని ఆద్యంతం పిచ్చెక్కిస్తుంది. మొత్తం మూడు సీజన్స్ గా రూపొందగా మూడు సీజన్లు ఇదే విధంగా ఉంటాయి. ఫస్ట్ సీజన్ నుంచి చివరి సీజన్ వరకు ప్రతి ఎపిసోడ్ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాగా హత్యల చుట్టూ సాగుతుంది.  సీజన్ 1 పశ్చిమ బెంగాల్‌లోని సుందరబన్స్ అడవుల్లో మొదలవుతుంది. ఆ తర్వాత మనాలీలో అత్వాల్ కుటుంబంలో జరిగే పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేసే ఇద్దరు అమ్మాయిలలో ఒకమ్మాయిని చూస్తుండగానే కాల్చి చంపేస్తాడు.ఈ ఘటన మొత్తాన్ని  పెళ్లి వేడుకని షూట్ చేస్తున్న ఇద్దరు కుర్రాళ్లు తమ కెమెరాలో షూట్ చేస్తారు. అక్కడి నుంచి సీజన్ 1 ముగుస్తుంది.  Also read: Virosh: ఇప్పుడు మేము ముగ్గురం కాబోతున్నాం.. రష్మిక పోస్ట్ తో ఫ్యాన్స్ హ్యాపీ  సీజన్ 2 సైతం హత్యలు, దర్యాప్తు చుట్టూ సాగుతుంది. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా.. అత్వాల్ కుటుంబ సభ్యుల నేర చరిత్ర గురించి చెప్తుంది.  ఇక సీజన్ 3  గతాన్ని వెంటాడే దెయ్యాలు అట్వాల్ కుటుంబాన్ని వేధించడానికి తిరిగి వచ్చినప్పుడు,కుటుంబ సామ్రాజ్యం కోసం పాపాజీ వేసిన ప్రణాళికలకి  అడ్డంకిగా మారుతుంది. ఆ ముప్పుని  ఎదుర్కొని అట్వాల్ కుటుంబం ఐక్యంగా నిలబడగలదా, లేక ప్రతీకారానికి బలైపోతుందా? అనేది ఎంతో థ్రిల్లింగ్ గా ఉంటుంది. దిబ్యేందు భట్టాచార్య, హర్ష్ ఛాయా, సూర్య శర్మ, అంకుర్ రథీ, ఐన్ జోయా, ఆంచల్ సింగ్, శివాంగి సింగ్ మరియు వరుణ్ బడోలా ముఖ్యమైన క్యారెక్టర్స్ ని పోషించారు. ఆర్.శుక్లా(R. Shukla)దర్శకత్వం వహించగా ఓటీటీ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. IMDBలో ఉన్న 7.9 రేటింగ్ నే అన్ దేఖి చరిష్మాకి ఉదాహరణ. తెలుగులో కూడా అందుబాటులో ఉంది      
  -ఫిబ్రవరి 26 న ఒక్కట్టైన రష్మిక, విజయ్  -రీసెంట్ గా ఇనిస్టాలో గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక  -ముగ్గురు కాబోతున్నాం అంటూ వెల్లడి     స్టార్ హీరోయిన్ రష్మిక(Rashmika),విజయ్ దేవరకొండ(Vijay deverakonda)వివాహం మొన్న ఫిబ్రవరి 26 న గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. వివాహం చేసుకొని ఆ ఇద్దరు ఎంత ఆనందంగా ఉంటారో అంతకంటే ఎక్కువ పది రేట్లు ఆనందంగా వారివురి అభిమానులు ఉంటారు. ఎందుకంటే విజయ్, రష్మిక ప్రేమ పక్షులుగా ఉన్నన్ని రోజులు ఆ ఇద్దరి గురించి పలు రకాల  గాసిప్స్ వచ్చాయి. అవన్నీ వింటు అభిమానులు ఎంతో బాధపడుతు వస్తున్నారు. అలాంటిది ఆ ఇద్దరు పెళ్లి చేసుకోవడంతో వాళ్లంతా ఇప్పుడు ఎంతో హ్యాపీగా ఉన్నారు. రీసెంట్ గా రష్మిక చేసిన పోస్ట్ తో వాళ్ళల్లో మరింత నూతనోత్సాహం వచ్చినట్లయింది. ఆ పోస్ట్ ఏంటో చూద్దాం. రష్మిక మందన్న తన ఇనిస్టాగ్రమ్ లో ఇప్పుడు మేము ముగ్గురయ్యామంటూ ఒక వీడియో క్లిప్ షేర్ చేసింది. సదరు వీడియోలో రష్మిక, విజయదేవరకొండలా ఉన్న కార్టూన్ బొమ్మలు ఉండగా రష్మిక టీ షర్ట్ పై గుడ్డు ఫోటో ఉంది. ఒక పొద్దు తిరుగుడు పువ్వు ని కూడా పక్కన ఉంచారు. దీంతో రష్మిక తల్లి కాబోతుందా అనే కామెంట్స్ తో ఇనిస్టాగ్రమ్ క్రాక్ అయ్యే పరిస్థితి. Also read: Bandla Ganesh: బండ్ల గణేష్ కూతురి పెళ్లి.. అల్లుడు సూర్యతేజ బ్యాక్ గ్రౌండ్ ఏంటి అసలు విషయం ఏంటంటే రష్మిక కి ఇన్ స్టాగ్రామ్ లో మరో అకౌంట్ ఉంది. పేరు rashmikaru .అందులో పొద్దుతిరుగుడు పువ్వుకి సంబంధించిన కథలని,యానిమేటెడ్ స్టోరీస్ ని ఉంచుతుంది. ఇప్పుడు ఆ యానిమేషన్ ప్రపంచంలోకి విజయ్ ని ఆహ్వానిస్తూ సదరు పోస్ట్ చేసింది. ఇదే అసలు నిజం.    
నటీనటులు: సంగీత్ శోభన్, నయన్ సారిక, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ తదితరులు సినిమాటోగ్రఫీ: ఎడురోలు రాజు ఎడిటింగ్: అన్వర్ అలీ సంగీతం: అనుదీప్ దేవ్ నిర్మాతలు: నిహారిక కొణిదెల, ఉమేష్‌కుమార్ బన్సాల్ బ్యానర్స్: పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సమర్పణ: జీ స్టూడియోస్ రచన, దర్శకత్వం: మానసశర్మ విడుదల తేదీ: 03.04.2026 సినిమా నిడివి: 133 నిమిషాలు ఒక సినిమాను నిర్మించడం కంటే దాన్ని ప్రమోషన్స్ ద్వారా జనంలోకి తీసుకెళ్లడమే ప్రస్తుత మార్కెట్ ట్రెండ్. సినిమా ఎలా ఉన్నా, దానికి హైప్ తీసుకొచ్చి ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడమే స్ట్రాట‌జీ. దాన్నే ఫాలో అయింది ‘రాకాస’ చిత్ర యూనిట్. అన్ని మాధ్యమాల్లో సినిమా గురించి ప్ర‌మోట్ చేసి ఏప్రిల్ 3న ‘రాకాస’ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొచ్చారు. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ వంటి సినిమాల‌తో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సంగీత్ శోభన్ హీరోగా లేడీ డైరెక్టర్ మానసశర్మ రూపొందించిన ఈ సినిమాకి నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరించడం విశేషం. హారర్ కామెడీగా ప్రమోషన్స్‌లో ప్రొజెక్ట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏమేర ఆకట్టుకుంది అనేది తెలుసుకుందాం. కథ:  ఇది 1000 క్రితం మొదలైన కథ. రాజుల కాలం నుంచి ఆ ఊరి చివర కోటలో ఉన్న భీకర బ్రహ్మరాక్షసుడికి నరబలి ఇవ్వ‌డం అనేది ఆచారంగా వస్తూ ఉంటుంది. కోటలో ఉన్న రాక్షసుడి నుంచి హెచ్చరికలు వచ్చిన ప్రతిసారీ ఓ నిండు ప్రాణాన్ని బలిగా పంపిస్తుంటారు. బలి ఇవ్వకపోతే ఊరు మొత్తం నాశనం అయిపోతుందనే మూడనమ్మకంతో హెచ్చరికలు వచ్చిన ప్రతిసారి బలి అర్పిస్తుంటారు. ఆ కోటలో నిజంగానే రాక్షసుడు ఉన్నాడనే భయంతో ఎవరూ ఆ కోట వైపు వెళ్లరు. వెయ్యేళ్ల తరువాత 2026లో ఆ ఊరివాడైన వీరబాబు (సంగీత్ శోభన్) అమెరికా నుంచి వస్తాడు. రకరకాల మలుపుల తర్వాత రాక్ష‌సుడికి బలిగా వెళ్లేందుకు సిద్ధపడతాడు వీరబాబు. కోటలోకి వెళ్లిన వీరబాబు బయటికి వచ్చే అవకాశం ఉండదు. అదే కోటలో వెన్నెల కిషోర్ కొన్నిరోజులుగా ఉంటూ ఉంటాడు. వీరబాబును వెతుక్కుంటూ హీరోయిన్, గెటప్ శ్రీను కూడా కోటలోకి వెళతారు. కానీ, బయటికి వచ్చే అవకాశం లేదు. రాక్షసుడ్ని చంపితేనే అక్కడి నుంచి వారంతా బయట పడగలరు. మరి వీరబాబు ఏం చేశాడు? చివరికి రాక్షసుడు హతమయ్యాడా? వీరబాబు బృందం బయటపడిందా.. అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.  విశ్లేషణ: ఓపెనింగ్ సీన్ చూస్తే సినిమాలో చాలా పెద్ద స్టఫ్ ఉంది అనిపిస్తుంది. 1000 ఏళ్ళ క్రితం కథతో మొదలై 2026లో హీరో ఎంటర్ కావడంతో పంచ్ డైలాగులతో కూడిన కామెడీ సినిమాగా మారిపోతుంది. అయితే ఇది హారర్ కామెడీ సినిమా అని గుర్తు చెయ్యడానికి అన్నట్టుగా కోట, రాక్షసుడికి సంబంధించిన ఏదో ఒక అంశాన్ని మధ్య మధ్య చూపిస్తుంటారు. ఏదో చందమామ కథని చూస్తున్న ఫీల్ కలిగించి, వీరబాబులోని ఫన్ ఎలిమెంట్స్‌ని వాడుకుంటూ కథని బాగా నడిపించారు దర్శకురాలు మానస. కథలో, కథనంలో ఎన్నో లోపాలు ఉన్నప్పటికీ సినిమాని ఎంటర్‌టైనింగ్‌గా నడపడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. సంగీత్ శోభన్, గెటప్ శ్రీను, వెన్నెల కిశోర్‌ల కామెడీ చాలా చోట్ల నవ్వించింది. ఎంతో బిల్డప్‌తో స్టార్ట్ అయిన సినిమా ఆ తర్వాత కామెడీ వైపు టర్న్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీపైనే నడుస్తుంది. సెకండాఫ్‌లో అసలు కథలోకి వెళ్తుంది. ఇక క్లయిమాక్స్‌లో చిన్న‌పాటి ట్విస్ట్‌తో, సెకండ్ పార్ట్ లీడ్‌తో సుఖాంత‌మ‌వుతుంది. అలాగే క్లయిమాక్స్‌లో వచ్చే ప్రమోషనల్ సాంగ్ కూడా బాగుంది.  నటీనటులు: సినిమాకి మెయిన్ ఎస్సెట్‌గా హీరో సంగీత్ శోభన్‌ని చెప్ప్పుకోవాలి. చక్కని టైమింగ్‌లో పంచ్ డైలాగులు కొడుతూ ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేశారు. అతనికితోడు గెటప్ శ్రీను, వెన్నెల కిశోర్‌ల కామెడీ కూడా బాగుంది. హీరోయిన్ నయన్ సారిక తన లుక్‌తో, అవసరమైన చోట పెర్‌ఫార్మ్ చేస్తూ ఆకట్టుకుంది. తనికెళ్ళ భరణి, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మాజీ వంటి నటులు తమ తమ క్యారెక్టర్లకు న్యాయం చేశారు.  సాంకేతిక నిపుణులు: టెక్నికల్‌గా ఈ సినిమా గురించి చెప్ప్పుకోవాలంటే ఎడురోలు రాజు సినిమాటోగ్రఫీ బాగుంది. అలాగే అన్వర్ అలీ ఎడిటింగ్ కూడా గ్రిప్పింగ్‌గా బాగానే ఉంది. సినిమా నిడివి 2 గంటల 13 నిమిషాలుగా ఉండడం విశేషం. అనుదీప్ దేవ్ సంగీతం ఫర్వాలేదు అనిపించింది. ఇక గ్రాఫిక్స్ విషయంలో కూడా మంచి కేర్ తీసుకున్నట్టు కనిపించింది. ముఖ్యంగా కొన్ని సీన్స్‌ను బాగా డిజైన్ చేసుకున్నారు. డైరెక్టర్ మానసశర్మ గురించి చెప్పాలంటే.. కాస్త క్లిష్టంగా ఉన్న సబ్జెక్ట్‌ని డీల్ చెయ్యడంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి. అక్కడక్కడా కనిపించే కొన్ని మైనస్‌లు తప్ప డైరెక్టర్‌గా ఓకే అనిపించుకున్నారు. ప్రొడక్షన్ వేల్యూస్ గురించి చెప్పాల్సి వస్తే.. ఖర్చుకు వెనుకాడకుండా అవసరమైన మేరకు రాజీ పడకుండా సినిమాను నిర్మించారని ఔట్‌పుట్ చూస్తే అర్థమవుతుంది. ఈ విషయంలో నిర్మాత నిహారిక కొణిదెలను అప్రిషియేట్ చెయ్యాలి.   ప్లస్ పాయింట్స్: సంగీత్ శోభన్ పెర్‌ఫార్మెన్స్ పంచ్ డైలాగ్స్ కొంత వరకు గ్రాఫిక్స్ పిల్లల్ని ఆకట్టుకునే అంశాలు ప్రమోషనల్ సాంగ్ మైనస్ పాయింట్స్: కథ, కథనాల్లో కేర్ తీసుకుంటే బాగుండేది ప్రధాన ఇతివత్తంలోనే లోపాలు ఫైనల్‌గా చెప్పాలంటే.. థియేటర్‌లోకి వెళ్లిన ప్రేక్ష‌కులు మంచి ఎంటర్‌టైన్‌మెంట్, పిల్లల్ని ఆకట్టుకునే కొన్ని అంశాలతో శాటిస్‌ఫై అవుతారు.  రేటింగ్: 2.5/5 - జి.హరా   Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
-కూతురి పెళ్లిని అధికారకంగా వెల్లడి చేసిన బండ్ల గణేష్  -ఎక్స్ వేదికగా డీటెయిల్స్  -పిక్స్ వైరల్  'బండ్ల గణేష్'(Bandla Ganesh)అనే పేరు ఎత్తి ఆయన హిస్టరీ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తే నీ దగ్గర లేనంత సినీ హిస్టరీ మా దగ్గర ఉందని అభిమానులతో పాటు ప్రేక్షకులు, నెటిజన్స్ చెప్పే పరిస్థితి. అంత అదృష్టాన్ని సంపాదించుకున్న బండ్ల గణేష్ ఇంట శుభముహుర్తానికి శుభ గడియలు దగ్గర పడ్డాయి. ఆ వివరాలేంటో చూద్దాం.  బండ్ల గణేష్ ఎక్స్ క్లూజివ్ గా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు దేవుడి ఆశీస్సులు, పెద్దల దీవెనలతో మా ఇంట్లో త్వరలోనే శుభకార్యం జరగబోతుంది. చిరంజీవి సూర్య తేజ చిలుకూరి, చిరంజీవి లక్ష్మి సౌభాగ్య వతి జనని వివాహం సందర్భంగా పసుపు, కుంకుమ కార్యక్రమం నిర్వహించామని ఎక్స్ సాక్షిగా తెలిపాడు. ఈ రోజు పదకొండు గంటల తొమ్మిది నిమిషాలకి ట్వీట్ చేయడంతో  మరి ఈ లెక్కన నిన్న సదరు పసుపు కుంకుమ కార్యక్రమం జరిగి ఉంటుంది. కూతురు, అల్లుడు ఫోటోలు కూడా షేర్ చెయ్యడంతో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్స్ కాబోయే వధూవరులకి విషెస్ చెప్తున్నారు. Also Read: Sreeleela: శ్రీలీల లేటెస్ట్ కామెంట్స్ వైరల్.. ఒత్తిడిలోనే అదంతా     మరి బండ్ల గణేష్ ప్రధానంగా సినిమా ప్రాపర్టీ కాబట్టి బండ్ల గణేష్ కాబోయే అల్లుడు ఎవరనే ఆసక్తి నిమిష నిమిషానికి టన్నుల లెక్కన పెరిగేలా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించి బండ్ల గణేష్ నే పూర్తి డిటైల్ చెప్పాలని ఫ్యాన్స్, నెటిజన్స్ కోరుతున్నారు.      
  -ఉస్తాద్ కి జోడీ కట్టి అలరించిన శ్రీలీల  -లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడి  -దీంతో ఫ్యాన్స్ తో పాటు అందరకి క్లారిటీ వచ్చింది.  ఎవరు ఎలా పోతే నాకేంటి అనుకునే బ్యాచ్ సినీ అభిమానులని, సినీ ప్రియుల్నిచూసి ఎప్పుడు కడుపు మంటతో రగిలిపోతుంటుంది. ఎందుకంటే ఎవరు ఎలా పోతే నాకేంటి అనే సూత్రానికి విరుద్ధంగా వాళ్ళు మాత్రం తాము అభిమానించే సినీ పర్సనాలిటీ గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి. మరి వాళ్ళ ఆలోచనల్లో శ్రీలీల(Sreeleela)కూడా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒక వైపు సినిమాలు చేస్తూనే రెండో వైపు డాక్టర్ ఫినిష్ చేసింది కదా. ఎన్నో ఒత్తిడులు, టెన్షన్స్ ని తట్టుకొని ఎలా సాధించిందనేది వాళ్ళ ఆలోచన. ఈ విషయంలో రీసెంట్ గా శ్రీలీల తన సీక్రెట్ బయటపెట్టింది. ఏం చెప్పిందో చూద్దాం. రీసెంట్ గా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు క్యారక్టర్ లో ఎంత లీనమైపోతామో అందులో నుంచి బయటకి రావడం కూడా చాలా ముఖ్యం. దీంతో ఒత్తిడి నుంచి బయటపడటానికి మ్యూజిక్ వినడం, కుటుంబసభ్యులతో వీడియో కాల్ మాట్లాడటం, ఒంటరిగా కాసేపు గడపటం, ఫ్రెండ్స్ తో చిట్ చాట్ చేయడం లాంటివి చేస్తాను. దాంతో నాకు ఉపశమనం లభిస్తుంది. ఒక వేళ పని ఒత్తిడిని ఇంటికి తీసుకెళ్తున్నానని అనిపించినా వెంటనే మరోసారి పైన చెప్పిన అలవాట్లనే మళ్ళీ చేస్తానని చెపుకొచ్చింది. మరి ఆ సిస్టం ఫాలో అయ్యింది కాబట్టే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలు చేస్తూనే డాక్టర్ కోర్స్  పూర్తి చేసిందని ఫ్యాన్స్ కి క్లియర్ గా అర్థమైంది. Also read: Rahul Ramakrishna: ఎంఎల్ఏకి రాహుల్ రామకృష్ణ కౌంటర్.. డ్రగ్ టెస్ట్, లైడిటెక్టర్‌ టెస్ట్  రీసెంట్ గా పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)వన్ మాన్ షో 'ఉస్తాద్ భగత్ సింగ్'(USttad Bhagath Singh)లో  ఆర్ జె లీలగా శ్రీలీల మరోసారి మెచ్యూర్డ్ పెర్ఫార్మ్ ప్రదర్శించి పవన్ ని ప్రేమలోకి దించిన  విషయం తెలిసిందే.   
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
గుడ్ ఫ్రైడే క్రైస్తవ మతంలో అత్యంత పవిత్రమైన,  భావోద్వేగభరితమైన రోజు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రైస్తవులు యేసు క్రీస్తు శిలువపై మరణించిన సంఘటనను స్మరించుకుంటారు. ఇది సాధారణ పండుగలా ఆనందంతో జరుపుకునే రోజు కాదు..  దీని వెనుక ఉన్న భావం ఎంతో గంభీరమైనది,  ఆధ్యాత్మికతతో నిండినది. యేసు ప్రభువు త్యాగాన్ని ప్రతిబింబించేది.. గుడ్ ఫ్రైడే గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. యేసు క్రీస్తు తన బోధనల ద్వారా ప్రేమ, క్షమ, దయ వంటి విలువలను ప్రపంచానికి పరిచయం చేశారు. ఆయన చెప్పిన మార్గం సహనం, పరస్పర గౌరవంతో కూడుకుని ఉంది. అయితే ఆయన బోధనలు అప్పటి కొందరు అధికారులకు నచ్చకపోవడంతో ఆయనను శిక్షించడానికి కుట్రలు పన్నారు. చివరకు ఆయనను శిలువపై వేయడం ద్వారా మరణశిక్ష అమలు చేశారు. గుడ్ ఫ్రైడే రోజు యేసు క్రీస్తు తన జీవితాన్ని త్యాగం చేసి, మానవాళి పాపాల విమోచన కోసం తనను తాను అర్పించుకున్నారని క్రైస్తవులు విశ్వసిస్తారు. ప్రేమకు, క్షమకు ఉన్న అపారమైన శక్తిని  ఈ త్యాగం ద్వారా యేసు ప్రభువు ప్రపంచానికి చాటి చెప్పాడని అంటారు. తనను బాధించిన వారిని కూడా క్షమించగలిగిన హృదయం ఉండాలని.. ఈ  గొప్ప సందేశాన్ని ఆయన తానే ఒక ఉదాహరణగా మారి ప్రజలకు, ప్రపంచానికి అందించారు. గుడ్ ఫ్రైడే ను గుర్తు చేసుకునే విధానం కూడా ఎంతో ప్రత్యేకమైనది. గుడ్ ఫ్రైడే రోజు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు, యేసు ప్రభువు శిలువ అయిన విధానాన్ని స్మరించుకుంటారు,  చాలా మంది ఉపవాసం పాటిస్తారు. ఇది ఆత్మపరిశీలనకు, ప్రతి ఒక్కరూ తమ  తప్పులను గుర్తించి మార్పు చెందడానికి  అవకాశం కల్పిస్తుంది. గుడ్ ఫ్రైడే ప్రతి ఒక్కరికి  ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది.. నిజమైన ప్రేమ అనేది త్యాగంతో కూడుకున్నదని,  క్షమించగలిగే మనసు మనిషిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని నేర్పుతుంది.  ప్రతి ఒక్కరు తమ  జీవితాల్లో కూడా ఇతరులను ప్రేమించడం, సహాయం చేయడం, క్షమించడం వంటి విలువలను అలవాటు చేసుకోవాలని గుడ్ ఫ్రైడే అందరికీ గుర్తు చేస్తుంది. గుడ్ ఫ్రైడే రోజు యేసు ప్రభువును శిలువ వేసిన కారణంగా.. ఈ రోజు ప్రతి క్రైస్తవ సోదరుడు, సోదరి..  ఎంతో భావోద్వేగంగా యేసును స్మరించుకుంటారు.  గుడ్ ఫ్రైడే అనేది ఒక విషాద దినం మాత్రమే కాదు,  ఇది మానవత్వాన్ని, దయను,  నిస్వార్థ త్యాగాన్ని ప్రతిబింబించే ఒక పవిత్రమైన రోజు. మనసును శుద్ది చేసుకుని,  ప్రతి ఒక్కరూ మంచి మార్గం వైపు నడిచేందుకు గుడ్ ఫ్రైడే ఒక మార్గం చూపిస్తుంది.                                 *రూపశ్రీ.
పిల్లలను సరిగ్గా పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. ఒక చిన్న పొరపాటు కూడా పిల్లల జీవితాన్ని నాశనం చేయగలదు. సరైన పెంపకం పిల్లలను విజయ శిఖరాలకు చేరుస్తుంది అనడంలో  ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఆడపిల్లలను  పెంచేటప్పుడు, తల్లిదండ్రులు కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. తల్లిదండ్రులు చేసే కొన్ని తప్పులు ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తాయి.  ఆడపిల్లలను పెంచే తల్లిదండ్రులు చేయకూడని తప్పులేంటి? ఆడపిల్లను పెంచేటప్పుడు తల్లిదండ్రులు దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయాలు ఏంటి? ఆచార్య చాణక్యుడు దీని గురించి ఏం చెప్పాడు? తెలుసుకుంటే.. ఆంక్షలు, పరిమితులు.. ఆడపిల్ల అంటే  కుటుంబానికి పరువుగా  భావిస్తారు. అందువల్ల తల్లిదండ్రులు తరచుగా  ఆడపిల్లల  కలలను అల్పమైనవిగా భావించి, వాటిపై ఆంక్షలు విధిస్తుంటారు. చాణక్య నీతి ప్రకారం ఆడపిల్లల  కలలను ఎన్నడూ పరిమితం చేయకూడదు. ఆమె చదువును, వృత్తిని నిర్లక్ష్యం చేయకూడదు. ఆడపిల్ల  అభివృద్ధి చెందడానికి ప్రతి అవకాశమూ కల్పించాలి. ఆడపిల్ల చదువులో,  వృత్తిలో ఎదిగే ఇంటికి అంతులేని గౌరవ మర్యాదలు లభిస్తాయి. స్వేచ్ఛ.. అతిగా స్వేచ్ఛ ఇవ్వడం ఎవరికీ మంచిది కాదు. అలాగే, ప్రతి విషయంలోనూ అతిగా జోక్యం చేసుకోవడం కూడా మంచిది కాదు. నిరంతరం ఆంక్షలు విధించడం మంచి ఆలోచన కాదు. అలా చేయడం ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. కొడుకు అయినా, కూతురు అయినా, వారి సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను ఇవ్వాలి. కొడుకుకు అయితే అన్నీ తెలుసు వారికి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు అనుకోవడం,  కూతురుకు ఏమీ తెలియదు అని ఏ విషయాన్ని ఆమె ఆలోచించకుండా,  ఆమె నిర్ణయించుకోకుండా చెయ్యడం మంచిది కాదు. వివాహం పట్ల అబిప్రాయం.. నేటి సమాజం మారుతున్నప్పటికీ, కొందరు అమ్మాయిలు మాత్రమే  పెళ్లి విషయంలో తమ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొంతమంది తండ్రులు ఇప్పటికీ తమ కూతుళ్ల పెళ్లి విషయమై వారి అభిప్రాయం తెలుసుకోరు. నేటికీ కూతుళ్లకు బలవంతంగా పెళ్లిళ్లు చేస్తున్న తల్లిదండ్రులు ఉంటున్నారు.  సమాజపు ఒత్తిడికి లొంగి కూతురికి పెళ్లి చేయడం లేదా అనారోగ్యకరమైన బంధంలోనే ఉండమని ఒత్తిడి చేయడం మంచిది కాదు. పెంపకం.. కూతుళ్ల పెంపకం రెండు విధాలుగా ఉంటుంది.  కొందరు ఆడపిల్లను ప్రేమగా పెంచుతారు.  అలాంటి వారు కూతుళ్లతో ప్రేమగా, స్నేహంగా అన్ని విషయాలు ఓపెన్ గా మాట్లాడేలా పెంచుతారు. కానీ కొందరు భయం గుప్పెట్లో పెంచుతారు. ఇలాంటి పెంపకంలో ఆడపిల్లలు తల్లిదండ్రుల దగ్గర, పెద్ద వారి దగ్గర,  సమాజంలోని వ్యక్తుల దగ్గర కూడా నోరు విప్పాలంటే భయపడుతుంది. దీని వల్ల ఆడపిల్ల తనను తాను కోల్పోతుంది.                                    *రూపశ్రీ.
నేటి డిజిటల్ ప్రపంచంలో, పిల్లలకు, ముఖ్యంగా టీనేజర్లకు చదువుకునేటప్పుడు ఏకాగ్రత పెట్టడం చాలా కష్టంగా మారుతోంది. స్మార్ట్‌ఫోన్‌లు, గేమ్‌లు, సోషల్ మీడియా,  మరెన్నో విషయాలు వారి చదువుకు చాలా  ఆటంకం కలిగిస్తాయి. అందువల్ల ఏ విధమైన ఆటంకం లేకుండా, శ్రద్దగా  చదువుకోవాలంటే వారికి జ్ఞాపకశక్తి కూడా మెరుగ్గా ఉండాలి. ముఖ్యంగా  స్టడీ టేబుల్‌పై వారి ఏకాగ్రతను దెబ్బతీసే వస్తువులు ఉంటే, వారు ఎంత కష్టపడి చదివినా  ఏకాగ్రత తక్కువగానే ఉంటుంది. ఎంత ప్రయత్నించినా చదువు మీద దృష్టి పెట్టలేరు. ఇంట్లో టీనేజ్ పిల్లలు ఉంటే వారు చదువుకునే ప్రదేశంలో లేదా స్టడీ టేబుల్‌పై ఉంచకూడని ఐదు వస్తువులు ఉన్నాయి. అవేంటో.. వాటిని ఎందుకు చదువుకొనేటప్పుడు పిల్లలకు దగ్గరగా ఉంచకూడదో తెలుసుకుంటే.. మొబైల్ ఫోన్.. ఈ రోజుల్లో మొబైల్ ఫోన్లు పిల్లల ఏకాగ్రతను బాగా దెబ్బతీస్తున్నాయి. సోషల్ మీడియా నోటిఫికేషన్లు, మెసేజ్‌లు, గేమ్స్, వీడియోలు పిల్లల ఏకాగ్రతను దెబ్బతీస్తున్నాయి. ఫోన్‌ను టేబుల్‌పై దూరంగా ఉంచినప్పటికీ, పిల్లల మనసు పదే పదే  నోటిఫికేషన్ల కోసం చూస్తూ ఉంటుంది. దీనివల్ల వారి చదువుపై ఏకాగ్రత తగ్గుతుంది. అందువల్ల, చదువుకునే సమయంలో మొబైల్ ఫోన్‌ను వేరే చోట ఉంచాలి.  మరీ ముఖ్యంగా నేటికాలంలో టీనేజ్ పిల్లలకు కూడా సపరేట్ గా ఫోన్ లు కొనివ్వడం పెద్దలు చేస్తున్న తప్పు.  చిన్నతనం నుండే పిల్లలకు ఫోన్ విషయంలో మంచి క్రమశిక్షణ పెట్టడం చాలా ముఖ్యం. ఇలా చేస్తే పిల్లల మనసు చదువుపైన దృష్టి పెట్టేందుకు సహాయపడుతుంది. స్నాక్స్.. చదువుకునే బల్లపై లేదా చదువుకునే ప్రదేశంలో  చిప్స్, చాక్లెట్, శీతల పానీయాలు వంటివి ఉంచడం కూడా మంచిది కాదు. పిల్లలు చదువుకునేటప్పుడు తినేస్తుంటారు, దీనివల్ల వారి ఏకాగ్రతకు భంగం కలుగుుతంది. జంగ్  ఫుడ్ వల్ల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి.  పిల్లల ఏకాగ్రత దెబ్బతింటుంది. దానికి బదులుగా, పిల్లలను చురుకుగా, ఏకాగ్రతతో ఉంచడానికి బల్ల దగ్గర పండ్లు, నీళ్లు వంటి ఆరోగ్యకరమైన పదార్థాలను ఉంచాలి. ఆరోగ్యకరమైన స్నాక్స్, ఒక గ్లాసు నీటిని ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోండి. స్టేషనరీ.. పిల్లలు తరచుగా పెన్నులు, పెన్సిళ్లు, మార్కర్లు , పోస్ట్-ఇట్ నోట్లను  బల్లలపై వదిలేస్తుంటారు. దీనివల్ల స్టడీ టేబుల్ చిందరవందరగా, అస్తవ్యస్తంగా తయారవుతుంది.  ఈ మానసిక గందరగోళం ఏకాగ్రతను కోల్పోయేలా చేస్తుంది. అందువల్ల, బల్లపై కేవలం అత్యవసరమైన పుస్తకాలు, పెన్నులు, నోట్‌బుక్‌లను మాత్రమే ఉంచాలి. ఇతర స్టేషనరీని అల్మరాలో లేదా డ్రాయర్‌లో భద్రపరచాలి. గేమింగ్ పరికరాలు.. టేబుల్‌పై గేమింగ్ కన్సోల్, హ్యాండ్‌హెల్డ్ గేమింగ్ పరికరం లేదా కంట్రోలర్‌ను ఉంచడం వల్ల పిల్లల చదువుకు ఆటంకం కలుగుతుంది. గేమింగ్ పరికరాన్ని చూడగానే పిల్లలకు ఆడాలనే కోరిక కలిగే అవకాశం ఎక్కువ.  దీనివల్ల చదువుకునే సమయం తగ్గి, వారి ఏకాగ్రతకు భంగం కలుగుతుంది. గేమింగ్ పరికరాలను వేరే గదిలో లేదా అల్మరాలో ఉంచాలి. కోట్స్.. గెలుపుకు బోలెడు మార్గాలు ఉంటాయి. కొందరు భయంతో గెలవాలని ప్రయత్నం చేస్తారు. చాలామంది పిల్లలకు బాగా చదువుకుని మార్కులు బాగ తెచ్చుకోవాలని ఉన్నా,  ఏదో బలహీనత వారిని వెనక్కు లాగుతూ ఉంటుంది.  ఈ కారణంగా భయంతో చదువు వైపు ఏకాగ్రత పెట్టడానికి కొన్ని కోట్స్ రాసిన స్టిక్కర్స్ పెట్టుకుంటారు.  కానీ భయంతో చదివే చదువుకంటే.. ఇష్టంతో చదివే చదువు చాలా బాగా గుర్తుంటుంది.  అందుకే చదువుకోవడాన్ని ప్రేరేపించే విదంగా ఉండే కోట్స్ ను స్టడీ టేబుల్ లేదా చదువుకునే ప్రదేశంలో పెట్టుకోవాలి.  ఇది మరింత మెరుగ్గా చదవడానికి సహాయపడుతుంది. చదువుకునే పిల్లలు ఉన్నప్పుడు పైన చెప్పుకున్నవి పాటించడం వల్ల పిల్లలు చదువులో మరింత మెరుగ్గా ముందుకెళతారు.                                   *రూపశ్రీ.
ఆరోగ్యంగా ఉండటానికి నీరు త్రాగడం మంచిదని చెబుతారు.  నీకు ఎంత తాగితే ఆరోగ్యం అంత బాగుంటుందని కూడా చెబుతారు. ఆరోగ్య  నిపుణులు రోజుకు  8 నుండి 9 గ్లాసుల నీరు త్రాగాలని సిఫార్సు చేస్తున్నారు.  అయితే చాలా మంది ప్రజలు తరచుగా తమ రోజును  కప్పు టీతో లేక కాఫీతో మొదలుపెడుతుంటారు.  దీని వల్ల ఉదయాన్నే చురుగ్గా పనిచేయగలుగుతామని చెబుతారు. అయితే టీకి బదులుగా ఉదయాన్నే  ఒక గ్లాసు నీరు త్రాగడం  ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  ఉదయం ఒక గ్లాసు నీరు త్రాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. ఖాళీ కడుపుతో నీరు త్రాగడం వల్ల కలిగే ప్రయోజనాలు , రోజుకు ఎన్ని లీటర్ల నీరు త్రాగాలో.. దీని గురించి ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుంటే.. ఎన్ని లీటర్ల నీరు తాగాలి? నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆరోగ్యకరమైన శరీరానికి సరైన మోతాదులో నీరు త్రాగడం చాలా అవసరం. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ప్రతిరోజూ 2.5 నుండి 3 లీటర్ల నీరు త్రాగాలి. వేసవి కాలంలో మరింత నీరు త్రాగడం మంచిది. జిమ్‌కు వెళ్లేవారు కూడా నీటిని ఎక్కువగా తాగాలి. ఎప్పుడు నీరు తాగాలి?  ప్రతి ఒకటి నుండి రెండు గంటలకు కొద్దిగా నీరు త్రాగాలి. ఒకేసారి ఎక్కువగా నీరు త్రాగడం మంచిది కాదు. కొద్దికొద్దిగా నీరు త్రాగడం ప్రయోజనకరం. భోజనానికి 30 నిమిషాల ముందు నీరు త్రాగడం ప్రయోజనకరం. భోజనం చేసేటప్పుడు ఎక్కువగా నీరు తాగకూడదు. అలాగే  పడుకునే ముందు కొద్దిగా నీరు తాగవచ్చు, కానీ ఎక్కువగా తాగడం మంచిది కాదు. ఇది నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. ఉదయాన్నే ఎందుకు తాగాలి? రాత్రి ఎనిమిది గంటలు నిద్రపోయిన తర్వాత, శరీరానికి తిరిగి తేమను అందించడానికి నీరు అవసరం. ఉదయం నిద్రలేచిన తర్వాత ఒకటి లేదా రెండు గ్లాసుల నీరు తాగాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. చర్మానికి మంచిది.. ఉదయం పూట ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం అందాన్ని పెంచుతుంది. నిజానికి, నీళ్లు తాగడం వల్ల ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. ఇది జుట్టుపై కూడా ప్రభావం చూపుతుంది. నీళ్లు తాగడం వల్ల జుట్టుకు మెరుపు వస్తుంది. తగినంత నీరు తాగడం వల్ల ముఖ ముడతలు తగ్గుతాయి , శరీరం నుండి విష పదార్థాలను బయటకు పంపడానికి కూడా సహాయపడుతుంది. జీవక్రియ.. ఉదయం ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వల్ల  జీవక్రియ వేగవంతమవుతుంది. జీవక్రియను పెంచుకోవడం బరువు పెరగకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వల్ల శరీరం డిటాక్స్ అవుతుంది.  దీని వల్ల  కాలేయం,  మూత్రపిండాల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కాబట్టి ఉదయాన్నే నీరు తాగడం వల్ల పైన చెప్పుకున్న లాభలన్నీ ఉంటాయి.  అంతేకాకుండా ప్రతి రోజూ తప్పకుండా శరీరానికి తగినంత నీరు తాగడం వల్ల చాలా రకాల వ్యాధులు కూడా దూరంగా ఉంటాయి.                                    *రూపశ్రీ.
కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఒక్కోరకం కూరగాయలలో ఒకో రకం పోషకాలు ఉంటాయి.  కొన్ని రకాల కూరగాయలు ఆరోగ్యానికి ఔషధంలా పనిచేస్తాయి.  అలాంటి కూరగాయలలో బ్రోకలీ కూడా ఒకటి.  చూడటానికి ఆకుపచ్చ రంగులో, క్యాలీ ఫ్లవర్ ను పోలిన బ్రోకలీ ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా కొన్ని రకాల జబ్బులను ఆమడ దూరంలో ఉంచే శక్తి బ్రోకలీకి ఉంది. అసలు బ్రోకలీలో ఉండే పోషకాలు ఏంటి? బ్రోకలీ తింటే ఏ వ్యాధులు దూరంగా ఉంటాయి?  తెలుసుకుంటే.. బ్రోకలీలో ఉండే పోషకాలు.. బ్రోకలీలో ఫైబర్,  విటమిన్-సి, విటమిన్-కె, ఐరన్,  పొటాషియం వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. బ్రోకలీ తింటే ఏ జబ్బులు దూరంగా ఉంటాయంటే.. గుండె జబ్బులు.. బ్రోకలీని తింటే గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. అయితే ఇందుకోసం బ్రోకలీని తీసుకునే విధానం కూడా చాలా ముఖ్యం.  ఆవిరి మీద ఉడికించిన బ్రోకలీని క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. రక్తనాళాల ఆరోగ్యం.. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం ద్వారా బ్రోకలీ గుండె మరియు రక్తనాళాల  వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు,  పరిశోధనా ఫలితాలు చెబుతున్నాయి. క్యాన్సర్.. బ్రోకలీకి క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అంటే.. బ్రోకలీ యాంటీ క్యాన్సర్ గుణాలు కలిగి ఉంటుంది. ముఖ్యంగా ప్రోస్టెస్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. కంటిచూపు.. కంటి చూపుకు పదును పెట్టడంలో,  దృష్టి లోపాన్ని నివారించడంలో,  రేచీకటి వంటి దృష్టి సమస్యలు నివారించడంలో బ్రోకలీ  కొంతవరకు సహాయపడుతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. పేగు ఆరోగ్యం.. బ్రోకలీలో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది.  ఇది పేగు ఆరోగ్యానికి చక్కగా  సహాయపడుతుంది. బ్రోకలీని తీసుకుంటూ ఉంటే పేగు ఆరోగ్యం మెరుగవుతుంది. చక్కెర స్థాయిలు.. మధుమేహం ఉన్నవారు బ్రోకలీని తింటే చాలా ఉపయోగం.  బ్రోకలీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.                                  *రూపశ్రీ.