ఈ లక్షణాలు కనిపిస్తే థైరాయిడ్ సరిగా పని చేయడం లేదని అర్థం..!

శరీరంలో ఏదైనా వ్యాధి లేక జబ్బు వస్తే.. అది వెంటనే బయటపడకపోయినా.. శరీరం మాత్రం వాటికి సంబంధించి సంకేతాలు ఇస్తూనే ఉంటుంది.  వీటినే ఆయా జబ్బుకు సంబంధించిన లక్షణాలు అంటుంటాం.  శరీరం పదే పదే  సంకేతాలు ఇస్తుంటే వాటిని నిర్లక్ష్యం చేయడం అస్సలు మంచిది కాదు. ముఖ్యంగా  థైరాయిడ్ పనిచేయకపోవడం కూడా అలాంటి సమస్యే.. థైరాయిడ్ సరిగా పనిచేయకపోతే  సమస్య నెమ్మదిగా పెరుగుతూ మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. థైరాయిడ్ అనేది మెడ ముందు భాగంలో ఉన్న ఒక చిన్న, సీతాకోకచిలుక ఆకారపు గ్రంథి. ఇది శరీర జీవక్రియను నియంత్రిస్తుంది. ఇది సరిగ్గా పనిచేయనప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. థైరాయిడ్ సమస్య ఉందని ఎలా తెలుసుకోవాలో.. ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలో తెలుసుకుంటే.. చలిగా అనిపించడం.. వాతావరణం సాధారణంగా ఉన్నప్పటికీ,  ఇతరులకన్నా చల్లగా అనిపిస్తే అది  జీవక్రియ మందగిస్తున్నదానికి సంకేతం కావచ్చని వైద్యులు చెబుతున్నారు. థైరాయిడ్ హార్మోన్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు శరీరం తక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల చల్లగా అనిపిస్తుంది. ఏకాగ్రత.. తరచుగా మరచిపోవడం, దృష్టి కేంద్రీకరించలేకపోవడం లేదా నీరసంగా అనిపించడం కూడా థైరాయిడ్ వ్యాధికి  సంకేతాలు కావచ్చట.  ఇది హార్మోన్ల అసమతుల్యత మానసిక పనితీరును ప్రభావితం చేస్తుంది. నెలసరి సమస్యలు.. స్త్రీలలో, అధికంగా లేదా  క్రమరహిత ఋతుస్రావం లేదా సాధారణం కంటే ఎక్కువ రక్తస్రావం థైరాయిడ్ సమస్యతో ముడిపడి ఉండే అవకాశం ఉంటుంది. హార్మోన్ల అసమతుల్యత నేరుగా ఋతు చక్రంపై ప్రభావం చూపుతుంది. బరువు పెరగడం..  ఆహారంలో ఎటువంటి  మార్పులు చేయకపోయినా  బరువు పెరుగుతున్నట్లయితే, అది నెమ్మదిగా జీవక్రియ జరుగుతుందనడానికి సంకేతం కావచ్చు. థైరాయిడ్ హార్మోన్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు, శరీరం కేలరీలను చాలా నెమ్మదిగా బర్న్ చేస్తుంది. దీని వల్ల బరువు పెరుగుతారు. చర్మం.. నిస్తేజంగా,  పొడిబారిన చర్మం, గరుకుగా ఉండే జుట్టు కూడా థైరాయిడ్ అసమతుల్యతను సూచిస్తుంది. ఎవరికి థైరాయిడ్ వ్యాధులు ప్రమాదం  ఉంటుంది?  ఆరోగ్య నిపుణుల ప్రకారం కొంతమందికి థైరాయిడ్ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పురుషుల కంటే మహిళలకు ఎక్కువ ప్రమాదం ఉంటుంది. కుటుంబ సభ్యులకు థైరాయిడ్ సమస్యల చరిత్ర ఉంటే వారికి  ప్రమాదం ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన మహిళల్లో ఈ ప్రమాదం మరింత పెరుగుతుంది. తల లేదా మెడకు రేడియేషన్ థెరపీ పొందిన లేదా అధిక మొత్తంలో అయోడిన్ ఉన్న మందులు తీసుకుంటున్న టర్నర్ సిండ్రోమ్ ఉన్నవారు  జాగ్రత్తగా ఉండాలి. వైద్యుడిని ఎప్పుడు కలవాలి.. పైన చెప్పుకున్న లక్షణాలు చాలా వారాల పాటు కొనసాగితే లేదా క్రమంగా పెరిగితే, TSH, T3,  T4  రక్త పరీక్షలు చేయించుకోవాలి. చికిత్సను ముందుగానే ప్రారంభిస్తే థైరాయిడ్ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు. థైరాయిడ్ వ్యాధి సాధారణం, కానీ వెంటనే గుర్తించి చికిత్స చేయకపోతే అది  గుండె, బరువు, మానసిక ఆరోగ్యం,  సంతానోత్పత్తిని కూడా ప్రభావితం చేస్తుంది. అందువల్ల శరీరం ఇచ్చే సంకేతాలను తేలికగా తీసుకోకూడదు.  వైద్యుడిని కలిసి చికిత్స తీసుకోవాలి.                         *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
జిమ్ ఏ టైంలో చేస్తే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి?| 

  నేటి వేగవంతమైన ప్రపంచంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం ఒక విలాసం కాదు, అది ఒక అవసరం. మీ ఫిట్‌నెస్ ప్రయాణాన్ని సరైన దిశలో నడిపించడానికి ఈ క్రింది సమగ్ర సమాచారం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం: మీ ఫిట్‌నెస్ ప్రయాణం ఇక్కడే మొదలు! మన పూర్వీకులు జిమ్ అంటే ఏంటో తెలియకపోయినా ఎంతో దృఢంగా, ఆరోగ్యంగా ఉండేవారు. ఎందుకంటే వారి జీవనశైలిలో శారీరక శ్రమ ఒక భాగంగా ఉండేది. కానీ నేటి కాలంలో మనం చిన్న పనికి కూడా స్విగ్గీ లేదా జెప్టో వంటి యాప్స్ పై ఆధారపడుతూ, కనీసం నడవడానికి కూడా బద్ధకిస్తున్నాము. మన శరీరం కదలడానికి పుట్టింది, కూర్చోవడానికి కాదు. కదలిక లేని జీవితం వ్యాధులకు నిలయంగా మారుతోంది. మనం ఎందుకు వర్కవుట్ చేయాలి? • మనుగడ కోసం: నడక అనేది ఒక వ్యాయామం కాదు, అది మన మనుగడకు ప్రాథమిక అవసరం. మనం ఆరోగ్యంగా బతకాలంటే శారీరక కదలిక తప్పనిసరి. • ఒత్తిడిని జయించడానికి: నిత్యం ఉండే మానసిక ఒత్తిడి, ఆందోళనల నుండి ఉపశమనం పొందడానికి రెసిస్టెన్స్ ట్రైనింగ్ వంటి వ్యాయామాలు ఎంతో మేలు చేస్తాయి. • శరీర పునరుజ్జీవనం కోసం: సరైన వర్కవుట్ మరియు తగినంత నిద్ర మీ బాడీని రిజూవినేట్ (Rejuvenate) చేసి, రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి. ఏం చేయకూడదు?  • లిఫ్ట్‌లు మరియు యాప్స్ పై అతిగా ఆధారపడటం: చిన్న దూరాలకు కూడా వాహనాలు వాడటం లేదా లిఫ్ట్‌లు వాడటం మానేయండి. మెట్లు ఎక్కడం వంటి చిన్న చిన్న పనులను వ్యాయామంగా కాకుండా దైనందిన కృత్యంగా మార్చుకోండి. • రాత్రిపూట ఆలస్యంగా వర్కవుట్ చేయడం: వీలైనంత వరకు రాత్రి 7 గంటల తర్వాత భారీ వర్కవుట్స్ చేయకండి. దీనివల్ల బాడీలో కార్టిసోల్ లెవెల్స్ పెరిగి, మీ నిద్రకు భంగం కలిగే అవకాశం ఉంది. • నిద్రకు ముందు స్క్రీన్ చూడటం: నిద్రలేమి (Insomnia) సమస్యలను నివారించడానికి పడుకునే ముందు ఫోన్ లేదా టీవీ చూడటం మానేయాలి. • వర్కవుట్ సమయంలో నీళ్లు తాగకపోవడం: వర్కవుట్ చేసేటప్పుడు లిక్విడ్స్ తీసుకోకూడదనేది తప్పుడు ప్రచారం. నీరు తాగకపోతే ఎలక్ట్రోలైట్స్ కోల్పోయి నీరసం (Dizziness) వచ్చే ప్రమాదం ఉంది. సరైన పద్ధతిలో వర్కవుట్ ఎలా చేయాలి? • సరైన సమయం: జిమ్ చేయడానికి ఉదయం 5 నుండి 9 గంటల లోపు అత్యంత అనుకూలమైన సమయం. • వ్యాయామ కాలపరిమితి: రోజుకు కనీసం ఒక గంట వెయిట్ ట్రైనింగ్ మరియు ఆ తర్వాత 20 నుండి 30 నిమిషాల కార్డియో చేయడం ఉత్తమం. మొత్తం మీద 1.5 గంటల రొటీన్ సరిపోతుంది. • సహజ ఎలక్ట్రోలైట్స్: వర్కవుట్ మధ్యలో ఉప్పు నీరు, నిమ్మరసం లేదా పుదీనా కలిపిన నీటిని సిప్ చేస్తూ ఉండటం వల్ల కోల్పోయిన లవణాలు తిరిగి లభిస్తాయి. • ఆహారం మరియు విశ్రాంతి: ఒకవేళ సాయంత్రం వర్కవుట్ చేసినా, ఆ తర్వాత ప్రోటీన్ మరియు ఫ్యాట్ అధికంగా ఉండే ఆహారం తీసుకుని, వేడి నీటి స్నానం చేసి పడుకోవడం వల్ల మంచి నిద్ర పడుతుంది. ప్రశ్నలు - సమాధానాలు  1. నడకను ఫిట్‌నెస్‌లో భాగంగా చూడవచ్చా:  లేదు, నడక అనేది మన శరీరం ప్రాథమికంగా చేసే పని. ఫిట్‌నెస్ కోసం అదనపు వ్యాయామాలు అవసరం. 2. జిమ్ చేయడానికి రోజులో ఏ సమయం ఉత్తమం: ఉదయం వేళల్లో చేయడం వల్ల హార్మోన్ల సమతుల్యత బాగుంటుంది. అయితే సమయం లేని వారు తగిన జాగ్రత్తలతో సాయంత్రం కూడా చేయవచ్చు. 3. బాడీ రికవరీ అవ్వాలంటే ఏం చేయాలి: తగినంత నిద్ర చాలా ముఖ్యం. నిద్రలోనే శరీరం తనను తాను మరమ్మతు చేసుకుంటుంది. నిద్ర తగ్గితే 'బ్రెయిన్ ఫాగ్' మరియు నీరసం వచ్చే అవకాశం ఉంది. ముగింపు: మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. కేవలం ఆహార నియమాలు పాటిస్తే సరిపోదు, తగినంత కదలిక మరియు వ్యాయామం కూడా ఉండాలి. సీడ్ ఆయిల్స్ మరియు కల్తీ పాల పదార్థాలకు దూరంగా ఉంటూ, ఒత్తిడిని నియంత్రించుకోవడం అలవాటు చేసుకోండి. మీ ఫిట్‌నెస్ ప్రయాణంలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మరియు నిపుణుల సలహాల కోసం మా YouTube Channel (Video link: https://youtu.be/u4uDJUP7Fw0?si=j6YfUFILXu2eJwcc ) ని సందర్శించండి. అక్కడ మీకు ఉపయోగపడే మరిన్ని వీడియోలు మరియు వర్కవుట్ చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా జీవించండి!

read more
ads
Online Jyotish
Tone Academy
KidsOne Telugu
బాదం బంక తినడం వల్ల మొటిమలు తగ్గుతాయా? అసలు నిజాలు ఏంటంటే!

చాలామందికి బాదం పప్పు గురించి తెలిసి ఉంటుంది. కానీ బాదం బంక అనే పేరు బహుశా చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది.  కానీ బాదం బంక ఆరోగ్యానికి చాలామంచిదని చెబుతారు.  బాదం బంకను నీటిలో నానబెట్టుకుని తింటుంటారు.  ముఖ్యంగా వేసవి కాలంలో బాదం బంక వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది.  ఇది చిన్న బంక గడ్డల్లా ఉంటుంది. నీటిలో వేసి సుమారు 2 గంటల సేపు నానబెడితే బాదం బంక కాస్తా జెల్లీ లాగా మారుతుంది. దీన్ని నేరుగా తింటారు,  నీటిలో కలిపి తాగుతారు,  ఇందులో సబ్జా, పంచదార వంటివి కూడా కలుపుకుని తాగుతారు.  వేసవిలో పానీయాలలో బాదం బంకను యాడ్ చేసుకుంటారు. ఇది శరీరానికి చలువ చేస్తుందని చెబుతారు. అయితే.. బాదం బంక తినడం వల్ల మొటిమలు తగ్గుతాయని కొందరు అంటుంటారు.  దీని వెనుక గల నిజం ఏమిటో తెలుసుకుంటే.. మొటిమలకు కారణం.. చర్మం మీద మొటిమలు, కురుపులు వంటివి వేడి వల్ల వస్తాయి. దీని వల్ల చర్మం చాలా దెబ్బతింటుంది. ఈ వేడిని తగ్గించడం ద్వారా మొటిమలు, కురుపులు తగ్గించడంలో బాదం బంక చక్కగా.. ఔషధంలా పనిచేస్తుంది. బాదం బంక.. చర్మ ప్రయజనాలు.. బాదం బంకను తీసుకోవడం వల్ల చాలా రకాల చర్మ సమస్యలు తగ్గిపోతాయి.   బాదం బంకను రాత్రంతా నీటిలో నానబెట్టాలి.  ఉదయానికి ఈ బంక కాస్తా జెల్లీ లాగా మారుతుంది.  దీనికి కొంచెం చల్లని నీరు కలపాలి.  ఇందులో కొంచెం నిమ్మరసం కలపాలి.  దీన్ని డీహైడ్రేట్ పానీయంలా తీసుకోవాలి.  కనీసం 3 నుండి 4 రోజులు రెగ్యులర్ గా తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. బాదం బంక ఎందుకు మంచిది? బాదం బంక తినడం వల్ల సహజంగానే శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇది చర్మాన్ని తేమ చేస్తుంది.  బాదం బంకలో ఉండే  యాంటీ-ఏజింగ్ లక్షణాల కారణంగా చాలా ప్రయోజనాలు అందిస్తుంది. ఇది శరీరం లోపలి నుండి విషాన్ని తొలగిస్తుంది.  మొటిమలు, ముడతలు,  వడదెబ్బ వంటి సమస్యలను తగ్గిస్తుంది. బాదం బంక తినడం వల్ల  చర్మానికి మెరుపు, యవ్వనం   లభిస్తుంది. ఇది చర్మ ఆరోగ్యానికి మాత్రమే కాకుండా శరీర ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.                                    *రూపశ్రీ.

read more
బీర్ తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు తొలగిపోతాయా? వైద్యులు చెప్పిన నిజాలివీ!

నేటికాలంలో కిడ్నీలో రాళ్లు ఏర్పడటం చాలా సాధారణం అయిపోయింది.   ఏ వయసు వారికైనా ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం వల్ల పిల్లలు,  యువకులలో కిడ్నీలో రాళ్ల సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ ప్రకారం దాదాపు 10 మందిలో ఒకరు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో కిడ్నీలో రాళ్ల సమస్యను ఎదుర్కుంటూ ఉన్నారట. ఈ సమస్యలు సాధారణంగా తేలికపాటి చికిత్స లేదా శస్త్రచికిత్స ద్వారా సులభంగా  పరిష్కారం అవుతాయి.  కానీ కొంతమందిలో రాళ్ల సమస్యలు తీవ్రమైన మూత్రపిండాల సమస్యలకు దారితీయవచ్చు. అసలు కిడ్నీలో రాళ్ల సమస్య ఎలా ఏర్పడుతుంది? బీర్ తాగితే కిడ్నీలో రాళ్ల సమస్య తగ్గుతుందనే మాట నిజమా? దీని గురించి వైద్యులు ఏం చెబుతున్నారు? తెలుసుకుంటే.. మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడటానికి కారణాలు.. మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడటానికి అతిపెద్ద కారణం తగినంత నీరు తీసుకోకపోవడం. తగినంత నీరు త్రాగనప్పుడు మూత్రం ఘాడతగా మారుతుంది.  దానిలోని ఖనిజాలు స్ఫటికాలను ఏర్పరుస్తాయి. ఇవే   కిడ్నీలో రాళ్లుగా రూపాంతరం చెందుతాయి.    ఉప్పు అధికంగా తీసుకోవడం, ప్రోటీన్ అధికంగా తీసుకోవడం, ఆక్సలేట్ అధికంగా ఉండే ఆహారాలైన పాలకూర, చాక్లెట్  వంటివి తినడం,  అధికంగా ప్రాసెస్ చేయబడిన ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా కిడ్నీలో రాళ్ల  ప్రమాదం పెరుగుతుంది. ఊబకాయం, మధుమేహం,  జీవక్రియ సమస్యలు కూడా రాళ్ళు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతాయి. మూత్రపిండాలలో రాళ్లు ఎలా నయమవుతాయి? వైద్యులు చెబుతున్న దాని ప్రకారం..  కిడ్నీలో రాళ్ళు సాధారణంగా  ఎక్కువ నీరు త్రాగడం ద్వారా వాటంతట అవే బయటకు వస్తాయి.  నొప్పిని తగ్గించడానికి,  రాళ్ల పరిమాణాన్ని తగ్గించడానికి వైద్యులు  మందులను సూచించవచ్చు. అయితే రాళ్ల పరిమాణం పెద్దగా ఉన్నప్పుడు  శస్త్రచికిత్స అవసరం ఏర్పడవచ్చు. కిడ్నీలో రాళ్లను ముందుగానే తొలగించడం చాలా ముఖ్యం ఎందుకంటే అవి కాలక్రమేణా కిడ్నీ లోపలి పొరను దెబ్బతీస్తాయి. బీరు తాగితే కిడ్నీలో రాళ్లు తగ్గుతాయా? బీరు తాగడం వల్ల మూత్ర ఉత్పత్తి పెరుగుతుందని, తరచుగా మూత్ర విసర్జన జరుగుతుందని,  రాళ్లు బయటకు వెళ్లడానికి సహాయపడుతుందని  చాలామంది నమ్ముతారు. కానీ వైద్యులు  ఈ నమ్మకాన్ని తోసిపుచ్చుతున్నారు. బీరు తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు బయటకు వెళ్లడానికి సహాయపడతాయనే నమ్మకం ప్రజలలో ఉన్నా.. బీరు తాగితే చాలు కిడ్నీలో రాళ్లు తొలగిపోతాయి అనుకోవడం చాలా తప్పని, అది వైద్యులు రికమెండ్ చేయరని చెబుతున్నారు. బీరు తాత్కాలికంగా మూత్ర ఉత్పత్తిని పెంచుతుంది, కానీ అది శరీరం డీహైడ్రేట్ అవ్వడానికి కారణం అవుతుంది.  ఇది రాళ్లు ఏర్పడటానికి ప్రధాన కారణం అవుతుంది. బీరులో ప్యూరిన్లు కూడా ఉంటాయి, ఇవి యూరిక్ ఆమ్లాన్ని పెంచుతాయి, మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతాయి, అప్పటికే కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు బీర్ తాగితే.. ఈ రాళ్ల ప్రమాదం మరింత పెరుగుతుంది. కాబట్టి కిడ్నీలో రాళ్ల సమస్యకు ఔషదంగా బీర్ ను తీసుకోవడం అస్సలు మంచిది కాదు.                            *రూపశ్రీ.  

read more
గ్యాస్ట్రిక్ తలనొప్పి.. ఇదెంత డేంజరో తెలుసా?

తలనొప్పి చాలా కామన్ గా అందరికీ వచ్చే సమస్య.  ఆఫీసు ఒత్తిళ్లు, దినచర్య క్రమంగా ఉండకపోవడం,   భోజనం ఆలస్యం కావడం,  సరిపడని ఆహారం తినడం వంటివి  తలనొప్పి కలిగిస్తూ ఉంటాయి. కానీ ప్రతి తలనొప్పి ఒత్తిడి వల్ల లేదా పైన చెప్పుకున్న సమస్యల వల్ల  వస్తుందని అనుకుంటే పొరపాటే.. కొన్నిసార్లు  తలనొప్పికి పొట్ట ఆరోగ్యం కూడా కారణం అవుతుందని అంటున్నారు వైద్యులు.  దీనిని సాధారణంగా గ్యాస్ తలనొప్పి లేదా గ్యాస్ట్రిక్ తలనొప్పి అని పిలుస్తారు. అసలు గ్యాస్ తలనొప్పి ఎలా వస్తుంది? ఈ తలనొప్పి వల్ల జరిగేదేంటి? తెలుసుకుంటే.. గ్యాస్ తలనొప్పి.. గ్యాస్ట్రిక్ తలనొప్పి అనేది సాధారణ టెన్షన్ లేదా సైనస్ తలనొప్పి కాదు. జీర్ణవ్యవస్థలో అజీర్ణం, ఆమ్లత్వం లేదా గ్యాస్ వంటి సమస్యలు ఉన్నప్పుడు ఇది వస్తుంది. కడుపు, మెదడు దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి. కడుపులో అసమతుల్యత ఉన్నప్పుడు, శరీరం ప్రతిస్పందిస్తుంది.  చాలా మందిలో కడుపులో ఉండే సమస్య తలకు వ్యాపిస్తుంది. కారంగా ఉండే ఆహారాలు, సక్రమంగా భోజనం చేయకపోవడం, అధికంగా  టీ,  కాఫీ తీసుకోవడం,  నిరంతర ఒత్తిడి ఇవన్నీ వంటివన్నీ సమస్యను మరింత తీవ్రం చేస్తాయి. గ్యాస్ట్రిక్ తలనొప్పి.. గ్యాస్ట్రిక్ తలనొప్పి  లైట్ గా ఉండవచ్చు లేదంటే ఎప్పుడూ తలనొప్పిగా కూడా ఉండవచ్చు.  అయితే గ్యాస్ట్రిక్ మైగ్రేన్ మరింత తీవ్రంగా  ఉంటుంది. ఇది కాంతికి,  శబ్దాలకు చాలా రియాక్ట్ అవుతుంది. వికారం లేదా వాంతులు కూడా ఉండొచ్చు. రెండింటిలోనూ  అంతర్లీనంగా  జీర్ణ సమస్యలే కారణం. ఈ సమస్య అప్పుడప్పుడు వస్తే అది ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, కానీ తరచుగా  వస్తుంటే మత్రం లైట్ గా తీసుకోకూడదు.  గ్యాస్ తలనొప్పి పదే పదే వస్తుంటే దీర్ఘకాలిక గ్యాస్ట్రిటిస్, పెప్టిక్ అల్సర్లు, పిత్తాశయ వ్యాధి, ప్రకోప ప్రేగు సిండ్రోమ్ లేదా గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్  వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉండొచ్చు.   డాక్టర్ ను ఎప్పుడు కలవాలి.. వారానికి రెండుసార్లు కంటే ఎక్కువసార్లు తలనొప్పి వస్తే, ఎటువంటి కారణం లేకుండా బరువు తగ్గుతుంటే, వాంతులు అవుతున్నా లేదా తీవ్రమైన కడుపు నొప్పిని ఉంటున్నా, లేదా ఇంటి చిట్కాలు ఫాలో అయినా  ఉపశమనం కలగకపోతే, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను సంప్రదించాలి. అవసరమైతే, ఎండోస్కోపీ వంటి పరీక్షలు జీర్ణవ్యవస్థ పరిస్థితిని స్పష్టం చేస్తాయి. చికిత్స అంటే నొప్పి నివారణ మందులు మాత్రమే కాదు, జీర్ణక్రియను మెరుగుపరచడం. సమయానికి తినడం, తేలికైన,  సమతుల్య ఆహారం తీసుకోవడం, తగినంత నీరు త్రాగడం,  నిరాశకు దూరంగా ఉండటం వంటివి ఈ సమస్యకు మంచి ఉపశమనం లభిస్తుంది.                                       *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
మునగాకు ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ వ్యక్తులు తినకూడదట..!

మునక్కాడల గురించి అందరికీ తెలిసే ఉంటుంది.  మునక్కాడలను వివిధ వంటకాల తయారీలో వాడుతూ ఉంటారు. అయితే మునగాకు గురించి చాలామందికి తెలియదు. పల్లె ప్రాంతాలలో విరివిగా మునగ చెట్లు పెరుగుతూ,  మునగాకు విరివిగా లభించినా వాటిని ఆహారంలో భాగం చేసుకునేవారు మాత్రం చాలా తక్కువే.. అయితే చాలా ప్రాంత ప్రజలు మాత్రం మునగాకులో ఉన్న పోషకాలను,  మునగాకు ఉపయోగాలను తెలుసుకుని డబ్బు వెచ్చించి మరీ మునగాకు కొని ఆహారంలో తీసుకుంటారు.  అయితే మునగాకు ఆరోగ్యానికి మంచిదే అయినా,  మునగాకును తినడం కొందరికి మంచిది కాదు.  ఇంతకీ మునగాకు ఎవరు తినకూడదు? ఎందువల్ల తినకూడదు? తెలుసుకుంటే.. మునగాకు పోషకాలు.. మునగలో మొక్కల ఆధారిత ప్రోటీన్ ఉంటుంది.  అలాగే విటమిన్-ఎ,  విటమిన్-సి, విటమిన్-ఇ,  కాల్షియం,  పొటాషియం,  ఐరన్, ఫైబర్,  యాంటీ ఆక్సిడెంట్లు,  బీటా కెరోటిన్,  బీటా క్వెర్సెటిన్ వంటివి మాత్రమే కాకుండా.. అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి. మునగాకు ఎవరు తినకూడదు.. థైరాయిడ్.. థైరాయిడ్ సమస్యలతో ఉన్నవారు మునగ తినడం చాలా ప్రమాదం అంటున్నారు.  ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యను కలిగిస్తుంది.  థైరాయిడ్ సమస్య ఉన్నవారు మునగ తినడం మానుకోవాలని చెబుతున్నారు. లో బిపి.. మునగ ఆకులలో అధిక మొత్తంలో ఆల్కలాయిడ్లు ఉంటాయి.  దీని వల్ల లో బిపి సమస్య ఉన్నవారికి మునగాకు తినడం వల్ల సమస్య పెరుగుతుంది. గర్బిణీ స్త్రీలు.. గర్బిణీ స్త్రీలు లేదా పాలిచ్చే తల్లులు వైద్యుల సలహా లేకుండా మునగ తినకూడదని అంటున్నారు.  ఇది గర్భస్రావం అయ్యే ప్రమాదాన్ని పెంచుతుందని చెబుతారు.   సెన్సిటివ్ స్టమక్.. కడుపు సున్నితంగా ఉండేవారు ఉంటారు.  ఇలాంటి వారు మునగ తీసుకోవడం చాలా పరిమితం చేయాలి.  కడుపు సున్నితంగా ఉండేవారు మునగాకు తీసుకుంటే విరేచనాలు,  తీవ్రమైన కడుపునొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.                              *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
మీరు కూడా చిన్న విషయాలకే కోప్పడుతుంటారా? ఇది మీ కోసమే..!

   నేటి కాలంలో నడుస్తున్న  బిజీ,  ఒత్తిడితో కూడిన జీవితంలో చిన్న విషయాలకే కోపం తెచ్చుకోవడం సర్వసాధారణం అయిపోయింది. ట్రాఫిక్‌లో చిక్కుకోవడం, ఇంటర్నెట్ నెమ్మదిగా ఉండటం లేదా స్నేహితుల మాటలకు వెంటనే కోపం తెచ్చుకోవడం ఇవన్నీ చాలా మంది అనుభవిస్తూ ఉంటారు. అయితే కోపం అనేది కేవలం ఒక ఎమోషన్  మాత్రమే కాదు, అది  శారీరక,  మానసిక ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుందని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. పదే పదే  కోపం రావడం అనేది అధిక రక్తపోటు, గుండె జబ్బులు,  జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. ముఖ్యంగా ఇది మానవ  సంబంధాలను,  వృత్తి జీవితాన్ని కూడా  ప్రభావితం చేస్తుంది.  అందువల్ల కోపాన్ని సరిగ్గా నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. అయితే కోపాన్ని నియంత్రించుకోవడం కూడా ఒక గొప్ప నైపుణ్యం అనే చెప్పవచ్చు. కోపాన్ని అదుపు చేసుకోవడం అంటే కోపాన్ని పూర్తిగా అణచివేయడం కాదు, దానిని వ్యక్తీకరించే విధానం కావచ్చు, దానిని ప్రదర్శించే ప్రాంతం కావచ్చు.. వీటిని మార్చుకోవడం.  ముఖ్యంగా  కోపానికి గల కారణాలను  అర్థం చేసుకుని, దానిని నియంత్రించుకోవడానికి పద్ధతులను అవలంబించినప్పుడు  భావోద్వేగాలపై  మంచి నియంత్రణను కలిగి ఉండగలుగుతాము. కోపాన్ని నియంత్రించుకునే పద్దతులు ఏంటో తెలుసుకుంటే.. ట్రిగ్గర్ లు..  కోపాన్ని నియంత్రించుకోవాలనుకుంటే,మొదట చేయాల్సింది ఎందుకు కోపం వస్తుంది? ఎవరి వల్ల కోపం వస్తుంది? ఎలాంటి పరిస్థితులలో కోపం వస్తుంది? ఈ విషయాలను అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు  పని ఒత్తిడి కావచ్చు లేదా ఒక  వ్యక్తి కావచ్చు,  కొన్నిసార్లు  రద్దీగా ఉండే ట్రాఫిక్ ప్రాంతం కావచ్చు. దేని వల్ల కోపం వస్తుందనేది గుర్తించగలిగితే ఆ కోపాన్ని నియంత్రించడానికి ఒక ప్రణాళికను తయారు చేసుకోవచ్చు.  శ్వాస సాధన..  కోపం వచ్చినప్పుడల్లా వెంటనే స్పందించే బదులు కొద్ది సేపు ఆగి లోతైన శ్వాసను ప్రాక్టీస్ చేయాలి. ఈ టెక్నిక్  శరీరాన్ని ప్రశాంతపరుస్తుంది.  హృదయ స్పందనను సాధారణీకరిస్తుంది.  ఆలోచించడానికి సమయం ఇస్తుంది. నెమ్మదిగా ఉచ్ఛ్వాసము,  నిశ్వాసము  కోపాన్ని తక్షణమే నియంత్రించగలవు. పరిస్థితి నుండి దూరం.. ఏదైనా  పరిస్థితి  చాలా ఇబ్బంది పెడుతుంటే ఆ ప్రదేశం నుండి కొంత సమయం దూరంగా వెళ్లడం మంచిది. తర్వాత  ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తితో మాట్లాడటం  లేదా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించడం చేయాలి. దూరాన్ని సృష్టించడం వల్ల పరిస్థితిని కొత్త కోణం నుండి చూసే అవకాశం లభిస్తుంది. ఇది కోపాన్ని శాంతపరుస్తుంది. వ్యాయామం,  ధ్యానం.. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా కోపాన్ని నియంత్రించడానికి సులువు అవుతుంది. శారీరక శ్రమ.. ఒత్తిడిని,  కోపాన్ని తగ్గించే హార్మోన్లను విడుదల చేస్తుంది. దీనితో పాటు ధ్యానం,  యోగా సాధన చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారి ఏకాగ్రత పెరుగుతుంది. తద్వారా  చిన్న విషయాలకు స్పందించడం మానేస్తారు.                          *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
ధరచూసి భయపడతాం కానీ కివిని రెగ్యులర్ గా తింటే కలిగే లాభాలివే!

ప్రతిరోజూ ఆహారంలో పండ్లు తీసుకోవడం చాలా మంచిదని దీనివల్ల ఆరోగ్యానికి ఢోకా ఉండదని అంటారు. అయితే పండ్లలో కొన్ని ఖరీదైనవి ఉంటాయి, మరికొన్ని తక్కువ ధరకే లభ్యమయ్యేవి ఉంటాయి. ధర విషయం పక్కన పెడితే ప్రతి పండుకూ దాని ప్రత్యేకత ఉంటుంది. చాలా మంది కివి పేరు చెబితే అధిక ధర అంటూ బ్యాక్ స్టెప్ వేస్తుంటారు. కానీ ధర అయినా సరే కివి పండును ఆహారంలో భాగం చేసుకుంటూ మాత్రం హాస్పిలట్స్ లో పోసే వందలు, వేల ఖర్చు ఈజీగా తగ్గినట్టేనట.  కివి పండును ఆహారంలో భాగంగా తీసుకుంటే  రోగనిరోధక వ్యవస్థ బలపడటంతో పాటు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.  తక్కువ కేలరీలతో, ఫైబర్ పుష్కలంగా ఉండే కివి పండులో డైజెస్టివ్ ఎంజైమ్ లు అయిన వియమిన్-సి ఉంటుంది. ఇది బరువు తగ్గడం నుండి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. కివి పండు రెగ్యులర్ గా ఆహారంలో భాగం చేసుకుంటే కలిగే ప్రయోజనాలు ఇవే.. రోగనిరోధక శక్తి.. కివి పండులో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. రోజూవారీ వ్యక్తికి కావలసిన విటమిన్-సి లో 80శాతం వరకు  కివి పండు నుండే పొందవచ్చు.  విటమిన్-సి శరీరంలో గొప్ప యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది.  ఆక్సీకరణ నష్టం నుండి కణాలను రక్షిస్తుంది. బలమైన రోగనిరోధక వ్యవస్థను ఏర్పరిచి అంటు వ్యాధుల  ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పొటాషియం మెండు.. గుండె, మూత్రపిండాలు, కండరాలు, నరాలు  సక్రమంగా పనిచేయాలంటే పొటాషియం చాలా అవసరం. ఒక కివి పండులో సుమారు 215మిగ్రా ల పొటాషియం ఉంటుంది.  కివిని తీసుకోవడం వల్ల శరీరానికి కావలసింత పొటాషియం లభిస్తుంది.  ఇది  అధిక రక్తపోటు, స్ట్రోక్, గుండె సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది.  అంతే కాదు మూత్రపిండాల్లో రాళ్లు, బోలు ఎముకల వ్యాధి నుండి కాపాడుతుంది. రక్తం గడ్డకట్టే పనికి చెక్..  సాధారణంగా దిగువ సిరల్లో రక్తం గడ్డ కట్టే సమస్య ఏర్పడుతుంది.  ఇది మెదడులో రక్తప్రసరణకు అంతరాయం కలిగిస్తుంది.  గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాలకు కూడా దారితీస్తుంది.  కివి రక్తంలో కొవ్వు స్థాయిలను తగ్గించడం ద్వారా రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది.  కివి పండ్లలో ఆహారంలో తీసుకుంటూ ఉంటే రక్తంలో కొవ్వు కరిగిపోయి  గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. స్ట్రోక్ సమస్యను కూడా తగ్గిస్తుంది. జీర్ణఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.. కివిలో కరిగే ఫైబర్స్, కరగని పైబర్స్ రెండూ ఉంటాయి. ఇందులో మూడు వంతులు కరిగే ఫైబర్, రెండు వంతుల కరగని పైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంతో పాటు గుండె, జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కివిలో ఉండే ఫైబర్ మొత్తం శరీర ఆరోగ్యానికి మేలు చేస్తుంది.                                                           *నిశ్శబ్ద.

read more
అన్నం, చపాతీ.. రెండు  కలిపి తినడం మంచిదేనా?

భారతీయులు ఆహార ప్రియులు.  భారతీయుల భోజనంలో చాలా రకాలు పదార్థాలు ఉంటాయి.  ముఖ్యంగా చాలామంది తమ భోజనంలో కొంచెం అన్నం  చపాతీ,  రెండు లేదా మూడు రకాల కూరలు.. ఇలా ఉండేలా చూసుకుంటారు. అయితే ఒకే భోజనంలో చపాతీ,  అన్నం రెండూ తినడం మంచిదేనా అని కొందరి అనుమానం.  నిజానికి నేటికాలంలో హోటళ్లలో కూడా  ఇలాంటి మెనూనే లంచ్ లో ఇస్తంటారు.  అయితే రెండూ తినడం ఎంత వరకు మంచిది? తెలుసుకుంటే.. బోజనంలో చపాతీ, అన్నం రెండూ కలిపి తినడం అనేది పూర్తీగా వ్యక్తి శారీరక స్థితి మీద ఆధారపడి ఉంటుందని ఆహార నిపుణులు అంటున్నారు. కానీ స్పష్టంగా చెప్పాలంటే మాత్రం చపాతీ, అన్నం రెండూ భోజనంలో తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచి ఛాయిస్ కాదని అంటున్నారు. ఒక్క చపాతీ,  ఒక కప్పు అన్నం.. ఇది చాలా మంది ఎంచుకునే అలవాటు. దీన్ని చాలా ఇష్టంగా ఎంచుకుంటారు. పైగా దీన్ని చాలా బాలెన్స్డ్ ఫుడ్ అని కూడా పిలుస్తారు.  కానీ చపాతీ, అన్నం.. రెండూ భోజనంలో తీసుకోవడం అయితే అస్సలు మంచిది కాదట. చపాతీలోనూ, అన్నంలోనూ.. రెండింటిలోనూ కార్బోహైడ్రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి.  రెండూ భోజనంలో తినడం వల్ల కార్బోహైడ్రేట్లు అధికంగా శరీరానికి అందుతాయి. తద్వారా కేలరీలు కూడా ఎక్కువ తీసుకున్నట్టు అవుతుంది. దీని వల్ల జీర్ణ సమస్యలు,  బరువు పెరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి. మరీ ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు అన్నం అవాయిడ్ చేసే చర్యలో భాగంగా కొంచెం అన్నం,  చపాతీ అని తమ లంచ్ ప్లాన్ చేసుకుంటారు. కానీ ఇది  రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతుంది.  అందుకే ఈ రెండింటి కాంబినేషన్ అస్సలు తినకూడదు. ప్రతి ఆహార పదార్థంలో ఉండే కార్బోహైడ్రేట్‌లకు  విభిన్నమైన శైలి ఉంటుంది.  గోధుమలలో ఉండే కార్బోహైడ్రేట్స్ వేరు,  అన్నంలో ఉండే కార్బోహేడ్రేట్స్ వేరు.. ఈ రెండింటికి విడివిడిగా తీసుకున్నప్పుడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ కలిపి తీసుకున్నప్పుడు జీర్ణం కావడంలో ఇబ్బంది ఏర్పడుతుంది.  అందుకే ఈ కాంబినేషన్ తినడం మంచిది కాదు.                                *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
ప్రేగు ఆరోగ్యం బాగలేకుంటే కనిపించే లక్షణాలు ఇవీ.. మీకు ఉన్నాయేమో చెక్  చేసుకోండి..!

ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. అయితే శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తేనే  ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా శరీరానికి శక్తిని ఇచ్చే ఆహారం ప్రేగులలోనే జీర్ణం అవుతుంది. కానీ నేటికాలంలో చాలామంది పేగు ఆరోగ్యం దెబ్బతినడం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి.  ముఖ్యంగా నేటికాలంలో ఫాస్ట్ ఫుడ్,  శీతల పానీయాలు తాగడం వల్ల పేగు ఆరోగ్యం దెబ్బతింటుంది. శరీరంలో కొన్ని లక్షణాలను బట్టి   ప్రేగు ఆరోగ్యం బాగుందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు.  ఆ లక్షణాలు ఏంటో తెలుసుకుంటే.. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి అంటే ప్రేగు ఆరోగ్యం ఎంతో ముఖ్యం.  ఎందుకంటే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పేగులలోనే తయారవుతుంది. పేగు ఆరోగ్యం దెబ్బతింటే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా తయారవదు. దీని వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ప్రేగు ఆరోగ్యం దెబ్బతింటే జీర్ణక్రియ నుండి రోగ నిరోధక శక్తి దెబ్బతినడం వరకు చాలా రకాల సమస్యలు వస్తాయి. తరచుగా ఉబ్బరం, కడుపులో గ్యాస్ ఏర్పడటం వంటి సమస్యలు వస్తుంటే ప్రేగు ఆరోగ్యం దెబ్బతినిందని,  ప్రేగు సమస్యలు ఉన్నాయని అర్థం. గట్ మైక్రోబయోమ్ అసమతుల్యత ఏర్పడినప్పుడు ఆహారం సరిగా జీర్ణం కాదు.  దీని వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడటం, కడుపు ఉబ్బరంగా మారడం, పొట్ట బరువుగా ఉండటం జరుగుతుంది. తరచుగా మలబద్దకం లేదా విరేచనాలు వంటి సమస్యలు వస్తున్నా కూడా ప్రేగు ఆరోగ్యం దెబ్బతిన్నదని అర్థం. ప్రేగు ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల పోషకాలు సరిగా గ్రహించబడవు. ఇది తరచుగా అలసటకు దారితీస్తుంది.  ఎంత మంచి ఆహారం తీసుకున్నా శరీరం శక్తివంతంగా ఉండదు. శరీరంలో దాదాపు 70శాతం రోగనిరోధక వ్యవస్థ పేగు ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది.  కాబట్టి ప్రేగు సమస్యలు వస్తే రోగనిరోధక శక్తి కూడా బలహీనంగా ఉండటం,  చిన్న చిన్న ఇన్ఫెక్షన్లను కూడా శరీరం భరించలేకపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి. గట్ మైక్రోబయోమ్ అసమతుల్యత కావడం వల్ల జీవక్రియ కూడా ప్రభావితం అవుతుంది.  ఇది బరువు పెరగడానికి అయినా కారణం కావచ్చు, లేదంటే బరువు తగ్గడానికి అయినా కారణం కావచ్చు.                                 *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
దాల్చిన చెక్క కొనే ముందు ఈ తప్పు చేయకండి.. చాలా నష్టపోతారు..!

వంటింట్లో సుగంధ ద్రవ్యాలు చాలా ఉంటాయి.  ఇవి అటు వంటలను ఘుమఘుమలాడించడమే కాకుండా.. ఇటు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.  చాలామంది రక్తంలో చక్కెర నియంత్రణకు,  ఇన్సులిన్ నిరోధకతకు పిసిఏస్ లేదా జీవక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం దాల్చిన చెక్కను ఉపయోగిస్తారు. అయితే దాల్చిన చెక్క కొనేముందు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. తప్పుగా ఉన్న దాల్చిన చెక్కను కొనుగోలు చేయడం,  దాన్ని వినియోగించడం వల్ల ప్రయోజనం చేకూరడానికి బదులు,  హాని జరిగే  అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అసలు క్వాలిటీ ఉన్న దాల్చిన చెక్కను ఎలా గుర్తించాలి? దాల్చిన చెక్కలో రకాలేంటి? వీటి గురించి వివరాలు తెలుసుకుంటే.. సిలోన్ సిన్నమోన్.. సిలోన్ సిన్నమోన్ ను  నిజమైన దాల్చిన చెక్క అని కూడా పిలుస్తారు. ఇది  ప్రధానంగా శ్రీలంక నుండి వస్తుంది. ఇది సహజంగానే చాలా తక్కువ మొత్తంలో 'కూమరిన్' కలిగి ఉంటుంది. ఇది దీర్ఘకాలిక రోజువారీ ఉపయోగం కోసం సురక్షితమైనదని చెబుతారు. సిలోన్ దాల్చిన చెక్క సారం పై చేసిన అధ్యయనాలు ఇది ఆహారం తీసుకోవడానికి ముందు   రక్తంలో చక్కెర స్థాయిలను,  ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని చూపించాయి . కాసియా సిన్నమోన్.. ఇది మార్కెట్లో లభించే అత్యంత సాధారణ దాల్చిన చెక్క. ఇందులో చాలా ఎక్కువ స్థాయిలో కూమరిన్ ఉంటుంది. దీన్ని అప్పుడప్పుడు మీ ఆహారంలో రుచి కోసం చేర్చుకుంటే పర్వాలేదు. కానీ  ఆరోగ్య ప్రయోజనాల కోసం ప్రతి రోజు పెద్ద పరిమాణంలో తీసుకుంటే అది కాలేయంపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుందని చెబుతున్నారు. ఇది గుర్తుంచుకోవాలి..  దాల్చిన చెక్కను దాని రుచి,  సువాసన కోసం మాత్రమే ఉపయోగిస్తుంటే ఏ రకమైన దాల్చిన చెక్కనైనా వాడవచ్చు, కానీ దాల్చిన చెక్కను రోజువారీ ఆరోగ్య దినచర్యలో భాగం చేసుకుంటూ ఉంటే సిలోన్ దాల్చిన చెక్కను ఎంచుకోవడం మంచిది. సిలోన్ దాల్చిన చెక్క ఎలా గుర్తించాలి.. దుకాణంలో నిజమైన దాల్చిన చెక్కను గుర్తించడానికి, ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. సిలోన్ దాల్చిన చెక్క.. దీని బెరడు మడతపెట్టిన కాగితంలాగా సన్నగా, మృదువుగా,  బహుళ పొరలుగా ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే చుట్టలాగా ఉంటుంది.  లోపల పొరలుగా కనిపిస్తూ ఉంటుంది. కాసియా దాల్చిన చెక్క.. కాసియా దాల్చిన చెక్క మందంగా, గట్టిగా,  కలపతో లాగా ఉంటుంది. దీనికి ఒకే పొర ఉంటుంది. పొడి కొనుగోలు చేస్తే.. దాల్చిన చెక్కను కొనుగోలు చేస్తే.. సిలోన్ దాల్చిన చెక్కను,  కాసియా దాల్చిన చెక్కను వాటి ఆకృతిని చూసి గుర్తించవచ్చు. కానీ పొడి కొనుగోలు చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్యాకేజీపై ఉన్న లేబుల్‌ను తప్పకుండా చదవండి. దానిపై 'సిలోన్ దాల్చిన చెక్క' లేదా 'సిన్నమోమమ్ వెరం' అని రాసి ఉండాలి. అలాంటి దాల్చిన చెక్క పొడినే కొనుగోలు చేయాలి.                                           *రూపశ్రీ.

read more
ఫ్రోజెన్ బఠానీలు తింటున్నారా? ఇవి తినడం మంచిదా కాదా? అసలు నిజాలివి..!

శీతాకాలంలో మార్కెట్ లో పచ్చి బఠానీలు అందుబాటులోకి వస్తాయి.  భారతీయ కూరలు,  మసాలా రైస్, వెజిటబుల్ రైస్, కూరగాయలు అన్నీ కలిపి వండే కూరలు, గ్రేవీలు, సూపుల  నుండి స్నాక్స్ వరకు బఠానీలు ప్రతి వంటకం  రుచిని పెంచుతాయి. కానీ శీతాకాలం ముగియగానే తాజా పచ్చి బఠానీలు మార్కెట్ లో కనిపించవు. ఇలాంటి సందర్భాలలో  ప్రజలు తెలివిగా ఆలోచిస్తారు. డీప్ ఫ్రిజ్ లో ఫ్రీజ్ చేసిన  బఠానీలను ఆశ్రయిస్తారు. వీటినే ఫ్రోజెన్ బఠానీలు అని అంటారు. అయితే, చాలా మంది ఫ్రోజెన్ బఠానీలు ఆరోగ్యానికి మంచివా కాదా అనే విషయం ఆలోచించరు. అలాగే  తాజా బఠానీల లాగా ఫ్రోజెన్ బఠానీలు ప్రయోజనకరంగా ఉంటాయా లేదా అని కూడా తెలుసుకోరు.  కానీ ఆరోగ్యం మీద స్పృహ ఉన్న కొద్దిమంది మాత్రం ఫ్రోజెన్ బఠానీ ల గురించి అయోమయంలో ఉంటారు.   అసలు ఫ్రోజెన్ బఠానీలు పచ్చి బఠానీలలాగా ఆరోగ్యానికి మేలు చేస్తాయా? దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. బఠానీలలో పోషకాలు.. శాకాహారులకు పచ్చి బఠానీలు ప్రోటీన్ పరంగా  అద్భుతమైన వనరు. వాటిలో ప్రోటీన్‌తో పాటు అనేక ముఖ్యమైన విటమిన్లు,  ఖనిజాలు ఉంటాయి. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం సాధారణ ఆహారంలో బఠానీలను చేర్చుకోవడం వల్ల పోషకాహార లోపాలను అధిగమించవచ్చు. అందుకే సీజన్ ముగిసిన తర్వాత  ఫ్రోజెన్   బఠానీలను తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. ఫ్రోజెన్ బఠానీ ప్రాసెస్.. ఫ్రోజెన్ బఠానీలు పూర్తిగా పండినప్పుడు వాటిని సేకరిస్తారు.  వాటిని దాదాపు -18 డిగ్రీల సెల్సియస్ వద్ద స్తంభింపజేస్తారు. ఈ తక్కువ ఉష్ణోగ్రత వద్ద వాటిని నిల్వ చేయడం వల్ల సూక్ష్మజీవుల పెరుగుదల లేదా జీవసంబంధమైన మార్పులు నిరోధించబడతాయి, అవి ఎక్కువ కాలం పచ్చి బఠానీల లాగా ఉంటాయి. ఆరోగ్యపరంగా.. ఫ్రోజెన్ బఠానీలు అనారోగ్యకరమైనవని,  అనారోగ్యానికి కారణమవుతాయని ప్రజలు తరచుగా అనుకుంటారు. అయితే నిపుణులు దీనిని తోసిపుచ్చుతున్నారు. ఫ్రోజెన్ బఠానీలు తాజా పచ్చి బఠానీల మాదిరిగానే ప్రోటీన్, విటమిన్లు,  ఖనిజాలను కలిగి ఉంటాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. తాజా బఠానీ, ఫ్రోజెన్ బఠానీ మధ్య తేడా.. నిపుణుల అభిప్రాయం ప్రకారం తాజా బఠానీలు,  ఫ్రోజెన్   బఠానీల పోషక విలువలో గణనీయమైన తేడా లేదు. ఒక అధ్యయనం రెండు సంవత్సరాల పాటు బఠానీలతో సహా తాజా,  ఫ్రోజెన్  కూరగాయలను పోల్చింది. ఈ అధ్యయనంలో రెండింటి పోషక విలువలు దాదాపు ఒకేలా ఉన్నాయని తేలింది. ఇంకా, అనేక ఇతర అధ్యయనాలు కూడా ఘనీభవించిన కూరగాయలు తాజా కూరగాయల మాదిరిగానే ప్రయోజనకరంగా ఉంటాయని చూపించాయి. ఫ్రిజర్వేటివ్స్.. కొంతమంది  ఫ్రోజెన్ బఠానీల లైఫ్ స్పాన్ పెంచడానికి వాటికి ప్రిజర్వేటివ్‌లు లేదా రసాయనాలు కలుపుతారని అనుకుంటారు. అయితే, పోషకాహార నిపుణులు ఇది నిజం కాదని చెబుతున్నారు. -18 డిగ్రీల సెల్సియస్ వద్ద బఠానీలను గడ్డకట్టించడం  వల్ల అవి సురక్షితంగా ఉంటాయి. దీనికోసం రసాయనాలు అవసరం లేదు.  అయితే, తాజా, ఫ్రోజెన్   బఠానీల మధ్య రుచిలో మాత్రం తేడా ఉంటుంది.                               *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
నిలబడి నీరు తాగుతున్నారా?ఈ షాకింగ్ నిజాలు తెలిస్తే అవాక్కవుతారు..!

నేటి వేగవంతమైన జీవితంలో, మనం చిన్న చిన్న అలవాట్ల విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు . కామన్ గా  ఆఫీసులో, ఇంట్లో లేదా బయటకు వెళ్లినప్పుడు నిలబడి నీరు తాగుతుంటారు.   దీని వల్ల ఏం జురుగుతుందనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు. అయితే ఇదేం చెడ్డ అలవాటు కాదులే అనుకుంటారు చాలామంది. కానీ ఆయుర్వేదం మాత్రం ఇది చాలా చెడ్డ అలవాటు అంటోంది.  శరీరానికి నీరు ఎంత ముఖ్యమైనదో.. నీరు తాగే పద్దతి కూడా అంతే ముఖ్యమని ఆయుర్వేదం చెబుతుంది. నిలబడి నీరు త్రాగడం క్రమంగా శరీరానికి హాని కలిగిస్తుందట.   దీని గురించి పూర్తీ విషయాలు తెలుసుకుంటే.. కూర్చుని నీరు తాగితే.. కూర్చుని సౌకర్యవంతంగా నీరు త్రాగినప్పుడు శరీరం దానిని నెమ్మదిగా గ్రహించడానికి సమయం ఉంటుంది. అయితే నిలబడి నీరు త్రాగడం వల్ల నీరు వేగంగా గ్రహించబడుతుంది. శరీరం దానిని సరిగ్గా ఉపయోగించుకోలేదు. ఇది క్రమంగా  ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఆయుర్వేదం ప్రకారం.. ఆయుర్వేదం ప్రకారం నిలబడి నీరు త్రాగడం వల్ల శరీరంలోని నీటి సమతుల్యత దెబ్బతింటుంది. దీనివల్ల నీరు సరిగ్గా ఉపయోగించబడకుండా కీళ్ళు, మోకాళ్ల చుట్టూ పేరుకుపోతుంది, దీని వలన చిన్న వయసులోనే మోకాళ్ల నొప్పులు,బిగుసుకుపోవడం,  కీళ్ల సమస్యలు వస్తాయి. కూర్చిని నీరు తాగితే జరిగేది ఇదే.. కూర్చుని నీరు త్రాగినప్పుడు శరీరం దానిని ఫిల్టర్ చేసి, తరువాత దానిని మూత్రపిండాలకు పంపిస్తుంది. అయితే, నిలబడి నీరు త్రాగడం వల్ల నీరు ఫిల్టర్ చేయకుండానే  మూత్రపిండాలకు చేరుతుంది, వాటిపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ఇలా ఎక్కువసేపు చేయడం వల్ల మూత్రపిండాల సమస్యలు వస్తాయి. నిలబడి నీరు తాగితే.. నిలబడి నీరు త్రాగడం వల్ల నీరు కడుపులోకి వేగంగా చేరుతుంది. ఇది జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. ఇది గ్యాస్, ఆమ్లత్వం, గుండెల్లో మంట, మలబద్ధకం,  బరువు తగ్గడం వంటి సమస్యలకు దారితీస్తుంది. శరీరంలో జరిగే మార్పు.. శరీరం నీటిని సరిగ్గా ఉపయోగించుకోలేనప్పుడు, అది శరీర శక్తిని,  బలాన్ని ప్రభావితం చేస్తుంది. ఎక్కువ పని లేకపోయినా  అలసిపోయి, నీరసంగా ఉన్నట్టు అనిపించవచ్చు. అందుకే ఇలా చేయాలి.. ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలనుకుంటే నీరు త్రాగేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఎల్లప్పుడూ హాయిగా కూర్చుని నీరు త్రాగాలి, అది కూడా  నెమ్మదిగా సిప్ బై సిప్  త్రాగాలి, తొందర తొందరగా నీరు తాగకూడదు. చాలా చల్లటి నీరు కూడా తాగకుండా ఉండటం మంచిది.  గది ఉష్ణోగ్రతలో ఉన్న  నీరు మంచిది, గోరు వెచ్చగా ఉన్న నీరు మంచిది.  గాజు లేదా మట్టి కుండలో నిల్వ చేసిన నీటిని త్రాగడం శ్రేష్టం.  ప్లాస్టిక్ బాటిళ్లలో నీటిని తాగడం మంచిది కాదు.                                *రూపశ్రీ.  

read more
రోజూ చేసే ఈ చిన్న తప్పులే డయాబెటిస్ రావడానికి కారణం అవుతాయి..!

డయాబెటిస్ చాలామందిని కుదిపేస్తున్న సమస్య.  ఒకప్పుడు 60ఏళ్ళు దాటిన వృద్దులలో డయాబెటిస్ కనిపించేది. కానీ నేటి కాలంలో మాత్రం 30 ఏళ్లు కూడా నిండకనే డయాబెటిస్ బారిన పడుతున్నారు.  మరీ దారుణం ఏమిటంటే.. చిన్న పిల్లలలో కూడా డయాబెటిస్ సమస్య ఉంటోంది. అయితే రోజువారీ జీవితంలో చేసే చిన్న తప్పులే డయాబెటిస్ రావడానికి కారణం అవుతున్నాయని ఆరోగ్య నిపుణులు,  పరిశోధకులు అంటున్నారు.  ఇంతకీ డయాబెటిస్ రావడానికి రోజువారీ జీవితంలో చేస్తున్న తప్పులేంటి? తెలుసుకుంటే.. జన్యు సమస్య కాదు.. డయాబెటిస్ అనేది తల్లిదండ్రుల నుండి వస్తుందని చాలా మంది అనుకుంటారు.   దీన్ని జన్యు పరమైన సమస్యగా చెబుతారు. అయితే డయాబెటిస్  ఎక్కువగా  ఆధునిక జీవనసైలి,  ఆహారం, శరీరానికి కష్టం లేకపోవడం వంటి అలవాట్ల వల్ల వస్తోంది. ప్రాచీన ఆయుర్వేదం ఏం చెప్పిందంటే.. ప్రాచీన భారతీయ గ్రంథాలు అయిన చరక సంహితలో చరకాచార్యుడు డయాబెటిస్ ను మధుమేహం గా వివరించాడు. మూత్రంలో తీపి రుచి ఉండటం ద్వారా దీన్ని గుర్తించారట. సుశ్రుత సంహితలో సుశ్రుతుడు 20రకాల మధుమేహాలను చెప్పి వీటి లక్షణాలు,  కారణాలు,  చికిత్సలను కూడా తెలిపాడు. పై విషయాలను బట్టి చూస్తే.. మధుమేహం అనేది పూర్వ కాలం నుండే ఉన్నా.. అది నేటికాలంలో మనుషుల జీవితాలను చాలా ప్రభావితం చేస్తోంది.   ఇన్సులిన్ వ్యవస్థ.. శరీరంలో ఇన్సులిన్ వ్యవస్థ ఉంటుంది.  ఈ వ్యవస్థను పాడు చేసే చిన్న చిన్న అలవాట్లు ఉంటాయి.  వీటిని చాలా వరకు ఎంతోమంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఇది డయాబెటిస్ రావడానికి కారణం అవుతుంది. అల్పాహారం.. అల్పాహారాన్ని దాటవేడయం వల్ల శరీరంలో ఇన్సులిన్ ప్రతిస్పందనకు అంతరాయం కలుగుతుంది. బోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయి.  ఇది క్రమంగా డయాబెటిస్ కు దారితీస్తుంది. ఎక్కువ సేపు కూర్చోవడం.. ఒకప్పుడు బాగా పని చేసి.. అలసిపోయినప్పుడు కొద్దిసేపు కూర్చొనేవారు.  కానీ నేటికాలంలో ఆఫీసులలో గంటలు గంటలు కూర్చుని పనిచేయడం.. నాలుగు గంటలకు ఒకసారి బ్రేక్ పేరుతో కొద్దిసేపు లేచి తిరగడం చేస్తున్నారు. దీని వల్ల శరీర కణాలు ఇన్సులిన్ కు సున్నితంగా మారిపోతాయి. శరీరం గ్లూకోజ్ శోషణను ఇది నెమ్మదిస్తుంది.  ఇది శరీరంలో గ్లూకోజ్ పేరుకోవడానికి దారి తీస్తుంది.  ఆలస్యంగా,  భారీగా తినడం.. రాత్రి భోజనం ఎప్పుడూ 7 లేదా 8 గంటల లోపు తినాలని చెబుతుంటారు. గూట్లో దీపం నోట్లో ముద్ద అన్నారు పెద్దలు.  అంటే సాయంత్రం ఇంట్లో దీపం వేయడం, రాత్రి ఆహారం తీసుకోవడం ఒకేసారి జరగాలని దీని ఉద్దేశ్యం.  అంతలోపు తీసుకోకపోయినా కనీసం 7 నుండి 8 లోపు తీసుకోవాలి.  కానీ  ఆలస్యంగా 10 గంటలకు పైన లేదా 11 గంటలకు పైన తినడం, అది కూడా చాలా భారీగా  తినడం చేస్తుంటారు. ఈ అలవాటు కొన్ని నెలలు,  ఏళ్ల పాటు కొనసాగితే డయాబెటిస్ పక్కాగా వస్తుంది.                                   *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
శరీరాన్ని ఉక్కులా మార్చే ఆహార కాంబినేషన్లు..!

శరీరాన్ని ఉక్కులా మార్చే ఆహార కాంబినేషన్లు..!   ఆహారం శరీరానికి చాలా ముఖ్యమైనది.  శరీరానికి అన్ని పోషకాలు లభించాలంటే ఆయా పోషకాలు సమృద్దిగా ఉన్న ఆహారాలు తినాలని చెబుతారు పెద్దలు, వైద్యులు.  అయితే కొన్ని రకాల ఆహారాలు ఎంత తిన్నా వాటిలోని పోషకాలు శరీరానికి అందవు,  ఎంత తిన్నా ఏం మార్పు లేదని చాలామంది కన్ప్యూజన్ అవుతుంటారు. అయితే ఆహారాల కాంబినేషన్ లు మ్యాజిక్ చేస్తాయి.  ఆహారంలో లభించే పోషకాల సినర్జిస్టిక్ ప్రభావం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మల్టీవిటమిన్లు సహజంగా మొత్తం ఆహారాలలో కనిపిస్తాయి. విటమిన్లు,  ఖనిజాలతో పాటు, అవి అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి. ఫైబర్.. ఇది నెమ్మదిగా జీర్ణమవుతుంది, ఇది శరీరంలోకి పోషకాలను నెమ్మదిగా విడుదల చేస్తుంది. ఎంజైమ్‌లు.. పోషకాలను విచ్ఛిన్నం చేసి నిర్దిష్ట మూలకాలను సక్రియం చేస్తాయి. ఫైటోకెమికల్స్.. పోషకాలను నష్టం నుండి రక్షిస్తాయి.  పోషకాలను మరింత ప్రయోజనకరంగా చేస్తాయి. ఆహార కాంబినేషన్లు.. బెస్ట్ కాంబో.. సిట్రస్ పండ్లు లేదా ఆకుకూరలతో కూరగాయలు, గింజలతో పండ్లు. బెస్ట్ కలర్స్.. వివిధ రంగుల పండ్లు,  కూరగాయలు ముఖ్యమైన ఫైటోన్యూట్రియెంట్లను కలిగి ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు.. ఆహార కొవ్వును సరిగ్గా జీర్ణం చేసుకోవడానికి విటమిన్లు A, D, E,  K వంటి కొవ్వులో కరిగే విటమిన్లు అవసరం. కాల్షియం, విటమిన్-డి.. తగినంత విటమిన్ డి లేకుండా  శరీరం కాల్షియంను సరిగ్గా గ్రహించదు. అందువల్ల  కాల్షియం అధికంగా ఉండే ఆహారాలతో విటమిన్ డి ని సప్లిమెంట్ చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది బలమైన దంతాలు,  ఎముకలను నిర్వహించడానికి,  గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. విటమిన్-సి, ఐరన్.. విటమిన్ సి తో ఐరన్ తీసుకోవడం వల్ల  శరీరం దానిని సులభంగా జీర్ణం చేస్తుంది. అందుకే పాలకూరతో నిమ్మకాయ, టమోటాలతో పప్పు, బెర్రీలతో బలవర్థకమైన తృణధాన్యాలు వంటి కాంబినేషన్లు మంచివిగా పరిగణించబడతాయి. ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్.. ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్‌ను నిర్వహించడానికి ప్రోబయోటిక్స్ అవసరమైన బ్యాక్టీరియా. అవి జీర్ణక్రియకు సహాయపడతాయి,  రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పెరుగు, ఊరగాయలు, ఇడ్లీ, దోస,  కేఫీర్ వంటి పులియబెట్టిన ఆహారాలు ప్రోబయోటిక్స్‌లో సమృద్ధిగా ఉంటాయి. ఈ బ్యాక్టీరియాను నిర్వహించడానికి ప్రీబయోటిక్ ఆహారాలు కూడా అంతే ముఖ్యమైనవి. ప్రీబయోటిక్స్ అనేది ప్రోబయోటిక్స్‌కు ఎరువుగా పనిచేసే ఒక రకమైన ఆహార ఫైబర్. ఉల్లిపాయలు, వెల్లుల్లి, అరటిపండ్లు, ఆపిల్స్,  తృణధాన్యాలలో ప్రీబయోటిక్స్ కనిపిస్తాయి.                                       *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
ఫైబర్ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారా? ఈ నిజాలు తెలిసా..!

ఆహారం ప్రతి జీవికి శక్తివనరు.  ప్రాణం లేని వాహనాలు కూడా వాటికి ఇంధనం  ఉంటేనే పని చేస్తాయి. అలాంటి ప్రాణం ఉన్న జీవులకు ఆహారం చాలా ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ప్రాణం ఉన్న జీవులలో ఈ ప్రపంచంలో మనిషి చాలా ప్రత్యేకం.  అయితే మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలంటే సమతుల ఆహారం తీసుకోవాలి.  ఇందులో ఫైబర్ కూడా ముఖ్యమైనది. చాలామంది ఆహారంలో కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ప్రోటీన్ వంటివి ఉన్నాయా లేదా అని చూస్తారు. కానీ ఫైబర్ గురించి ఆలోచించే వారు తక్కువ. ఆహారంలో ఫైబర్ లోపిస్తే చాలా రకాల ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. పైబర్ గురించి నిర్లక్ష్యంగా ఉండేవారు తప్పకుండా తెలుసుకోవలసిన నిజాలు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. పేగు ఆరోగ్యం.. ఫైబర్ లేకపోవడం వల్ల మన గట్ లైనింగ్ నేరుగా దెబ్బతింటుంది, ఇది జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీని వల్ల పేగులు దెబ్బతినే అవకాశాలు క్రమంగా పెరుగుతాయి.   షుగర్ లెవల్స్.. ఫైబర్ లేకపోవడం వల్ల శరీరంలో షుగర్ లెవల్స్ పెరుగుదల మరింత తీవ్రమవుతుందని. ఆహారంలో ఫైబర్ ఉన్నప్పుడు, అది చక్కెర శోషణను నెమ్మదిస్తుంది. ఫైబర్ లేకపోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయి. ఇది ఇన్సులిన్ నిరోధకత,  టైప్ 2 డయాబెటిస్‌కు  దారితీస్తుంది. కొలెస్ట్రాల్.. గుండె ఆరోగ్యం.. ఫైబర్ శరీరంలో చీపురులా పనిచేస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తుడిచిపెడుతుంది. ఆహారంలో ఫైబర్ తక్కువగా ఉంటే, ఈ చెడు కొవ్వు ధమనులలో పేరుకుపోతుంది. గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. ఫ్యాటీ లివర్.. ఫైబర్ లేకపోవడం కొవ్వు కాలేయం ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. దీనివల్ల శరీరం  ప్రధాన వడపోత  అవయవమైన లివర్ పనితీరు మందగిస్తుంది.  ఆరోగ్యకరమైన వ్యక్తి ప్రతిరోజూ 25-30 గ్రాముల ఫైబర్ తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. క్యాన్సర్.. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఫైబర్ లేకపోవడం వల్ల శరీరం బ్యూటిరేట్ అనే ముఖ్యమైన షార్ట్-చైన్ ఫ్యాటీ యాసిడ్ ఉత్పత్తి తగ్గుతుంది. బ్యూటిరేట్ పేగు కణాలకు శక్తిని అందిస్తుంది,  క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుండి వాటిని రక్షిస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం లేకపోవడం వల్ల పెద్దప్రేగు క్యాన్సర్,  ఇతర శోథ వ్యాధుల ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని, ఇది దీర్ఘకాలిక ఆరోగ్యానికి ఎక్కువ ముప్పును కలిగిస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. హార్మోన్ల అసమతుల్యత.. అకాల వృద్దాప్యం.. ఫైబర్ లేకపోవడం వల్ల అంతర్గత అవయవాలు మాత్రమే కాకుండా చిన్న వయసులోనే వయస్సు పెరిగినట్టు (అకాల వృద్ధాప్యం) కూడా ప్రభావితమవుతుంది. ఇది హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది,  అకాల వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఫైబర్ తగినంతగా తీసుకోకపోవడం ముడతలు,  శరీరంలో ఎనర్జీ నష్టానికి దారితీస్తుంది. అందువల్ల,  ఆహారంలో తృణధాన్యాలు, పప్పుధాన్యాలు,  కాలానుగుణ కూరగాయలను చేర్చడం చాలా ముఖ్యం.                              *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...  

read more
రాత్రి పడుకునేముందు సొంపు నీరు తాగితే.. ఆయుర్వేద వైద్యులు చెప్పిన రహస్యాలు ఇవి.. !

ఒకప్పుడు సొంపు చాలా మందికి తెలియదు. జీలకర్రను పోలిన సొంపు చాలా మంచి సువాసనతో ఉంటుంది. కొన్నిరకాల వంటల్లో సొంపును వాడతారు. మరికొందరు సొంపును భోజనం తర్వాత జీర్ణశక్తి కోసం తీసుకుంటారు. రెస్టారెంట్లలో భారీ భోజనం తిన్న తరువాత సొంపు ఇవ్వడం వెనుక కారణం.. కడుపు ఉబ్బరం, అజీర్తి ఉండకూడదనే.. అయితే ఆయుర్వేదం సొంపుతో మరింత గొప్ప ప్రయోజనాలు ఉన్నాయని చెబుతుంది. చాలామంది రాత్రి నీటిలో సొంపును నానబెట్టి ఉదయాన్నే తాగుతూ ఉంటారు.  కానీ రాత్రి పడుకునే ముందు సొంపు నీరు తాగితే అద్భుతాలు జరుగుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఇంతకూ రాత్రి పడుకునే ముందు సొంపు నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఆయుర్వేద వైద్యులు ఏం చెప్పారు? తెలుసుకుంటే.. మనం తినే,  త్రాగే ఆహారాలు మన చర్మంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయని చెబుతారు. అందుకే మనం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి.  కడుపును శుభ్రంగా ఉంచుకోవడం వల్ల సహజమైన మెరుపు వస్తుంది. సొంపు నీరు కూడా ఇలాంటిదే..  డిటాక్స్ డ్రింక్.. రోజూ డీటాక్స్ డ్రింక్ తాగడం వల్ల శరీరం నుండి టాక్సిన్స్ బయటకు పోతాయి. ఇది  చర్మాన్ని హైడ్రేటెడ్ గా, ప్రకాశవంతంగా,  యవ్వనంగా ఉంచుతుంది. డిటాక్స్  డ్రింక్ తాగడం వల్ల మొటిమలు , మంట,  మచ్చలు వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. సొంపు నీటిని ఎలా చేసుకోవాలి.. 1 కప్పు నీరు 1 టీస్పూన్ సోంపు.. 1 టీస్పూన్ జీలకర్ర.. 1 టీస్పూన్ క్యారమ్ విత్తనాలు.. తయారు విధానం.. పైన పేర్కొన్నవన్నీ ఒక పాన్‌లో లేదా గిన్నెలో వేయాలి. అందులో ఒక కప్పు నీరు పోయాలి.  దీన్ని తక్కువ మంట మీద మరిగించాలి. 5 నుండి 10 నిమిషాలు ఉడకబెట్టండి.  ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి.   డిటాక్స్ డ్రింక్ రెడీగా ఉన్నట్టే ప్రతి రాత్రి పడుకునే ముందు దీన్ని తయారు చేసుకుని తాగమని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ప్రయోజనాలు.. ఈ డిటాక్స్ డ్రింక్ తాగడం వల్ల మొటిమలు తగ్గుతాయి, చర్మం మెరుస్తుంది,  కడుపు శుభ్రంగా ఉంటుంది, శరీరం డీటాక్స్ అవుతుంది సొంపు చేసే మ్యాజిక్.. పైన పేర్కొన్న డిటాక్స్ డ్రింక్ లో సొంపు ఉంటుంది.  ఇది చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ఎ, సి, ఇ తో పాటు అనేక ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి.  ఇవి చర్మాన్ని శుద్ది చేస్తాయి. ఇది మొటిమలు,  ముడతలను తగ్గిస్తుంది,  ముఖానికి సహజమైన మెరుపును ఇస్తుంది . ఇది మంటను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.                        *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more