Home

»

Latest News

Gautham Vasudev Menon: హైకోర్టు కీలక తీర్పు.. నాగ చైతన్య, సమంతల ఏ మాయ చేసావే గుర్తుంది కదా!

Apr 9, 2026 12:34PM

 

-గౌతమ్ వాసుదేవ మీనన్ కి భారీ ఊరట 
-2011 లోనే డైరెక్టర్ గా వైదొలిగాను 
-కోర్టు తీర్పులో ఏముంది

  
సరికొత్త ప్రేమకథ చిత్రాల రూపశిల్పి గౌతమ్ వాసుదేవ మీనన్(Gautham Vasudev Menon). తన చిత్రాల్లోని లవ్ సీన్స్ చూస్తుంటే ప్రతి మనిషి జీవితంలో ఉద్భవించిన ప్రేమని గుర్తు చేస్తుంది. ఏ మాయ చేసావే, ఘర్షణ వంటి చిత్రాల్లోని ప్రేమనే సింపుల్ ఉదాహరణ. రీసెంట్ గా మద్రాస్ హైకోర్ట్ అంతే ప్రేమని కురిపిస్తూ ఆయనపై నమోదైన కేసుని కొట్టివేసింది. ఆ డీటెయిల్స్ చూద్దాం.

ఫోటాన్‌ కథాస్' అనే సినీ ప్రొడక్షన్ కంపెనీకి డైరెక్టర్ గా ఉన్న గౌతం మీనన్ 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేయలేదని చెన్నై ఆదాయపన్ను శాఖ ఎగ్మోర్‌  కోర్టులో కేసు వేసింది. దీంతో గౌతమ్ మీనన్ ఆదాయపన్ను శాఖకి కౌంటర్ గా మద్రాస్ హైకోర్ట్ లో రిటర్న్ పిటిషన్ దాఖలు చేసాడు. సదరు పిటిషన్ లో ఫోటాన్‌ కథాస్‌ కంపెనీ డైరెక్టర్‌ పదవి నుంచి  2011లోనే వైదొలిగాను. ఈ విషయాన్ని న్యాయ స్థానానికి కంపెనీ తెలియజేయలేదు.పైగా ఆ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి కేసుని కొట్టివేయాలని పిటిషన్ లో పేర్కొన్నాడు.


also read: Jennifer Lopez: 4 పెళ్లిళ్లు, 7 ఎంగేజ్‌మెంట్స్.. అయినా సుఖం దక్కలేదంటున్న స్టార్ హీరోయిన్

 వాదనలు ఆలకించిన కోర్టు తన తీర్పులో నిర్ణీత ఆర్థిక సంవత్సరం ముగియకముందే డైరెక్టర్‌ పదవి నుంచి గౌతం మేనన్‌ తప్పుకున్నాడు కాబట్టి,తనకి సదరు కేసుకి ఎలాంటి సంబంధం లేదని కొట్టివేసింది. నటుడుగాను తన సత్తా చాటుతున్న గౌతమ్ ప్రెజెంట్ సముద్ర ఖని తో కలిసి 'కార్మేని సెల్వం' అనే చిత్రంతో థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com