లోకం మాధ‌వి మిరాకిల్ అక్ర‌మాల ప‌రిస్థితి ఏంటి?  ఆమె ప‌ద‌వికి గండం ఏర్ప‌డ‌నుందా? ఈసీ వ‌ర‌కూ చేరిన ఈ ఆరోప‌ణ‌ల ప్ర‌భావం ఎంత మేర‌కు ఉండొచ్చు? జ‌న‌సేన‌కు ఇది మ‌రో త‌ల‌నొప్పి కానుందా?  అన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాలలో జోరుగా సాగుతోంది. ఔను నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం  మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశ మయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి   చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే..  ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్ప‌టికే అర‌వ‌శ్రీధ‌ర్  వ్య‌వ‌హారంతో సతమతమౌతున్న జనసేనకు ఇప్పుడు లోకం మాధవిపై వచ్చిన అవినీతి వ్యవహారాలు మరో తలపోటుగా పరిణమించాయని అంటున్నారు.   జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి గెలిచారు.  ఆమెకు చెందిన మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ చుట్టూ ముసురుతున్న వివాదాలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ వ్యవహారం ఆమె పదవికి ఎసరుపెడుతుందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.  లోకం మాధవిపై ప్రధానంగా రెండు రకాల ఆరోపణలు వస్తున్నాయి. మొద‌టిది భూ ఆక్రమణలు.  భోగాపురం సమీపంలో మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సంస్థ కోసం కేటాయించిన భూముల్లో అక్రమాలకు పాల్పడ్డారని, ప్రభుత్వ భూములను నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్నారని ఫిర్యాదులు అందాయి. ఇక రెండోది ఎన్నికల అఫిడవిట్ వివాదం. ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తులు, కంపెనీ లావాదేవీలు, బకాయిల వివరాలను తప్పుగా లేదా అసంపూర్తిగా చూపించారనేది మ‌రో ఆరోప‌ణ‌.    వైసీపీ నాయకులు, కొందరు సామాజిక కార్యకర్తలు ఆమె అఫిడవిట్‌లో సమాచారాన్ని దాచారంటూ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.  అఫిడవిట్‌లో ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.   ఇంత‌కీ ఆమె పదవికి గండం ఉందా? అంటే..  ప్రస్తుతానికి లోకంమాధవి పదవికి వచ్చిన తక్షణ ముప్పు ఏమీ లేదంటున్నారు.  లోకం మాధవిపై వచ్చిన ఆరోపణలపై  అంతర్గత విచారణ జరిగే అవకాశం ఉందంటున్నారు. ఇక పోతే మాధవి ఈ ఆరోపణలను నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నారు. ఇవి రాజకీయ కక్ష సాధింపుతో చేస్తున్న ఆరోపణలనీ,  తన సంస్థలన్నీ నిబంధనల ప్రకారమే నడుస్తున్నాయని ఆమె చెబుతున్నారు.   ఇక ఈ విషయంలో   జనసేన పార్టీకి మాత్రం ఒకింత  ఇబ్బందికరమైన పరిణామంగానే చెప్పాలి.  పవన్ కళ్యాణ్ ఎప్పుడూ అవినీతి రహిత రాజకీయాలు అని చెబుతుంటారు. అటువంటిది ఆయన పార్టీ ఎమ్మెల్యేపై ఇలాంటి ఆరోపణలు రావడం ప్రత్యర్థులకు.. మ‌రీ ముఖ్యంగా వైసీపీకి ఒక విమర్శనాస్త్రంగా మారుతుంది. ఒకవేళ విచారణలో ప్రాథమిక ఆధారాలు దొరికితే, పార్టీ పరంగా ఆమెపై చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ పై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.  గతంలో అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ పదవులను కోల్పోయిన ఉదాహరణలు ఉన్నాయి. కానీ, మిరాకిల్ సంస్థల వ్యవహారం కార్పొరేట్ లావాదేవీలతో ముడిపడి ఉన్నందున, అందులోని సాంకేతిక అంశాలను విశ్లేషించడానికి సమయం పడుతుంది. ఈ వివాదం ఆమె రాజకీయ భవిష్యత్తును దెబ్బతీస్తుందా లేదా? అనేది రాబోయే విజిలెన్స్ నివేదికలు, కోర్టు విచారణలపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇది లోకం మాధవికి మరియు జనసేన పార్టీకి ఒక రాజకీయ సవాల్ లాంటిదేనంటున్నారు పరిశీలకులు. 
నారా లోకేష్ ఇటీవల కొందరు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్-ఛార్జ్‌ల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మ‌రీ ముఖ్యంగా క‌డ‌ప జిల్లా ఎమ్మెల్యేలు, నేత‌ల‌పై లోకేష్ సీరియస్  అయ్యారు. వారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలకు   గైర్హాజరు కావడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.  మ‌రీ ముఖ్యంగా కడప జిల్లా నేతలలైన పుట్టా సుధాకర్, వరదరాజులు రెడ్డి, మాధవి రెడ్డిపై లోకేష్ ఫైరయ్యారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన సమీక్షలో, నారా లోకేష్ కడప జిల్లా నేతలపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా ఫిర్యాదుల విన్నపం కార్యక్రమాలకు ఈ నేతలు హాజరుకాకపోవడంపై నిలదీసినట్లు చెబుతున్నారు. మైద‌కూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా లేరనీ, నియోజకవర్గ సమస్యలపై పట్టు కోల్పోతున్నారని లోకేష్ ద‌గ్గ‌ర స‌మాచారం ఉండ‌టంతో ఆయ‌న‌పై సీరియ‌స్ అయ్యారు. ఇటీవ‌ల పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ త‌న‌యుడు మ‌హేష్ యాద‌వ్ డ్ర‌గ్ టెస్టుల్లో ప‌ట్టుబ‌డ‌టం.. పార్టీకి మాయ‌ని మ‌చ్చ‌గా మార‌డం కూడా ఇందుకు ఒక కార‌ణం అయి ఉండొచ్చ‌ని భావిస్తున్నారు. ఇక ప్రొద్ద‌టూరు ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి సీనియర్ నేత అయినప్పటికీ, క్షేత్రస్థాయిలో క్యాడర్‌ను సమన్వయం చేయడంలో విఫలమవుతున్నారని  నారా లోకేష్ అన్నారు.అలాగే కడప  ఎమ్మెల్యే   మాధ‌వీ రెడ్డి   జిల్లా హెడ్ క్వార్ట‌ర్లో ఉంటూ కూడా జ‌నానికి  అందుబాటులో ఉండ‌టం లేద‌న్న ఫిర్యాదులున్నాయి. ఇటీవ‌ల ఒక ఆక‌స్మిక త‌నిఖీ చేసినా అది బూమ‌రాంగ్ కావ‌డంతో.. పార్టీ అధిష్టానం ఆమెపై ఆగ్ర‌హంగా  ఉన్న‌ట్టు స‌మాచారం. మాధ‌విరెడ్డిపై వ‌స్తున్న ఫిర్యాదుల‌పై లోకేష్ వివ‌ర‌ణ అడిగారని తెలుస్తున్నది. ధ‌ర్మ‌వ‌రం ఇంఛార్జ్ ప‌రిటాల శ్రీరామ్ త‌దిత‌ర నేత‌ల‌పైనా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మంత్రి నారా లోకేష్. కొందరు నేతలు స్థానిక పోలీసు, రెవెన్యూ అధికారులపై తీవ్ర‌ ఒత్తిడి తెస్తున్నారని, ఇందువల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని లోకేష్ మందలించిన‌ట్టు తెలుస్తోంది. నియోజకవర్గాల్లో పాత, కొత్త నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం, సొంత వర్గాలను ప్రోత్సహించడంపైనా లోకేష్ సీరియస్ అయిన‌ట్టు స‌మాచారం. మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలోని  పార్టీ అంతర్గత విభేదాలు, స్థానిక నేతల మధ్య గ‌ల‌ ఆధిపత్య పోరుపై లోకేష్ గతంలోనే హెచ్చరికలు జారీ చేశారు. ఎమ్మెల్యేలు లేదా ఇన్-ఛార్జ్‌లు ప్రజలకు అందుబాటులో లేకపోతే వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇచ్చే ప్రసక్తి లేదని  లోకేష్ నిష్కర్షగా చెప్పినట్లు తెలుస్తోంది.  ప్రతి మూడు నెలలకోసారి ఇచ్చే పర్ఫార్మెన్స్ రిపోర్ట్  ఆధారంగానే భవిష్యత్తు ఉంటుందన్న వార్నింగ్ కూడా లోకేష్ నుంచి వారికి వెళ్లిందని చెబుతున్నారు.  ఇసుక, భూ దందాల వంటి వాటిలో ఎవరి పేరు వినిపించినా ఉపేక్షించేది లేదన్నారని చెబుతున్నారు. మొత్తానికి, ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పెంచే క్రమంలో సొంత పార్టీ నేతలైనా సరే తప్పు చేస్తే వదిలిపెట్టేది లేదన్న సంకేతాన్ని ఈ హెచ్చరికల ద్వారా లోకేష్ ఇచ్చారని చెబుతున్నారు.  
మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు ఆర్కే రోజా ఉరుములేని పిడుగులా రాజకీయాల పట్ల వైరాగ్యం ప్రదర్శించారు. రాజకీయాల వల్ల తన ఆరోగ్యం పాడైందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలలో ఉండటం వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడి.. తద్వారా ఆనారోగ్యం తప్ప తనకు ఒరిగిందేమీ లేదంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో తెగ వైరల్ గా మారాయి.   రాజకీయాల్లో నిరంతరం ఉండే సవాళ్లు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డానన్న రోజా..  తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తనకు బ్లడ్ ప్రషర్ సమస్య వచ్చిందనీ, ఇక రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిని అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయ్యిందనీ వివరించారు.  నియోజకవర్గ సమస్యలు, పార్టీ బాధ్యతలు మరియు ప్రజల అంచనాల మధ్య వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ వహించేందుకు సమయమే చిక్కలేదన్నారు. గత ఎన్నికలలో ఓటమితో ఒత్తడి నుంచి పూర్తిగా బయటపడ్డానని చెప్పుకొచ్చారు.  ప్రస్తుతం ఆమె రాజకీయాలకు ఒకింత దూరంగా ఉంటున్నారు. అడపాదడపా తప్ప రాజకీయ వ్యాఖ్యలు చేయడం లేదు. ఈ పరిస్థితుల్లో రోజా రాజకీయాలు, తన వ్యక్తిగత ఆరోగ్యంపై చేసిన వ్యాఖ్యపై పలు రకాలుగా చర్చ జరుగుతోంది.  
ALSO ON TELUGUONE N E W S
Ajith Kumar, One of Tamil Biggest Stars, has delivered a blockbuster with Good Bad Ugly, last year, and the movie completes one year of release too, by tomorrow. Still, he did not start shooting for his next, even though Adhik Ravichandran is confirmed as director. Mythri Movie Makers have produced it but they did not show interest in collaborating again or continuing same combination which Ajith, previously, did for his previous films.  On top of it all, Kollywood grapevine is buzzing with rumors that Ajith is quoting close to 175-185 crores remuneration and if that is impossible, a 50 crore advance and 10-15% share in entire pre-release business. This is a humungous demand and also, it is reported that Mytgri lost close to 35-50 crores in GBU, due to production costs.  So, hearing Ajith demands, potential producers got cold feet, fearing how they would ever make that money back after the investment. Now, fed up with going around the town, Ajith has decided to produce #AK64 himself, say new reports. It is stated that Ajith understood the salary issue with other producers and he asked Adhik Ravichandran to give him complete production cost details.  So, he is ready to make that investment and he believes the story will work out in theatres big time, it seems. If the whispers are true, the shoot will finally begin this June. We hear he will be giving 15 days of call-sheets every month to keep the production moving at a steady pace. Since it is being planned as a proper family entertainer, the makers are aiming straight for a grand Pongal release. Let's wait for an official confirmation and if this project turns out to be a massive hit, he might become co-producer for his next films, too.    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
వెంకటేష్, మీనా జంటగా ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన అబ్బాయిగారు చిత్రంలోనిది. బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, నూతన్ప్రసాద్, జయచిత్ర ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో ఇవివి మార్క్ కామెడీ ప్రేక్షకుల్నినవ్వుల్లో ముంచెత్తుతుంది. మచ్చుకి కొన్ని సరదా సన్నివేశాలను ఈ వీడియో ద్వారా మీకు అందిస్తున్నాం.  ఈ వీడియోలో ఓబయ్య అనే పాత్ర చేసే ఓవర్ యాక్టింగ్ మరియు అతడి జీతం గురించి సాగే సంభాషణ చాలా నవ్వు తెప్పిస్తుంది. యజమాని అతడిని తిడుతూ, "ఈ నెల నుంచి నీ జీతం 200 కట్" అని చెప్పడం, దానికి ఓబయ్య ఇచ్చే కౌంటర్లు హాస్యభరితంగా ఉంటాయి. అందమైన అమ్మాయిలను చూస్తూ చేసే కామెడీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఒక సన్నివేశంలో ఒక వ్యక్తి ఒక అందమైన అమ్మాయిని చూసి చెల్లమ్మ అని పిలుస్తాడు. దానికి స్పందిస్తూ మరొకరు "ఇంత మంచి ఫిగర్‌ని పట్టుకొని చెల్లమ్మ అంటావా, కళ్ళు పోతాయి" అని అనడం ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. పెళ్ళి చూపులు, ఫోటోలు చూస్తూ వదిన అందాన్ని వర్ణించే తీరు ఈ రొమాంటిక్ కామెడీలో హైలైట్‌గా నిలుస్తుంది మరోవైపు, వ్యాపార లాభనష్టాల గురించి జరిగే చర్చ చాలా విచిత్రంగా సాగుతుంది. అద్దాలు లేకుండా చదవడం వల్ల "నష్టం" అనే పదాన్ని లాభం అని చదవడంతో వచ్చే కన్ఫ్యూజన్ అద్భుతంగా ఉంటుంది. కాన్వెంట్ చదువుల వల్ల ఇలాగే జరుగుతుందంటూ చేసే కామెంట్స్ అప్పటి సామాజిక పరిస్థితులను హాస్యంగా చూపిస్తాయి. ఈ వీడియోలో అత్యంత ఆసక్తికరమైన అంశం "కట్టల పాము" సీన్. పరుపులో పాము ఉందని అందరినీ భయపెట్టి, అసలు దొంగతనాన్ని బయటపెట్టడం ఒక పెద్ద ట్విస్ట్. పాము కోసం వెతికితే చివరకు నోట్ల కట్టలు బయటపడటంతో ఆ ఇంటి మేనమామ వేసిన ఎత్తుగడలు బట్టబయలవుతాయి. సొంత చెల్లెలిని మరియు మేనల్లుడిని మోసం చేస్తున్న మేనమామ అసలు రంగు బయటపడటంతో కథ ముగుస్తుంది.దేవత లాంటి తల్లిని మోసం చేసినందుకు శిక్షగా, వారిని కూలీలతో కలిసి పొలం పనులు చేయమని ఆజ్ఞాపిస్తారు. మోసగాళ్ళకు సరైన బుద్ధి చెప్పే ఈ సన్నివేశం మనసుకు సంతృప్తిని ఇస్తుంది. రొమాంటిక్ కామెడీతో పాటు కుటుంబ సభ్యుల మధ్య ఉండే బంధాలు, మోసాలు మరియు వాటి పరిష్కారాలను హాస్యంగా చూపించడం ఈ వీడియోలోని ప్రత్యేకత. ఇటువంటి మరిన్ని వినోదాత్మక వీడియోల కోసం మాTeluguone youtube channelను  Subscribe చేసుకోండి.
'డెకాయిట్' సినిమాకు సమంత సపోర్ట్ సుప్రియ యార్లగడ్డ కోసం సామ్ స్పెషల్ పోస్ట్ అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘డెకాయిట్’ (Dacoit). అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘డెకాయిట్’ మూవీ రేపు(ఏప్రిల్ 10) ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అక్కినేని కాంపౌండ్ నుండి వస్తున్న ఈ సినిమాకు అనూహ్యంగా స్టార్ హీరోయిన్ సమంత(Samantha) మద్దతు లభించింది. సోషల్ మీడియా వేదికగా సమంత చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ‘డెకాయిట్’ మూవీ టీంకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యంగా ఈ సినిమా నిర్మాత, అక్కినేని ఫ్యామిలీ మెంబర్ సుప్రియ యార్లగడ్డను ఉద్దేశించి ఆమె పెట్టిన పోస్ట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. "నీ కష్టాన్ని, నీ మనసుని చూశాను. ఆల్ ది వెరీ బెస్ట్ సుప్రియ. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి" అంటూ సమంత ఆకాంక్షించారు. అక్కినేని కుటుంబానికి సమంత దూరమైనప్పటికీ, ఇప్పటికీ ఆ ఫ్యామిలీ మెంబర్స్‌తో ఆమెకు ఉన్న సాన్నిహిత్యం ఈ పోస్ట్‌ ద్వారా మరోసారి బయటపడిందని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇక సినిమా విషయానికి వస్తే, ‘డెకాయిట్’ కేవలం ఒక యాక్షన్ సినిమా మాత్రమే కాదు, ఇందులో అడివి శేష్ మార్క్ ఇంటెన్సిటీతో కూడిన లవ్ స్టోరీ కూడా ఉందని ట్రైలర్ ద్వారా స్పష్టమైంది. అడివి శేష్ తన ప్రతి సినిమాకు ఏదో ఒక కొత్తదనం జోడిస్తారనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. ‘క్షణం’, ‘గూఢచారి’, ‘మేజర్’ వంటి హిట్ సినిమాల తర్వాత ఆయన నటిస్తున్న చిత్రం కావడంతో దీనిపై భారీ హైప్ నెలకొంది. దీనికి తోడు ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ తోడవ్వడంతో సినిమా క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కు వెళ్ళింది. అక్కినేని కుటుంబానికి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన సినిమా కావడంతో ప్రమోషన్స్ కూడా అదే రేంజ్‌లో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఈ సినిమా ప్రమోషన్లలో అడివి శేష్ క్లారిటీగా చెప్తూ వస్తున్నారు.. ఇది మామూలు దొంగల కథ కాదు, భావోద్వేగాలతో కూడిన ప్రయాణం అని. మృణాల్ ఠాకూర్ పాత్ర కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతోందని సమాచారం. సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులు కూడా ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సమంత విషెస్ తర్వాత సోషల్ మీడియాలో 'డెకాయిట్' హ్యాష్ ట్యాగ్ మరింతగా వైరల్ అవుతోంది. ఏప్రిల్ 10న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న ‘డెకాయిట్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. అడివి శేష్ తన సక్సెస్ స్ట్రీక్‌ను కంటిన్యూ చేస్తారా? మృణాల్ మరో హిట్ తన ఖాతాలో వేసుకుంటుందా? అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. ఏదేమైనా సమంత ఈ సినిమాకు సపోర్ట్ గా పోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. మరి థియేటర్లలో ఈ 'డెకాయిట్' ఎంతవరకు దోచుకుంటాడో వేచి చూడాల్సిందే!  
  -ధురంధర్ 2 కి వరుస చిక్కులు  -కథ విషయంలో కేసు రన్ అవుతూనే ఉంది  -ఇప్పుడు మరో కేసు  -సాంగ్ వాళ్లదేనంట అదేం విచిత్రమో గాని ధురంధర్ 2(Dhurandhar 2)థియేటర్స్ లోకి ల్యాండ్ అయిన వేళ రాని కాపీరైట్ కేసులు ఇప్పుడు వరుసగా నమోదవుతున్నాయి. ఇటీవల ప్రముఖ కన్నడ దర్శకుడు సంతోష్ కుమార్(Santhosh Kumar)ధురంధర్ 2 కథ తనదే అంటూ కేసు వేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కేసు ముంబై లోని కోర్టు పరిధిలో ఉంది.  ఈ నెల 16 న తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మరో కేసు ధురంధరుడుకి హాయ్ చెప్పింది. ఆ కేసు డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ధురంధర్ 2 లో 'హమ్ ప్యార్ కర్నె వాలే' అనే సాంగ్ ఉంటుంది. 1989 లో వచ్చిన త్రిదేవ్ చిత్రంలోనిది. ఇప్పుడు ఈ సాంగ్ పై త్రిమూర్తి ఫిలిమ్స్ ముంబై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సదరు పిటిషన్ లో 'హమ్ ప్యార్ కర్నెవాలా' సాంగ్ హక్కులు మా దగ్గరే ఉన్నాయి. ఆదిత్య ధర్(Aditya Dhar)తో పాటు నిర్మాణ సంస్థ బి 62 స్టూడియోస్ మా అనుమతి లేకుండా సాంగ్ ని ఉపయోగించారు. కాబట్టి సినిమాలో సాంగ్ ని తొలగించాలి లేదా, నష్ట పరిహారం చెల్లించాలని తన పిటిషన్ లో పేర్కొంది. మరి కోర్టు తీర్పు ఎలా వస్తుందో చూడాలి. also read: Gautham Vasudev Menon: హైకోర్టు కీలక తీర్పు.. నాగ చైతన్య, సమంతల ఏ మాయ చేసావే గుర్తుంది కదా! ప్రస్తుతానికైతే ధురంధర్ 'జిందగీ ఏక్ సఫర్ హై సుహానా' అనే రీతిలో ఆడుతు పాడుతు 1700 కోట్ల కలెక్షన్స్ వరకు రాబట్టింది. 2000 కోట్లకి చేరాడేమో అనే సందేహాలు వ్యక్తం అవుతున్న వేల వరుస కేసుల రాకతో ఆ 2000 కోట్ల ఫిగర్ కూడా అందుకుంటుందేమో చూడాలి. వైరల్ న్యూస్ కి ఉన్న కెపాసిటీ అదే.  
  -గౌతమ్ వాసుదేవ మీనన్ కి భారీ ఊరట  -2011 లోనే డైరెక్టర్ గా వైదొలిగాను  -కోర్టు తీర్పులో ఏముంది    సరికొత్త ప్రేమకథ చిత్రాల రూపశిల్పి గౌతమ్ వాసుదేవ మీనన్(Gautham Vasudev Menon). తన చిత్రాల్లోని లవ్ సీన్స్ చూస్తుంటే ప్రతి మనిషి జీవితంలో ఉద్భవించిన ప్రేమని గుర్తు చేస్తుంది. ఏ మాయ చేసావే, ఘర్షణ వంటి చిత్రాల్లోని ప్రేమనే సింపుల్ ఉదాహరణ. రీసెంట్ గా మద్రాస్ హైకోర్ట్ అంతే ప్రేమని కురిపిస్తూ ఆయనపై నమోదైన కేసుని కొట్టివేసింది. ఆ డీటెయిల్స్ చూద్దాం. ఫోటాన్‌ కథాస్' అనే సినీ ప్రొడక్షన్ కంపెనీకి డైరెక్టర్ గా ఉన్న గౌతం మీనన్ 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేయలేదని చెన్నై ఆదాయపన్ను శాఖ ఎగ్మోర్‌  కోర్టులో కేసు వేసింది. దీంతో గౌతమ్ మీనన్ ఆదాయపన్ను శాఖకి కౌంటర్ గా మద్రాస్ హైకోర్ట్ లో రిటర్న్ పిటిషన్ దాఖలు చేసాడు. సదరు పిటిషన్ లో ఫోటాన్‌ కథాస్‌ కంపెనీ డైరెక్టర్‌ పదవి నుంచి  2011లోనే వైదొలిగాను. ఈ విషయాన్ని న్యాయ స్థానానికి కంపెనీ తెలియజేయలేదు.పైగా ఆ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి కేసుని కొట్టివేయాలని పిటిషన్ లో పేర్కొన్నాడు. also read: Jennifer Lopez: 4 పెళ్లిళ్లు, 7 ఎంగేజ్‌మెంట్స్.. అయినా సుఖం దక్కలేదంటున్న స్టార్ హీరోయిన్  వాదనలు ఆలకించిన కోర్టు తన తీర్పులో నిర్ణీత ఆర్థిక సంవత్సరం ముగియకముందే డైరెక్టర్‌ పదవి నుంచి గౌతం మేనన్‌ తప్పుకున్నాడు కాబట్టి,తనకి సదరు కేసుకి ఎలాంటి సంబంధం లేదని కొట్టివేసింది. నటుడుగాను తన సత్తా చాటుతున్న గౌతమ్ ప్రెజెంట్ సముద్ర ఖని తో కలిసి 'కార్మేని సెల్వం' అనే చిత్రంతో థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు.  
అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ప్రేక్షకులను పలకరించిన సరికొత్త వెబ్ సిరీస్ ‘మా కా సమ్’ (Maa Ka Sum). సీనియర్ నటి మోనా సింగ్, యువ నటుడు మిహిర్ అహూజా ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్, ఒక సున్నితమైన అంశాన్ని ఆధునిక కోణంలో ఆవిష్కరించే ప్రయత్నం చేసింది. నికోలస్ ఖార్కోమ్ గోర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ 8 ఎపిసోడ్ల సిరీస్ ఎలా ఉందంటే..? కథ: వినీత (మోనా సింగ్) తన కొడుకు అగస్త్య (మిహిర్ అహూజా)తో కలిసి ఢిల్లీలో నివసిస్తూ ఉంటుంది. అగస్త్య చిన్నతనంలోనే.. వినీత భర్త ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. దాంతో అన్నీ తానై కొడుకుని పెంచుకుంది. అగస్త్య కాలేజ్ లో చదువుతుంటాడు. అతను మ్యాథ్స్ లో జీనియస్. తన కోసం ఎన్నో త్యాగాలు చేసిన తల్లికి ఒక తోడు ఉండాలని భావిస్తాడు. ఈ క్రమంలో ఆమె కోసం డేటింగ్ వెబ్‌సైట్ల ద్వారా సరైన వ్యక్తిని వెతికే బాధ్యతను తానే తీసుకుంటాడు. ఈ లెక్కల జీనియస్ తన తల్లి కోసం ఎలాంటి లెక్కలు వేశాడు. ఈ ప్రయాణంలో తల్లి కొడుకుల మధ్య వచ్చే మార్పులు, అగస్త్య వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే సంఘర్షణలే ఈ సిరీస్ కథ. విశ్లేషణ: సాధారణంగా భారతీయ సమాజంలో తల్లిని కేవలం త్యాగమూర్తిగా మాత్రమే చూస్తారు. కానీ ఆమెకు కూడా వ్యక్తిగత ఇష్టాలు, ఆకాంక్షలు ఉంటాయనే పాయింట్‌ను ఈ సిరీస్ ద్వారా దర్శకుడు చెప్పాలనుకున్నాడు. గతంలో తండ్రికి పెళ్లి చేసే కొడుకు కథలు లేదా తల్లికి తోడు వెతికే కూతురు కథలు వచ్చినప్పటికీ, ఇందులో ‘డేటింగ్’ కాన్సెప్ట్‌ను జోడించి కొంచెం కొత్తగా ప్రజెంట్ చేశారు. అయితే, ఈ ఆధునిక ఆలోచనా ధోరణి ఎంతవరకు సామాన్య ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందనేది ప్రశ్నార్థకమే. ఈ కథలో చూపించిన 'తల్లి డేటింగ్‌కు వెళ్లడం' అనే కాన్సెప్ట్ సాధారణ ప్రేక్షకులకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి అంత త్వరగా కనెక్ట్ కాకపోవచ్చు. ఇది కేవలం అర్బన్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని తీసినట్టుగా కనిపిస్తుంది. అయితే తల్లీకొడుకుల మధ్య ఉండే అనుబంధాన్ని మాత్రం చాలా సహజంగా, ఎక్కడా అతి లేకుండా చూపించారు. వారిద్దరి మధ్య వచ్చే సంభాషణలు హృదయానికి హత్తుకుంటాయి. కథలో అక్కడక్కడా వచ్చే కామెడీ బోర్ కొట్టించకుండా చూస్తుంది. ముఖ్యంగా డేటింగ్ ప్రక్రియలో ఎదురయ్యే కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ ప్రేక్షకులను నవ్విస్తాయి. ఎనిమిది ఎపిసోడ్ల పాటు సాగే ఈ సిరీస్ కొన్ని చోట్ల చాలా నెమ్మదిగా సాగుతుంది. కొన్ని సన్నివేశాలు అనవసరంగా సాగదీసినట్లు అనిపిస్తుంది. సిరీస్ ముగింపు కూడా ఇంకా బలంగా ఉండాల్సింది. అలాగే హీరో కాలేజీ లైఫ్, లెక్చరర్‌తో అతని ట్రాక్.. కథకు అంతగా బలాన్ని చేకూర్చలేదు. అది మెయిన్ స్టోరీ ప్రయాణాన్ని పక్కదారి పట్టించినట్టు అనిపిస్తుంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:  మోనా సింగ్ మరోసారి తన అద్భుత నటనతో ఆకట్టుకుంది. ఒక బాధ్యతాయుతమైన తల్లిగా, మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకునే మహిళగా ఆమె నటన సహజంగా ఉంది. ఇక కొడుకు పాత్రలో మిహిర్ అహూజా ఒదిగిపోయాడు. మ్యాథ్స్ ని ప్రేమిస్తూనే, తల్లి ఆనందం కోసం తపించే యువకుడిగా తన నటనతో మెప్పించాడు. వీరిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ ఈ సిరీస్‌కు ప్రధాన బలంగా నిలిచింది. సాంకేతిక పరంగా 'మా కా సమ్' ఒక క్వాలిటీ వెబ్ సిరీస్ అని చెప్పొచ్చు. కథనం నెమ్మదిగా ఉన్నా.. విజువల్స్, మ్యూజిక్ ఆ లోటును కొంతవరకు భర్తీ చేశాయి. విజువల్స్ చాలా ప్లెజెంట్‌గా ఉన్నాయి. ఢిల్లీ నగరంలోని మధ్యతరగతి వాతావరణాన్ని, అక్కడి గల్లీలను, ఇళ్లను చాలా సహజంగా కెమెరాలో బంధించారు. నేపథ్య సంగీతం కథలోని ఎమోషన్స్‌ను పండించడంలో సాయపడింది. ముఖ్యంగా తల్లి, కొడుకుల మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్స్‌లో మ్యూజిక్ ప్రేక్షకుడిని కథలోకి లీనమయ్యేలా చేస్తుంది. ఎడిటింగ్ విభాగం పనితీరు ఫర్వాలేదనిపిస్తుంది. నిడివి కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. కొన్ని అనవసరమైన ల్యాగ్ సీన్స్‌ను కత్తిరించి ఉంటే కథనం మరింత వేగంగా సాగేది. ముఖ్యంగా మధ్యలో వచ్చే కొన్ని ఉపకథలను (Sub-plots) మరింత షార్ప్‌గా ఎడిట్ చేసి ఉంటే ప్రేక్షకుడికి ఎక్కడా బోర్ కొట్టే అవకాశం ఉండేది కాదు. దర్శకుడు నికోలస్ ఖార్కోమ్ గోర్ ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉంది. దాన్ని ఆవిష్కరించిన తీరు కూడా బాగానే ఉంది. నటీనటుల నుంచి బెస్ట్ అవుట్‌పుట్ రాబట్టుకోవడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సిరీస్ స్థాయికి తగ్గట్టుగా రిచ్‌గా ఉన్నాయి.  ప్లస్ పాయింట్స్: నటీనటుల పర్ఫార్మెన్స్ కొత్తదనంతో కూడిన పాయింట్ ఎమోషన్స్ కామెడీ మైనస్ పాయింట్స్: నెమ్మదించిన కథనం క్లైమాక్స్ సబ్ ప్లాట్స్ ఫైనల్ గా.. ‘మా కా సమ్’ వెబ్ సిరీస్ అనేది ఒక బోల్డ్ అటెంప్ట్‌. ఒక కొత్త తరహా కథాంశాన్ని చూడాలనుకునే వారు, ఎమోషనల్ డ్రామాలను ఇష్టపడే వారు ఈ సిరీస్‌ను ఒక లుక్కేయొచ్చు. ముఖ్యంగా మోనా సింగ్ పెర్ఫార్మెన్స్ కోసం చూడవచ్చు. అయితే 'తల్లి డేటింగ్‌కు వెళ్లడం' అనే కాన్సెప్ట్ కొందరికి నచ్చకపోవచ్చు. రేటింగ్: 2.25/5 Disclaimer: Views expressed in this review are personal opinions of the reviewer and organisation doesn't take any liability. Viewers discretion is advised before commenting or reacting to this review.  
  -కొన్ని కోట్ల మంది చేత ప్రేమించబడ్డ స్టార్  -అమెరికా అధ్యక్షుడైనా ఆమె ప్రోగ్రాం చూడాల్సిందే   -కానీ వ్యక్తి గత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు  -మరి నన్ను ఎవరు ప్రేమించలేక పోయారని ఎందుకు చెప్తుంది  -ఇంతకీ ఆమె ఆక్రందన ఏంటి   జెన్నిఫర్ లోపెజ్(Jennifer Lopez).. ప్రపంచ పాప్ మ్యూజిక్ రంగంలో తిరుగులేని అజమాయిషీ చెలాయించిన లెజండ్రీ. ఆమె ప్రోగ్రాం చేస్తుందంటే చాలు అమెరికా అధ్యక్షుడైనా తన పనులు సైతం పక్కన పెట్టి  వీక్షించాల్సిందే. ఇక అభిమానులు గురించి అయితే చెప్పక్కర్లేదు తిండి తిప్పలు, నిద్రమాని జెన్నీఫర్ ని చూస్తుండిపోతారు. తన స్వరం ఎంత మధురంగా ఉంటుందో, రూపం కూడా అంతే. ఐ లవ్ యు చెప్పిన వాళ్ళ సంఖ్యని అయితే కనిపెట్టడం ఏఐ కాదు కదా దాన్ని పుట్టించిన వాడి వల్ల కూడా కాదు. స్వచ్చతతో కూడిన ఒరిజినల్ కళకి అంతటి శక్తి ఉంది. అలాంటి జెన్నీఫర్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి చెప్పిన మాటలు అభిమానులనే కాదు, ప్రతి ఒక్కర్ని ఎంతగానో బాధకి గురి చేస్తున్నాయి. ఆ మాటలేంటో చూద్దాం. ఆమె మాట్లాడుతు లైఫ్ లో నేను నేర్చుకున్న పెద్ద పాఠం 'సెల్ఫ్ లవ్'. లెక్కకి మించిన స్టార్‌డమ్, సక్సెస్ అందుకున్నాను. కానీ నాలుగు సార్లు పెళ్లి, ఏడు ఎంగేజ్‌మెంట్స్ జరిగినప్పటికీ నిజమైన ప్రేమ మాత్రం దక్కలేదు. ఎన్నో సంవత్సరాలుగా నాలో నేను బాధపడుతున్నాను. కానీ బయటకి మాత్రం మాములుగా ఉంటు భావోద్వేగాన్ని బయట ప్రపంచానికి చూపించకుండా దాచేస్తున్నాను. నేను ప్రేమించదగిన వ్యక్తినే. కానీ కొంతమంది నిజంగా ప్రేమించలేరు. బయట ఎంత సక్సెస్ ఉన్నా, మనసుకి శాంతి కలిగించేది నిజమైన ప్రేమ, అర్థం చేసుకోవడమేనని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ మాటల వరల్డ్  నెట్టింట్లో ప్రకంపనలు రేపుతున్నాయి. Also read: Dhurandhar 2: ధురంధర్ 2 థియేటర్ లో ప్రభాస్, సందీప్ రెడ్డి ఏం చేసారో చూసారా! తాను చెప్పినట్టుగా ఆమె వ్యకిగత జీవితం విషయానికి వస్తే మొత్తం నాలుగు సార్లు మ్యారేజ్ చేసుకుంది. 1997లో క్యూబన్ నటుడు ఒజాని నోవాతో మొదటి సారి వివాహం జరగగా ఏడాదికే ఆ బంధం ముగిసింది. ఆ తర్వాత 2001లో డ్యాన్సర్ క్రిస్ జడ్‌ ని  2004లో గాయకుడు మార్క్ ఆంథోనీని పెళ్లి చేసుకుంది.మార్క్, జెన్నిఫర్ కి  ఇద్దరు కవల పిల్లలు. దాదాపు పదేళ్లు  కలిసి జీవించిన తర్వాత విడిపోయారు. 2022లో నటుడు బెన్ అఫ్లెక్‌ని పెళ్లి చేసుకుంది. 2002లోనే మొదటిసారి నిశ్చితార్థం చేసుకుని విడిపోయిన ఈ జంట, దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ కలుసుకుని పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ బంధం కూడా గత ఏడాదితో క్లోజ్ అయ్యింది. జెన్నీఫర్ పెళ్లి లిస్టే కాదు, డేటింగ్ హిస్టరీ కూడా చాలా పెద్దదే అని టాక్ . సీన్ "డిడ్డీ" కోంబ్స్, కాస్పర్ స్మార్ట్, అలెక్స్ రోడ్రిగ్జ్ వంటి ప్రముఖులతో డేటింగ్ చేసినట్టుగా హాలీవుడ్ సినీ సర్కిల్స్ లో న్యూస్ చక్కర్లు కొడుతు ఉంటుంది. నటిగాను పలు చిత్రాల్లో చేసి ఆయా చిత్రాల రేంజ్ ని పెంచిన జెన్నిఫర్ ఏజ్ ప్రెజెంట్ 56. జల్సాలో జెన్నిఫర్ లోపెజ్ స్కెచ్ గీసినట్టుగా ఉందిరో ఈ సుందరి అని పవన్ కళ్యాణ్(Pawan Kalyan)పాడిన విషయం గుర్తుంది కదా!     
టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న నటుడు 'రియల్ స్టార్' శ్రీహరి(Srihari). విలన్‌గా కెరీర్ ప్రారంభించి, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణించి, ఆపై హీరోగా కూడా మెప్పించిన నటుడు ఆయన. ముఖ్యంగా 'భద్రాచలం'(Bhadrachalam) వంటి చిత్రాల్లో ఆయన ప్రదర్శించిన నటన ఇప్పటికీ సినీ అభిమానుల గుండెల్లో పదిలంగా ఉంది. శ్రీహరి కెరీర్‌లోనే ది బెస్ట్ అనిపించే ఎమోషనల్ అండ్ పవర్‌ఫుల్ సీన్స్‌ 'భద్రాచలం' సినిమాలో ఎన్నో ఉన్నాయి. శ్రీహరి కెరీర్‌లో 'భద్రాచలం' సినిమాకి ప్రత్యేక స్థానం ఉంటుంది. కేవలం కండలు తిరిగిన శరీరమే కాదు, అంతకు మించిన సున్నితమైన మనసు, మనుషుల పట్ల అపారమైన ప్రేమ ఉన్న ఒక సామాన్యుడి కథ ఇది. ఈ రోజు మనం ఆ సినిమాలోని కొన్ని మరుపురాని సన్నివేశాలను, భద్రాచలం పాత్రలోని లోతును మరోసారి గుర్తుచేసుకుందాం. మమకారానికి నిలువుటద్దం.. భద్రాచలం పాత్ర! శ్రీహరి అనగానే మనకు గుర్తొచ్చేది ఆ గంభీరమైన కంఠం, కొండంత కండ. కానీ ఆ కండ వెనుక ఉన్న కరుణను, అమాయకత్వాన్ని 'భద్రాచలం' సినిమాలో ఆయన పండించిన తీరు అద్భుతం. గోదావరి తీరాన సాగే ఈ కథలో, ఒక మూగ జీవిని కసాయి వాడికి అమ్మలేక, తన అన్నయ్య ఎదుట నిలబడి "తల్లి కడుపులో నుంచి పడుతున్నప్పుడు పట్టుకున్న ఈ చేతులతో ఎలా అమ్మను అన్నయ్యా?" అని ఆయన అడిగే డైలాగ్ ప్రేక్షకుల కళ్లు చెమర్చేలా చేస్తుంది. శ్రీహరి నటనలోని ఆ సున్నితత్వం ఆయనను సామాన్య ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. వదినమ్మ తిట్లు.. అన్నం వాసన! కుటుంబంలో అందరిలాగే కష్టపడుతున్నా, భద్రాచలంకు ఎదురయ్యే అవమానాలు తక్కువేమీ కాదు. "ముప్పొద్దులా వండి పెట్టడానికి ఇక్కడ ఎవరూ తీరికగా లేరు" అని వదిన గారు కసురుకున్నా, అన్నం వాసన వస్తున్నా.. వదిన మీద ఉన్న గౌరవంతో వాటన్నిటినీ చిరునవ్వుతో భరిస్తాడు. తల్లి ప్రేమను చూసుకున్న క్షణాలు! శ్రీహరి గొప్ప ఎమోషనల్ నటుడు కూడా. చిన్నారి తనకు అన్నం తినిపిస్తుంటే, అందులో తన తల్లి ప్రేమను చూసుకుని కంటతడి పెట్టే సన్నివేశం ఆయన కెరీర్‌లోనే ఒక మైలురాయి. "నువ్వు గత జన్మలో మా అమ్మవై ఉంటావు తల్లి" అని ఆయన పలికే మాటలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. భారీ కాయం ఉన్న మనిషిలో ఉన్న పసివాడి మనస్తత్వాన్ని ఆవిష్కరించడంలో శ్రీహరి సక్సెస్ అయ్యారు. శ్రీరామనవమి పోటీలు - ఊరి సందడి శ్రీరామనవమి వస్తుందంటే చాలు, ఆ ఊరిలో ఉండే ఉత్సాహమే వేరు. ముఖ్యంగా పడవల పోటీలు, బలం ప్రదర్శించే పోటీల్లో భద్రాచలం తన సత్తా చాటడానికి సిద్ధమవుతుంటే, ఆ గ్రామస్తుల మధ్య జరిగే సంభాషణలు ఎంతో వినోదాన్ని పంచుతాయి. "మా బాబాయి గెలుస్తాడు" అని ఒకరు, "మా అన్నయ్యే గెలుస్తాడు" అని మరొకరు పందాలు వేసుకోవడం, ఆ పల్లెటూరి వాతావరణాన్ని మన కళ్ళముందు ఉంచుతాయి. భద్రాచలం బలం కేవలం గెలవడానికే కాదు, ఆ ఊరి గౌరవాన్ని నిలబెట్టడానికి కూడా. రియల్ స్టార్ శ్రీహరి ఈరోజు మన మధ్య లేకపోయినా, ఆయన పోషించిన ఇలాంటి అద్భుతమైన పాత్రలు తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. మరిన్ని అద్భుతమైన సన్నివేశాలు, సినిమా విశేషాల కోసం మా తెలుగువన్(TeluguOne) యూట్యూబ్ ఛానల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
విజయం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక లక్ష్యంగా ఉంటుంది.  చదువు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ప్రతి విషయంలో ఒక లక్ష్యం పెట్టుకుని,  దాన్ని సాధించి,  విజయ బావుటా ఎగరవేయాలని అనుకుంటారు చాలా మంది. అయితే.. విజయం సాధించడానికి కష్టపడితే సరిపోతుందని  తెలివి ఉంటే చాలని అనుకుంటారు అందరూ. కానీ విజయం సాధించడానికి తెలివి తేటలు, కష్టపడే తత్వం ఉన్నా.. కొన్ని అలవాట్లు మాత్రం వారికి విజయాన్ని దూరంగానే ఉంచుతాయి.  కొన్ని అలవాట్లు ఉన్న వ్యక్తి జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేడని సాక్షత్తు ఆచార్య చాణక్యుడే చెబుతాడు.  ఒక వ్యక్తిని విజయం సాధించకుండా చేసే ఆ అలవాట్లు ఏమిటో తెలుసుకుంటే.. సోమరితనం.. కష్టపడే వ్యక్తులలో సోమరితనం ఉంటుందా అని చాలా మంది ఆశ్చర్యపోతారు. కానీ ఇది నిజం.. కష్టపడే వ్యక్తులలో ఎంతో కొంత సోమరితనం కనిపిస్తూ ఉంటుంది.  అయితే ఏదో ఒక సందర్బంలో ఈ సోమరితనం వారిని దెబ్బతీస్తుంది.  కీలకమైన సందర్బంలో ఏ విషయాన్ని అయినా లైట్ తీసుకుంటే లేదా పనిని నిర్లక్ష్యం చేస్తే.. చేతుల దాకా వచ్చిన విజయం కూడా చేజారిపోతుంది.  అందుకే.. ఏ కొద్దిపాటి సోమరితనం ఉన్నా,  దాన్ని వదిలిపెట్టడం మంచిది. పట్టుదల.. పట్టుదల ఏ పనిలో అయినా ముందుకు సాగడానికి,  పనిని పూర్తీ చేయడానికి ప్రేరణ ఇస్తుంది. కానీ చాలామంది ఏదైనా పనిని మొదలు పెట్టినప్పుడు చాలా సీరియస్ గా ప్రారంభించి కష్టపడతారు.. ఆ తరువాత మాత్రం తమ పట్టుదలను తగ్గిస్తారు.  దీని వల్ల దక్కాల్సిన విజయం చెయ్యి జారిపోతుంది. ప్రవర్తన.. మనిషి ప్రవర్తన కూడా వారు పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. చాలామంది ఇతరులతో అమర్యాదగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి వ్యక్తులను చుట్టుప్రక్కల వారు, సమాజం ఎప్పటికీ ఇష్టపడదు, వారికి గౌరవం ఇవ్వదు,  వారు చేసే పనులలో తోడ్పాటు, వారు చేసే పనులకు గౌరవం కూడా ఇవ్వదు. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నవారు తమ పనుల విషయంలో కూడా నెగెటివ్ ఫలితాలు పొందుతారు.                                   *రూపశ్రీ.
మంచి, చెడు ప్రతి మనిషిలోనూ తప్పకుండా ఉండే గుణాలు.  మనుషులు కొన్ని విషయాల్లో మంచిగా, మరికొన్ని విషయాల్లో చెడ్డగా ఉంటారు. పూర్తీగా మంచితనం ఉన్న మనుషులు, పూర్తీగా చెడ్డగా ఉన్న మనుషులు ఎక్కడా ఉండరు. అయితే మనిషి తన స్వార్థం కోసం ఇతరులను ఇబ్బంది పెడుతూ, ఇతరులకు నష్టం కలిగిస్తూ, ఇతరుల జీవితాలు నాశనం అవుతున్నా తనకు అది అనవసరం అనుకునే స్థాయిలో కొందరు ఉంటారు. వారికి కేవలం తమ క్షేమం, తమ సంతోషం మాత్రం ముఖ్యం.  అలాంటి వారిని సింపుల్ గా అవకాశవాదులు అని కూడా అంటారు. కానీ ఇలాంటి వారు తమలో ఉన్న స్వార్థం, అవకాశవాదం బయటకు కనిపించకుండా మంచితనం అనే ముసుగు వేసుకుని ఉంటారు. అలాంటి వ్యక్తులను గుర్తించడం చాలా ముఖ్యం.  మంచితనం ముసుగు ధరించిన చెడ్డ వ్యక్తులలో కనిపించే కొన్న లక్షణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. వారిని గుర్తించి జాగ్రత్త పడవచ్చు.. మంచితనం ముసుగు వేసుకున్న వ్యక్తుల లక్షణాలు.. కొంతమంది ప్రతి విషయంలో ఇతరులను విమర్శిస్తూ, ఆలోచించకుండానే తమ అభిప్రాయాలను ఏర్పరచుకుంటారు. వారి మాటలు కొన్నిసార్లు ఎంత కఠినంగా ఉంటాయంటే, అవి ఎదుటివారి మనసును గాయపరుస్తాయి. తమ తప్పులను ఒప్పుకోకుండా, ఇతరులను నిందించే వారు ఉంటారు. తాము చెప్పిందే సరైనదని నిరూపించుకోవడమే వారికి ముఖ్యం. ఇతరులను,  ఇతరుల అభిప్రాయాలను  గౌరవించరు,  వాటిని పట్టించుకోరు. వారి ప్రవర్తన కేవలం వారి ప్రాధాన్యత, వారికి నచ్చిన విషయాలే అయి ఉండాలని అనుకుంటారు. కృతజ్ఞత అనేది వీరిలో కొంచెమైనా ఉండదు.  ఎప్పుడూ ప్రతికూలతపైనే దృష్టి పెడతారు. ఏ విషయంలో అయినా సరే.. మంచిని చూడటం కంటే ఫిర్యాదు చేయడానికి,  నెగెటివ్ గా మాట్లాడటానికి ఇష్టపడతారు. మంచితనం అనే ముసుగు వేసుకున్నవారు ఎవరికీ ఇచ్చిన మాటలను నిలబెట్టుకోరు.  మాట దాటేస్తుంటారు. అవకాశం కోసం మాటలు ఇవ్వడం తర్వాత మాట తప్పడం వీరి దృష్టిలో అస్సలు తప్పు కాదు.  ఒకవేళ తప్పిన మాట గురించి మాట్లాడితే ఎదురుదాడి చేసి మాట్లాడతారు. సరదా లేదా ఫన్ పేరుతో ఇతరులను ఎగతాళి చేయడం, కించపరిచి మాట్లాడటం వీరి గుణం. ఇలాంటివి పదే పదే చేస్తూ ఉంటే.. వారు మంచితనం ముసుగు వేసుకున్న చెడ్డ వ్యక్తుని అర్థం చేసుకోవచ్చు. తాము ఇతరుల కన్నా గొప్ప అని  భావించుకుంటూ, తమ ఆధిక్యతను నిరూపించుకోవడానికి  ప్రయత్నిస్తుంటారు. పైగా ఇతరులను తక్కువగా అంచనా వేస్తారు. తక్కువ చేసి మాట్లాడతారు.  పాత పగలను మనసులో పెట్టుకుంటారు, ఎవ్వరినీ క్షమించరు.  చిన్న చిన్న తప్పులను కూడా చాలా కాలం గుర్తుంచుకుంటారు. గాసిప్స్ చెప్పుకోవడం, ఇతరుల వ్యక్తిగత సమాచారాన్ని అందరికీ చేరవేడం,  అందరి దృష్టిలో ఇతరులను చెడ్డ చేయడం అంటే వీరికి చాలా సంతోషం కలిగించే విషయం. చిన్న విషయాల్లో కూడా అబద్ధాలు చెబుతూ ఉంటారు.  ఇలాంటి అబద్దాలు విని విని అవి సహజం అనుకునే వారు ఏదో ఒకరోజు వీరి ద్వారా చాలా పెద్ద మోసాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఇది క్రమంగా సంబంధాలలో నమ్మకాన్ని దెబ్బతీస్తుంది.                                *రూపశ్రీ.
అపరాజిత లేదా శంఖు పుష్పాలు నీలం ,  తెలుపు రంగులో ఉంటాయి.  ఈ పువ్వులు  చాలా అందంగా ఉంటాయి. శంఖు పుష్పం మొక్కను దేవతా మొక్కగా పరిగణిస్తుంటారు.  ఈ పువ్వులు  సంతోషం, శ్రేయస్సు,  సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. వేసవిలో ఈ తీగ ఎండిపోవడం మొదలై, పూయడం ఆగిపోతూ ఉంటుంది.  చాలా మంది వేసవిలో శంఖు పుష్పం మొక్క ఇక పువ్వులు పూయదు ఈ సీజన్ లో అనుకుంటారు.  అయితే గార్డెనింగ్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ మొక్కకు మార్చి,  ఏప్రిల్ నెలలు ప్రత్యేకంగా ముఖ్యమైనవి. కొన్ని చిట్కాలు పాటిస్తే  శంఖు పుష్పం మొక్కకు పువ్వులు చక్కగా పూస్తాయి.  ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. శంఖు పుష్పం మొక్కకు మార్చి, ఏప్రిల్ నెలలు చాలా ముఖ్యమైనవి. ఈ సమయంలో తీగను కత్తిరించడం చాలా అవసరం. పాత, ఎండిపోయిన, పసుపు రంగులోకి మారిన కొమ్మలను కత్తిరించాలి. ఇది మొక్క కొత్త కొమ్మలను చిగురించడానికి ప్రోత్సహిస్తుంది. కొమ్మలు ఎంత ఎక్కువగా ఉంటే, అది అంత ఎక్కువగా పువ్వులను పూస్తుంది. శంఖు పుష్పం తీగ కుండీలోని మట్టి ఒకటి నుంచి రెండు సంవత్సరాల పాతదైతే దానిని మార్చాలి. కాలక్రమేణా, మట్టిలోని పోషకాలు తగ్గిపోయి చాలా గట్టిగా మారుతుంది. కుండీ పైభాగంలోని 2 నుంచి 3 అంగుళాల మట్టిని తీసివేసి, దాని స్థానంలో కొత్త కంపోస్ట్ కలిపిన మట్టిని నింపాలి. ఇది మొక్క  కొత్త వేర్లను బలపరిచి, వేగవంతమైన పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. వేసవిలో శంఖు పుష్పం  మొక్కకు తేమ మాత్రమే అవసరం. అధికంగా నీరు పోయడం మొక్కకు హాని కలిగిస్తుంది. వేసవి కాలంలో, ఆకులకు నీరు పోయడానికి స్ప్రే బాటిల్‌ను ఉపయోగించాలి. ఇది మొక్కను తేమగా ఉంచుతుంది. మట్టి పై పొర ఎండిపోయినప్పుడు మాత్రమే నీరు పోయాలి. శంఖు పుష్ప మొక్కకు సూర్యరశ్మి అంటే చాలా ఇష్టం. ఈ మొక్కకు కనీసం 5 నుండి 6 గంటల సూర్యరశ్మిని అందించాలి. ఒకవేళ ఈ మొక్క ఎక్కువ కాలం నీడలో ఉంటే, తీగ పొడవుగా పెరుగుతుంది కానీ పూలు పూయదు. శంఖు పుష్ప మొక్క కోసం మట్టిని సిద్ధం చేసేటప్పుడు, ఇసుక, వర్మీకంపోస్ట్ సరైన నిష్పత్తిలో ఉండేలా చూసుకోవాలి. నెలకు ఒకసారి మట్టిలో లిక్విడ్  ఆవాల పిండి ఎరువును కలపాలి. దీనివల్ల పూల సంఖ్య పెరగవచ్చు. ప్రత్యామ్నాయంగా ఆవు పేడ ఎరువును కూడా వేయవచ్చు.                                        *రూపశ్రీ.
వేసవికాలం అంటేనే వేడి గాలులు, వడదెబ్బ, మండే ఎండలు గుర్తొస్తాయి.  ఎండల వేడి గురించి పక్కన పెడితే.. మనుషుల నుండి జంతువుల వరకు.. ప్రతి ఒక్క ప్రాణి వేసవిలో వడదెబ్బకు గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వడదెబ్బ కారణంగా ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది.   వేసవి కాలంలో వడదెబ్బ తగలకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలే ప్రతి ఒక్కరికి శ్రీరామ రక్షలా కాపాడతాయి. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. ప్రయాణాలు.. వేసవి కాలంలో చేసే ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.  అధిక వేడిమితో డీహైడ్రేషన్ గురికాకుండా తరచూ మంచినీరు,ఓఆరెస్,పల్చటి మజ్జిగ వంటివి తీసుకుంటూ ఉండాలి. వీలైనంత వరకు  ఉదయం చాలా తొందరగా,  లేదా సాయంత్రం ఎండ వేడిమి చాలా వరకు తగ్గిన తర్వాత ప్రయాణాలు చేయడం ఉత్తమం. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలతో ప్రయాణాలు చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. బయటకు వెళ్లడం.. వేసవి కాలంలో సాధారణంగా మిగతా రోజుల్లా పనుల కోసం బయటకు వెళ్ళే విధానాన్ని తగ్గించుకోవాలి. వేసవి కాలంలో పనుల షెడ్యుల్.. బయటకు వెళ్ళి చక్కబెట్టుకోవాల్సిన పనుల ప్రణాళికలు మార్చుకోవాలి.  తప్పనిసరిగా వెళ్లవలసి వస్తే.. వెంట వాటర్ బాటిల్,  గొడుగు ఉండేలా చూసుకోవాలి. కాలి నడకన లేదా బైక్ లో వెళ్లడం కంటే ఆటో వంటి వాహనాలలో బయటకు వెళ్లి రావడం చాలా మంచిది. ఆహార, పానీయాలు.. వేసవిలో తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. శరీరానికి  నీటి శాతాన్ని ఇచ్చే ఆహారాలు తీసుకోవాలి.  ఆహారంలో కారం, ఉప్పు,  నూనె వంటివి బాగా తగ్గించాలి. నీటి శాతం అధికంగా ఉండే కూరగాయలు,  పండ్లు విరివిగా తీసుకోవాలి. ముఖ్యంగా ఎండలో బయటకు వెళ్లి వచ్చిన తర్వాత తొందర పాటులో చాలా చల్లగా ఉన్న ఫ్రిజ్ లోని నీరు తాగడం  మానుకోవాలి.  బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత కుండలోని నీరు లేదా పల్చగా మజ్జిగ,  సుగంద షర్బత్ వంటివి తాగవచ్చు. ఇవి శరీరానికి ఊరట ఇస్తాయి.  వేసవి తాపం తీరుస్తాయి. హెల్త్ కేర్..   వేసవి ఎండల కారణంగా ఆరోగ్య ఇబ్బందులు తలెత్తితే దగ్గరలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో తగిన చికిత్స పొందాలి. అక్కడ ఓఆర్ లేదా ఎలక్ట్రోలైట్స్ ను అందించి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తారు. ఉదయం 11గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నీడ పట్టున విశ్రాంతి తీసుకోవడం లేదా నీడ పట్టున పనులు చేసుకోవడం మంచిది.   సేవ.. వేసవికాలంలో ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యం గురించి మాత్రమే కాకుండా.. నలుగురి ఆరోగ్యం గురించి కూడా ఆలోచించడం కనీస మానవత్వం.  వేసవిలో ప్రయాణాలు చేసేవారు.. దారి వెంట వెళ్లే బాటసారులు ఉంటారు. అలాంటి వారి కోసం.. మంచి నీరు ఏర్పాటు చేయడం,  అక్కడక్కడా కూర్చోవడానికి కాసింత చోటు ఇవ్వడం వంటివి కూడా చేయాలి. ఇవి కనీస మానవ ధర్మం కూడా. అయితే.. ఏ పని చేసినా ప్రమాదాలు మీదకు తెచ్చుకోకుండా చేయడమే మంచిది.                               *రూపశ్రీ.
  ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం బాగుంటే ఏ పనులైనా చేయవచ్చు, ఎంత డబ్బు అయినా సంపాదించుకోవచ్చు. కానీ నేటికాలంలో డబ్బు  చాలా వరకు ఆరోగ్యం కోసమే ఖర్చు పెడుతున్నారు.  ఎక్కడ చూసినా హాస్పిటల్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.  చిన్న పిల్లల నుండి వృద్దుల వరకు వయసుతో నిమిత్తం లేకుండా చాలా  రకాల ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు.  అయితే ఈ ఆరోగ్యం గురించి అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీన వరల్డ్ హెల్త్ డే జరుపుకుంటున్నారు. ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సపం ఎలా ఆవిర్బవించింది? దీని ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? ఈ రోజు ఏ కార్యక్రమాలు చేపడతారు? ఆరోగ్యం కోసం ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? తెలుసుకుంటే.. వరల్డ్ హెల్త్ డే ప్రారంభం.. వరల్డ్ హెల్త్ డే ప్రారంభానికి ప్రధాన కారణం World Health Organization (WHO). 1948 ఏప్రిల్ 7న WHO అధికారికంగా స్థాపించబడింది. అదే తేదీని గుర్తుగా 1950 నుంచి ప్రతి సంవత్సరం వరల్డ్ హెల్త్ డే జరుపుతున్నారు. ప్రపంచంలోని ప్రజల ఆరోగ్యం మెరుగుపరచడం, ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించడం కోసం ఈ రోజును ఏర్పాటు చేశారు. ఉద్దేశ్యం.. ప్రపంచ ఆరోగ్య సంస్థకు గుర్తుగా  ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ రోజు జరుపుకోవడం వెనుక కొన్ని ముఖ్య ఉద్దేశ్యాలు ఉన్నాయి.  ప్రజల్లో అవగాహన పెంచడం.. ఆరోగ్యం గురించి చాలామందికి సరైన సమాచారం,  అవగాహన  ఉండవు. అందుకే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా  వ్యాధుల నివారణ, ఆరోగ్యకర జీవనశైలి,  మానసిక ఆరోగ్యం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. గ్లోబల్ హెల్త్ సమస్యలపై దృష్టి.. ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక థీమ్ ఉంటుంది. ఈ థీమ్ ను అనుసరించి కార్యక్రమాల రూపకల్పన,  వాటి ఆచరణ వైపు ప్రణాళికలు ఏర్పాటు చేస్తారు.  ఉదాహరణకు..  మెంటల్ హెల్త్, క్లైమేట్ చేంజ్ ప్రభావం, యూనివర్సల్ హెల్త్ కేర్  వంటి అంశాలు ఉండవచ్చు.  ఈ రోజు తీసుకునే నిర్ణయాలు,  ప్రాణాళికలు.. ప్రపంచ మొత్తాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వాలు, సంస్థలను ప్రోత్సహించడం.. దేశాలు తమ ఆరోగ్య విధానాలను మెరుగుపరచడానికి ఈ రోజు ప్రేరణ కల్పిస్తుంది. ఇందుకోసం.. ఆరోగ్య సమాచారం,  ఆరోగ్యం కోసం మెరుగు పరుచుకోవలసిన అంశాలు,  పర్యావరణం,  ఆరోగ్య సూత్రాలు..  వంటివి సూచించడం జరుగుతుంది. నిర్వహించే కార్యక్రమాలు.. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజున కొన్ని  కార్యక్రమాలు నిర్వహించడం పరిపాటి. ఇవి ప్రతి గ్రామం, ప్రతి ఊరు, పట్టణాలలో ప్రభుత్వ ఆసుపత్రులు,  ప్రభుత్వం,  స్వచ్చంద ఆరోగ్య సంస్థల నేతృత్వంలో జరుగుతాయి. ఉచిత ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది.  గ్రామాలు, పట్టణాల్లో ఫ్రీ మెడికల్ చెకప్‌లు,  రక్తపరీక్షలు, షుగర్, BP పరీక్షలు వంటివి ఉచితంగా చేస్తారు. హెల్త్ ర్యాలీలు & అవగాహన కార్యక్రమాలు చేపడతారు.  కొన్ని ప్రాంతాలలో వాకథాన్‌లు, మారథాన్‌లు,  స్కూల్స్, కాలేజీల్లో అవగాహన సెషన్స్ నిర్వహిస్తారు. చాలా చోట్ల సెమినార్లు & వర్క్‌షాప్స్ నిర్వహిస్తారు. డాక్టర్లు, హెల్త్ ఎక్స్‌పర్ట్స్ ప్రసంగాలు, మానసిక ఆరోగ్యం, పోషణపై చర్చలు వంటివి జరుపుతారు. వ్యాక్సినేషన్ డ్రైవ్స్ కూడా ఇస్తారు. పిల్లలకు, పెద్దలకు టీకాలు వేయించడం,  ప్రజల్లో ఇమ్యూనిటీ పెంపుకు తోడ్పడటం చేస్తారు. సోషల్ మీడియా క్యాంపెయిన్స్ కూడా నిర్వహిస్తారు. హ్యాష్‌ట్యాగ్స్ ద్వారా అవగాహన, ఆరోగ్య చిట్కాలు పంచుకోవడం. ఆరోగ్య సమస్యల గురించి సరైన సమాచారం అందించడం,  ఆరోగ్య విషయంలో చాలా చేసే నిర్లక్ష్యాల గురించి వివరించి జాగ్రత్తలు తీసుకోవాల్సిన సందర్బాలు చెప్పడం వంటివి చేస్తారు. అందరూ చేయాల్సింది.. హెల్త్ ఈజ్ వెల్త్ అని అంటారు.. ఆరోగ్యం బాగుంటే కోట్ల ఆస్తులు ఉన్నట్టే.. అందుకే ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి.  వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ద కనబరచాలి.  జాగ్రత్తలు తీసుకుంటూ మంచి లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలి.  ఆరోగ్య సమస్యలు ఉన్నవారు రెగ్యులర్ చెకప్స్ కు హాజరు కావాలి. వ్యాయామం, ప్రాణాయామం, ధ్యానం వంటి చిన్న అలవాట్లు ఆరోగ్యాన్ని చాలా గొప్పగా మెరుగుపరుస్తాయి.  ప్రతి రోజు వీటిని కొద్దిసేపు అయినా ప్రాక్టీస్ చేయాలి. అలాగే మంచి ఆహారం తీసుకోవాలి.  మంచి ఆహారం అంటే ఖరీదైన ఆహారం అనే అపోహను వదిలేయాలి. నోటికి రుచిగా ఉన్నది కాదు.. శరీరానికి, ఆరోగ్యానికి ఏది మంచిదో అది తినడం అలవాటు చేసుకుంటే.. ఎవరి ఆరోగ్యం వారి చేతుల్లోనే భద్రంగా ఉంటుంది.                                               *రూపశ్రీ.