ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా?  ప్రభుత్వాన్ని రద్దు చేసే ఆలోచనలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వున్నారా?  అందుకే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఢిల్లీ టూర్ పెట్టుకున్నారా? అయితే ముంద‌స్తుకు ప్ర‌ధాని గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తారా?  సోషల్ మీడియాలో బాగానే ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై చ‌ర్చ అయితే జ‌రుగుతోంది.  ప్ర‌స్తుత పరిస్థితుల్లో ముందస్తుకు వెళ్తేనే.. టీడీపీని నిర్వీర్యం చేసి, తిరిగి అధికారంలోకి రావొచ్చని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన గుట్టుచప్పుడు కాకుండా మంత్రులు, వైసీపీ నేతలతో రహస్య సమావేశం నిర్వహించారట. ఇప్పుడున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా తాను ఎంతగానో నమ్మే, ఆరాధించే స్వరూపానంద సరస్వతిని జగన్ కలిశారట‌... అసెంబ్లీ రద్దుకు మంచి ముహూర్తం గురించి చర్చించారని తాడేప‌ల్లిలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.    నిజానికి.. గ్రౌండ్ రిపోర్ట్ చూస్తే, వైసీపీ ప్రభుత్వంపై ఏపీ ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉంది. ఇంత వరకూ రాజధాని లేకుండా ఏపీని ఏకాకి చేయడం, ప్రాజెక్టులు లేకుండా దిక్కుమాలిన రాష్ట్రంగా మార్చడం, పథకాలు పేరు చెప్పి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడంతో.. జ‌గ‌న్ స‌ర్కార్‌పై రాష్ట్ర ప్రజలు గుర్రుగా ఉన్నారు. ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి తమకు భవిష్యత్తే లేకుండా చేశాడని జగన్‌పై ఏపీ జ‌నం తీవ్రంగా మండిపడుతున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇలాంటి చేదు అనుభవాలు ఎన్నో ఎదురయ్యాయి. దీనికి తోడు.. వాలంటీర్ వ్యవస్థలోని పాపాల గుట్ట కూడా బయటపడటంతో, జగన్ ప్రభుత్వం ఇరుకున పడింది. ఇక నవరత్నాలను ఎలా నిర్వీర్యం చేశారో అందరికీ తెలిసిందేగా! మద్యపానం నిషేధం పేరుతో ఇంకా మద్యం అమ్మకాలు పెంచి పేదలను ఇబ్బంది పెట్టడమే కాకుండా మద్యం ద్వారా వచ్చే నిధులను పక్కదారి పట్టిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి తనపై వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్ చేసేందుకు జగన్ ‘స్కిల్ డెవలప్‌మెంట్’ కేసుని తెరమీదకు తీసుకొచ్చి, చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేయించారు. ఇప్పుడు టీడీపీకి వ్యతిరేకంగా ఏపీ ప్రజల్ని రెచ్చగొట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఒకవేళ టీడీపీపై అవినీతి బురదజల్లి, ప్రజల్ని నమ్మించడంలో సక్సెస్ అయితే.. అప్పుడు ముందస్తుకు వెళ్లడమే నయమని జగన్ ఉద్దేశంగా తెలుస్తోంది. టీడీపీని నిర్వీర్యం చేస్తే.. తమకు అనుకూలంగా ఓట్లు పడతాయని, ఫలితంగా మరోసారి అధికారాన్ని చేపట్టవచ్చని జగన్ క‌ల‌లు కంటున్నార‌ని వాస్త‌వ ప‌రిస్థితులు భిన్నంగా వున్నాయ‌ని ప్రముఖ రాజ‌కీయ విశ్లేష‌కులు అడుసుమిల్లి శ్రీనివాసరావు తెలుగుఒన్ తో అన్నారు. ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా జ‌గ‌న్‌కు ఘోర‌ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌ని ఆయ‌న విశ్లేషించారు. ఏపీలో మైండ్ బ్లాంక్ అయ్యే ఫలితాలు వస్తాయ‌ని, శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ వైసీపీకి సింగిల్ డిజిట్ మాత్రమే వస్తుందని ఆయ‌న విశ్లేషించారు.  వివేకా హత్య కేసును పక్కదారి పట్టించి చంద్రబాబు అరెస్టుపైనే రాజకీయం నడిపిస్తున్నారని.. కానీ ఏపీ ప్రజలు వివేకా హత్య కేసును మరిచిపోలేదని ఆయన పేర్కొన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లేంత సాహసం జగన్ చేయలేరని.. ఒకవేళ వెళ్లినా ఆయనకు ఘోర పరాభవం తప్పదని జోస్యం చెప్పారు. త‌న అధికారాన్ని అడ్డు పెట్టుకొని టీడీపీ నేత‌ల్ని భ‌య‌పెట్టేలా అరెస్ట్‌ల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. అందులో భాగంగానే బండారును అరెస్టు చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో చూసిన‌ట్లైతే టీడీపీ లో హ‌ల్‌చ‌ల్ చేసిన మంత్రులు ముగ్గురున్నారు.  వారిలో ఒకరు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అయితే,మరొకరు గంటా శ్రీనివాసరావు. వీరి మధ్యలో అంటే 1998 ప్రాంతంలో ఒక్కసారి మంత్రి చేశారు బండారు సత్యనారాయణమూర్తి. ఇలా ఈ ముగ్గురూ త్రిమూర్తులుగా ఉమ్మడి విశాఖ జిల్లా టీడీపీ పాలిటిక్స్ ని నడిపిస్తున్నారు. ఇందులో మొదట అరెస్ట్ చేసింది అయ్యన్నపాత్రుడిని. ఆయన మీద దాదాపుగా పదిహేను కేసులు వైసీపీ ప్రభుత్వం పెట్టింది. అయ్యన్న అరెస్ట్ ని పోలీసులు చూపించినా స్టేషన్ బెయిల్ తో ఆయన బయటకు వచ్చారు.  గడచిన నాలుగున్నరేళ్ళుగా అనేక సందర్భాలలో అయ్యన్నపాత్రుడు ప్రభుత్వం పైన‌,  జగన్ మీద వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. దాంతో ఆ విధంగా ఆయన మీద పెట్టిన కేసులే ఎక్కువగా ఉన్నాయి.  ఇక ఆయన తరువాత బండారు సత్యనారాయణమూర్తి వంతు వచ్చింది. బండారు మీడియా మీటింగ్స్ పెట్టి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా డోస్ ఎపుడూ ఒక స్థాయిలోనే ఉండేది. అలాంటి బండారు ఇటీవల సడెన్ గా మహిళా మంత్రి రోజా మీద  రెచ్చిపోయారు.  దాంతో ఆయన మీద రెండు కేసులు పెట్టి  అరెస్ట్ చేశారు. బెయిల్ మంజూర‌వ్వ‌డంతో ఆయ‌న బ‌య‌టికి వ‌చ్చారు.  ఇపుడు బండారు తరువాత ఎవరు అరెస్ట్ అవుతారు అన్నది విశాఖ జిల్లాలో చర్చ జ‌రుగుతోంది. త్రిమూర్తులలో ఇద్దరు అయిపోయారు కాబట్టి మూడవ షాట్ మాజీ మంత్రి గంటా కే అని అంటున్నారు. గంటా ఇటీవల కాలంలో ప్రభుత్వం మీద గట్టిగా నోరు చేసుకుంటున్నారు.   ఎన్నిక‌ల్ని దృష్టిలో పెట్టుకొనే  ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ త‌న‌దైన స్టైల్‌లో టీడీపీని టార్గెట్ చేస్తున్నార‌ని ఖ‌చ్చితంగా చెప్ప‌వ‌చ్చు. రాజ‌కీయాల్లో భాగంగా ముఖ్య‌మంత్రి దూకుడుగా వ్య‌వ‌హ‌రించ‌డాన్ని  ఆంధ్ర‌ప్ర‌జ‌లు జాగ్ర‌త‌గా గ‌మ‌నిస్తున్నారు.  అధికార పార్టీ చేసే కుట్రలు..... టీడీపీ నేతలకు, ప్రజలకు, కార్యకర్తలకు అర్థమైపోయింది.  చంద్రబాబును జైలుకు పంపి.. టీడీపీని ఏదో చేద్దామనుకుంటున్నారన్న స్పష్టత అందరికీ ఉంది. అన్ని రకాల వ్యవస్థల్నీ మేనేజ్ చేస్తున్నారని అర్థమవుతోంది.  ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం ఏమాత్రం భ‌య‌ప‌డ‌డం లేదు. భరించాల్సిన నష్టాలను.. కష్టాలను ఇప్పటికే భరించామని, ఇప్పుడు కొత్తగా పోయేదేమీ లేదని టీడీపీ క్యాడర్ తెగించి పోరాడుతోంది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత తెలుగు వాళ్లు ఉన్న ప్రతీ దేశంలోనూ నిర‌సనలు జరుగుతూనే వున్నాయి.  అందరూ ఎవరికి వారు మాట్లాడుకుని నిరసనలు చేశారు. ఏపీలో తీవ్రమైన కట్టడి మధ్య ప్రజలు బయటకు వస్తున్నారు. టీడీపీని ముక్క‌లు చేయ‌డానికి  కుట్ర జరుగుతోందని, కాపాడుకోవాలన్న సంకల్పం టీడీపీ క్యాడ‌ర్‌లో స్ప‌ష్టంగా కనిపిస్తోంది. చంద్ర‌బాబుపై నమ్మకం ఎక్క‌డా సడలిపోవడం లేదు. ఎదురొడ్డి నిలబడుతున్నారు. ఒక్క నేత కూడా వెనక్కితగ్గలేదు. దీనికి తోడు స‌ర్వే రిపోర్ట్స్‌  కూడా టీడీపీకి అనుకూలంగా రావ‌డంతో  ఇతర పార్టీల నేతలు టీడీపీలోకి చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీలో చేరబోతున్నారు. వైసీపీలోని మరికొంత మంది నేతలు కూడా టీడీపీలో చేర‌డానికి ఆస‌క్తి చూపుతున్నార‌ట‌. వైసీపీ నుంచి టికెట్ మ‌ళ్ళీ రాద‌నుకున్న నేత‌లంతా టీడీపీతో ట‌చ్‌లోనే వున్నార‌ట‌.  చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీని ఏదో చేద్దామనుకున్నారు కానీ… గ్రౌండ్ లెవెల్‌లో చూస్తే  టీడీపీ మరింత బలం పెంచుకుంది. ఇక్క‌డ ఓ విష‌యం మ‌నం గుర్తు చేసుకుంటే, అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ ప్ర‌స్తుత సి.ఎం. జగన్ మోహ‌న్ రెడ్డిని అరెస్టు చేసినప్పుడు అప్ప‌ట్లో ఒక్కరు కూడా రోడ్లపైకి రాలేదు. కుటుంబసభ్యులు మాత్రమే రోడ్డుపై ధర్నా చేశారు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు కోసం ఊళ్ల కు ఊళ్లు కదులుతున్నాయి. టీడీపీ గ్రాఫ్ కూడా బాగా పెరిగింద‌ని ఇంట‌లిజెన్స్ స‌ర్వేల్లో కూడా వ‌చ్చింద‌ట‌.  ఆ విష‌యాన్ని ప‌క్క‌దారి ప‌ట్టించ‌డానికే త‌న‌కు అనుకూలంగా ముఖ్య‌మంత్రి స‌ర్వే చేయించుకున్నార‌నే తాడేప‌ల్లిలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.  చంద్ర‌బాబు అరెస్టు త‌రువాత జ‌రుగుతున్న ప‌రిణామాల్ని క‌నుక గ‌మ‌నిస్తే,  టీడీపీ, జనసేన మధ్య పూర్తి స్థాయిలో ఫెవికాల్ బంధం ఏర్పడింది.  టీడీపీ, జనసేన క్యాడర్ కలిసిపోయాయి.  రాష్ట్రమంతా కలిసే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎక్కడా రెండో అభిప్రాయానికి చోటు లేకుండా … జ‌గ‌న్ ప్రభుత్వంపై పోరాటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. పవన్ వారాహి యాత్రలో టీడీపీ క్యాడ‌ర్ సందడి చేస్తుంది.   పవన్ కూడా టీడీపీ, జనసేన మధ్య బంధం ఎంత బలంగా ఉందో తేల్చి చెప్పేశారు. చిచ్చు పెట్టాలని ప్రయత్నించిన వైసీపీ కనీస ప్రయోజనం లభించలేదు. బలంపై స్పష్టమైన అవగాహనతో ఉన్న జనసేనానికి ఏపీ రాజకీయాలపై ఇప్పుడు పూర్తి స్పష్టత వచ్చింది. వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నారు.  పవన్ రాజకీయంగా రాటుదేలారని జ‌నం కూడా చెప్పుకుంటున్నారు.  మ‌రో వైపు టీడీపీ, జనసేన మధ్య బంధం.. లీడర్లు, క్యాడర్‌ స్థాయిలో  బాగానే కలిసిపోయింది.  జనసేనకు క్యాడర్ ఉంది. ఓట్లు వేసే ఫ్యాన్స్ ఉన్నారు . కానీ బలమైన నేతలు పరిమితంగానే ఉన్నారు. టీడీపీకి లీడర్, క్యాడర్ ఉన్నారు. ప్రణాళికాబద్దంగా వీరు పని చేసుకుంటే.. మైండ్ బ్లాంక్ అయ్యే ఫలితాలు వస్తాయి. పొత్తులు ఇప్పుడున్న రీతిలో కొనసాగిస్తే శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ వైసీపీకి సింగిల్ డిజిట్ మాత్రమే వస్తుందని ఇటీవ‌ల వ‌చ్చిన తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేంద్రంలోని బీజేపీ పెద్దలతో ఉన్న అనుబంధం ప్రత్యేక మైనది. ఏపీ ముఖ్యమంత్రిగా గత నాలుగేళ్ల పైచిలుకు పాలనలో జగన్ రెడ్డి అరాచకాలకు, అడ్డగోలు అప్పులకు కేంద్రం పెద్దలు వెన్నుదన్నుగా నిలిచారన్న భావన ఏపీలో గట్టిగా వ్యక్తం అవుతోంది. తెలుగు రాష్ట్రాలలో జగన్ సర్కార్ విషయంలో ఒకలా, తెలంగాణ సర్కార్ విషయంలో ఒకలా కేంద్రం వ్యవహరిస్తోందన్న ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కి, పరిమితిని మించి ఏపీకి అప్పులు మంజూరు అవుతుండగా, అవే నిబంధనల సాకుతో  తెలంగాణకు మాత్రం అప్పులు దక్కకుండా కేంద్రంలోని మోడీ సర్కార్ అడుగడుగునా అడ్డుపడుతున్నది.  వాస్తవానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రెండూ కూడా మోడీ అడుగులకు మడుగులొత్తుతూనే మనుగడ సాగించాయి. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి ఎప్పుడైతే భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిందో  అప్పటి నుంచీ కేంద్రంతో బీఆర్ఎస్ బంధం ఉప్పూ నిప్పులా మారింది. అలా మారడానికి కారణమేమిటో ప్రధాని మోడీ నిజామాబాద్ బహిరంగ సభ సాక్షిగా మంగళవారం ( సెప్టెంబర్ 3) వెల్లడించారు. సరిగ్గా ఎన్నికల ముంగిట ప్రధాని మోడీ కేసీఆర్ హస్తినలో తనతో భేటీ అయిన సందర్భంగా ఏం మాట్లాడారు, ఏం కోరారు అన్నది బయటపెట్టి సంచలనం సృష్టించారు. బీఆర్ఎస్ కాళ్ల కింద నేల భూకంపం వచ్చినట్లుగా కదిలిపోయేలా చేశారు. ఇంతకీ మోడీ ఏం చెప్పారంటే నాలుగేళ్ల కిందట.. అంటే జీహెచ్ఎంసీ ఎన్నికలలో బీఆర్ఎస్ కు బీజేపీ చేతిలో చావుతప్పి కన్ను లొట్టపోయినంత పనైంతరువాత కేసీఆర్ హస్తిన వెళ్లి మోడీతో భేటీ అయ్యారు. ఆ భేటీలో బీఆర్ఎస్ (అప్పటికి టీఆర్ఎస్)  ను ఎన్డీయేలో చేర్చాలని, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రిగా తన కుమారుడు కేటీఆర్ కు పట్టం కట్టాలని భావిస్తున్నాననీ, అందుకు ఆశీర్వాదం కావాలని మోడీని అడిగారు. అలా అని మోడీ నిజామాబాద్ బహిరంగ సభలో చెప్పారు. అంతే కాదు.. తాను ఎన్డీయేలో బీఆర్ఎస్ ను చేర్చుకోవడానికి నిరాకరించాననీ వెళ్లడించారు. అంతే కాదు.. ఇదేమీ రాజరికం కాదనీ, ప్రజల ఆశీస్సులుంటేనే పదవులు దక్కుతాయనీ, కేటీఆర్ ప్రజామద్దతుతో ముఖ్యమంత్రి అయితే ఆశీర్వదిస్తాననీ అన్నానని కూడా సెలవిచ్చారు. ఆ తరువాత నుంచే కేసీఆర్ కేంద్రం, మోడీ లక్ష్యంగా విమర్శలు గుప్పించడం ప్రారంభించారనీ, నాలుగో ఫ్రంట్, మూడో ప్రత్యామ్నాయం అంటూ.. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతానంటూ బయలు దేరారని మోడీ మాటలతో తేటతెల్లమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మోడీ ప్రభుత్వ వైఫల్యాలు అంటూ విమర్శలు గుప్పించిన కేసీఆర్ ఆ తరువాత తన కుమార్తె కవిత మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొనడంతో సైలంటయ్యారనీ, తన కుమార్తెను మద్యం కుంభకోణం నుంచి బయటపడేయమంటూ అమిత్ షా వద్దకు తెలంగాణ,  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ గా పని చేసిన నరసింహన్ ను రాయబారం పంపారనీ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. సరైన సమయంలో కీలెరిగి వాతపెట్టిన చందంగా కేసీఆర్ రాజకీయాలన్నీ స్వార్ధం కోసమేనని మోదీ కుండబద్దలు కొట్టారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో మోడీ కూడా ఎన్నికల సమయంలోనే ఆరోపణలు చేస్తారనీ, లేకుంటే నాలుగేళ్లుగా గోప్యంగా ఉంచిన విషయాన్ని ఎన్నికల సమయంలోనే ఎందుకు వెల్లడించారనీ ప్రశ్నిస్తున్నారు.  ఇదే విధంగా  ఎన్నికల ముంగిట ఏపీలో జగన్ సర్కార్ బండారాన్ని కూడా మోడీ బయటపెట్టగలరా అని ప్రశ్నిస్తున్నారు.  ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దేశంలోని ఏ ముఖ్యమంత్రికీ లభించని విధంగా కోరినప్పుడల్లా ప్రధాని అప్పాయింట్ మెంట్ లభిస్తుంది. స్పష్టంగా చెప్పాలంటే.. సిఎం జగన్ సగటున నెలకొకసారి అయినా మోడీ, షాలతో హస్తినలో భేటీ అవుతుంటారు. ఆ భేటీలలో చర్చకు వచ్చే  అంశాలేమిటన్నది బ్రహ్మ రహస్యం అన్నట్లుగా ఉంటుంది. అధికారిక పర్యటనపై హస్తిన వెళ్లిన సీఎం మొక్కుబడి ప్రెస్ నోట్ విడుదల చేయడం తప్ప.. హస్తినలో కానీ, ఏపీలో కానీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించిన దాఖలాలు లేవు.  పైగా కేంద్రం పెద్దలతో జగన్  భేటీలన్నీ ఆయనపై అక్రమాస్తుల కేసు విచారణకు వచ్చినప్పుడు,  సొంత బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచినప్పుడు ఉంటాయి. జగన్ హస్తిన వెళ్లి వచ్చిన తరువాత  సీబీఐ దూకుడు ఉండదు, అక్రమాస్తుల కేసుల విచారణ మందగిస్తుంది.   ఇప్పుడు పరిశీలకులు ఆ విషయాలనే సోదహరణగా ప్రస్తావిస్తూ.. జగన్ కు ఈ స్థాయిలో ప్రయోజనం కలిగిస్తున్న మోడీ తనతో భేటీ సందర్భంగా జగన్  ఏం మాట్లాడారు, ఏం కోరారు అన్నది వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు.  ఇప్పుడు స్కిల్  కేసులో చంద్రబాబు అరెస్టు తరువాత జగన్ తన ప్రతిష్టనే కాకుండా తనకు అండదండగా ఉంటూ వస్తున్న మోడీ ప్రతిష్టను కూడా మంటగలిపేశారని పరిశీలకులు అంటున్నారు. అంతే కాకుండా ఇప్పటికీ ఏపీలో నడుస్తున్న స్కిల్ సెంటర్ల పేరును మార్చేసి అవి కేంద్రం స్పాన్సర్ షిప్ తో నడుస్తున్న కేంద్రాలుగా చూపే ప్రయత్నం చేసి మోడీని కూడా ఇరికించేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో మోడీ తనపై నింద పడకుండా ఉండేదుకైనా సరే జగన్ బండారాన్ని బయటపెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు. అయితే జగన్ ది కక్ష సాధింపు రాజకీయం అయితే మోడీది ఎన్నికల రాజకీయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ జాతీయ రాజకీయాలలోకి అడుగుపెట్టడానికి గల కారణాన్ని ఎలాగైతే ఎన్నికల వేళ వెల్లడించారో.. అలాగే జగన్ బండారాన్ని కూడా ఏపీలో ఎన్నికల సమయం మరింత దగ్గరపడిన సమయంలో మోదీ బట్టబయలు చేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. 
బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో నేడు 20 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించింది. ఈ జాబితాలో బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఉన్నారు. ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. పలు కసరత్తుల అనంతరం మిగతా స్థానాలకు కూడా విడతల వారీగా అభ్యర్థులను ప్రకటించనున్నారు. తెలంగాణలో మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడం తెలిసిందే.  బీఎస్పీ అభ్యర్థుల తొలి జాబితా... 1. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్- సిర్పూర్,2. మేడి ప్రియదర్శిని- నకిరేకల్,3. పిలుట్ల శ్రీనివాస్- కోదాడ,4.జంగం గోపి- జహీరాబాద్,5 బానోత్ రాంబాబు నాయక్- వైరా,6.ఎన్.రాంచందర్-మానకొండూరు, 7. దాసరి ఉషా- పెద్దపల్లి, 8. నాగమోని చెన్  రాములుముదిరాజ్- వనపర్తి, 9. ప్రద్యుమ్నకుమార్ మహదేవ్ రావు ఏకాంబర్- జుక్కల్,10. ముప్పారపు ప్రకాశం- ఆందోల్,11.చంద్రశేఖర్ ముదిరాజ్- తాండూర్, 12. ఎర్రా కామేశ్- కొత్తగూడెం, 13.నక్కావిజయ్ కుమార్- ధర్మపురి,14. కొత్తపల్లి కుమార్- నాగర్ కర్నూలు,15. వట్టె జానయ్య యాదవ్- సూర్యాపేట,16.డాక్టర్ ముదావత్ వెంకటేశ్ చౌహాన్- దేవరకొండ,17. గడ్డం క్రాంతి కుమార్- వికారాబాద్18. బన్సీలాల్ రాథోడ్- ఖానాపూర్,19. కొంకటి శేఖర్- చొప్పదండి,20.అల్లికవెంకటేశ్వరరావు యాదవ్- పాలేరు
ALSO ON TELUGUONE N E W S
మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, ఇండియన్‌ క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ ధోని ముంబైలో కలుసుకున్నారు. వీరిద్దరూ కలిసి దిగిన ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 13 సంవత్సరాల క్రితం ఒక కమర్షియల్‌ యాడ్‌ కోసం వీరిద్దరూ కలిసారు. మళ్ళీ ఇన్నాళ్ళకు కలుసుకున్నారు. ఈ ఫోటో బయటికి వచ్చిన మరుక్షణమే సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘బెస్ట్‌ పిక్‌ ఆప్‌ ది డే’ అంటూ కామెంట్లు పెడుతూ షేర్‌ చేస్తున్నారు నెటిజన్లు.  మళ్ళీ వీరిద్దరూ కలవడం వెనుక రీజన్‌ ఏమిటి.. అని అందరూ అనుకుంటున్నారు. 2009లో పెప్సీ యాడ్‌లో ఇద్దరూ కలిసి కనిపించారు. అప్పట్లో దానికి మంచి పేరు వచ్చింది. అయితే ఒక కమర్షియల్‌ యాడ్‌లో కలిసి నటించేందుకే మళ్ళీ కలిసారని తెలుస్తోంది. పెప్సీ యాడ్‌ బాగా సక్సెస్‌ అవ్వడంతో మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి యాడ్‌ చేస్తే బాగుంటుందని అప్పట్లో అభిమానులు కోరుకున్నారు. అది ఇన్నాళ్ళకు జరుగుతోంది. వాస్తవానికి 2016లో నీరజ్‌ పాండే దర్శకత్వంలో రూపొందిన ‘ఎం.ఎస్‌.ధోని’  బయోపిక్‌లో సురేష్‌ రైనా పాత్రను రామ్‌చరణ్‌ చేస్తారనే వార్త వినిపించింది. అది రూమర్‌ అని తర్వాత అర్థమైంది. అయితే మళ్ళీ ఇద్దరూ కలిసి ఒక యాడ్‌ నటించడం అనేది ఇద్దరి అభిమానులు సంతోషించే విషయమే కదా.  
సినిమా ఇండస్ట్రీలోని హీరోలు, హీరోయిన్లు వారికి తెలియకుండానే పెళ్ళి పీటలు ఎక్కేస్తున్నారు. అదెలాగంటే.. ఈ సెలబ్రిటీలకు పెళ్ళి చేసుకోవాలనే ఆలోచన లేకపోయినా ఎవరో ఒకరితో వారికి లింక్‌ పెట్టేసి త్వరలో ఒక్కటవుతున్న జంట అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం చేసేస్తున్నారు. సాధారణంగా ఇలాంటి న్యూస్‌లు ఎక్కువ వైరల్‌ అవుతుంటాయి. ఎందుకంటే సెలబ్రిటీల పర్సనల్‌ లైఫ్‌ గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. ప్రభాస్‌, రామ్‌.. ఇంకా కొందరు హీరోలు, హీరోయిన్లు వయసు మీద పడుతున్నా వారికి పెళ్ళి మీద ధ్యాస ఉండడం లేదు. అయితే వారికి ఏదో విధంగా పెళ్ళి చేసేద్దాం అన్న ధోరణిలో నెటిజన్లు వారి పెళ్ళికి సంబంధించిన వార్తలను వైరల్‌ చేస్తున్నారు. తాజాగా సింగర్‌ మంగ్లీ పెళ్ళి విషయం వార్తల్లోకి వచ్చింది. ఆమె పెళ్ళి చేసుకోబోతోందని, వరుడు వరసకు బావ అవుతాడనే న్యూస్‌ వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన మంగ్లీ.. ‘ఇప్పట్లో నాకు పెళ్ళి చేసుకునే ఆలోచన లేదు. నేను చేసుకోబోయేవాడు వరసకు బావ అవుతాడని అంటున్నారు. అసలు నాకు తెలీని బావ ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు. భగవంతుడా.. నాక్కూడా తెలీకుండా నా పెళ్ళి చేసేస్తున్నారు’ అంటూ తన పెళ్ళి గురించి క్లారిటీ ఇచ్చింది. 
సింహం ఒక అడుగు వెనక్కివేసింది అంటే వంద అడుగులు ముందుకు వెయ్యడానికి అనే సూత్రాన్ని తన జైలర్ మూవీ విజయం తో  రజని మరోసారి  భారతీయ చిత్ర పరిశ్రమకి గుర్తు చేసాడు. అలాగే జైలర్ మూవీ రిలీజ్ ముందు వరకు ఉన్న అన్ని రికార్డులని  తుడిపేసి లేట్ గా అయినా లేటెస్ట్ గా వచ్చాను అర్థమైందా రాజా అని తన పని అయిపోయిందని అనుకున్న వాళ్ళకి కూడా తన సత్తాని చూపించాడు .జైలర్ సక్సెస్ మోడ్ లో ఉన్న రజని తాజాగా ఒక కొత్త చిత్రాన్ని ప్రారంచించారు.ఆ మూవీ ఓపెనింగ్ కి సంబంచిన ఫొటోస్ రజని ఫాన్స్ ని ఆనందం లో ముంచడంతో పాటు సోషల్ మీడియాని ఒక ఊపు ఉపుతున్నాయి. రజని..ఈ ఒక్క పేరు చాలు ప్రపంచ బాక్స్ ఆఫీస్ సినిమా కలక్షన్ ల వర్షం తో తడిసి ముద్దవటానికి . రజని దాదాపు రెండు దశాబ్దాలపై నుంచి తన సినిమాలతో సినీ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తూ వస్తున్నారు. లేటెస్ట్ గా జైలర్ మూవీతో సక్సెస్ కొట్టి ఇప్పుడు తన 170 వ సినిమాగా టీజె జ్ఞానవేల్ దర్శకత్వం లో నటిస్తున్నాడు. ఆ మూవీ తాజాగా పూజ కార్యక్రమాలతో త్రివేండ్రంలో  ప్రారంభం అయ్యింది. ఆ పూజ కార్యక్రమంలో రజని లుక్ ని చూసిన ఫాన్స్ మొత్తం ఫుల్ ఖుషీగా ఉన్నారు. రజని ఇంకో ఇరవై ఏళ్ళు వెన్కక్కి వెళ్లాడని అంటున్నారు.   మూవీ లోని మిగతా ఆర్టిస్టుల విషయానికి వస్తే.. ఎన్నో సంవత్సరాల నుంచే రజని అంటేనే  పాన్ ఇండియా హీరో ఇప్పుడు ఈ సినిమా లో కూడా పాన్ ఇండియా లెవెల్లో పేరెన్నికిగన్న నటులు నటిస్తున్నారు. ది గ్రేట్ ఇండియన్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ ఈ మూవీ లో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే ఇటీవలే విక్రమ్,పుష్ప సినిమాలతో దేశ వ్యాప్తం గా పేరు తెచ్చుకున్న ఫహద్ ఫాజిల్,అలాగే బాహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా కీర్తిని తెచ్చుకున్న దగ్గుబాటి రానాలు నటిస్తుండటం తో తలైవా 170 మీద ఎన్నో అంచనాలు ఉన్నాయి.అందరి అంచనాలని అందుకునే విధంగానే ఈ చిత్ర కథ ఉండబోతుందని తెలుస్తుంది. లైకా ప్రొడక్షన్స్ పై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ తలైవా 170 కి అనిరుద్ సంగీత సారధ్యం వహిస్తున్నాడు.    
ఇటీవల డ్రగ్స్‌ కేసుకు సంబంధించి హీరోయిన్‌ వరలక్ష్మీ శరత్‌కుమార్‌ పేరు వినిపించిన విషయం తెలిసిందే. ఆమెకు సమన్లు ఇచ్చారని, త్వరలోనే ఆమెను ఈ కేసు విషయంలో ఎంక్వరీ చేస్తామని పోలీసులు తెలిపినట్టు వార్తలు వచ్చాయి. సోషల్‌ మీడియాలో వరలక్ష్మీ పేరు రాగానే దీనిపై వెంటనే ఆమె స్పందించింది. తనకు ఎలాంటి సమన్లు అందలేదని, అసలు ఈ కేసుతో తనకు సంబంధం లేదని ఆమె చెప్పింది.  ఈ విషయాన్ని మరోసారి ఖండిస్తూ.. తన పేరు ఈ కేసులో వినిపించచడానికి గల కారణాలను తెలియజేస్తూ.. ‘నా దగ్గర ఫ్రీలాన్స్‌ మేనేజర్‌గా పనిచేసిన ఆదిలింగం ద్వారా తనకు మూడు సినిమాలు వచ్చాయి. వాటిని పూర్తి చేశాను. అక్కడితో అతని పని అయిపోయింది. పర్సనల్‌ లైఫ్‌లో అతను ఏం చేస్తుంటాడో నాకెలా తెలుస్తుంది.  2020లో కేరళలో విల్లించాం తీర ప్రాంతంలో పోలీసులు సోదాలు చేయగా.. ఒక పడవలో డ్రగ్స్‌, రైఫిళ్లు, బుల్లెట్స్‌ లభించాయి. అప్పుడు 13మందిని అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత 14వ నిందితుడిగా ఆదిలింగంను ఇటీవల పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతను నా దగ్గర మేనేజర్‌గా పనిచేశాడు కాబట్టి నాకు కూడా దీనితో ఉన్నాయని అనుమానించిన పోలీసులు నాకు సమన్లు ఇచ్చారని, త్వరలో ఎంక్వరీ చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. ఈ కేసులో వరలక్ష్మీ మేనేజర్‌ అరెస్ట్‌ అనేసరికి నా పేరు బాగా వినిపించింది.  ఆదిలింగం ఫోటో వేసి న్యూస్‌ రాస్తే ఎవ్వరూ చదవరు, నా మేనేజర్‌ అని రాస్తే అందరూ చదువుతారు. అలా నా పేరు ఇందులోకి వచ్చింది’ అన్నారు.   
ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఎ.ఆర్‌.రెహమాన్‌ గతంలో కొన్ని వివాదాల్లో ఇరుక్కున్న విషయం తెలిసిందే. తాజాగా మరో కొత్త వివాదం రెహమాన్‌ను వేధిస్తోంది. అదేమిటంటే.. అసోసియేషన్‌ ఆఫ్‌ సర్జన్స్‌ ఆఫ్‌ ఇండియా.. ఎ.ఆర్‌.రెహమాన్‌పై ఫిర్యాదు చేసింది.  తమ అసోసియేషన్‌ తరఫు నుంచి రూ.29 లక్షలు తీసుకొని అగ్రిమెంట్‌ చేసుకున్న రెహమాన్‌ దానికి తగ్గట్టుగా కాన్సర్ట్‌ చేయలేదని ఆ సంస్థ ఆరోపించింది. చిన్నగా ప్రారంభమైన ఈ వివాదం ఇప్పుడు పెద్దదిగా మారడంతో రెహమాన్‌ తన న్యాయవాదిని సంప్రదించారు.  దీనిపై స్సందించిన రెహమాన్‌ న్యాయవాది.. తన క్లయింట్‌పై నమోదు చేసిన కేసును మూడు రోజుల్లోగా ఉపసంహరించుకోవాలని కోరారు. అంతేకాదు, తన క్లయింట్‌ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేసిన వైద్యుల సంఘం రూ.10 కోట్ల పరువు నష్టం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. వైద్యులు రెహమాన్‌పై చేసిన ఆరోపణల్లో నిజం లేదని, దీని వెనుక థర్డ్‌ పార్టీ జోక్యం ఉందని తెలిపారు. ఈ విషయంలో రెహమాన్‌కు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని వైద్యుల సంఘాన్ని రెహమాన్‌ తరఫు న్యాయవాది కోరారు. 
నందమూరి నట సింహం బాలకృష్ణ అమ్ముల పొదిలో నుంచి వస్తున్న తాజా మూవీ భగవంత్ కేసరి. సినిమా రిలీజ్ దగ్గర పడేకొద్దీ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ని మేకర్స్ ఒక లెవెల్లో స్టార్ట్ చేసారు. రెండు రోజులకొకసారి అయినా కూడా భగవంత్ కేసరి మూవీ కి సంబంధించిన ఏదో ఒక  న్యూస్ బయటికి వస్తు నందమూరి అభిమానులని ఆనందంలో ముంచెత్తుతుంది. ఇప్పుడు వాళ్ళ ఆనందాన్ని మరింత పెంచేలా భగవంత్ కేసరి మూవీ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ అయ్యింది. రిలీజ్ అవ్వటమే కాదు కొన్ని డౌట్స్ కి పూర్తి క్లారిఫై ని కూడా ఇచ్చింది. విజయదశమి కానుకగా అక్టోబర్ 19 న బాలయ్య,అనిల్ రావిపూడిల భగవంత్ కేసరి ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుందనే విషయం అందరికి తెలిసిందే. ట్రైలర్ కూడా మరికొన్ని రోజుల్లో విడుదల కాబోతుంది .అలాగే ఈ మూవీ నుంచి ఆల్రెడీ ఒక సాంగ్ రిలీజ్ అయ్యి సంగీత అభిమానులని ఉర్రుతలూగిస్తుంది. ఇప్పుడు రెండో సాంగ్ రిలీజ్ అయ్యి రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే రికార్డు స్థాయిలో వ్యూయర్స్ ని సంపాదించింది. ఉయ్యాలో ఉయ్యాలా అనే పల్లవితో స్టార్ట్ అయిన సాంగ్ లో  బాలకృష్ణ సూపర్ పెరఫార్మెన్సు ని ఇచ్చి సినిమా మీద మరిన్ని అంచనాల్ని పెంచాడు. అలాగే ఈ సాంగ్ ద్వారా ప్రేక్షకులకి వచ్చిన క్లారిఫై ఏంటంటే ఒక చిన్న పాప తో ఉయ్యాలో ఉయ్యాలా అనే పాట ప్రారంభించిన బాలయ్య అదే పాట కంటిన్యుటీ లో ఆ పాప పెరిగి పెద్దది అవుతుంది. ఆ పాప రోల్ లో శ్రీ లీల నటించింది. సో ఆడియన్స్ కి ఉన్న కొన్ని డౌట్స్ కి మేకర్స్ క్లారిఫై ఇచ్చినట్టయ్యింది. సాంగ్ మాత్రం సూపర్ గా ఉంది.అలాగే సాంగ్ లో బాలయ్య క్లాస్ స్టెప్స్ కూడా సూపర్ గా ఉన్నాయి.మీరు కూడా  ఒక లుక్ వెయ్యండి .అనంత శ్రీరామ్ ఆ పాటని రాయగా ఎస్.పి చరణ్ అద్భుతంగా పాడాడు.
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో 'దేవర' చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఈ ఏడాది చివరికల్లా దేవర షూటింగ్ పూర్తి చేసి ఆ వెంటనే బాలీవుడ్ ఫిల్మ్ 'వార్-2'తో బిజీ కానున్నాడు. దాని తర్వాత 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా కమిటై ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆ సినిమా ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. 'దేవర' సినిమాని రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు తాజాగా అధికారికంగా ప్రకటించారు. అంటే దేవర కోసం ఎన్టీఆర్ మరో ఏడాది కేటాయించనున్నాడన్నమాట. 2024, ఏప్రిల్ 5న దేవర మొదటి భాగం విడుదల కానుంది. ఆలోపు ఎన్టీఆర్ 'వార్-2' షూటింగ్ పూర్తి చేసి, ఆ తర్వాత 'దేవర-2' షూటింగ్ లో పాల్గొనే అవకాశముంది. ఇది పూర్తయ్యే సమయానికి 2024 పూర్తయ్యి 2025 కూడా వచ్చేస్తుంది. ఇదే ఇప్పుడు ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పై అనుమానాలు రేకెత్తిస్తోంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ ని 2024, మార్చిలో స్టార్ట్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడది 2025, మార్చికి వెళ్ళిపోయినా ఆశ్చర్యంలేదు.  ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ చేస్తున్నాడు. ఈ సినిమా కూడా రెండు భాగాలుగా రానుంది. సెప్టెంబర్ 28న విడుదల కావాల్సిన 'సలార్-1' డిసెంబర్ 22 కి వాయిదా పడింది. 'సలార్-2' ఎప్పుడొస్తుందో ఇంకా క్లారిటీ లేదు. అటు 'దేవర-2', ఇటు 'సలార్-2' పూర్తయితేనే.. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల ల ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశముంది. ఈ ప్రాజెక్ట్ కి 2025 లో మోక్షం కలుగుతుందేమో చూడాలి.
బుల్లితెరపై, వెండితెరపై రాణిస్తూ ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న అనసూయ ఇప్పుడు సినిమాలపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ, కొన్ని విషయాలపై స్పందించే అనసూయకు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎక్కువే. అందుకే తనకు సంబంధించిన ఏ విషయాన్నయినా అభిమానులతో షేర్‌ చేసుకుంటుంది. అంతేకాదు, తన వివాదాస్పద వ్యాఖ్యలతో కొన్నిసార్లు ఇరుకున పడిన సందర్భాలు కూడా లేకపోలేదు.  లేటెస్ట్‌గా సోషల్‌ మీడియాలో ఓ కొత్త పోస్ట్‌తో అభిమానుల్ని పలకరించింది అనసూయ. తన భర్త పుట్టినరోజు సందర్భంగా అనసూయ ఓ ఇంట్రెస్టింగ్‌ ట్వీట్‌ వేసింది. అదేమిటంటే.. ‘నీలాంటి భర్త, నీలాంటి తండ్రి, నీలాంటి కొడుకు, నీలాంటి అల్లుడు, నీలాంటి అన్న... మొత్తానికి నీలాంటి మగాడు ఈ ప్రపంచానికి కావాలి’ అంటూ  అనసూయ వేసిన ట్వీట్‌తో తన భర్తపై ఆమెకు ఎంత ప్రేమ వుందో వ్యక్తమవుతోందని నెటిజన్లు ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇప్పుడీ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా పి.వాసు దర్శకత్వంలో రూపొందిన ‘చంద్రముఖి’ అప్పట్లో సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా రిలీజ్‌ అయిన 18 సంవత్సరాలకు సీక్వెల్‌ రాబోతోందని అధికారికంగా ప్రకటించిన రోజు నుంచి సినిమాపై చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్‌ నెలకొన్నాయి. రాఘవ లారెన్స్‌, కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘చంద్రముఖి 2’ ఇటీవల విడుదలైంది. అయితే అందరూ ఆశించిన విధంగా ఈ సినిమా విజయం సాధించలేదు. విడుదలైన తొలి రోజు నుంచే ఈ సినిమాకి డివైడ్‌ టాక్‌ రావడంతో కలెక్షన్స్‌ కూడా అనుకున్న స్థాయిలో సాధించలేకపోయింది. అయితే థియేటర్స్‌లో ఈ సినిమాకి ఆదరణ లభించకపోయినా ఓటీటీలో మాత్రం మంచి డిమాండ్‌ ఏర్పడింది. ‘చంద్రముఖి 2’ ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ ఫ్యాన్సీ ఆఫర్‌తో కొనుగోలు చేసిందని తెలుస్తోంది. దాదాపు రూ. 8 కోట్లు చెల్లించి ఈ రైట్స్‌ పొందిందని సమాచారం. సినిమా రిలీజ్‌ అయిన 45 రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్‌ చెయ్యాలని మొదట భావించినప్పటికీ థియేటర్లలో ఈ సినిమాకి ఆదరణ లేకపోవడంతో అంతకంటే ముందే ఓటీటీలో రిలీజ్‌ చేసెయ్యాలని భావిస్తున్నారు. ‘చంద్రముఖి 2’ ఓటీటీ రిలీజ్‌కి సంబంధించి అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడకపోయినప్పటికీ నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ ఈ సినిమాను స్ట్రీమింగ్‌ చేయబోతోందనే వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 
ఈ మధ్య కాలంలో పలు భారీ సినిమాలు రెండు భాగాలుగా తెరకెక్కుతున్నాయి. ఇప్పుడు ఆ లిస్టులో జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న 'దేవర' కూడా వచ్చింది. దేవర చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు తాజాగా దర్శకుడు కొరటాల శివ అధికారికంగా ప్రకటించారు. 'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ ఎన్టీఆర్, కొరటాల కాంబోలో రూపొందుతోన్న మూవీ 'దేవర'. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలున్నాయి. 'ఆర్ఆర్ఆర్'తో గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఎన్టీఆర్.. మరోసారి బాక్సాఫీస్ దగ్గర గర్జించడం ఖాయమని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఆ అంచనాలను, నమ్మకాన్ని రెట్టింపు చేస్తూ ఈ సినిమాని రెండు భాగాలుగా రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కొరటాల ఓ వీడియోని విడుదల చేశారు. "దేవరలో ఓ కొత్త ప్రపంచం చూపించబోతున్నాం. బలమైన కథ, బలమైన పాత్రలు, బలమైన ఎమోషన్స్ ఉంటాయి. కథగా ఎంత ఎక్సైట్ అయ్యామో, తెరకెక్కిస్తున్నప్పుడు అంతకంటే ఎక్కువ ఎక్సైట్ అవుతున్నాం. దేవర ప్రపంచం రోజురోజుకి పెద్దగా కనిపిస్తోంది. కథ పెద్దది కావడం, బలమైన పాత్రలు, ఎమోషన్స్ ఉండటంతో.. ఆదరాబాదరాగా ఒక్క పార్ట్ లో ఈ కథని ముగించడం తప్పు అనిపించింది. ఈ కథని రెండు భాగాలుగా తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాం" అని కొరటాల వీడియోలో తెలిపారు. దేవర చిత్రం 2024 ఏప్రిల్ 05న విడుదల కానుందని గతంలో ప్రకటించారు. ఇప్పుడు రెండు పార్టుల అనౌన్స్ మెంట్ రావడంతో.. మొదటి ఏప్రిల్ 05న రానుందని అర్థమవుతోంది. మరి రెండో భాగం ఎప్పుడొస్తుందో చూడాలి.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్ష తరహ పాలనా వ్యవస్థ వైపుగా పాప్వులు కదుపు తున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రానున్న రెండు మూడు నెలల్లో జరగనునన్న  నాలుగు రాష్ట్రాల,పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల శాసన సభలకు జరిగే ఎన్నికల్లో  బీజేపీ కి ఆశించిన ఫలితాలు  వస్తే ... ఇక ఆ తర్వాత అధ్యక్ష తరహ పాలనా వ్యవస్థ వైపుగా పావులు మరింత వేగంగా కడులుతాయని అంటున్నారు.నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం. ఈ ఎన్నికలలో విజయం సాధించడం కోసం, అన్నిరాజకీయ పార్టీలు ఎప్పటినుంచో  సన్నాహాలు చేసుకుంటున్నాయి.అయితే,కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, అందరికంటే మిన్నగా, ఎట్టి పరిస్థితులలోనూ ఒక్క కేరళ తప్పించి మిగిలిన మూడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో సొంత ప్రభుత్వం కాదంటే  తమ చెప్పు చేతల్లో ఉండే ప్రభుత్వాలు ఏర్పడాలని, అందుకోసం ఎందాకా అయినా వెళ్లేందుకు సిద్దం అన్న సంకేతాలను ఇస్తోంది.  పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్నతృణమూల్ కాంగ్రెస్’ను పూర్తిగా తుడచి పెట్టేస్తోంది, తెర వెంక ఏమి చేస్తోందో ఏమో గానీ, తెరమీద చూస్తే, తృణమూల్ ఎంపీలు, ఎమ్మెల్ల్యేలు, మంత్రులు చివరకు తృణమూల్ అధినాయకురాలు, ముఖ్యమంత్రి మమత బెనెర్జీ సొంత మనుషులు, ఇంటి మనుషులు, కుటుంబ సభ్యులు బారులుతీరి మరీ కమలదళంలో చేరిపోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నడ్డా, మరో పది మందివరకు కేంద్ర మంత్రులు, విధ రాష్టాల ముఖ్యమంత్రులు ఇలా ఒకరి వెంట ఒకరు, పస్చిమ బెంగాల్ పై దండయాత్ర చేస్తున్నారు. మమతా బెనర్జీ అంతటి గడుసు పిండాన్ని ఒక్కరి బిక్కిరి చేస్తున్నారు. అంతిమ ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది ఎలా ఉన్నా, ప్రస్తుతానికి అయితే పశ్చిమబెంగాల్ కమల దళం ఖాతాలో చేరినట్లే  అన్న అభిప్రాయమే వ్యక్తమౌతోంది.  అలాగే ఇటీవల పుదుచ్చేరిలో ఏమి జరిగిందో చూశాం, మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న సమయంలో, అధికార కాంగ్రెస్ పార్టీ  ఎమ్మెల్యేలు వరస పెట్టి రాజీనామా చేయడం,ఆవెంటనే ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రభుత్వం కుప్ప కూలిపోవడం, అదే సమయంలో అంతే వేగంగా లెఫ్ట్’నెంట్ గవర్నర్’ కిరణ బేడీ ఉద్వాసన, ఆమె స్థానంలో తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్’కు అదనపు బాధ్యతలు అప్పగించడం, ఆమె సిఫార్సు మేరకు, రాష్ట్రపతి పాలన విధించడం అన్నీ  చక చకా జరిగి పోయాయి. గతంలో కర్ణాటక, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలలో బీజేపీ రాజీనామాల రూటులో కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చి అధికారాన్ని ఎగరేసుకు పోయినా, రాజస్థాన్’లో అలాంటి విఫల ప్రయత్నం చేసిందన్నా కొంతవరకు అర్థం చేసుకోవచ్చునుకానీ, నిండా నాలుగు పుంజీల సభ్యులు లేని పుదుచ్చేరిలో అది కూడా మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో ఇంతటి తెలివి తక్కువ పరువు తక్కవ పని బీజేపీ ఎందుకు చేసింది,అనేది అనేక మందిలో ఉన్న సందేహం. అయితే అందరూ అనుకుంటున్నట్లుగా బీజేపీ నాయకత్వం తెలివి తక్కువగా, పరువు తక్కువ పనులు చేయడం లేదు. పార్టీ లోగుట్లు, అంతర్గత వ్యవహారాలు తెలిసిన అంతరంగికుల సమాచారం ప్రకారం, సంఘ్ పరివార్ సిద్దాంతానికి కార్యరూపం ఇచ్చే వ్యూహంలో భాగంగానే బీజేపీ నాయకత్వం అడుగులు చేస్తోంది. అంతిమ లక్ష్యం, అంతిమ గమ్యం చేరుకోవడంలో ఐడియాలజీ విషయంలో కొంచెం కాంప్రమైజ్’ అయినా ఫర్వాలేదని, ఇటీవల పార్టీ అంతర్గత సమావేశాల్లో సర్దుబాటు ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని కూడా లోపలి సమాచారం.  అయితే ఇక్కడ బీజేపీ ముందున్న అంతిమ లక్ష్యం ఏమిటి,అంటే, ఆర్టికల్ 370 రద్దు నుంచి, పాక్ ఆక్రమిత కాశ్మీర్’ తిరిగి భారత దేశంలో కలుపుకోవడం వరకు, ట్రిపుల్ తలాక్ నుంచి ఉమ్మడి పౌర స్మృతి వరకు ... రామ మందిరం నిర్మాణం మొదలు, అధ్యక్ష తరహ పాలన వరకు పార్టీ మూల సిద్ధాంతానికి సంబందించిన అన్ని అంశాలకు సంబందించిన లక్ష్యాలు ఇందులో ఉన్నాయి. గడచిన ఆరేడు సంవత్సరాలలో ఇందులో కొన్ని సాఫల్య మయ్యాయి.  ఇక ఇప్పుడు, కమల నాధులు,జమిల ఎన్నికల మీదుగా అధ్యక్ష తరహ పాలన లక్ష్యంగా పావులు కదుపుతోందని విశ్వసనీయ సమాచారం. నిజానికి అధ్యక్ష తరహ పాలనకు, ఆదాయ తరహ పాలనా వ్యవస్థకు,బీజేపీ, సంఘ్ పరివార్ సిద్దాంత కర్తలు మొదలు సామాన్య కార్యకర్తలు మొదలు అందరూ అనుకూలమే. అందుకే ఎప్పటి నుంచో పార్టీ వేదికల మీద, బయట కూడా ఇలాంటి చర్చ జరుగుతూనే  ఉంది.  నిజానికి ఒక్క బీజేపీలోనే కాదు,ఇతర పార్టీలలోనూ చాలా కాలంగా అధ్యక్ష తరహ పాలనపై  చర్చ జరుగుతోంది. రాజకీయ పార్టీలలో ఇప్పడు చర్చ జరగడంకాదు,రాజ్యాంగ సభలోనూ ఆ దిశగా చర్చ జరిగింది. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్, కూడా “అధ్యక్ష తరహా పాలనలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుంది. కాకపోతే జవాబుదారీతనమే కొరవడుతుంది” అంటూ ఎప్పుడోనే తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.అలాగే రాజ్యాంగసభ చర్చల్లో పాల్గొన్న వల్లభాయ్‌ పటేల్‌ కూడా దేశాధ్యక్షుడు, గవర్నర్‌ పోస్టులకు ప్రత్యక్ష ఎన్నికలు జరగాలని సూచించారు. ఇక బీజేపీ విషయం అయితే చెప్పనే అక్కర లేదు. బీజేపీ, ఆ పార్టీ సిద్ధాంతకర్తలు మొదటి నుంచీ అధ్యక్ష వ్యవస్థకే మొగ్గు చూపుతున్నారు. బీజేపీ సిద్ధాంత కర్త దీనదయాళ్‌.. అధ్యక్ష వ్యవస్థను సమర్థించారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి 1998లో చేసిన ప్రసంగంలో.. అధ్యక్ష వ్యవస్థ గురించి ఆలోచించాలని చెప్పారు. రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ సీనియర్‌ నేత లాల్‌ కృష్ణ ఆడ్వాణీ కూడా దేశంలో అధ్యక్ష తరహ పాలనకు మద్దతుగా ఉపన్యాసాలు చేశారు.వ్యాసాలు రాశారు.    అలాగే  కాంగ్రెస్ పార్టీ ఏక చత్రాధిపత్యానికి గండిపడిన తర్వాత సుమారు మూడు దశాబ్దాల పాటు సాగిన సంకీర్ణ యుగంలో,అస్థిర ప్రభుత్వాలు సక్రమంగా పాలన సాగించలేని పరిస్థితులు ఏర్పడిన సమయంలోనూ, అధ్యక్ష తరహ పాలన గురించి చర్చ జరిగింది. ఆ నేపధ్యంలో 2014 లో మోడీ నాయకత్వంలో తొలిసారిగా బీజేపీ సారధ్యంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. ఆ ఎన్నికలలో మోడీ అధ్యక్ష తరహ ఎన్నికల పచారామ్ సాగించారు. ఆ 2019 ఎన్నికల ప్రచారంతో పాటుగా పరిపాలన కూడా అదే తరహాలో పీఎంఓ, ప్రధాన మంత్రి కార్యాలయం సెంట్రిక్’గా పరిపాలన సాగుతోందని ,ఇది కూడా అందుకు మరో సంకేతమని అంటున్నారు.  ఇక ప్రస్తుతానికి వస్తే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సంఘ పరివార్, ప్రస్తుత పార్లమెంటరీ ప్రజాసామ్య వ్యవస్థ స్థానంలో  అధ్యక్ష తరహ వ్యవస్థను తెచ్చేందుకు ఇంతకంటే మంచి సమయం మరొకటి ఉందని భావిస్తున్నారు. పరిపాలన వ్యవస్థలో మార్పులు తీసుకు రావాలంటే అందుకు రాజ్యాంగ సవరణ అవసరం అవుతుంది. రాజ్యంగ సవరణకు రాజ్యాంగంలోని 368 అధికరణం ప్రకారం, ప్రభుత్వం లేదా సభ్యులు ప్రవేశ పెట్టె తీర్మానానికి పార్లమెంట్ ఉభయ సభలు మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోదించడంతో పాటుగా మొత్తం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల శాసన సభలలో సగం శాసన సభలు ఆమోదించ వలసి ఉంటుంది. అందుకే, బీజేపీ సాధ్యమైన మేరకు రాష్రాలను గెలుచుకుని, తద్వారా రాజ్యాంగ సవరణ, అందుకు కొనసాగింపుగా అధ్యక్ష తరహ పాలనకు శ్రీకారం చుట్టాలని చూస్తోంది.  ఇప్పటికే బీజేపీ 12  రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మరో ఆరు రాష్ట్రాలలో మిత్ర పక్షాలతో కలిసి ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వలున్నాయి... ఇక ..పార్లమెంట్ ఉభయ సభలో సొంత బలం కొంత తగ్గినా, మేనేజ్ చేయగల సమర్ధులున్నారు .. సో .. ఇదే అందుకు మంచి సమయమని కమలనాధులు భావిస్తున్నారు. రాజ్యాంగ సవరణ అనుకున్నది అనుకున్నట్లు సాగితే, 2022 చివరిలో అధ్యక్ష పదవికీ, ఎంచుకున్న అధ్యక్ష తరహ పాలనకు అనుగుణంగా పార్లమెంట్ ,శాసన సభలకు  జమిలి ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత నరేంద్ర మోడీ అధ్యక్షుడిగా, అమిత్ షా ప్రధానిగా ... కొత్త పాలన వస్తుంది. అయితే, ఇదులో చాలా అయితే గియితే లున్నాయి. రాజ్యాంగ సవరణ సహా, ఇంకా చాలా చిక్కుముళ్ళు ఉన్నాయని అవన్నీ విడతేస్తేనే గానీ, మోడీ ఆలోచనలు కార్యరూపం దాల్చవని న్యాయ కోవిదులు అంటున్నారు. నిజానికి గతంలోనే సుప్రీం కోర్టు రాజ్యంగ ధర్మాసనం రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని మార్చే వీలు లేదని పేర్కొందని, కాబట్టి  మోడీ అలోచన కార్యరూపం  దాల్చడం అంతసులభం కాదన్నమాట కూడా వినవస్తోంది.
అమరావతిని అడ్రస్ లేకుండా చేసేందుకు సీఎం జగన్ రెడ్డి చేయని ప్రయత్నం లేదు. . ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి జై కొట్టిన మడమ తిప్పని నేత.. పవర్ లోకి వచ్చాకా  రాజధాని విషయంలో కంప్లీట్ యూ టర్న్ తీసుకున్నారు. రాజధానిని మూడు ముక్కలు చేశారు. ఆంధ్రుల కలల సౌధాన్ని కుప్పకూలుస్తూ.. అమరావతిని కేవలం శాసన రాజధానికే పరిమితం చేశారు. అక్కడి ఆకాశ హర్మాలు, విశాల రోడ్లను ఎక్కడికక్కడే వదిలేశారు. రాజధాని కోసం రైతులు ఉవ్వెత్తున ఉద్యమం చేస్తున్నా.. ఏమాత్రం కనికరం చూపించలేదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అలాంటిది సడెన్ గా జగన్ మనసు మారినట్టుంది. ఏపీ కేబినెట్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 50 శాతం నిర్మాణం పూర్తయి.. పెండింగ్‌లో ఉన్న భవనాలను పూర్తి చేయాలని సర్కారు నిర్ణయించింది. అందుకు  3వేల కోట్ల బ్యాంక్ గ్యారంటీ ఇచ్చేందకు ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పటికీ ప్రారంభం కానీ, కొద్దిగా ప్రారంభమైన భవనాల నిర్మాణాలపై ఇంజనీరింగ్ నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకోవాలని కేబినెట్‌ అభిప్రాయ పడింది.  జగన్ తీసుకున్న తాజా నిర్ణయం ఏపీలో సంచలనంగా మారింది. చంద్రబాబుకు క్రెడిట్ వస్తుందని అమరావతి లాంటి అద్భుత రాజధానిని కాలరాసే ప్రయత్నం చేసిన జగన్ రెడ్డిలో సడెన్ గా ఇంతటి ఛేంజ్ చూసి అంతా అవాక్కవుతున్నారు. అసంపూర్తి భవనాల నిర్మాణం పూర్తైతే.. అమరావతికి కొత్త అందం వస్తుంది. డిమాండ్ పెరుగుతుంది. ఇక విశాఖతో పనేముంది? అమరావతిలో భవనాలను పూర్తి చేస్తున్నారంటే.. ఇక విశాఖలో రాజధాని అంశాన్ని పక్కకు పెట్టేసినట్టేనా? లేక తాత్కాలికంగా ఆపుతారా? ఆలస్యం చేస్తారా? అనే చర్చ జరుగుతోంది. అందుకే జగన్ నిర్ణయంపై అమరావతి రైతులు సైతం ఈ నిర్ణయాన్ని నమ్మలేకపోతున్నారు.  అయితే హైకోర్టులో రాజధాని నిర్మాణం వ్యవహారాలపై విచారణ షెడ్యూల్ వచ్చింది. త్వరలోనే కోర్టుకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది. అమరావతి భవనాల నిర్మాణంపై సర్కారు తీరుపై గతంలో హైకోర్టు పలుమార్లు అక్షింతలు వేసింది. కోర్టు ఎంత చెప్పినా సర్కారులో కదలిక రాలేదు. భవనాలు పూర్తి చేయడంపై ఉలుకూ పలుకూ లేదు. ఈ సారి విచారణ సందర్భంగా హైకోర్టుకు అమరావతి భవనాలపై ప్రభుత్వ నిర్ణయమేంటో చెప్పక తప్పని పరిస్థితి. అందుకే, కేబినెట్ లో అంపూర్తి భవనాలు పూర్తయ్యేలా పాజిటివ్ నిర్ణయం తీసుకొని.. ఆ విషయాన్ని కోర్టు ద్రుష్టికి తీసుకెళ్లనుంది సర్కారు. అమరావతి రోడ్ల విషయంలోనూ ఇప్పటికే రివ్యూ కూడా నిర్వహించారు సీఎం జగన్.  ప్రభుత్వ పాజిటివ్ దృక్పదంతో.. భవన నిర్మాణాలు పూర్తైతే.. ఇక అమరావతికి డిమాండ్ అమాంతం పెరగడం ఖాయం. అదే జరిగితే.. ఇక విశాఖపట్నంతో పెద్దగా అవసరం ఉండకపోవచ్చు. ఆకర్షణీయమైన రోడ్లు, భవనాలతో అమరావతి అసలైన రాజధానిగా నిలిచే అవకాశాలున్నాయి. అటు, కేంద్రం సైతం మూడు రాజధానుల విషయంలో జగన్ కు ఇప్పటికే హితబోధ చేసినట్టు సమాచారం. ఇటు హైకోర్టు సైతం కేపిటల్స్ ను తిరష్కరించే అవకాశాలే ఎక్కువ అనేది న్యాయ నిపుణుల మాట. ఇలా ఎలా చూసినా.. భవిష్యత్ లో అమరావతికి మళ్లీ మంచి రోజులు వస్తాయనే ఆశ అక్కడి ప్రజల్లో.  సీఎం జగన్ తాజా నిర్ణయంతో వారి ఆశలు మరింత చిగురిస్తున్నాయి. తమ కలల రాజధాని కోసం మరింతగా పరితపిస్తున్నారు అమరావతి ప్రజలు. 
ఆచార్య చాణక్యుడు గొప్ప రాజకీయవేత్త, దౌత్యవేత్త, ఆర్థికవేత్త, ప్రసిద్ధ పండితుడు. మౌర్య సామ్రాజ్యానికి సమకాలీనుడైన ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రాన్ని రచించడంలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు. ఆయన విధానాలు నేటికీ సంబంధించినవి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఏ వ్యక్తి అయినా నైతికతను అనుసరించడం ద్వారా తక్కువ సమయంలో విజయం సాధించవచ్చు. నీతి శాస్త్రంలో ముగ్గురిని నమ్మవద్దని ఆచార్య చాణక్యుడు సలహా ఇచ్చాడు. మీరు కూడా మీ జీవితంలో విజయవంతమైన వ్యక్తిగా మారాలనుకుంటే, పొరపాటున కూడా ఈ ముగ్గురిని నమ్మకండి. ఈ వ్యక్తులను విశ్వసించడం జీవితంలో అన్ని సమయాలలో ద్రోహానికి దారితీస్తుంది. చెడు స్నేహం: ఆచార్య చాణక్యుడి ప్రకారం, స్నేహం కూడా ఆలోచనాత్మకంగా చేయాలి. ముఖ్యంగా, చెడు సమయాల్లో సహాయం చేయని, క్లిష్ట పరిస్థితుల్లో సాకులు చెప్పే వ్యక్తికి దూరంగా ఉండాలి. దుఃఖంలో అబద్ధాలు చెప్పే స్నేహితుడిని పొరపాటున కూడా నమ్మకూడదు. ఇలాంటి స్నేహితుల వల్ల జీవితంలో ఎప్పుడూ మోసపోతూనే ఉంటాడు. ద్రోహి: ఆచార్య చాణక్యుడు చెపుతున్నాడు ద్రోహి... ఎప్పుడూ యజమాని మంచిని కోరుకోడు. అలాంటి వ్యక్తులు ద్రోహులు. ఎప్పుడూ తమ సంక్షేమం గురించే ఆలోచిస్తారు. ఇలాంటి వాళ్ల యజమాని ఇబ్బందులు ఎదుర్కొంటాడు. అలాంటివారిని అస్సలు నమ్మకూడదు అంటాడు చాణక్యుడు. సంస్కారం లేని భార్య: ఆచార్య చాణక్యుడు ఆజ్ఞలను పాటించే అమ్మాయిని వివాహం చేసుకుంటే , మరణానంతరం స్వర్గం వంటి సుఖం లభిస్తుందని చెప్పారు . అదే సమయంలో, విధేయత, సంస్కారవంతమైన భార్య దొరకకపోతే, ఆ వ్యక్తి జీవితం నరకంలా మారుతుంది. అలాంటి స్త్రీ తన భర్త లేదా కుటుంబ సంక్షేమం గురించి ఎప్పుడూ ఆలోచించదు. దుష్ట భార్యను పొరపాటున కూడా నమ్మకూడదు. చెడ్డ భార్యను నమ్మి పొరపాటు చేస్తే దాని పర్యవసానాలను ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది. కావున చెడు స్నేహం, ద్రోహులకు,దుష్ట భార్యలకు దూరంగా ఉండాలని చాణక్యుడు పేర్కొన్నారు.
ఈ ప్రపంచంలో మనుషులతో పాటు జంతువులు, పక్షులు, సరీసృపాలు ఇలా చాలా జీవులు ఉన్నాయి. జంతువులకు లేని ఎన్నో అడ్వాంటేజస్ మనుషులకు ఉన్నాయి. ఈ కారణంగానే జంతువులు మనుషుల్లా అభివృద్ది చెందలేకపోయాయి.   అయితే జంతువులకు మనసుంటుంది. అవి కూడా వాటి మనసులో ఉన్న భావాల్ని వ్యక్తం చేయడానికి విభిన్న రకాలుగా ప్రయత్నిస్తాయి. వాటికి కావలసిన స్వేచ్చ గురించి మరెన్నో విషయాల గురించి చెప్పాలనుకుంటాయి. కానీ అవి చెప్పలేవు. అందుకే వాటి  తరపున సగటు మనిషే గొంతు వినిపిస్తాడు. జంతువుల సంరక్షణ,  జంతువుల హక్కులు, అంతరించిపోతున్న జంతుజాతుల కోసం పోరాడటం వంటి ఎన్నో విషయాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఒక రోజు ఏర్పాటుచేయబడింది. ఇది అక్టోబర్ 4వ తేదీన నిర్వహించబడుతుంది. ఈ రోజున జంతు ప్రేమికులు జంతువుల తరపున తమ గొంతును ప్రపంచానికి వినిపిస్తారు. అసలు ఈ జంతు దినోత్సపం ఎప్పుడు ఎలా ఏర్పడింది? మూగజీవుల కోసం ఒకరోజు ఏర్పాటు చెయ్యాలని అనిపించడం వెనుక కారణం ఏమిటి? పూర్తీ వివరాలు తెలుసుకుంటే.. చరిత్ర ఏం చెబుతోందంటే.. ప్రపంచ జంతు దినోత్సవం 1925లో హెన్రిచ్ జిమ్మెర్‌మాన్ బెర్లిన్‌లో మొదటిసారి  నిర్వహించింది. జిమ్మెర్‌మాన్, జర్మన్ జంతు ప్రేమికుల మ్యాగజైన్ “మ్యాన్ అండ్ డాగ్” ను  ప్రచురించారు.  జంతువుల పట్ల అవగాహన పెంచడానికి, ఆ అవగాహనను  మెరుగుపరచడానికి  ఈ ఈవెంట్‌ను ప్రారంభించారు. కాథలిక్కులందరూ గౌరవంగా భావించే  సెయింట్ ఫ్రాన్సిస్ జంతువులు ఇంకా ఇతర  అన్ని జీవులతో  ఎంతో గొప్ప అనుబంధాన్ని ఏర్పరుచున్నారు.   జంతువుల కోసం సెయింట్ ఫ్రాన్సిస్ ఎన్నో గొప్ప పనులు చేశారు.  ఈ రోజున కొన్ని కాథలిక్ చర్చిలు పెంపుడు జంతువులకు ఆశీర్వాదాలు అందిస్తాయి. ప్రపంచ జంతు దినోత్సవం పర్యావరణ శాస్త్రవేత్తలకు అంతరించిపోతున్న జాతులకు సంబంధించిన సమస్యలను చర్చించడానికి ఒక వేదికగా మారింది. 2003 నుండి, UK-ఆధారిత స్వచ్ఛంద సంస్థ నేచర్‌వాచ్ ఫౌండేషన్ ఈ ఈవెంట్‌ను ఏర్పాటు  చేసింది.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న జంతు ప్రేమికులు ఈ ఈవెంట్ కు మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని వ్యాప్తం చేస్తూ వచ్చింది. ప్రపంచ జంతు దినోత్సం రోజున  కేవలం పెంపుడు జంతువులకు మాత్రమే కాదు అడవి జంతువులు, అంతరించిపోతున్న జాతులు,  పర్యావరణ విధ్వంసం లేదా రక్షణ లేకపోవడం వల్ల  జరుగుతున్న నష్టాన్ని చర్చించడం, దాన్ని నిర్మూలించడానికి చర్యలు తీసుకోవడం. జంతువుల హక్కులు, వాటి సంరక్షణ, ప్రజల ఆలోచనలలో మార్పు మొదలైన విషయాల గురించి అవగాహన పెంచండం దిశగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. సగటు పౌరుడి భాద్యత ఏంటంటే.. చాలామంది ఇళ్ళలో పెంపుడు జంతువులు ఉంటాయి. అయితే కేవలం పెంపుడు జంతువులనే కాకుండా సమాజంలో భాగంగా ఉన్న జంతువులకు కూడా ఆహారం ఇవ్వడం వాటి సంరక్షణ దిశగా ఆలోచన చెయ్యడం, జంతు హింస మానడం, జంతువుల పట్ల అనుచితంగా ప్రవర్తించేవారిలో మార్పు తీసుకురావడం, సమాజంలో మనుషులతోపాటు నివసించే హక్కు జంతువులకు ఉందని గుర్తించడం, ఈ విషయాలను అందరికీ తెలియజేయడం ప్రతి ఒక్కరి బాధ్యత. జంతువులకు ఫీలింగ్స్ ఉంటాయి. వాటిని గుర్తించి ఆ జంతువులతో ప్రేమగా మసలుకోవడం ఎంతో ముఖ్యం. మనిషి జంతువులను ప్రేమిస్తే మనిషి కంటే ఎక్కువ ప్రేమను అవి తిరిగి ఇస్తాయి. ఈ విషయాలు అందరూ గుర్తుపెట్టుకోవాలి. జంతు దినోత్సవం వెనుక కొన్ని ఆసక్తిర విషయాలు.. జంతువుల పట్ల తన గొంతు వినిపించడం అనేది ఇప్పటినాటి మాట కాదు. గ్రీకు తత్వవేత్త పైథాగరస్  జంతువులకు ఫీలింగ్స్ ఉంటాయని, అవి కూడా బాధపడతాయని, వాటికి కూడా ఆత్మ ఉంటుందని గుర్తించాడు. అందుకే అందరూ శాఖాహారం తీసుకోవాలని, జంతు హింస మానేయాలని  ఎప్పుడో చెప్పారు.   లూయిస్ గోంపెర్ట్జ్ అనే వ్యక్తి జంతువుల హక్కుల కోసం వాదించడానికి మొదటిసారి ఒక పుస్తకాన్ని వెలువరించారు. ఈ పుస్తకం పేరు “Moral Inquiries on the Situation of Man and of Brutes,” ఇది 1624లో జరిగింది. 1877లో సాహిత్య పరంగా కూడా జంతువుల హక్కులు, వాటి జీవితం గురించి ఒక నవల వెలువడింది. అన్నా సీవెల్ రచించిన ఈ  నవల 'బ్లాక్ బ్యూటీ'.  మానవేతర దృక్కోణం నుండి వ్రాయబడిన మొదటి ఆంగ్ల నవల ఇదే.   గుర్రాల చికిత్సపై ఈ నవల  చర్చను రేకెత్తిస్తుంది. ఫ్లోరెన్స్ ఇటలీలోని ఇంటర్నేషనల్ యానిమల్ ప్రొటెక్షన్ కాంగ్రెస్ ప్రపంచవ్యాప్తంగా 'ప్రపంచ జంతు దినోత్సవాన్ని' ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇది 1931 వ సంవత్సరంలో జరిగింది. సొసైటీ ఫర్ యానిమల్ ప్రొటెక్టివ్ లెజిస్లేషన్ (SAPL) USలో హ్యూమన్ స్లాటర్ చట్టం కోసం లాబీయింగ్ చేసిన మొదటి సంస్థ. ఇది 1955లో జరిగింది.                                                              *నిశ్శబ్ద.
చాణక్య నీతిలో జీవితానికి ఉపయోగపడే ఎన్నో విషయాలు ప్రస్తావించారు. జీవితంలో  ఏది సరైనది...ఏది తప్పు అని నిర్ణయించుకోవలసిన సందర్భాలు చాలా ఉన్నాయి.  కానీ కొన్ని పరిస్థితులలో నిర్ణయాలు తీసుకోవడం ప్రాణాంతకం అని ఆచార్య చాణక్య చెప్పారు. అవేంటో చూద్దాం.  ఆచార్య చాణక్యుడు మానవ ప్రవర్తనను చాలా లోతుగా అధ్యయనం చేశాడు. ఆ తర్వాత అతను తన చాణక్య నీతిలో అనేక సూత్రాలను వ్రాసాడు. వీటిని స్వీకరించడం ద్వారా ఒక వ్యక్తి  అనేక సమస్యలను పరిష్కరించుకోవచ్చు. తన నీతి శాస్త్రంలో, ఒక వ్యక్తి ఎవరికీ సమాధానం ఇవ్వకూడదు..వాగ్దానం చేయకూడదు లేదా ఏ నిర్ణయం తీసుకోకూడదు అనే మూడు పరిస్థితుల గురించి ఆయన ప్రస్తావించారు. లేకుంటే ఆ వ్యక్తి దాని చెడు పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని పేర్కొన్నారు. ఎప్పుడు వాగ్దానం చేయకూడదు? ఆచార్య చాణక్యుడు ప్రకారం, మీరు సంతోషంగా ఉన్నప్పుడు మీరు ఎవరికీ ఎలాంటి వాగ్దానం చేయకూడదు. లేదంటే మీరు తర్వాత పశ్చాత్తాపపడవచ్చు. ఎందుకంటే  సంతోషంగా ఉన్న సమయంలో, ఒక వ్యక్తి కొన్నిసార్లు అతను నెరవేర్చలేని వాగ్దానాలను ఇస్తాడు. అందుకే వాగ్దానాలు ఎప్పుడూ ఆలోచించి మాత్రమే ఇవ్వాలని చాణక్య నీతిలో చెప్పబడింది. ఈ పరిస్థితిలో ఎవరికీ సమాధానం చెప్పవద్దు: మీరు కోపంగా ఉన్నప్పుడు ఎవరికీ సమాధానం చెప్పకూడదు. ఎందుకంటే కోపంతో ఉన్న వ్యక్తి తన నిగ్రహాన్ని కోల్పోతాడు. దీని కారణంగా అతను కొన్నిసార్లు ఎదుటివారి మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడతాడు. అందువల్ల, మీకు కోపం వచ్చినప్పుడు ఓపికపట్టండి.  నిర్ణయాలు ఎప్పుడు తీసుకోకూడదు? ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు. ఎందుకంటే అటువంటి పరిస్థితిలో, తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు తప్పు కావచ్చు, దాని వల్ల భవిష్యత్తులో మీరు నష్టపోవాల్సి రావచ్చు. కాబట్టి, చాణక్య నీతి ప్రకారం, దుఃఖ సమయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.  
ఆహారం నుండి లభించే పోషకాలు మాత్రమే మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచగలవు. ఇది ఎముకల నొప్పి నుండి రక్తహీనత వరకు అన్నింటిని నయం చేస్తుంది. దీనికి కారణం ఈ ఆహారాలలో లభించే పోషకాలు. మీరు రక్తహీనత వంటి వ్యాధితో కూడా బాధపడుతుంటే, మీరు ఈ ఐరన్‌తో కూడిన ఆహారాలను మీ ఆహారంలో చేర్చుకోవచ్చు. శరీరాన్ని ఐరన్ తో నింపడంతో పాటు రక్తహీనతను కూడా దూరం చేస్తుంది. దీంతో కీళ్ల నొప్పులు, గోళ్ల సమస్యలు, అధిక జ్వరం, కామెర్లు వంటి సమస్యలు దూరమవుతాయి. మీరు ఐరన్  లోపం లేదా రక్తహీనతతో బాధపడుతున్నట్లయితే, మీరు మీ ఆహారంలో ఈ కూరగాయలు, గింజలను చేర్చుకోవచ్చు. ఇవి మీ శరీరంలో ఐరన్ లోపాన్ని తొలగిస్తాయి. ఈ ఫుడ్స్ నొప్పి,  రక్తస్రావం సమస్యల నుండి ఉపశమనం పొందేందుకు సహాయపడతాయి. హిమోగ్లోబిన్ వేగంగా పెరుగుతుంది. వాటి ప్రయోజనాలు, వాటిని ఎలా తినాలో తెలుసుకుందాం. క్యారెట్, బీట్‌రూట్‌లను ఆహారంలో చేర్చుకోండి: బీట్‌రూట్, క్యారెట్ రెండింటిలోనూ ఐరన్ పుష్కలంగా ఉంటుంది. మీరు రక్తహీనతతో బాధపడుతున్నట్లయితే, మీరు వాటిని కూరగాయలతో పాటు జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. దీని కోసం ఒక కప్పు బీట్‌రూట్, క్యారెట్ తీసుకోవాలి. ఇప్పుడు వాటిని బ్లెండర్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి.  దీన్ని ఫిల్టర్ చేసి రుచికి తగినట్లుగా ఉప్పు, నిమ్మకాయ జోడించండి. ఉదయం ఖాళీ కడుపుతో క్రమం తప్పకుండా త్రాగాలి. ఇది విటమిన్ సిని పెంచుతుంది. అలాగే శరీరంలోని ఐరన్‌ను గ్రహిస్తుంది. వీటిని సలాడ్ రూపంలో కూడా తినవచ్చు. డ్రై ఫ్రూట్స్ కూడా మేలు చేస్తాయి: మీరు ప్రతిరోజూ అత్తి పండ్లను, ఎండుద్రాక్ష,  ఖర్జూరాలను తినవచ్చు. వీటిలో విటమిన్ ఎ, సి, ఐరన్,  మెగ్నీషియం లభిస్తాయి. ఈ మూడు వస్తువులను రాత్రంతా నానబెట్టి ఉంచండి. మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే, 2 నుండి 3 ఖర్జూరాలు, అంజిర్,  ఒక చెంచా ఎండుద్రాక్షను తినండి. దీంతో శరీరంలో శక్తి పెరుగుతుంది. ఐరన్ సమం అవుతుంది. వీట్ గ్రాస్: వీట్ గ్రాస్ అనేక పోషకాలు అధికంగా ఉండే గడ్డిలో ఒకటి. ఇందులో బీటా కెరోటిన్, విటమిన్ బి, సి, కె, కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ప్రొటీన్, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. ప్రతిరోజూ 3 నుంచి 5 గ్రాముల గోధుమ గడ్డి రసాన్ని తాగడం వల్ల శరీరంలోని రక్తహీనత సమస్య తొలగిపోతుంది. మీ హెచ్‌బిని మెరుగుపరచడంతో పాటు, మీ రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. నల్ల నువ్వులు కూడా దివ్యౌషధం: తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వులు ఎక్కువ ప్రయోజనకరమైనవి. పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ బి6, ఇ, ఫోలేట్ యాసిడ్, జింక్, ఐరన్, కాపర్,  సెలీనియం నల్ల నువ్వులలో లభిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని అలసట, నొప్పి, రక్తహీనత దూరమవుతాయి. దీన్ని తీసుకోవడానికి, ప్రతి రోజు ఒక టేబుల్ స్పూన్ నల్ల నువ్వులు వేయించుకోండి. దీని తరువాత, ఒక చెంచా తేనె లేదా నెయ్యితో కలపండి. ఐరన్ స్థాయిని పెంచడంతో పాటు శరీరానికి బలం చేకూరుతుంది.   
ఇప్పట్లో ఉద్యోగాలన్నీ కంప్యూటర్ల ముందు కూర్చుని చేసేవే ఎక్కువ. డెస్క్ జాబ్ లేదా ఎక్కువసేపు ఒకే చోట కూర్చుని ఉద్యోగం చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని చాలా పరిశోధనలు చెబుతున్నాయి.  ఎక్కువసేపు కూర్చునే ఉద్యోగాల కారణంగా  లైఫ్ స్టైల్ తటస్థంగా మారుతుంది. ఈ  నిశ్చల జీవనశైలి శారీరక,  మానసిక ఆరోగ్యానికి హాని చేకూరుస్తుంది.  ప్రతిరోజూ 8-10 గంటలసేపు  కూర్చొని పని చేస్తుంటే మాత్రం ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.  డెస్క్ ఉద్యోగాలు ఉన్న వ్యక్తులలో  కాలక్రమేణా తీవ్రమైన నరాల సంబంధిత రుగ్మతలు  ఏర్పడే  ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.  ఇది అల్జీమర్స్ వంటి తీవ్రమైన వ్యాధులను కలిగిస్తుంది. చిత్తవైకల్యానికి ప్రధాన కారణాలలో ఒకటైన అల్జీమర్స్ వ్యాధి ఇంతకు ముందు వరకు 60 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా వచ్చేది. కానీ   ఈ వ్యాధి ముప్పు  ఇప్పుడు ఎక్కువ సేపు డెస్క్ ముందు కూర్చుని పనిచేసేవారిలో  పెరుగుతోంది. నిశ్చల జీవనశైలి,  చిత్తవైకల్యం ప్రమాదం.. కొన్ని దశాబ్దాల క్రితం వరకు పెద్దవారిలో చిత్తవైకల్యం లేదా అల్జీమర్స్ వ్యాధి ప్రమాదం చాలా తక్కువగా పరిగణించబడింది.  కానీ కాలక్రమేణా కేవలం పెద్ద వయసులోనే కాకుండా  అన్ని వయసుల వారిలో ఈ ప్రమాదం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది.  ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, ప్రస్తుతం 55 మిలియన్ల మంది అల్జీమర్స్-డిమెన్షియాతో బాధపడుతున్నారు. జీవనశైలి సమస్యల కారణంగా ఈ ప్రమాదం మరింత పెరిగింది. కొన్ని అధ్యయనాల ప్రకారం  ప్రతిరోజూ 10 గంటల కంటే ఎక్కువసేపు కూర్చొని ఉద్యోగం చేస్తే  డిమెన్షియా సమస్య  అభివృద్ధి చెందుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నిశ్చలంగా పనిచేయడం ప్రమాదం ఎందుకంటే.. అమెరికన్లలో చేసిన ఒక పరిశోధనలో సగం కంటే ఎక్కువ మంది అమెరికన్లు రోజుకు తొమ్మిదిన్నర గంటల కంటే ఎక్కువ సమయం కూర్చొని గడుపుతారు ఈ అలవాటు మెదడు వృద్ధాప్యం,  అభిజ్ఞా  పనితీరు మందగించడం వంటి  వాటితో  ముడిపడి ఉంటుంది. ఒకే చోట ఎక్కువసేపు ఆఫీసులో కూర్చోవడమే కాకుండా, ఎక్కువసేపు కూర్చొని టీవీ  చూడడం, కంప్యూటర్లలో పని చేయడం,  డ్రైవింగ్ చేయడం వంటివి ఉంటాయి. ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే.. డిమెన్షియా ప్రమాదాల గురించి అధ్యయనం నిపుణుల ప్రకారం  స్థూలకాయం, అధిక రక్తపోటు,  మధుమేహం వంటి అనేక రకాల ఆరోగ్య సమస్యలకు నిశ్చల జీవనశైలి ఇప్పటికే కారణమవుతోందని  తెలిపారు. దీని కారణంగా ఇప్పుడు చిత్తవైకల్యం వచ్చే ప్రమాదం కూడా పెరుగుతోంది.  ఒకే చోట కూర్చుని పనిచేయడం వల్ల శరీరంలో రక్తప్రవాహం మందగిస్తుంది.   ఇది మెదడుకు రక్త ప్రవాహాన్ని తగ్గించడం ద్వారా సెరెబ్రోవాస్కులర్ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది.                                                             *నిశ్శబ్ద. 
వాము వంటింట్లో ఉండే ఒక గొప్ప ఔషదం. కొన్నిరకాల వంటలలో చిటికెడు వామును జోడించడం చాలా మంచిదని పెద్దలు చెబుతారు.  ఇది ఆకలిని పెంచుతుంది,  జీర్ణశక్తిని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఉబ్బరం, అసిడిటీ వంటి సమస్యలతో  అసౌకర్యంగా  ఉన్నప్పుడు వాటిని పరిష్కరిస్తుంది.  ప్రాచీన కాలం నుండే వామును జ్వరం, కడుపు నొప్పి నుండి  నెలసరి ఇబ్బందుల వరకు అనేక సమస్యలు చికిత్స చేయడానికి ఉపయోగించబడింది. వాము గింజలను స్నాక్స్, పిండి వంటలు,  వివిధ రకాల  మసాలాలోనూ ఉపయోగిస్తారు. కడుపుకు సంబంధించిన సమస్యలు,  ప్రేగులు వదులుగా మారడం, దగ్గు మొదలైన  సమస్యలకు వాము గింజల కషాయాన్ని ఆయుర్వేదంలో మొదటి  చికిత్సగా ఉపయోగిస్తారు. వాము గింజలు   యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్,  క్రిమిసంహారక లక్షణాలను కలిగి ఉంటాయి. వామును దేంతో కలిపి తీసుకుంటే ఏ సమస్యలు నయమవుతాయంటే.. నల్ల ఉప్పుతో పాటు వాము పొడి  కలిపి తీసుకుంటే కడుపు నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. నెయ్యి,  పంచదారతో కలిపి వాము గింజల పొడిని తీసుకుంటే   నెలసరి సమయంలో తక్కువగా అయ్యే రక్తస్రావాన్ని సమం చేస్తుంది.  గర్భాశయాన్ని క్లియర్ చేస్తుంది. పెర్షియన్ సాంప్రదాయ వైద్యులు చెవికి సంబంధించిన సమస్యలను  చికిత్స చేయడానికి వాము గింజల నుండి తీసిన నూనెను  కళ్లు, చెవి చుక్కల మందుగా  ఉపయోగించారు. మధ్యప్రదేశ్‌లోని కొన్ని తెగలలో వాము గింజలను  బెల్లం లేదా గుడ్డు,  గోరువెచ్చని నెయ్యితో కలుపుతారు.   గర్భధారణ తర్వాత మహిళలకు శక్తిని అందించడానికి తినిపిస్తారు. ఎన్నో ఏళ్ళ నుండి  బరువు తగ్గడానికి సహజ ఔషధంగా వాము గింజలను  ఉపయోగిస్తున్నారు. వాములో  థైమోల్‌తో సహా  అనేక  సమ్మేళనాలు జీవక్రియను మెరుగుపరచడమే కాకుండా కొవ్వు కణాల విచ్ఛిన్నానికి కూడా సహాయపడతాయి. వాము గింజలతో మరికొన్ని అద్భుతమైన ప్రయోజనాలు  ఉన్నాయి..  బ్యాక్టీరియా,  శిలీంధ్రాలతో పోరాడుతుంది,  కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుపరుస్తుంది,  రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.  పెప్టిక్ అల్సర్లను నయం చేయడంలో,  అజీర్ణం నుండి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది. ఇందులో  యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వామును ఎలా తీసుకోవచ్చంటే.. 1 గ్లాసు గోరువెచ్చని వాము నీరు ఉదయాన్నే డిటాక్స్ వాటర్‌గా తీసుకోవడం ఉత్తమ మార్గం. జీర్ణక్రియ సమస్య పరిష్కారం కోసం వాము నూనెను బొడ్డు బటన్‌పై అప్లై చేయవచ్చు. ఇది చేయడం చాలా సులభం.  ఒక కప్పు వేడినీటిలో ఒక టీస్పూన్ వాము గింజలను వేసి ఉడికించాలి. ఇలా వాము టీ తయారుచేసుకోవాలి.  దీన్ని తేనెతో తీసుకోవచ్చు లేదా అదనపు రుచి కోసం కొంచెం నిమ్మకాయను జోడించవచ్చు. వాము ఎవరు తీసుకోకూడదంటే? గర్భిణీ స్త్రీలు వాము తీసుకుంటే తీవ్రమైన వాంతులు, వికారం,  మైకము కలిగించవచ్చు. చిన్న పిల్లలు, అలెర్జీలు ఉన్న వ్యక్తులు, రక్తపోటు మందులు తీసుకునే వ్యక్తులు, శస్త్రచికిత్సలు చేయించుకున్నవారు వామును తీసుకోకూడదు.                                                       *నిశ్శబ్ద.