Latest News

బ్రోకలీ తింటే ఈ వ్యాధులన్నీ దూరం..!

posted on: Apr 2, 2026 11:17AM


కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఒక్కోరకం కూరగాయలలో ఒకో రకం పోషకాలు ఉంటాయి.  కొన్ని రకాల కూరగాయలు ఆరోగ్యానికి ఔషధంలా పనిచేస్తాయి.  అలాంటి కూరగాయలలో బ్రోకలీ కూడా ఒకటి.  చూడటానికి ఆకుపచ్చ రంగులో, క్యాలీ ఫ్లవర్ ను పోలిన బ్రోకలీ ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా కొన్ని రకాల జబ్బులను ఆమడ దూరంలో ఉంచే శక్తి బ్రోకలీకి ఉంది. అసలు బ్రోకలీలో ఉండే పోషకాలు ఏంటి? బ్రోకలీ తింటే ఏ వ్యాధులు దూరంగా ఉంటాయి?  తెలుసుకుంటే..

బ్రోకలీలో ఉండే పోషకాలు..

బ్రోకలీలో ఫైబర్,  విటమిన్-సి, విటమిన్-కె, ఐరన్,  పొటాషియం వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

బ్రోకలీ తింటే ఏ జబ్బులు దూరంగా ఉంటాయంటే..

గుండె జబ్బులు..

బ్రోకలీని తింటే గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. అయితే ఇందుకోసం బ్రోకలీని తీసుకునే విధానం కూడా చాలా ముఖ్యం.  ఆవిరి మీద ఉడికించిన బ్రోకలీని క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.

రక్తనాళాల ఆరోగ్యం..

శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం ద్వారా బ్రోకలీ గుండె మరియు రక్తనాళాల  వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు,  పరిశోధనా ఫలితాలు చెబుతున్నాయి.

క్యాన్సర్..

బ్రోకలీకి క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అంటే.. బ్రోకలీ యాంటీ క్యాన్సర్ గుణాలు కలిగి ఉంటుంది. ముఖ్యంగా ప్రోస్టెస్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.

కంటిచూపు..

కంటి చూపుకు పదును పెట్టడంలో,  దృష్టి లోపాన్ని నివారించడంలో,  రేచీకటి వంటి దృష్టి సమస్యలు నివారించడంలో బ్రోకలీ  కొంతవరకు సహాయపడుతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు.

పేగు ఆరోగ్యం..

బ్రోకలీలో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది.  ఇది పేగు ఆరోగ్యానికి చక్కగా  సహాయపడుతుంది. బ్రోకలీని తీసుకుంటూ ఉంటే పేగు ఆరోగ్యం మెరుగవుతుంది.

చక్కెర స్థాయిలు..

మధుమేహం ఉన్నవారు బ్రోకలీని తింటే చాలా ఉపయోగం.  బ్రోకలీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

                                 *రూపశ్రీ.

google-ad-img
    Related Sigment News
    • Loading...