Home

»

Latest News

Virosh: ఇప్పుడు మేము ముగ్గురం కాబోతున్నాం.. రష్మిక పోస్ట్ తో ఫ్యాన్స్ హ్యాపీ 

Apr 3, 2026 2:24PM

 

-ఫిబ్రవరి 26 న ఒక్కట్టైన రష్మిక, విజయ్ 
-రీసెంట్ గా ఇనిస్టాలో గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక 
-ముగ్గురు కాబోతున్నాం అంటూ వెల్లడి  
 

స్టార్ హీరోయిన్ రష్మిక(Rashmika),విజయ్ దేవరకొండ(Vijay deverakonda)వివాహం మొన్న ఫిబ్రవరి 26 న గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. వివాహం చేసుకొని ఆ ఇద్దరు ఎంత ఆనందంగా ఉంటారో అంతకంటే ఎక్కువ పది రేట్లు ఆనందంగా వారివురి అభిమానులు ఉంటారు. ఎందుకంటే విజయ్, రష్మిక ప్రేమ పక్షులుగా ఉన్నన్ని రోజులు ఆ ఇద్దరి గురించి పలు రకాల  గాసిప్స్ వచ్చాయి. అవన్నీ వింటు అభిమానులు ఎంతో బాధపడుతు వస్తున్నారు. అలాంటిది ఆ ఇద్దరు పెళ్లి చేసుకోవడంతో వాళ్లంతా ఇప్పుడు ఎంతో హ్యాపీగా ఉన్నారు. రీసెంట్ గా రష్మిక చేసిన పోస్ట్ తో వాళ్ళల్లో మరింత నూతనోత్సాహం వచ్చినట్లయింది. ఆ పోస్ట్ ఏంటో చూద్దాం.

రష్మిక మందన్న తన ఇనిస్టాగ్రమ్ లో ఇప్పుడు మేము ముగ్గురయ్యామంటూ ఒక వీడియో క్లిప్ షేర్ చేసింది. సదరు వీడియోలో రష్మిక, విజయదేవరకొండలా ఉన్న కార్టూన్ బొమ్మలు ఉండగా రష్మిక టీ షర్ట్ పై గుడ్డు ఫోటో ఉంది. ఒక పొద్దు తిరుగుడు పువ్వు ని కూడా పక్కన ఉంచారు. దీంతో రష్మిక తల్లి కాబోతుందా అనే కామెంట్స్ తో ఇనిస్టాగ్రమ్ క్రాక్ అయ్యే పరిస్థితి.

Also read: Bandla Ganesh: బండ్ల గణేష్ కూతురి పెళ్లి.. అల్లుడు సూర్యతేజ బ్యాక్ గ్రౌండ్ ఏంటి

అసలు విషయం ఏంటంటే రష్మిక కి ఇన్ స్టాగ్రామ్ లో మరో అకౌంట్ ఉంది. పేరు rashmikaru .అందులో పొద్దుతిరుగుడు పువ్వుకి సంబంధించిన కథలని,యానిమేటెడ్ స్టోరీస్ ని ఉంచుతుంది. ఇప్పుడు ఆ యానిమేషన్ ప్రపంచంలోకి విజయ్ ని ఆహ్వానిస్తూ సదరు పోస్ట్ చేసింది. ఇదే అసలు నిజం.

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com