అప్పుడు వైసీపీ మంత్రి చేయి చేసుకున్నాడు.. మండలి మాజీ చైర్మన్

posted on: Apr 3, 2026 3:31PM

ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతే అంటూ ప్రవేశపెట్టిన బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపడంతో మంగళగిరిలోని తెలుగుదేశ పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ఘనంగా వేడుకలు జరిగాయి. ఆ వేడుకలకు హాజరైన ఆంధ్రప్రదేశ్ శాసన మండలి మాజీ చైర్మన్ ఎం.ఎ.షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లు సమయంలో జరిగిన పరిణామాలపై స్పందించారు. కెమెరాలు కట్ చేసి చోటు చేసుకున్న పరిణామాలపై ఆయన తొలిసారి పెదవి విప్పారు. 

ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై  చెయ్యి చేసుకున్నారని  పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో  తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు. తన దగ్గర డబ్బు లేదు కాబట్టి బతుకుదెరువు చూపిస్తామని ప్రలోభ పెట్టారని, మండలినే రద్దు చేస్తామని బెదిరించారని నాటి వైసీపీ ఘాతులకాలను వివరించారు.

అయినా తనకున్న అధికారంతో మూడు రాజధానుల బిల్లు ఆమోదించలేదని షరీఫ్ సగర్వంగా చెప్పారు. నమాజ్ చేసుకుని అల్లాని ప్రార్థించుకుని 'అల్లా సత్యం వైపు ఉండేటట్లుగా నా కళ్లు తెరువు' అని కోరారన్నారు. ఎన్ని ఒత్తిడిలు ఉన్నా.. బెదిరించినా ధర్మం వైపు నిలబడాలనే అల్లా మాటలకు ఆరోజు కట్టుబడి ఉన్నా. ఆ తర్వాతా తనన న్ను చైర్మన్ స్థానం నుంచి దింపేందుకు అనేక కుట్రలు చేశారని,  ఇప్పుడు అమరావతి రాజధానిగా చట్టం చేయడం ఆనందంగా ఉందని నాడు జరిగిన సంఘటనలు గుర్తు చేసుకున్నారు 

google-ad-img
    Related Sigment News
    • Loading...