ఈ పండ్లు మూత్రపిండాల ఆరోగ్యానికి గొప్ప వరం..!
మూత్రపిండాలు శరీరంలో వడపోత అవయవాలు. ఇవి రక్తాన్ని శుద్ది చేస్తాయి. అలాగే శరీరంలో ద్రవాల నుండి వెలువడే వ్యర్థాలను మూత్రం రూపంలో విసర్జించడానికి సహాయపడతాయి. అయితే నేటి కాలంలో చాలామంది మూత్రపిండాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కిడ్నీ ఫెయిల్యూర్, మూత్రనాళ ఆరోగ్యం దెబ్బతినడం, కిడ్నీలలో రాళ్లు..ఇలా మూత్రపిండాలకు సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. మూత్రపిండాల ఆరోగ్యం బాగుండాలన్నా, వాటి పనితీరు మెరుగ్గా ఉండాలన్నా కొన్ని పండ్లు చాలా బాగా సహాయపడతాయి. ఈ పండ్లు మూత్రపిండాల ఆరోగ్యానికి వరం అని చెప్పవచ్చు. ఆ పండ్లు ఏమిటో.. ఆ పండ్లు మూత్రపిండాల ఆరోగ్యానికి ఎందుకు సహాయపడతాయో తెలుసుకుంటే.. బెర్రీస్.. బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే పొటాషియం తక్కువగా ఉంటుంది. ఇది ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తుంది. మూత్రపిండాల ఆరోగ్యానికి మంచివి. చెర్రీస్.. చెర్రీస్ ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి, ముత్రపిండాల ఆరోగ్యానికి మేలు చేసే యూరిక్ ఆమ్లాన్ని తగ్గించడానికి సహాయపడే యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా కలిగి ఉంటాయి. ద్రాక్ష.. ద్రాక్ష పండ్లలో రెస్వెరాట్రాల్ ఉంటుంది. ఇది గుండె మరియు మూత్రపిండాల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ద్రాక్షలో పొటాషియం తక్కువగా ఉంటుంది. పైనాపిల్.. పైనాపిల్ పొటాషియం అధికంగా కలిగి ఉంటుంది. ఇది ఉష్ణ మండల పండు. ఇందులో బ్రోమెలైన్ అధికంగా ఉంటుంది. ఇది శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉన్న ఎంజైమ్. పుచ్చకాయ.. పుచ్చకాయ చర్మాన్ని హెడ్రేట్ చేస్తుంది. శరీరంలో టాక్సిన్లను బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఇది వాపును కూడా తగ్గిస్తుంది. మూత్రపిండాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. యాపిల్స్.. యాపిల్స్ లో పొటాషియం తక్కువగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించడంలోనూ, శరీరంలో ఉండే వాపును తగ్గించడంలోనూ సహాయపడుతుంది. పీచ్.. పీచ్ పండ్లలో పొటాషియం తక్కువగా ఉంటుంది. కానీ విటమిన్-ఎ, విటమిన్-సి అధికంగా ఉంటాయి. ఇది మూత్రపిండ రోగులకు చాలా మంచి పండు. అందులోనూ ఇది చాలా రుచిగా కూడా ఉంటుంది. అంతేకాదు.. ఈ పండు వేసవిలో విరివిగా దొరుకుతుంది. క్రాన్బెర్రీ.. క్రాన్బెర్రీ పండ్లు మూత్ర మార్గ ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది. అలాగే కాల్ఫియం, ఆక్సలేట్ తో మూత్రపిండాలలో తయారయ్యే రాళ్లను తగ్గించడంలో సహాయపడుతుంది. బేరి.. బేరి పండ్లలో జీర్ణక్రియకు సహాయపడే ఫైబర్ ఉంటుంది. అలాగే ఈ పండులో సోడియం తక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. పైన చెప్పుకున్న పండ్లన్నీ మూత్రపిండాల ఆరోగ్యానికి ఎంతో బాగా సహాయపడతాయి. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే పైన పేర్కొన్న పండ్లను తప్పక తినండి. *రూపశ్రీ.
read moreRO వాటర్ ఆరోగ్యానికి మంచివా? చెడ్డవా? వైద్యులు చెప్పిన షాకింగ్ నిజాలివీ..!
మంచి నీరు అంటే నేటికాలంలో అందరికీ మినరల్ వాటర్ ఏ తెలుసు. ఇక చాలామందికి తాగే నీరు అంటే RO వాటరే. ఇప్పట్లో ధనికుల ఇళ్ళ నుండి మధ్య తరగతి కుటుంబ సభ్యులు కూడా ప్రతి ఇంట్లో రివర్స్ ఆస్మాసిస్ టెక్నాలజీ ఉపయోగించే ఫ్యూరిఫైయర్లు వాడుతున్నారు. వీటినే సింపుల్ గా RO ఫ్యూరిఫైయర్లు అని అంటున్నారు. నీటిలో ఉండే మలినాలను, భారీ లోహాలను, ఇతర హానికరమైన కలుషితాలను తొలగించడంలో ఈ ప్యూరిఫైయర్లు బాగా సహాయపడతాయని చెబుతారు. ఈ కారణంగానే ప్రతి ఇంట్లో వాటర్ ఫ్యూరిపైయర్లు వాడటం సహజం అయిపోయింది. ప్రతిరోజూ ఆర్.ఓ వాటర్ తాగడం సహజం. అయితే ప్రతిరోజూ ఈ ఆర్.ఓ వాటర్ ను తాగడం మంచిదేనా? ఇది ఆరోగ్యానికి మంచి చేస్తుందా లేదా చెడు చేస్తుందా? వైద్యులు దీని గురించి ఏం చెబుతున్నారు? తెలుసుకుంటే.. ఆర్.ఓ శుద్దీకరణ ఎలా పనిచేస్తుంది? RO టెక్నాలజీలో, నీరు పొర గుండా వెళుతుంది, బ్యాక్టీరియా, వైరస్‌లు, కరిగిన లవణాలు, భారీ లోహాలు, ఇతర హానికరమైన మూలకాలను తొలగిస్తుంది. అందుకే ఆహార కాలుష్యం లేదా మలినాలకు గురయ్యే ప్రాంతాలలో నీటిని శుద్ధి చేయడంలో RO వ్యవస్థ ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. అయితే ఈ ప్రక్రియ నీటిలోని కాల్షియం, మెగ్నీషియం వంటి కొన్ని సహజ ఖనిజాల పరిమాణాన్ని తగ్గిస్తుంది. అందుకే చాలామంది RO నీరు అధికంగా శుద్ధి చేయబడిందని, ఈ నీటిలో అవసరమైన పోషకాలు ఉండవని చెబుతారు. ఖనిజ లోపాలు.. ఆహారం.. శరీరానికి అవసరమైన ఖనిజాలకు ప్రధాన వనరు నీరు కాదని, మనం రోజువారీ తీసుకునే ఆహారమే ఖనిజాలు భర్తీ చేస్తుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. త్రాగునీటి నుండి శరీరం పొందే ఖనిజాల పరిమాణం చాలా తక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. చాలా పోషకాలు ఆహారం నుండి లభిస్తాయి, అయితే ప్రతిరోజూ సమతుల్య, పోషకమైన ఆహారం తీసుకుంటే, RO నీటిలో కొద్దిగా ఖనిజాలు లోపం ఉన్నా అదేమీ సమస్య కాదని అంటున్నారు. . పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు శరీర పోషక అవసరాలను సులభంగా తీర్చగలుగుతాయని అంటున్నారు. ఆర్.ఓ నీరు.. మూత్రపిండాల ఆరోగ్యం.. మూత్రపిండ వైద్యులు, నిపుణుల అభిప్రాయం ప్రకారం, RO నీరు సాధారణంగా మూత్రపిండాల ఆరోగ్యంపై ఎటువంటి పెద్ద ప్రతికూల ప్రభావాలను చూపదట. నీటి నుండి మలినాలను తొలగించడానికి, త్రాగడానికి సురక్షితంగా చేయడానికి RO వ్యవస్థ రూపొందించబడిందని వైద్యులు అంటున్నారు. ఈ ప్రక్రియలో కొన్ని ఖనిజాలు కోల్పోవచ్చు, మూత్రపిండాల ఆరోగ్యంగా ఉండటానికి నీరు తగినంతగా తాగడం చాలా ముఖ్యమట. సమతుల్య ఆహారం తీసుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం. శుభ్రమైన, సురక్షితమైన నీటిని తాగడం మూత్రపిండాలకు ప్రయోజనకరంగా ఉంటుంది, ఎందుకంటే ఇది శరీరం నుండి వ్యర్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఆర్.ఓ నీరు.. ఎలక్ట్రోలైట్లు.. కొంతమంది RO నీటిని ఎక్కువ కాలం తాగడం వల్ల శరీరంలోని ఎలక్ట్రోలైట్ సమతుల్యత దెబ్బతింటుందని చెబుతారు. కానీ ఆరోగ్యవంతమైన వ్యక్తులలో ఇది చాలా అరుదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని ఎలక్ట్రోలైట్ సమతుల్యత మూత్రపిండాల హార్మోన్లు, ఆహారం నుండి పొందిన పోషకాల ద్వారా నియంత్రించబడుతుంది. సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్లు ప్రధానంగా ఆహారం నుండి లభిస్తాయి. కాబట్టి సాధారణ సమయాలలో ఆర్.ఓ నీరు తాగడం వల్ల ఎలాంటి ఎలక్ట్రోలైట్ సమతుల్యత ప్రబావితం కాదు. *రూపశ్రీ.
read more60 ఏళ్ల తర్వాత కూడా స్పష్టంగా వినాలనుకుంటున్నారా.. చెవి సమస్యలకు శాశ్వత పరిష్కారం!
మన జీవితంలో వినికిడి అనేది కేవలం ఒక ఇంద్రియ జ్ఞానం మాత్రమే కాదు, అది మన ఆత్మీయులతో మనల్ని కలిపే ఒక వారధి. వయసు మళ్లుతున్న కొద్దీ కంటి చూపు తగ్గడం సహజమని ఎలా భావిస్తామో, వినికిడి తగ్గడాన్ని కూడా అలాగే గమనించాలి. ముఖ్యంగా 50 నుండి 60 ఏళ్ల మధ్య వయసు వారికి మాటలు వినిపిస్తున్నా, అవి స్పష్టంగా అర్థం కాకపోవడం ఒక పెద్ద సమస్యగా మారుతుంది. ఇది కేవలం శారీరక సమస్యే కాదు, మనుషులతో కలవలేకపోవడం వల్ల వచ్చే మానసిక వేదన కూడా. మీ వినికిడి ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకోవడానికి ENT Specialist Dr. PLVN Murthy గారు చెప్పిన విషయాలను ఈ Video Link క్లిక్ చేసి తెలుసుకోండి. మనం ఎందుకు వినికిడి పరీక్షలు చేయించుకోవాలి? (Why Should We?) వయసు పెరిగే కొద్దీ వచ్చే వినికిడి లోపాన్ని 'ప్రెస్ బై అక్యూసిస్' (Presbycusis) అంటారు. దీనిని నిర్లక్ష్యం చేస్తే కలిగే నష్టాలు ఇవే: సామాజిక దూరం (Social Withdrawal): ఎదుటివారు మాట్లాడే మాటలు అర్థం కాకపోవడం వల్ల, ఫ్యామిలీ ఫంక్షన్లలో లేదా స్నేహితులతో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్న భావన కలుగుతుంది. మానసిక ఒత్తిడి: సరిగ్గా వినిపించకపోవడం వల్ల ఎదుటివారు ఎగతాళి చేస్తారేమో అన్న భయంతో డిప్రెషన్ మరియు మానసిక ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. జ్ఞాపకశక్తి తగ్గడం: వినికిడి లోపం వల్ల మెదడు యొక్క పనితీరు (Cognitive function) మందగించే ప్రమాదం ఉంటుంది. ఆరోగ్య పర్యవేక్షణ: ముఖ్యంగా డయాబెటిస్ (చక్కెర వ్యాధి), బీపీ (రక్తపోటు) ఉన్నవారిలో వినికిడి నరాలు త్వరగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు రెగ్యులర్ గా పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. ఏమి చేయకూడదు? (What Not To Do) గూగుల్ వైద్యం వద్దు: వినికిడి సమస్య రాగానే గూగుల్‌లో చూసి సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం లేదా మందులు వాడటం చేయకండి. ఇది చాలా సున్నితమైన అవయవం కాబట్టి నిపుణులైన ఈఎంటి (ENT) డాక్టర్ని మాత్రమే సంప్రదించాలి. లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి: "వయసు పెరిగింది కదా, వినిపించకపోవడం సహజం" అని సరిపెట్టుకోవద్దు. అధిక శబ్దాలకు దూరంగా ఉండండి: ఫ్యాక్టరీల్లో లేదా అధిక శబ్దాలు వచ్చే ప్రదేశాల్లో పని చేసే వారు తగిన రక్షణ లేకుండా ఉండకూడదు. పరీక్షలు మరియు చికిత్స - ఎలా? (How To) మీ వినికిడి స్థాయిని తెలుసుకోవడానికి డాక్టర్లు సాధారణంగా ఈ క్రింది పరీక్షలు చేస్తారు: ప్యూర్ టోన్ ఆడియోమెట్రీ (Pure Tone Audiometry): ఇది వినికిడి లోపాన్ని గుర్తించడానికి అత్యంత కీలకమైన (Gold Standard) పరీక్ష. దీని ద్వారా ఏ ఫ్రీక్వెన్సీలో ఎంత లోపం ఉందో తెలుస్తుంది. టెంపనోమెట్రీ (Tympanometry): మధ్య చెవిలో ఏవైనా లోపాలు ఉన్నాయా లేదా నీరు చేరిందా అని తెలుసుకోవడానికి ఈ పరీక్ష చేస్తారు. ఓటో ఎకౌస్టిక్ ఎమిషన్స్ (OAE): చెవిలోని లోపలి భాగంలో ఉండే 'ఔటర్ హెయిర్ సెల్స్' పనితీరును ఇది గుర్తిస్తుంది. పరీక్షల కాలపరిమితి: 45 నుండి 50 ఏళ్ల మధ్యలో ఒకసారి బేస్‌లైన్ టెస్ట్ చేయించుకోవాలి. సాధారణంగా ప్రతి 2 నుండి 3 ఏళ్లకు ఒకసారి పరీక్ష చేయించుకుంటే మంచిది. డయాబెటిస్, బీపీ లేదా కిడ్నీ సమస్యలు ఉన్నవారు ప్రతి ఏటా వినికిడి పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) ప్రశ్న: నాకు మాటలు వినిపిస్తున్నాయి కానీ అర్థం కావడం లేదు, ఎందుకు? సమాధానం: దీనిని 'వర్డ్ డిస్క్రిమినేషన్' (Word Discrimination) సమస్య అంటారు. వయసు రీత్యా హై ఫ్రీక్వెన్సీ వినికిడి లోపం ఉన్నప్పుడు శబ్దం వినిపిస్తుంది కానీ మాటలోని స్పష్టత లోపిస్తుంది. ప్రశ్న: ఆరోగ్యకరమైన జీవనశైలి ఉన్నవారికి కూడా వినికిడి సమస్యలు వస్తాయా? సమాధానం: అవును, మంచి లైఫ్ స్టైల్ ఉన్నప్పటికీ వయసుతో పాటు వినికిడి నరాలు బలహీనపడటం వల్ల సమస్యలు రావచ్చు. అలాగే డయాబెటిస్ వంటి సమస్యలు ఉన్నా ఇది త్వరగా వచ్చే అవకాశం ఉంది. ప్రశ్న: ఏవైనా మందుల వల్ల వినికిడి తగ్గుతుందా? సమాధానం: అవును, కొన్ని రకాల క్యాన్సర్ డ్రగ్స్ లేదా మరికొన్ని ఆటోటాక్సిక్ డ్రగ్స్ వాడటం వల్ల వినికిడి శక్తిపై ప్రభావం పడవచ్చు. వినికిడి లోపం అనేది కేవలం చెవికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, అది మీ జీవన ప్రమాణాన్ని ప్రభావితం చేసే అంశం. సరైన సమయంలో స్క్రీనింగ్ చేయించుకోవడం ద్వారా మీ సామాజిక జీవితాన్ని, ఆనందాన్ని తిరిగి పొందవచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం, అందులో వినికిడి ఆరోగ్యం అత్యంత ముఖ్యం! మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. వినికిడి లోపం అనేది కేవలం శారీరక సమస్య మాత్రమే కాదు, అది మన ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచే జాగ్రత్త పడండి. మరిన్ని ఆరోగ్య సమాచారం కోసం ఇప్పుడే మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌లో చూడిండి (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
read moreకిడ్నీలో రాళ్ళు & యూరిన్ ఇన్ఫెక్షన్ కి పరిష్కారం!
• కిడ్నీలో రాళ్ళు ఉన్న • యూరిన్ ఇన్ఫెక్షన్ / యూరిన్ ప్రాబ్లెమ్స్ • కిడ్నీ డిసీజ్ & వారి కుటుంబ సభ్యులు • సహజమైన ఆయుర్వేదం / యూనానీ వైద్యం • సర్జరీ లేకుండా కిడ్నీ స్టోన్స్ ట్రీట్‌మెంట్ ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు ఊరికే అనలేదు. ఈ రోజుల్లో మనల్ని వేధిస్తున్న ఎన్నో ఆరోగ్య సమస్యలకు ప్రకృతిలోనే అద్భుతమైన పరిష్కారాలు ఉన్నాయి. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు, యూరిన్ ఇన్ఫెక్షన్స్ వంటి ఇబ్బందులతో బాధపడేవారికి ఒక తీపి కబురు. కేవలం ఒక పండుతో మీ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవచ్చో ఈ వ్యాసంలో వివరంగా తెలుసుకుందాం. కిడ్నీలో రాళ్ళు (Kidney Stones) & యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యలతో బాధపడుతున్నారా? ఈ వీడియోలో ప్రముఖ యూనానీ వైద్య నిపుణులు Dr. SGV Satya గారు కిడ్నీ స్టోన్స్ కి సహజమైన & శాశ్వతమైన పరిష్కారం గురించి వివరంగా చెప్తున్నారు. సర్జరీ లేకుండా కిడ్నీ రాళ్ళు కరిగించే అద్భుతమైన పండు గురించి, యూరిన్ ప్రాబ్లెమ్స్ కి యూనానీ ట్రీట్‌మెంట్ గురించి ఈ వీడియోలో తెలుసుకోండి. పైనాపిల్: మీ కిడ్నీలకు మరియు సర్వ రోగాలకు ఒక సంజీవిని పైనాపిల్ కేవలం రుచికరమైన పండు మాత్రమే కాదు, వందల ఏళ్ల నాటి యునాని వైద్యంలో దీనికి విశిష్ట స్థానం ఉంది. శరీరంలోని మలినాలను తొలగించి, మిమ్మల్ని తాజాగా ఉంచడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. మనం పైనాపిల్ ఎందుకు తీసుకోవాలి? (Why Should We?) 1. కిడ్నీ మరియు మూత్రపిండాల రక్షణ: పైనాపిల్‌లో 'డయూరిటిక్ ఎఫెక్ట్' ఉంటుంది. ఇది యూరిన్ ఫ్రీగా వచ్చేలా చేసి, కిడ్నీలో రాళ్లు (Kidney Stones) మరియు ప్రోస్టేట్ సమస్యలను నివారిస్తుంది. 2. వాపుల నివారణ (Anti-inflammatory): యునాని వైద్యంలో దీనిని 'ఇల్తహాబ్' (వాపు) తగ్గించడానికి వాడుతుంటారు. కీళ్ల నొప్పులు (Arthritis), సైనసైటిస్, గొంతు ఇన్ఫెక్షన్ల వంటి సమస్యలకు ఇది మేలైన పరిష్కారం. 3. శరీర ప్రక్షాళన (Detoxification): శరీరంలోని హానికరమైన వ్యర్థాలను (Morbid material) బయటకు పంపడంలో పైనాపిల్‌ను మించినది లేదు. 4. మెదడు మరియు గుండె ఆరోగ్యం: నిరంతరం కంప్యూటర్ల ముందు కూర్చుని పని చేసే వారికి, మెమరీ లాస్ ఉన్న వారికి ఇది మేధోశక్తిని పెంచుతుంది. అలాగే రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టకుండా (Blood clotting) చూస్తూ గుండెను కాపాడుతుంది. 5. దంత ఆరోగ్యం: పళ్లపై పేరుకుపోయిన గార (Plaque) తొలగించడానికి మరియు చిగుళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి నేరుగా పైనాపిల్ ముక్కలు తినడం ఎంతో మంచిది. ఏం చేయకూడదు? (What Not to Do?) • అపెండిక్స్ సర్జరీ అయిన వారు: అపెండిక్స్ తీసేసిన వారు నేరుగా పండు తినకూడదు, కేవలం జ్యూస్ మాత్రమే తాగాలి. • అతిగా తీసుకోవద్దు: పైనాపిల్ ఆరోగ్యానికి మంచిదే కదా అని అతిగా, మరీ పుల్లగా ఉన్నవి తీసుకోకండి. దీనివల్ల కొన్నిసార్లు జలుబు లేదా ఆస్తమా ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది. • డయాబెటిస్ ఉన్నవారు: షుగర్ ఉన్నవారు పండును లేదా జ్యూస్‌ను తక్కువ పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. ఎలా ఉపయోగించాలి? (How to Use?) • ప్రయాణాల్లో వాంతులు (Motion Sickness): బస్సుల్లో ప్రయాణించేటప్పుడు వాంతులు అయ్యే వారు, చిన్న బాక్స్‌లో పైనాపిల్ ముక్కలు పెట్టుకుని, టూత్‌పిక్‌తో అప్పుడప్పుడు తింటూ ఉంటే ఆ సమస్య తగ్గుతుంది. • పిల్లల్లో కడుపులో పురుగులు: పిల్లలకు తరచుగా పైనాపిల్ తినిపిస్తే, పేగుల్లో ఉండే పురుగులు (Intestinal worms) నశిస్తాయి. • డయాబెటిస్ నియంత్రణకు: పైనాపిల్ ఆకులు మరియు వేర్లను నీళ్లలో మరిగించి ఆ కషాయం తాగితే షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. • శ్వాసకోస సమస్యలకు: జలుబు, దగ్గు ఉన్నప్పుడు పైనాపిల్ జ్యూస్‌ను డైల్యూట్ చేసి తీసుకుంటే ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. తరచుగా అడిగే ప్రశ్నలు (Q&A) ప్రశ్న: కిడ్నీలో రాళ్లు ఉన్నవారు పైనాపిల్ తీసుకోవచ్చా? జవాబు: తప్పకుండా! బాడీలో ఎక్కడ స్టోన్స్ ఉన్నా వాటిని బ్రేక్ చేయడంలో, ముఖ్యంగా కిడ్నీ స్టోన్స్ తొలగించడంలో పైనాపిల్ జ్యూస్ పాత్ర సాటిలేనిది. ప్రశ్న: పైనాపిల్ తింటే జలుబు చేస్తుందా? జవాబు: ఇది చాలా మందిలో ఉన్న అపోహ. పైనాపిల్ వల్ల జలుబు రాదు, కానీ అతిగా పుల్లని పండు తింటే సమస్య రావచ్చు. సరైన పద్ధతిలో తీసుకుంటే ఇది లంగ్స్ మరియు గొంతు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ప్రశ్న: శరీర నొప్పులకు పైనాపిల్ పనిచేస్తుందా? జవాబు: అవును, ఇందులో అనాల్జిసిక్ (Analgesic) గుణాలు ఉండటం వల్ల వెన్నునొప్పి, కడుపునొప్పి వంటి బాడీ పెయిన్స్ తగ్గడానికి సహాయపడుతుంది. ప్రకృతి ప్రసాదించిన ఈ అద్భుతమైన పండును మీ డైట్‌లో భాగం చేసుకోండి. "ఏతదాలే అక్లాత్" అంటే శరీరంలోని నాలుగు ధాతువులను సమతుల్యంగా ఉంచి మిమ్మల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయడంలో పైనాపిల్ ఎంతో కీలకం. మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య చిట్కాలు మరియు నిపుణుల సలహాల కోసం మా యూట్యూబ్ మా Youtube"TeluguOne Health"ఛానెల్‌ను సందర్శించండి. (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!) ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా జీవించండి! Disclaimer: ఈ వీడియో కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా ట్రీట్‌మెంట్ ప్రారంభించే ముందు మీ డాక్టర్‌ని సంప్రదించండి.
read moreబోన్ సిస్ట్: కౌమార దశలో వచ్చే ఈ వ్యాధి గురించి తెలుసా?
బోన్ సిస్ట్.. దీన్నే ఎముక తిత్తి అని అంటారు. ఎముక తిత్తి అనేది ఎముక సంబంధిత సమస్య, దీని గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. ఇది చాలా అరుదైన వ్యాధి, కానీ ఎవరికైనా ఇది వచ్చినప్పుడు, వారి సమస్యలు విపరీతంగా పెరుగుతాయి. ఎముక తిత్తి అభివృద్ధి చెందినప్పుడు, ఆ ప్రాంతంలోని ఎముక నెమ్మదిగా కరిగిపోవడం ప్రారంభమవుతుంది. తరచుగా ఈ సమస్యను క్యాన్సర్‌తో రిలేటెడ్ గా పరిశీలిస్తారు. కానీ ఇది క్యాన్సర్ కు సంబందం లేని వ్యాధి. బోన్ సిస్ట్ సమస్య ప్రధానంగా పిల్లలను ప్రభావితం చేస్తుంది. మరీ ముఖ్యంగా కౌమారదశలో పిల్లలను ప్రభావితం చేస్తుంది. చిన్న గాయం కారణంగా అకస్మాత్తుగా ఎముక విరిగినప్పుడు ఎముక తిత్తులు వస్తాయి. ఒక అధ్యయనం ప్రకారం, ఈ తిత్తులు సాధారణంగా ఎముకల చివర్లలో అభివృద్ధి చెందుతాయి. ఇక్కడ పెరుగుదల ప్లేట్లు చురుకుగా ఉంటాయి, ఈ తిత్తులు సాధారణంగా రెండు రకాలు: అనూరిస్మల్ ఎముక తిత్తులు యునికార్న్యుయేట్ ఎముక తిత్తులు. ప్రారంభం.. ఈ వ్యాధి ప్రారంభం లక్షణాలు ప్రభావిత ప్రాంతంలో వివరించలేని నొప్పి,, ఎక్స్-కిరణాలు ఆ ప్రాంతంలో ఎముక సాంద్రత తగ్గినట్లు వెల్లడిస్తాయి. అదృష్టవశాత్తూ, ముందుగానే గుర్తిస్తే, దీనిని పూర్తిగా నయం చేయవచ్చు. కౌమార దశలో దీని ప్రమాదం ఎక్కువ ఎందుకు? కౌమారదశలో ఎముకలు వేగంగా పెరుగుతాయి. ఈ సమయంలో ఎముకల లోపల ద్రవ పీడనం లేదా రక్త నాళాలలో మార్పులు తిత్తులు ఏర్పడటానికి దారితీస్తాయి. వైద్యులు, నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇది సాధారణంగా 5 నుండి 15 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలలో కనిపిస్తుంది, ఎందుకంటే ఈ కాలంలో ఎముక ఎదుగుదల, ఎముకలలో మార్పుల ప్రక్రియ వేగంగా జరుగుతుంది. లక్షణాలు.. ఎముక తిత్తులు ఎలాంటి స్పష్టమైన లక్షణాలను కలిగి ఉండవు, కొన్నిసార్లు ప్రభావిత ప్రాంతంలో నొప్పిని కలిగిస్తాయి, కానీ చాలా సందర్భాలలో ఎముక బలహీనపడి విరిగిపోయే వరకు నొప్పి ఉండకపోవచ్చు. ఈ వ్యాధి తరచుగా ఆటలు ఆడే సమయంలో గాయాలు తగలడం జరిగినప్పుడు చేసే ఎక్స్-రే వాపు లేదా చిన్న బెణుకుల ద్వారా గుర్తించబడుతుంది. పిల్లలు పెద్ద గాయం లేకుండా ఒకే ప్రాంతంలో పదే పదే నొప్పి లేదా పగుళ్లను ఎదుర్కొంటుంటే, అది ఎముక తిత్తికి ముందస్తు సంకేతం కావచ్చు. చికిత్స.. వైద్యులు తరచుగా చిన్న తిత్తులను పర్యవేక్షిస్తారు, ఎందుకంటే చాలా సందర్భాలలో అవి వయస్సుతో పాటు వాటంతట అవే నయం అవుతాయి. తిత్తి పెద్దగా ఉండి, పగులు వచ్చే ప్రమాదం ఉంటే, 'క్యూరెట్టేజ్' ప్రక్రియ ద్వారా ద్రవాన్ని తొలగించడం ద్వారా 'బోన్ గ్రాఫ్టింగ్' చేస్తారు. కొన్ని సందర్భాల్లో, ఈ తిత్తులను శస్త్రచికిత్స లేకుండానే స్టెరాయిడ్ ఇంజెక్షన్ల ద్వారా కూడా చికిత్స చేయవచ్చు. తిత్తి పెద్దదిగా మారితే శస్త్రచికిత్సను కూడా సూచించవచ్చు. ఇది చాలా అవసరం.. ఎముక తిత్తి సమస్య సరైన సమయంలో గుర్తించబడితే సకాలంలో చికిత్స చేయడం ద్వారా దీనిని పూర్తిగా నయం చేయవచ్చు. ప్రభావిత ప్రాంతంలో కణజాలం బయాప్సీ చేసిన తర్వాత మాత్రమే నిపుణులు ఈ సమస్యను నిర్ధారిస్తారు. బయాప్సీ నివేదిక ఎముక తిత్తిని నిర్ధారించిన తర్వాత, చికిత్స ప్రారంభిస్తారు. పిల్లలకు ఎముకల విషయంలో ఏదైనా అనుమానాస్పదంగా సమస్య కనిపిస్తుంటే నిర్లక్ష్యం చేయంకుడా ఆర్థోపెడిక్ వైద్యులను సంప్రదించడం చాలా మంచిది. *రూపశ్రీ.
read moreబట్టతల రావడానికి కారణాలు ఏమిటి?
బట్టతల మరియు జుట్టు రాలడం : కారణాలు నివారణలు ఆధునిక చికిత్సలు జుట్టు అనేది కేవలం మన శరీరంలో ఒక భాగం మాత్రమే కాదు, అది మన అందానికి మరియు ఆత్మవిశ్వాసానికి చిహ్నం. అద్దంలో చూసుకున్నప్పుడు జుట్టు పలచబడటం గమనిస్తే కలిగే ఆందోళన అంతా ఇంతా కాదు. ఒకప్పుడు 40 ఏళ్లు దాటిన వారిలో కనిపించే బట్టతల సమస్య, నేడు మారుతున్న జీవనశైలి వల్ల 13-14 ఏళ్ల చిన్న వయసులోనే మొదలవుతోంది. ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీనిని అరికట్టడం సాధ్యమేనా? Dr. Sunaina Shaik చెప్పిన మరిన్ని విషయాలు ఈ TeluguOne Health Video Link క్లిక్ చేసి తెలుసుకుందాం. మనం జుట్టుపై ఎందుకు శ్రద్ధ వహించాలి? (Why Should We?) • ముందస్తు గుర్తింపు (Early Diagnosis): జుట్టు పూర్తిగా ఊడిపోయిన తర్వాత తిరిగి రావడం అసాధ్యం. ప్రారంభ దశలోనే గుర్తిస్తే మందుల ద్వారా జుట్టును కాపాడుకోవచ్చు. • ఆత్మవిశ్వాసం: జుట్టు రాలడం వల్ల కలిగే మానసిక ఒత్తిడి మన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది. సరైన సమయంలో చికిత్స తీసుకోవడం వల్ల మనల్ని మనం ఉత్సాహంగా ఉంచుకోవచ్చు. • మెరుగైన ఫలితాలు: జుట్టు పల్చబడే దశలో (Hair Thinning) చికిత్స ప్రారంభిస్తే, ఉన్న జుట్టును ఒత్తుగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏమి చేయకూడదు? (What Not To Do?) • సొంత వైద్యం వద్దు: డాక్టర్ పర్యవేక్షణ లేకుండా మినాక్సిడిల్ (Minoxidil) వంటి మందులను వాడకూడదు. • గర్భధారణ సమయంలో జాగ్రత్త: గర్భం దాల్చిన వారు లేదా ప్లాన్ చేస్తున్న వారు మినాక్సిడిల్ వాడటం వల్ల పుట్టబోయే పిల్లల్లో లోపాలు వచ్చే అవకాశం ఉంది. • అతిగా ఆశించవద్దు: హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ ద్వారా గతంలో ఉన్నంత సహజమైన సాంద్రత (Density) రాకపోవచ్చు; ఇది కేవలం పలచబడిన ప్రాంతాన్ని కవర్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. • ఒత్తిడిని నిర్లక్ష్యం చేయకండి: ఆధునిక పరిశోధనల ప్రకారం, ఒత్తిడి (Stress) అనేది బట్టతలకు ప్రధాన కారణాల్లో ఒకటిగా మారుతోంది. జుట్టును ఎలా కాపాడుకోవాలి? (How to - Treatment Steps) 1. కారణాన్ని గుర్తించండి: పురుషులలో వచ్చే బట్టతలను 'ఆండ్రోజెనెటిక్ అలోపేసియా' అంటారు, ఇది ఎక్కువగా జన్యుపరంగా వస్తుంది. మహిళల్లో జుట్టు మధ్యలో పలచబడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 2. వైద్య చికిత్సలు: ◦ మినాక్సిడిల్: ఇది సీరం, లోషన్, ఫోమ్ లేదా టాబ్లెట్ రూపంలో అందుబాటులో ఉంటుంది. ఇది జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది. ◦ PRP మరియు GFC: ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా (PRP) మరియు గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సంట్రేట్ (GFC) చికిత్సల ద్వారా మీ స్వంత రక్తం నుండి తీసిన పోషకాలను తలకు ఇంజెక్ట్ చేసి జుట్టు సాంద్రతను పెంచుతారు. ◦ హెయిర్ ట్రాన్స్ ప్లాంట్: జుట్టు పూర్తిగా ఊడిపోయిన చోట వేరే ప్రాంతం నుండి జుట్టును తీసి నాటుతారు. 3. సప్లిమెంట్స్: డాక్టర్ సూచన మేరకు అవసరమైన విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల జుట్టుకు పోషణ అందుతుంది. సాధారణ సందేహాలు - సమాధానాలు (Q&A) ప్ర: బట్టతల అనేది కేవలం జన్యుపరంగానే వస్తుందా? జ: పురుషులలో ఇది ప్రధానంగా జన్యుపరంగా వస్తుంది. కానీ మహిళల్లో జన్యువులతో పాటు హార్మోన్ల మార్పులు మరియు ఇతర కారణాల వల్ల కూడా రావచ్చు. ప్ర: PRP చికిత్సతో కొత్త జుట్టు వస్తుందా? జ: లేదు. PRP లేదా GFC చికిత్సలు ఉన్న జుట్టును ఒత్తుగా (Thickening) చేయడానికి మరియు రాలకుండా ఆపడానికి మాత్రమే ఉపయోగపడతాయి. జుట్టు లేని చోట కొత్తగా జుట్టు రావాలంటే హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ ఒక్కటే మార్గం. ప్ర: శరీరంలోని ఇతర భాగాల నుండి జుట్టును తీసి తలకు వాడవచ్చా? జ: అవును, చాతి లేదా గడ్డం వంటి భాగాల నుండి జుట్టును తీసి ట్రాన్స్ ప్లాంట్ చేయవచ్చు. కానీ తలపై ఉన్న జుట్టు ఇచ్చినంత సహజమైన ఫలితాలు వీటితో రాకపోవచ్చు. జుట్టు రాలడం అనేది ఒక సమస్యే కావచ్చు, కానీ సరైన సమయంలో స్పందిస్తే దానికి పరిష్కారం తప్పక ఉంటుంది. భయపడకుండా నిపుణులైన డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించి సరైన చికిత్స తీసుకోండి. మరింత సమాచారం కోసం మా యూట్యూబ్ ఛానెల్ సందర్శించండి: జుట్టు సంరక్షణ మరియు మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం ఇప్పుడే మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!
read moreపురుషుల కంటే మహిళలకు ఎక్కువ నిద్ర అవసరమా? సైన్స్ ఏం చెబుతోందంటే..!
బిజీగా గడిపిన తర్వాత పురుషుల కంటే మహిళలు ఎక్కువగా అలసిపోయినట్లు కనిపిస్తారు. ఆడవాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అని చాలామంది మగాళ్లు అనుకుంటూ ఉంటారు. కానీ సైన్స్ మాత్రం ఆడవారి పరిస్థితి నిజమేనని చెబుతోంది. సైన్స్ కూడా మహిళలు పురుషుల కంటే ఎక్కువ అలసిపోతారని, వారికి ఎక్కువ నిద్ర అవసరమని చెబుతోంది. ఇది కేవలం సోమరితనం లేదా విశ్రాంతి తీసుకోవడానికి చెబుతున్న విషయం కాదని, దాని వెనుక చాలా ముఖ్యమైన కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. పురుషుల కంటే మహిళలకు ఎక్కువ నిద్ర ఎందుకు అవసరమో అర్థం తెలుసుకుంటే.. మల్టీ టాస్కింగ్.. మెదడు సంక్లిష్టత.. నిద్ర యొక్క అతి ముఖ్యమైన విధి మెదడును బాగుచేయడానికి, తిరిగి శక్తిని నింపడానికి సమయం కేటాయించడం. పరిశోధన ప్రకారం స్త్రీలు పురుషుల కంటే ఎక్కువ పనులు చేస్తారు. ఇల్లు, పిల్లలు, ఉద్యోగం, భవిష్యత్తు ప్రణాళికల గురించి ఒకేసారి ఆలోచిస్తారు. మెదడును తీవ్రంగా, ఎక్కువ కాలం ఇలా ఆలోచించినప్పుడు, అది కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. మహిళల మెదళ్ళు రోజంతా ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తాయి. కాబట్టి వారికి మరింత గాఢ నిద్ర అవసరం అవుతుంది. హార్మోన్ల మార్పులు.. జీవితంలోని వివిధ దశలలో మహిళల శరీరాలు గణనీయమైన హార్మోన్ల మార్పులకు లోనవుతాయి. ఋతుస్రావం, గర్భధారణ, మెనోపాజ్ వంటి సమయాలలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్ల స్థాయిలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. గర్భం.. గర్బం దాల్చిన కాలంలో శరీర బరువు పెరగడం, శారీరక మార్పులు అలసటను పెంచుతాయి. మెనోపాజ్. మెనోపాజ్ దశలో వేడి ఆవిర్లు, చెమటలు పట్టడం వంటి సమస్యలు తరచుగా నిద్రకు అంతరాయం కలిగిస్తాయి. దీని కారణంగా శరీరానికి పూర్తి విశ్రాంతి లభించదు. అందుకే ఎక్కువగా నిద్రపోవాలని అనిపిస్తూ ఉంటుంది. నిద్ర నాణ్యత.. పురుషుల కంటే స్త్రీల నిద్ర తక్కువగా ఉంటుంది. ఇంట్లో శబ్దాలు, పిల్లలు ఏడుపు లేదా ఏదైనా చిన్న కదలికలకు కూడా వారు తొందరగా మేల్కొంటారు. ఇంకా మహిళలు నిద్రలేమి, రెస్ట్‌లెస్ కాళ్ల సిండ్రోమ్ వంటి సమస్యలకు ఎక్కువగా గురవుతారు. తరచుగా నిద్ర అంతరాయాల కారణంగా, శరీర మరమ్మత్తుకు అవసరమైన గాఢ నిద్ర వారికి లభించదు. అందువల్ల ఉదయం మేల్కొనేటప్పుడు అలసటగా, ఇంకాసేపు నిద్రపోవాలని అనిపిస్తుంది. మానసిక ఆరోగ్యం, ఒత్తిడి.. సామాజిక, కుటుంబ బాధ్యతల కారణంగా మహిళలు తరచుగా ఎక్కువ మానసిక ఒత్తిడి, ఆందోళనను అనుభవిస్తారు. ఒత్తిడి నేరుగా నిద్రను ప్రభావితం చేస్తుంది. మనస్సు ప్రశాంతంగా లేనప్పుడు, శరీరం విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. తగినంత నిద్ర లేకపోవడం ఈ ఒత్తిడిని మరింత పెంచుతుంది, ఇది ఒక చక్రంలా కొనసాగుతుంది. బాగా నిద్రపోవడానికి ఏమి చేయాలి? మహిళలకు నిద్ర లేకపోవడం అలసటను మాత్రమే కాదు.. గుండె జబ్బులు, ఆందోళన, నిరాశ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. పడుకోవడానికి, మేల్కొనడానికి ఒక సమయాన్ని నిర్థేశించుకోవాలి. నిద్రపోవడానికి కనీసం ఒక గంట ముందు మొబైల్, ల్యాప్‌టాప్ వాడటం మానేయాలి. మధ్యాహ్నం తర్వాత టీ, కాఫీ తాగకూడదు. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreమగవారిలో స్పెర్మ్ కౌంట్ అమాంతం పెంచే పండు ఇదే!
ప్రకృతి మనకు ప్రసాదించిన అనేక పండ్లలో కొన్ని మనకు తెలియని రహస్యాలను దాచుకుంటాయి. అలాంటి ఒక అరుదైన మరియు శక్తివంతమైన పండే 'బిహి' (Behi). దీనిని ఇంగ్లీష్ లో 'క్విన్స్' (Quince) అని, సంస్కృతంలో 'అమృతఫల' అని, తెలుగులో 'సీమ దానిమ్మ' అని పిలుస్తారు. సుమారు 2500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పండు, పర్షియా (నేటి ఇరాన్) నుండి గ్రీస్, రోమ్ మరియు మధ్యప్రాచ్య దేశాలకు వ్యాపించింది. ప్రాచీన గ్రీకులు దీనిని 'ప్రేమ మరియు సంతాన సాఫల్యతకు' (Love and Fertility) చిహ్నంగా భావించేవారు. ఈ రోజు మనం ఈ 'బంగారు ఆపిల్' వంటి బిహి పండు విశిష్టతలను గురించి Dr SGV Satya (Unani Specialist) ఈ Video లింక్ క్లిక్ చేసి వివరంగా తెలుసుకుందాం. మనం ఈ పండును ఎందుకు తీసుకోవాలి? (Why should we?) బిహి పండు కేవలం రుచికరమైనదే కాదు, ఇది ఒక పోషకాల గని. దీనిని మీ ఆహారంలో చేర్చుకోవడానికి గల ముఖ్య కారణాలు ఇక్కడ ఉన్నాయి: సంతాన సాఫల్యత మరియు పురుషుల ఆరోగ్యం: మగవారిలో స్పెర్మ్ కౌంట్‌ను (Sperm Count) అమాంతం పెంచే అద్భుత గుణం దీనికి ఉంది. అందుకే పురాతన కాలంలో పెళ్లికూతుళ్లకు పెళ్లికి ముందు దీనిని ఇచ్చే ఆనవాయితీ ఉండేది. బరువు తగ్గడానికి మరియు మధుమేహానికి: ఇది తక్కువ క్యాలరీలు ఉండి, పోషకాలు ఎక్కువగా ఉండే ఫ్రూట్. బరువు తగ్గాలనుకునే వారు, డయాబెటిక్ పేషెంట్లు, థైరాయిడ్ మరియు క్యాన్సర్ రోగులు కూడా దీనిని తమ డైట్‌లో చేర్చుకోవచ్చు. జీర్ణక్రియ మెరుగుదల: ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం (Constipation) మరియు అల్సర్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యం: పొటాషియం, కాపర్ మరియు ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇది రక్తపోటును (BP) అదుపులో ఉంచి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తి (Immunity): కరోనా సమయంలో ప్రభుత్వం విడుదల చేసిన 'జోషాంద' (Joshanda) కాడాలో బిహి గింజలను (Behi Dana) ఒక ముఖ్యమైన ఇంగ్రిడియంట్‌గా వాడారు. ఇది వైరస్‌లకు వ్యతిరేకంగా పోరాడి బాడీని స్ట్రెంథన్ చేస్తుంది. ఎలా ఉపయోగించాలి? (How to use?) బిహి పండు నేరుగా తినడానికి చాలా పుల్లగా ఉంటుంది, కాబట్టి దీనిని ఈ క్రింది పద్ధతుల్లో తీసుకోవచ్చు: మురబ్బా (Murabba): ఇది అత్యంత ప్రాచుర్యం పొందిన పద్ధతి. బిహి మురబ్బా ఏ యునానీ మందుల షాపులోనైనా దొరుకుతుంది. తేనెతో కలిపి: డయాబెటిక్ పేషెంట్లు పంచదార పాకంలో చేసిన మురబ్బా కాకుండా, తేనెతో చేసిన దానిని ఎంచుకోవాలి. జెల్లీలు మరియు షర్బత్‌లు: దీనితో జెల్లీలు, జామ్‌లు లేదా 'షర్బతే బిహి' వంటి పానీయాలు తయారు చేసుకోవచ్చు. వంటల్లో: గ్రీస్ వంటి దేశాల్లో దీనిని నిమ్మరసంతో కలిపి ఉడికించి వంటల్లో వాడుతుంటారు. ఏమి చేయకూడదు? (What NOT to do?) ఈ పండు ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ, కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి: నేరుగా ఎక్కువగా తినకండి: ఇది చాలా పుల్లగా ఉండటం వల్ల నేరుగా పండును ఎక్కువగా తింటే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మధుమేహ రోగులు జాగ్రత్త: బయట దొరికే మురబ్బాలలో షుగర్ సిరప్ ఎక్కువగా ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు తేనె లేదా తాటి బెల్లంతో ఇంట్లోనే తయారు చేసుకున్న మురబ్బాను వాడటం శ్రేయస్కరం. అపరిమితంగా వద్దు: ఇది మన దేశీయ పండు కాదు కాబట్టి, రోజుకు ఒక చిన్న టీస్పూన్ మురబ్బా తీసుకుంటే సరిపోతుంది. అతిగా తీసుకోకూడదు. ప్రశ్నోత్తరాలు (Q&A): ప్రశ్న: బిహి పండు కేవలం మగవారికి మాత్రమే ఉపయోగపడుతుందా? సమాధానం: లేదు, ఇది అందరికీ ఆరోగ్యకరమైనది. అయితే పురుషులలో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో ఇది విశేషంగా పనిచేస్తుంది. ప్రశ్న: ఇది మార్కెట్‌లో దొరుకుతుందా? సమాధానం: పండు దొరకడం కష్టమైనా, 'బిహి మురబ్బా' రూపంలో యునానీ స్టోర్లలో సులభంగా లభిస్తుంది. ప్రశ్న: పిల్లలకు ఇది ఇవ్వవచ్చా? సమాధానం: అవును, రోగనిరోధక శక్తి పెంచడానికి తక్కువ మోతాదులో మురబ్బాను ఇవ్వవచ్చు. పురాతన కాలం నుండి ప్రాచుర్యంలో ఉన్న ఈ బిహి పండు మన ఆరోగ్యానికి ఒక వరం లాంటిది. ముఖ్యంగా నేటి కాలంలో ఎదుర్కొంటున్న సంతాన సమస్యలకు మరియు ఇమ్యూనిటీ సమస్యలకు ఇది చక్కని పరిష్కారం. ప్రకృతి ఇచ్చిన ఈ 'అమృతఫలాన్ని' సరైన పద్ధతిలో తీసుకుని ఆరోగ్యంగా ఉందాం. మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య చిట్కాలు మరియు ఇలాంటి అరుదైన పండ్ల గురించి వివరంగా తెలుసుకోవడానికి మా TeluguOne Health Youtube Channel సందర్శించండి! మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.
read moreచెవిలో ఈ లక్షణాలు కనిపిస్తే ఇక చెవుడు ఖాయం!
మన శరీరంలోని ఐదు జ్ఞానేంద్రియాలలో చెవి అత్యంత సున్నితమైనది మరియు ముఖ్యమైనది. మనం ప్రపంచంతో మమేకమవ్వడానికి, ఇతరుల మాటలు వినడానికి, సంగీతాన్ని ఆస్వాదించడానికి వినికిడి శక్తి ఎంతో అవసరం. కానీ నేటి కాలంలో మనం మన చెవుల ఆరోగ్యాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నాము. ఆ నిర్లక్ష్యం చివరకు మనల్ని శాశ్వత చెవుడు వైపు ఎలా నెడుతుందో, సీనియర్ ఈఎన్‌టీ సర్జన్ డాక్టర్ పి.వి.ఎల్.ఎన్. మూర్తి గారు పంచుకున్న కొన్ని కీలక విషయాలను ఈ Video Link క్లిక్ చేసి చూడండి మనం చెవుల ఆరోగ్యంపై ఎందుకు శ్రద్ధ పెట్టాలి? (Why Should We?) మన చెవి లోపల వినికిడికి సహాయపడే 'హెయిర్ సెల్స్' (Hair Cells) అనేవి ఉంటాయి. ఇవి చాలా సున్నితమైనవి. వీటి ప్రాముఖ్యత ఏమిటంటే: శాశ్వత నష్టం: ఒకసారి ఈ హెయిర్ సెల్స్ దెబ్బతింటే, అవి మళ్ళీ తిరిగి రావు. మన శరీరంలోని ఇతర కణాలలాగా ఇవి మళ్ళీ పుట్టవు (Regeneration ఉండదు). వృత్తిపరమైన జీవితం: వినికిడి లోపం ఉంటే మీటింగ్‌లలో ఇతరులు చెప్పేది అర్థం కాదు, దీనివల్ల నిర్ణయాలు తీసుకోవడంలో తప్పులు జరిగి మీ కెరీర్ దెబ్బతినవచ్చు. భారీ ఖర్చు: ఒకవేళ వినికిడి పూర్తిగా పోయి ఆపరేషన్ (Cochlear Implant) చేయించుకోవాల్సి వస్తే, ఒక్క చెవికి 7 నుండి 10 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఏం చేయకూడదు? (What Not To Do) నిరంతర శబ్దాలు: 24 గంటలూ బ్లూటూత్ హెడ్‌సెట్లు లేదా ఇయర్ ఫోన్లు పెట్టుకుని వినకండి. దీనివల్ల హెయిర్ సెల్స్ అలసిపోయి (Fatigue) శాశ్వతంగా దెబ్బతింటాయి. నిర్లక్ష్యం: చిన్నపాటి వినికిడి లోపం ఉన్నా "ఏం కాదులే" అని వదిలేయకండి. స్క్రీనింగ్ చేయించుకోకపోవడం వల్ల సమస్య తీవ్రమవుతుంది. సామాజిక భయం: కళ్ళద్దాలు పెట్టుకున్నట్లే, అవసరమైతే హియరింగ్ ఎయిడ్ (Hearing Aid) పెట్టుకోవడానికి వెనుకాడకండి. లోకం ఏమనుకుంటుందో అన్న భయంతో సమస్యను పెంచుకోవద్దు. దురలవాట్లు: ధూమపానం (Smoking) మరియు మద్యం అలవాటు వల్ల శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగి లోపలి కణాలు దెబ్బతింటాయి. చెవులను ఎలా కాపాడుకోవాలి? (How To Maintain Ear Health) ఆరోగ్యకరమైన జీవనశైలి: డయాబెటిస్ (షుగర్), బీపీ మరియు కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుకోవాలి. ఇవి పెరిగితే వినికిడి శక్తిపై ప్రభావం చూపుతాయి. వ్యాయామం: యోగా, ప్రాణాయామం మరియు క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయడం వల్ల శరీరంలో మంచి హార్మోన్లు విడుదలయ్యి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముందస్తు పరీక్షలు: చెవిలో బ్లాకేజ్ అనిపించినా, వినికిడి తగ్గినట్లు అనిపించినా వెంటనే 'ప్యూర్‌టోన్ ఆడియోమెట్రీ' లేదా 'ఎండోస్కోపీ' వంటి పరీక్షలు చేయించుకోవాలి. నీటి జాగ్రత్తలు: స్నానం చేసేటప్పుడు లేదా స్విమ్మింగ్ చేసేటప్పుడు చెవిలోకి నీరు వెళ్లకుండా చూసుకోవాలి. నీరు వెళ్తే చెవిలోని గుబిలి (Wax) ఉబ్బిపోయి నొప్పి మరియు బ్లాకేజ్‌కి దారితీస్తుంది. సాధారణ సందేహాలు - సమాధానాలు (Q&A) ప్రశ్న: వయసు పెరగడం వల్ల వచ్చే వినికిడి లోపాన్ని మందులతో తగ్గించవచ్చా? జవాబు: దీనిని 'ప్రెస్ బ్రాయకోసిస్' అంటారు. దీనికి మందులు లేదా ఆపరేషన్లు ఉండవు. ప్రివెన్షన్ (ముందస్తు జాగ్రత్త) మాత్రమే మార్గం. సమస్య ఎక్కువైతే హియరింగ్ ఎయిడ్ వాడాలి. ప్రశ్న: పిల్లల్లో చెవి నొప్పి, బ్లాకేజ్ ఎందుకు వస్తుంది? జవాబు: పిల్లల్లో జలుబు చేసినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ చెవిలోకి చేరి బ్లాకేజ్ ఏర్పడుతుంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే 'గ్లూ ఇయర్' (Glue Ear) గా మారి వినికిడి లోపం రావచ్చు. వెంటనే డాక్టరును సంప్రదించి చికిత్స తీసుకోవాలి. ప్రశ్న: చెవిలో గుబిలి (Wax) ఉండటం తప్పా? జవాబు: గుబిలి అనేది ఒక రక్షణ కవచం లాంటిది. కానీ అది ఎక్కువై ఇయర్ కెనాల్‌ను బ్లాక్ చేసినప్పుడు మాత్రమే సమస్య అవుతుంది. అప్పుడు డాక్టర్ ద్వారా క్లీన్ చేయించుకోవాలి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. వినికిడి లోపం అనేది కేవలం శారీరక సమస్య మాత్రమే కాదు, అది మన ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచే జాగ్రత్త పడండి. మరిన్ని ఆరోగ్య సమాచారం కోసం మరియు ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా 👉 (TeluguOne Health YouTube Channel) ని సందర్శించండి. సబ్‌స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి!
read moreఆరోగ్యకరమైన హోళికి ఆరోగ్య చిట్కాలు!
హోళి అంటే ఇష్టం లేనిది ఎవరికి?? చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు హోళి సందడిలో తమవంతు పాత్ర పోషిస్తారు. అయితే హోళి సంబరాలలో అక్కడక్కడా అపశ్రుతులు చోటుచేసుకుంటు ఉంటాయి. హోళిని హాయిగా ఎంజాయ్ చేస్తూ.. ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు అవసరం. మీ చర్మ సంరక్షణ తప్పనిసరి: చర్మాన్ని వీలైనంత జిడ్డుగా చేయడం చాలా ముఖ్యం, తద్వారా రంగులు చర్మం మీద వ్యాప్తి చెందడానికి లేదా అంటుకునే అవకాశం ఉండదు. ఇందుకోసం కొబ్బరి నూనె రాసుకోవచ్చు. కొబ్బరి నూనె వల్ల మరొక లాభం ఏంటంటే చర్మం పొడిబారకుండా చేస్తుంది. అలాగే శరీరం మీద రంగులు క్లీన్ చేయడం సులువు అవుతుంది. సేంద్రీయ రంగుల ఎంపిక: పర్యావరణ అనుకూలంగానే కాకుండా మన చర్మానికి కూడా అనుకూలమైన రంగులతో హోలీని జరుపుకోవాలి. హానికరమైన రసాయనాలు కలిపిన రంగులను నివారించాలి. రసాయనాలు కలిపిన రంగులు ప్రకాశవంతంగా కనిపిస్తాయి అంతేకాఫు ఇవి నీటిలో చాలా తొందరగా కలిసిపోతాయి. ఈ రంగులు చర్మం నుండి తొలగించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. చర్మాన్ని డ్యామేజ్ చేస్తాయి. ఇన్ఫెక్షన్లు, సైడ్ ఎఫెక్ట్ చూపిస్తాయి. బంతి పువ్వు, గులాబీ, మందారం, చెట్ల ఆకులు, పసుపు ఇలా పువ్వుల రెక్కల నుండి రంగులు తయారుచేసుకోవచ్చు. . హైడ్రేటెడ్ గా ఉండాలి: హోలీ వేసవిలో వస్తుంది, హోళి సమయానికి వేసవి మొదలైపోయి ఉంటుంది. దీనివల్ల బయట ఎండలు భగ్గుమంటుంటాయి. ఈ ఎండల్లో రంగులు చల్లుకుని ఎంజాయ్ చేసినా.. మరొకవైపు ఎండ దెబ్బ మాములుగా ఉండదు. కాబట్టి హైడ్రేటెడ్ గా ఉండటం చాలా అవసరం. నీరు, గ్లూకోజ్, జ్యూస్‌లు, శరీరాన్ని తిరిగి శక్తివంతం చేయడంలో సహాయపడతాయి. పైగా ఇవి చర్మం పొడిబారకుండా తేమగా ఉండేలా చేస్తాయి. కళ్ళను తేలిగ్గా తీసుకోవద్దు: మీరు రోజూ కాంటాక్ట్ లెన్స్‌లను ధరించేవారు అయితే, రంగులతో ఆడుకునే ముందు వాటిని తీసివేయడం మంచిది. కళ్ళజోడు మీద రంగులు లేదా నీళ్లు పడితే ఎదుటి ప్రాంతాన్ని మసగ్గా కనిపించేలా చేస్తాయి. ఇది ఇబ్బందే అనుకోవచ్చు. అలాగని కళ్ళజోడు లేకుండా హొలీ ఆడేటప్పుడు రంగులు నేరుగా కళ్ళలోకి పడకుండా అజాగ్రత్త పడాలి. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. కాబట్టి కళ్లను జాగ్రత్తగా చూసుకోవాలి. స్వీట్ల దగ్గరా జాగ్రత్త: హోలీ సమయంలో మార్కెట్‌లో కల్తీ ఖోయా, మావా అమ్ముతారు. ఇంకా ఇలాంటి కల్తీ పదార్థాలతో స్వీట్లు తయారుచేస్తారు. ఇలాంటివే ఆఫర్స్ కింద, డిస్కౌంట్ల కింద అమ్మేస్తారు. కాబట్టి స్వీట్స్ కొనేముందు జాగ్రత్తగా ఉండాలి. . శరీరాన్ని ఇలా కవర్ చేయాలి: హొలీ ఆడేటప్పుడు యావరేజ్ గా ఉన్న బట్టలు వేసుకోవాలి. దీనివల్ల వాటిమీద రంగులు వదలకపోయినా పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ కొత్త బట్టలు అయితే నాశనం అయిపోతాయి. ఫుల్ హాండ్స్ ఉన్న టాప్స్, ఫుల్ గా కాళ్లను కవర్ చేసే ప్యాంట్స్ వేసుకోవాలి. దీనీవల్ల రంగులు శరీరాన్ని పాడుచేసే అవకాశం తక్కువ. పాత డెనిమ్ జీన్స్, పొడవాటి పైజామాలను ఎంచుకోవచ్చు. ఇలా ఆరోగ్యకరమైన హోళిని ఎంజాయ్ చేసి, ఆరోగ్యంగా ఉండండి. ◆నిశ్శబ్ద.
read moreహోలీ రంగుల వల్ల పొంచి ఉన్న ప్రమాదం!
హోళీ ఓ రంగుల పండుగ. కానీ అజాగ్రత్తగా ఉంటే, అవే రంగుల ఇతరుల జీవితాలలో చీకటిని నింపుతాయని హెచ్చరిస్తున్నారు. పిల్లవాడు తాగే పాల దగ్గర నుంచీ అంతా కలుషితం అయిపోతున్న ఈ రోజులలో, హోళీ సందర్భంగా ఎక్కడపడితే అక్కడ చవకగా దొరికే రంగుల గురించి చెప్పేదేముంది. మరి హోళీలో వాడే రంగులలో ఎలాంటి రసాయనాలు ఉంటాయో, వాటికి ఎలాంటి ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలో ఆలోచించాల్సిందే రంగు – ఆకుపచ్చ ఉపయోగించే రసాయనం – కాపర్ సల్ఫేట్. విషప్రభావం – కొంట్లో పడితే చాలా ప్రమాదకరం. కళ్లు నీరుకారడం, ఎర్రబడటం, వాయడం జరగవచ్చు. ఒకోసారి తాత్కాలికంగా చూపు కూడా కనిపించకుండా పోవచ్చు. రంగు – ఎరుపు ఉపయోగించే రసాయనం – మెర్క్యురీ సల్ఫేట్. విషప్రభావం – చర్మం మీద ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒకోసారి చర్మ కేన్సర్కు కూడా దారితీయవచ్చు. గర్భిణీల శరీరంలోకి కనుక ఇది చేరితే వారి కడుపులో ఉన్న శిశువు ఎదుగుదల మీద తీవ్ర ప్రభావం చూపవచ్చు. ఒకోసారి ఆ శిశువుకి ప్రాణాంతకంగా కూడా మారుతుంది ఈ రసాయనం. రంగు – నీలం ఉపయోగించే రసాయనం – ప్రష్యన్ బ్లూ. విషప్రభావం – మాడు మీదా చర్మం మీదా దద్దుర్లు. రంగు – సిల్వర్ ఉపయోగించే రసాయనం – అల్యూమినియం బ్రొమైడ్. విషప్రభావం – చర్మం, ఊపిరితిత్తుల మీద తీవ్ర ప్రభావం. కేన్సర్ కారకం. రంగు – నలుపు ఉపయోగించే రసాయనం – రెడ్ ఆక్సైడ్. విషప్రభావం – మూత్ర పిండాల మీద ప్రభావం. గర్భస్రావం అయ్యే ప్రమాదం. చాంతాడంత జాబితా! గులాల్ పొడులలో లెడ్, క్రోమియం, కాడ్మియం, నికెల్, జింక్, సిలికా, మైకా... వంటి నానారకాల రసాయనాలూ కలుస్తాయని తేలింది. వీటిలో ఒకో రసాయనానిదీ ఒకో దుష్ఫ్రభావం! ఇక హోళీ రంగులు మెరిసిపోతూ ఉండేందుకు వాటిలో గాజుపొడి కలుపుతారన్న ఆరోపణమూ వినిపిస్తున్నాయి. పేస్టు లేదా ద్రవరూపంలో ఉండే రంగులది మరో సమస్య. వీటిలో ఇంజన్ ఆయల్ వంటి చవకబారు ద్రవాలను కలిపే ప్రమాదం ఉంది. ఈ రసాయనాలతో ఆరోగ్యం ఎలాగూ దెబ్బతింటుంది. హోళీ రోజున అవి నీటిలోనూ, నేలమీదా పడితే పర్యావరణం కూడా దెబ్బతింటుంది. కొత్త పోకడలూ ప్రమాదమే! ఇప్పుడు కొత్తగా హోళీ రంగులను చల్లుకునేందుకు చైనావారి పిచికారీలు దొరుకుతున్నాయి. వీటికి తోడు రంగులతో నింపిన బెలూన్లు కూడా లభిస్తున్నాయి. అసలే రసాయనాలు... ఆపై వాటిని వేగంగా చల్లేందుకు పరికరాలు. దీంతో ఏ రంగు ఎవరి కంట్లో పడుతుందో, అది ఎవరి జీవితాన్ని చీకటి చేస్తుందో తెలియని పరిస్థితి. ఒక్కసారిగా మీదపడే బెలూన్ల వల్ల ఒకోసారి వినికిడి కూడా దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి రంగుకీ ఓ ప్రత్యామ్నాయం హోళీలో ఇతరులు చల్లే కృత్రిమమైన రంగుల నుంచి జాగ్రత్తపడటం ఒక ఎత్తు. మనవరకు మనం అలాంటి రంగుల జోలికి పోకుండా సహజసిద్ధమైన రంగులు వాడటం మరో ఎత్తు. ప్రతి ఇంట్లోనూ దొరికే పసుపు, కుంకుమ, చందనం, బొగ్గు లాంటి రంగులు పదార్థాలు ఎలాగూ బోలెడు రంగలకు ప్రత్యామ్నాయంగా ఉంటాయి. ఇక ఆకుకూరలు, గోరింట పొడి, బీట్రూట్, కరక్కాయలు, మందారపూలు, నేరేడు పండ్లు లాంటివాటితో చాలా రంగులే సిద్ధమవుతాయి. కాస్త ఓపిక చేసుకుంటే తేలికగా అమరిపోయే సహజసిద్ధమైన రంగులను వదిలేసి ఏరికోరి రసాయనాలు కొనితెచ్చుకోవడం ఎందకన్నదే పెద్దల ప్రశ్న! - నిర్జర.
read moreపెరుగు గురించి చాలామందిలో ఉన్న అపోహలు ఇవే..!
భారతదేశంలో దాదాపు ప్రతి ఇంట్లో పెరుగు ఉంటుంది. కొందరు భోజనాన్ని పెరుగుతో ముగిస్తారు. మరికొందరు రైతా చేసుకుంటారు. ఇంకొందరు తీపి పెరుగును ఇష్టపడతారు. వేసవిలో పెరుగు చల్లదనాన్ని ఇస్తుందని చెబుతారు. కానీ పెరుగును శీతాకాలంలో తక్కువ తినమని చెబుతారు. మరికొందరు శీతాకాలంలో పెరుగు వాడటం ఆపేయమని చెబుతారు. పెరుగు చుట్టూ చాలా అపోహలు, నమ్మకాలు ఉన్నాయి, పెరుగు తినడం వల్ల జలుబు వస్తుందని కొందరు, రాత్రిపూట పెరుగు తినడం వల్ల కడుపు భారంగా ఉంటుందని, పెరుగు తింటే వాతం చేస్తుందని.. ఇలా చాలా అపోహలు ఉన్నాయి. పెరుగు గురించి చాలామందిలో అపోహలు, వాస్తవాలు ఏంటో తెలుసుకుంటే.. పెరుగు ఆరోగ్యానికి మంచిది. ఇందులో ప్రోటీన్, కాల్షియం, మంచి బ్యాక్టీరియా (ప్రోబయోటిక్స్) ఉంటాయి. ఈ బ్యాక్టీరియా పేగు ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పెరుగును క్రమం తప్పకుండా సరైన మొత్తంలో తింటే చాలా ప్రయోజనాలు ఉంటాయి. పెరుగు చాలా మందికి జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇందులో ఉండే బ్యాక్టీరియా పేగులలో మంచి, చెడు బ్యాక్టీరియా సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడతాయి. ఇది గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. పెరుగు తింటే జలుబు వస్తుందనేది చాలామంది నమ్మకం. కానీ ఇది అందరికీ నిజం కాదు. చాలా మందికి పెరుగు వల్ల జలుబు రాదు. అయితే, ఎవరైనా జలుబుకు సెన్సిటివ్ గా ఉంటే లేదా ఇప్పటికే జలుబుతో ఇబ్బంది పడుతుంటే.. ఆ తరువాత పెరుగు తినడం వల్ల ఇబ్బంది కలగవచ్చు అంతే. రాత్రిపూట పెరుగు తినడం వల్ల ఎలాంటి సమస్యలు లేకపోతే పెరుగు తినవచ్చు. అయితే రాత్రి భోజనం చాలా ఆలస్యంగా తినకూడదు. 7 గంటల లోపు భోజనం చేస్తే అప్పుడు పెరుగు తీసుకుంటే ఏమీ కాదు. చాలా మందికి, పాలు కంటే పెరుగు జీర్ణం కావడం సులభం. పెరుగులోని బ్యాక్టీరియా పాలలోని లాక్టోస్‌ను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. ఇది కడుపులో తేలికగా ఉంటుంది. అందువల్ల జీర్ణక్రియ పరంగా పెరుగు పాల కంటే మంచిదని చెబుతారు. ఒక సాధారణ వ్యక్తికి రోజుకు ఒక కప్పు పెరుగు సరిపోతుంది. ఎక్కువ పరిమాణంలో అవసరం లేదు. పెరుగును బాలెన్స్ గా తీసుకున్నప్పుడే అది మంచి ఫలితాలు ఇస్తుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు సాదా పెరుగు తినవచ్చు. ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర వేగంగా పెరగకుండా నిరోధిస్తుంది. అయితే స్వీట్ పెరుగును నివారించాలి. చాలా మందికి పెరుగు వల్ల కడుపు ఉబ్బరం కలగదు. కానీ లాక్టోస్ అసహనం ఉన్నవారికి కొంత గ్యాస్ లేదా ఉబ్బరం కలగవచ్చు. శరీరం పాల ఉత్పత్తులను సులభంగా జీర్ణం చేసుకోగలిగితే ప్రతిరోజూ పెరుగు తినడం సురక్షితం. పెరుగును చేపలు, చికెన్ లేదా మటన్ వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలతో కలిపి తినవచ్చు. దీని చుట్టూ ఉన్న భయం, గందరగోళానికి శాస్త్రీయ ఆధారం లేదు. ఇది కేవలం జీర్ణ సామర్థ్యం పైన ఆధారపడి ఉంటుంది. *రూపశ్రీ.
read moreవెరికోస్ వెయిన్స్ ఎందుకు వస్తాయి? వ్యాస్కులర్ సర్జరీ అవసరం ఎప్పుడు?
వెరికోస్ వెయిన్స్ వల్ల కాళ్ళ వాపు, నొప్పి, బరువు, మరియు కనిపించే ఉబ్బిన సిరలు ఏర్పడతాయి. ప్రముఖ వాస్కులర్ సర్జన్ డాక్టర్ రాహుల్ లక్ష్మీనారాయణన్ వాస్కులర్ సర్జరీ అంటే ఏమిటి, వెరికోస్ వెయిన్స్ ఎందుకు వస్తాయి, వాటి లక్షణాలు, చికిత్స ఎంపికలు మరియు శస్త్రచికిత్స ఎప్పుడు అవసరమో వివరిస్తూ... తెలుగువన్ Health యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ మీ కోసం.. .వెయిన్స్‌లో వాల్వ్స్ బలహీనపడటం .ఎక్కువసేపు నిలబడి ఉండటం .ఎక్కువసేపు కూర్చోవడం .వయసు పెరగడం .అధిక బరువు .వంశపారంపర్యం .వ్యాయామం లేకపోవడం .టైటు దుస్తులు ధరించడం మీ కాళ్ళ నొప్పులను నిర్లక్ష్యం చేయకండి: వెరికోస్ వెయిన్స్ మరియు వాస్కులర్ సర్జరీ గురించి మీకు తెలియని నిజాలు పరిచయం (Introduction) రోజంతా కష్టపడి పనిచేసి ఇంటికి రాగానే కాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా? చర్మంపై రక్తనాళాలు ఉబ్బిపోయి, నీలం రంగులో కనిపిస్తున్నాయా? ఇది కేవలం అలసట మాత్రమే కాకపోవచ్చు. మన శరీరంలోని రక్త ప్రసరణ వ్యవస్థలో వచ్చే మార్పుల వల్ల కలిగే 'వెరికోస్ వెయిన్స్' సమస్య కావచ్చు. చాలామంది దీనిని వయసుతో పాటు వచ్చే సాధారణ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తారు, కానీ ఇది మీ జీవన నాణ్యతను (Quality of Life) దెబ్బతీస్తుంది. రక్తనాళాల ఆరోగ్యం మరియు ఆధునిక వాస్కులర్ సర్జరీ ద్వారా దీనికి గల శాశ్వత పరిష్కారాల గురించి ఈ వ్యాసంలో వివరంగా తెలుసుకుందాం. వాస్కులర్ సర్జరీ అంటే ఏమిటి? (What is Vascular Surgery?) వాస్కులర్ సర్జరీ అనేది మన శరీరంలోని రక్తనాళాలకు (రక్త ప్రసరణ వ్యవస్థకు) సంబంధించిన చికిత్స. గుండె మరియు మెదడు మినహా, శరీరంలోని మిగిలిన అన్ని భాగాలకు—అంటే చేతులు, కాళ్లు, లివర్ మరియు పేగులకు—రక్తాన్ని సరఫరా చేసే నాళాలలో ఏవైనా బ్లాకేజెస్, రక్తం గడ్డకట్టడం (Clots) లేదా కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వంటి సమస్యలు వస్తే వాస్కులర్ సర్జన్స్ చికిత్స అందిస్తారు. వెరికోస్ వెయిన్స్ ఎందుకు వస్తాయి? (Why do Varicose Veins occur?) మనుషులు నిటారుగా నిలబడటం వల్ల గ్రావిటీ (గురుత్వాకర్షణ) ప్రభావం కాళ్ళపై పడుతుంది. కాళ్ళలోని వాల్వ్స్ బలహీనపడినప్పుడు, రక్తం సరిగ్గా పైకి ప్రవహించక కిందే ఆగిపోతుంది. దీనివల్ల రక్తనాళాలు ఉబ్బి, చర్మంపై స్పష్టంగా కనిపిస్తాయి. ఎవరికి ఎక్కువ ముప్పు?: ఎక్కువ సేపు నిలబడి పనిచేసే పోలీసులు, ఆర్మీ జవాన్లు, రైతులు, షాప్ కీపర్స్, డాక్టర్లు మరియు నర్సులకు ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. మహిళల్లో గర్భధారణ సమయంలో లేదా వయసు పెరిగే కొద్దీ ఈ సమస్య కనిపిస్తుంది. మనం ఎందుకు చికిత్స తీసుకోవాలి? (Why Should We?) చాలామంది వెరికోస్ వెయిన్స్ కేవలం చూడటానికి బాగోవు అని అనుకుంటారు, కానీ చికిత్స తీసుకోకపోతే ప్రమాదకరంగా మారవచ్చు. 1. నొప్పి మరియు వాపు: కాళ్ళలో విపరీతమైన నొప్పి, ముఖ్యంగా మోకాలి కింద వాపు రావచ్చు. 2. చర్మం రంగు మారడం: యాంకిల్స్ (చీలమండలు) దగ్గర చర్మం నల్లగా మారడం ప్రారంభమవుతుంది. 3. నిర్లక్ష్యం చేస్తే పుండ్లు: ఈ సమస్య అడ్వాన్స్డ్ స్టేజ్‌కి వెళ్తే కాళ్ళపై పుండ్లు (Ulcers) పడతాయి, ఇవి అంత త్వరగా మానవు. 4. రక్తస్రావం: కొన్నిసార్లు ఉబ్బిన సిరల నుండి రక్తస్రావం కూడా జరగవచ్చు. ఏమి చేయకూడదు? (What Not to Do?) • నిర్లక్ష్యం వద్దు: కాళ్ళపై నీలం రంగు నరాలు కనిపిస్తున్నా లేదా చర్మం రంగు మారుతున్నా సాధారణ నొప్పే కదా అని వదిలేయకండి. • సొంత వైద్యం: డాక్టర్ సలహా లేకుండా మసాజ్‌లు చేయడం లేదా ఏవో క్రీములు వాడటం వల్ల సమస్య పరిష్కారం కాదు. • ఎక్కువ సేపు నిలబడటం: సమస్య మొదలైనప్పుడు నిరంతరాయంగా నిలబడి ఉండటం మానుకోవాలి. నివారణ మరియు జాగ్రత్తలు (How-to Guide) • కంప్రెషన్ స్టాకింగ్స్: ఇవి ఒక ప్రత్యేకమైన బిగుతుగా ఉండే సాక్సులు. ఇవి రక్తనాళాలపై ఒత్తిడి కలిగించి రక్తం పైకి ప్రవహించేలా చేస్తాయి. వీటిని ఉదయం నుండి రాత్రి వరకు ధరించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. • వ్యాయామం: క్రమం తప్పకుండా నడవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. • ఆధునిక చికిత్సలు: ఇప్పుడు లేజర్ (Laser therapy) మరియు గ్లూ థెరపీ (Glue therapy) వంటి అధునాతన పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఎటువంటి కోతలు, కుట్లు ఉండవు, కేవలం చిన్న ఇంజెక్షన్ ద్వారా చికిత్స చేస్తారు. ప్రశ్నోత్తరాలు (Q&A) ప్ర: వాస్కులర్ సర్జరీ తర్వాత కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది? జ: ఆధునిక మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీల ద్వారా పేషెంట్ 2-3 రోజుల్లోనే నడవగలరు మరియు సుమారు రెండు వారాల్లో తన సాధారణ పనులన్నీ చేసుకోవచ్చు. ప్ర: ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఉందా? జ: అవును, లేజర్ మరియు గ్లూ థెరపీ వంటి ఆధునిక టెక్నాలజీల ద్వారా సమస్యాత్మకమైన రక్తనాళాలను పూర్తిగా నయం చేయవచ్చు. ప్ర: వాస్కులర్ సర్జన్ గుండెకు కూడా సర్జరీ చేస్తారా? జ: లేదు, వాస్కులర్ సర్జన్స్ గుండె మరియు మెదడు మినహా శరీరంలోని మిగిలిన అన్ని భాగాల రక్తనాళాలకు చికిత్స చేస్తారు. ముగింపు (Outro) : మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. వెరికోస్ వెయిన్స్ వంటి సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే శస్త్రచికిత్స అవసరం లేకుండానే కేవలం జాగ్రత్తలతో నయం చేసుకోవచ్చు. పైన చెప్పిన లక్షణాలు మీకు కనిపిస్తే వెంటనే నిపుణులైన వాస్కులర్ సర్జన్‌ను సంప్రదించండి. మరిన్ని ఆరోగ్య సమాచారం కోసం మా యూట్యూబ్ ఛానెల్‌ని సందర్శించండి! ఇలాంటి మరెన్నో ఆరోగ్య సమస్యలు, నిపుణుల సలహాలు మరియు తాజా వైద్య పరిజ్ఞానం గురించి తెలుసుకోవడానికి మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి!
read moreతెలియకుండానే చేసే ఈ తప్పుల వల్ల స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుందట..!
ప్రతి వ్యక్తి అలవాట్లను బట్టి వారి మెదడు, వారి వయస్సు కంటే ఎక్కువగా వృద్ధాప్యం చెందుతుందని అంటారు. ఈ విషయాన్ని స్వయానా వైద్యులే చెబుతున్నారు. మనం ఏమి తింటాము, ఎలా జీవిస్తాము, అన్నీ మన మెదడుపై ప్రభావం చూపుతాయి. మనలో చాలా మంది తెలియకుండానే మన మెదడుకు క్రమంగా హాని కలిగించే అలవాట్లను పాటిస్తుంటారు. మెదడులకు రహస్యంగా హాని కలిగించే ఏడు సాధారణ అలవాట్లు ఉన్నాయి. ఆ అలవాట్లు ఏంటో తెలుసుకుని, వాటిని నివారించడం చాలా ముఖ్యమని, లేకపోతే వాటి కారణంగా స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని అంటున్నారు వైద్యులు. ఇంతకీ స్ట్రోక్ రావడానికి కారణమయ్యే తప్పులు ఏంటో తెలుసుకుంటే.. నిద్ర.. శారీరక అలసట నుండి ఉపశమనం పొందడమే కాకుండా మెదడు రిలాక్స్ అవ్వడానికి, రికవర్ అవ్వడానికి. ముఖ్యంగా రిపేర్ అవ్వడానికి కూడా నిద్ర చాలా అవసరం. రోజుకు ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోవడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఇంకా రియాక్షన్ టైం నెమ్మదిస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఎక్కువ సేపు కూర్చోవడం.. నేటికాలంలో డెస్క్ ఉద్యోగాల కారణంగా గంటల తరబడి ఒకే చోట కూర్చోవాల్సి వస్తోంది. కానీ 8 నుండి 10 గంటలు వరుసగా కూర్చోవడం వల్ల గుండె జబ్బులు, చిత్తవైకల్యం వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుందట. శారీరకంగా చురుకుగా ఉండకపోవడం మెదడుకు విషం లాంటిది. రాత్రి సమయంలో స్క్రీన్ స్క్రోలింగ్.. పడుకునే ముందు మొబైల్ ఫోన్ లేదా ల్యాప్‌టాప్ ఉపయోగించడం వల్ల మెదడులోని నిద్ర హార్మోన్ అయిన మెలటోనిన్ తగ్గిపోతుంది. ఇది గాఢ నిద్ర రాకుండా చేస్తుంది. గాఢ నిద్ర లేకుండా, మెదడు తనను తాను రిపేర్ చేసుకోలేదు, మరుసటి రోజు మానసికంగా అలసటగా ఉన్నట్టు అనిపిస్తుంది. వ్యాయామం.. వ్యాయామం లేకపోవడం వల్ల శారీరక, మెదడు పెరుగుదల రెండూ కుంటుపడతాయి. శారీరక శ్రమ లేకపోవడం వల్ల మెదడు కణాల పెరుగుదల, నిర్వహణకు బాధ్యత వహించే ప్రోటీన్ BDNF (బ్రెయిన్-డెరైవ్డ్ న్యూరోట్రోఫిక్ ఫ్యాక్టర్) తగ్గుతుంది. బీపి, షుగర్.. అదుపులేని రక్తపోటు, షుగర్ లెవెల్స్ గుండెకు శత్రువులే కాదు.. అవి మెదడులోని చిన్న రక్త నాళాలను కూడా నిశ్శబ్దంగా దెబ్బతీస్తాయి. ఇది నిశ్శబ్దంగా మెదడును దెబ్బతీస్తుంది. స్ట్రోక్ ప్రమాదాన్ని విపరీతంగా పెంచుతుంది. ఒత్తిడి.. ఒత్తిడి మానసిక స్థితిని నాశనం చేయడమే కాదు, అది మెదడును శారీరకంగా కుంచించుకుపోయేలా చేస్తుంది. దీర్ఘకాలిక ఒత్తిడి మెదడు యొక్క హిప్పోకాంపస్ పరిమాణాన్ని తగ్గిస్తుంది. ఇది నేర్చుకోవడం, జ్ఞాపకశక్తికి కీలకమైన కేంద్రం. గురక.. నిద్రపోతున్నప్పుడు బిగ్గరగా గురక పెడితే అది స్లీప్ అప్నియాకు సంకేతం కావచ్చు. ఈ పరిస్థితి నిద్రలో ఆక్సిజన్ లోపిస్తుంది. దీని వలన మెదడు పొగమంచు ఏర్పడుతుంది, స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreడిటాక్స్ డ్రింక్స్ నిజంగానే ఆరోగ్యానికి మేలు చేస్తాయా?వైద్యులు చెప్పిన షాకింగ్ నిజాలివీ..!
డిటాక్స్ డ్రింక్స్ ఈ మధ్యకాలంలో చాలా వైరల్ అయ్యాయి. శరీరాన్ని శుద్ది చేయడంలో డిటాక్స్ డ్రింక్స్ చాలా బాగా పనిచేస్తాయని చెబుతారు. ఈ డిటాక్స్ డ్రింక్స్ లో ఎన్నెన్నో పానీయాలు పరిచయం చేస్తూనే ఉన్నారు. బీట్రూట్ క్యారెట్ జ్యూస్ లేదా షాట్ నుండి.. కాకరకాయ, నిమ్మరసం, ఉసిరి వంటి ఎన్నో పదార్థాలతో డిటాక్స్ డ్రింక్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇవి కాలేయాన్ని శుద్ది చేస్తాయని, శరీరంలో టాక్సిన్లు తొలగిస్తాయని చెబుతారు. కానీ దీని గురించి వైద్యులు చెబుతున్న విషయం వేరే ఉంది. మానవ శరీరం ఫ్లష్ చేయాల్సిన, మూసుకుపోయిన పైపు లాంటిది కాదని, స్వీయ-నియంత్రణ జీవరసాయన వ్యవస్థ ఈ శరీరానికి స్వతహాగా ఉన్న లక్షణం అని అంటున్నారు. డిటాక్స్ డ్రింక్స్ ను గుడ్డిగా తీసుకునే ముందు వైద్యులు ఏం చెప్తున్నారో తెలుసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు. డీటాక్స్ పానీయాలు అవసరమా? శరీర భాగాలు 24 గంటలూ పని చేస్తుంటాయి. కాబట్టి ఎలాంటి డిటాక్స్ జ్యూస్ లు అవసరం లేదని వైద్యులు అంటున్నారు. కాలేయం.. ఇది మందులు, ఆల్కహాల్, హార్మోన్లు, జీవక్రియ వ్యర్థాలను శరీరం విసర్జించగల రూపంలోకి విచ్ఛిన్నం చేస్తుంది. మూత్రపిండాలు.. మూత్రపిండాలు రోజుకు సుమారు 150-180 లీటర్ల రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. అవి యూరియా, క్రియాటినిన్, అదనపు ఉప్పు వంటి టాక్సిన్లను నిరంతరం తొలగిస్తాయి. ఈ అవయవాలు సరిగ్గా పనిచేస్తుంటే ఎలాంటి డీటాక్స్ జ్యూస్ అవసరం లేదని, అవి సరిగ్గా పనిచేయకపోతే, ఏ డిటాక్స్ జ్యూస్ కూడా వాటిని సరిచేయలేదని వైద్యులు చెబుతున్నారు. డిటాక్స్ జ్యూస్ లు హాని కలిగిస్తాయా? మూత్రపిండాల వ్యాధి.. దుంపలు, టమోటాలలో పొటాషియం అధికంగా ఉంటుంది. అధిక పొటాషియం స్థాయిలు హృదయ స్పందనలకు క్రమరహితంగా మారి, ప్రమాదకరంగా మారేందుకు కారణమవుతాయి. రాళ్లు.. బీట్‌రూట్, పాలకూర రసంలో అధిక మొత్తంలో ఆక్సలేట్ ఉంటుంది. ఇది రాళ్ల సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది . డయాబెటిస్.. జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల పండ్లు, కూరగాయల నుండి ఫైబర్ తొలగిపోతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది . కాలేయ వ్యాధి.. కూరగాయల రసం ప్యాటీ లివర్ లేదా ఫైబ్రోసిస్‌ను నయం చేస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ దీనికి ఎటువంటి ఆధారాలు లేవు. హైపోనాట్రేమియా.. ద్రవాలు మాత్రమే తీసుకునే ఆహారం శరీరంలో సోడియం స్థాయిలను తగ్గిస్తుంది. సైన్స్ ఏం చెబుతోందంటే.. డీటాక్స్ జ్యూస్‌లు బరువు తగ్గడానికి లేదా అవయవాలను శుభ్రపరచడానికి సహాయపడతాయని నిరూపించడానికి ఎటువంటి క్లినికల్ ఆధారాలు లేవు. డీటాక్సిఫికేషన్ ప్రక్రియ వల్ల కాకుండా, ప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించడం, తక్కువ కేలరీలు తీసుకోవడం, హైడ్రేటెడ్‌గా ఉండటం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది. శరీరం శుభ్రంగా ఉండాలంటే ఇవి చేయాలి.. శరీరానికి ఫైబర్ అందేలా పండ్లు, కూరగాయలను పూర్తిగా తినాలి. పుష్కలంగా నీరు త్రాగాలి, మద్యపానం మానుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం, మంచి నిద్ర పొందాలి. డయాబెటిస్, బిపి, కొలెస్ట్రాల్ లను అదుపులో ఉంచుకోవాలి. *రూపశ్రీ.
read moreషుగర్ ఉన్నవాళ్లకి ఈ 7 ఆర్గాన్స్ మొదట దెబ్బతింటాయి
- డయాబెటిస్ శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? - కళ్ళపై డయాబెటిస్ ప్రభావం (Diabetic Retinopathy) - కిడ్నీలపై షుగర్ ప్రభావం (Diabetic Nephropathy) - గుండెపై షుగర్ ప్రభావం (Heart Disease) - పాదాలపై ప్రభావం (Diabetic Foot) - డయాబెటిస్ నియంత్రణ చిట్కాలు & జాగ్రత్తలు చక్కెరను నిర్లక్ష్యం చేస్తే సంభవించే దీర్ఘకాలిక సమస్యలు, ప్రారంభ లక్షణాలు, అలాగే నియంత్రణ కోసం అనుసరించాల్సిన ఆరోగ్య చిట్కాలు, మధుమేహ లక్షణాలు & ముందస్తు హెచ్చరిక సంకేతాలు, చక్కెర వల్ల దెబ్బతిన్న ప్రధాన అవయవాలు మరియు వాటిని ఎలా నివారించాలి అనే అంశాల గురించి తెలుగువన్ Health యూట్యూబ్ ఛానల్‌కి Dr NG Sastry (Medical Director sr. Diadetologist) ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ మీ కోసం.. మధుమేహం (డయాబెటిస్)... నేడు ప్రతి ఇంట్లోనూ వినిపిస్తున్న పేరు. ఈ పేరు వినగానే చాలా మంది గుండెల్లో ఒక రకమైన ఆందోళన, భయం మొదలవుతుంది. "ఇక జీవితాంతం మందులు వాడాలా?", "నా అవయవాలు దెబ్బతింటాయా?" అన్న ప్రశ్నలు వేధిస్తుంటాయి. కానీ గుర్తుంచుకోండి, మధుమేహం అనేది అంతం కాదు, అది కేవలం మీ జీవనశైలిని మార్చుకోమని మీ శరీరం ఇచ్చే ఒక హెచ్చరిక మాత్రమే. సరైన అవగాహన, క్రమశిక్షణ ఉంటే డయాబెటిస్‌ను నియంత్రించడమే కాకుండా, కాంప్లికేషన్స్ లేని ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు. మనం డయాబెటిస్‌ను ఎందుకు నియంత్రించుకోవాలి? (Why Should We?) డయాబెటిస్ అనేది కేవలం రక్తంలో చక్కెర స్థాయి పెరగడం మాత్రమే కాదు, ఇది ప్రధానంగా రక్తనాళాల వ్యాధి. మన శరీరంలో రక్తనాళాలు లేని చోటు లేదు, అందుకే ఇది శరీరం అంతటా ప్రభావం చూపుతుంది. • అవయవాల రక్షణ: డయాబెటిస్ నియంత్రణలో లేకపోతే అది కళ్లు, కిడ్నీలు, గుండె మరియు పాదాలను దెబ్బతీస్తుంది. • దీర్ఘకాలిక ఆరోగ్యం: రక్తంలో చక్కెర స్థాయిలను (HbA1c) 6.5 నుండి 7 లోపు ఉంచుకోవడం వల్ల భవిష్యత్తులో వచ్చే కిడ్నీ మరియు గుండె సమస్యలను నివారించవచ్చు. • జీవన నాణ్యత: ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కంటి చూపు కోల్పోవడం (రెటినోపతి) లేదా పాదాలను తొలగించాల్సిన పరిస్థితి (ఆంప్యుటేషన్) రాకుండా చూసుకోవచ్చు. ఏమి చేయకూడదు? (What NOT to Do) చాలా మంది తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లు పెద్ద ప్రమాదాలకు దారి తీస్తాయి: • నిర్లక్ష్యం వద్దు: HbA1c స్థాయిలు 9 లేదా 10 ఉన్నా "నాకు బాగానే ఉంది కదా" అని నిర్లక్ష్యం చేయకండి. ఇది లోలోపల అవయవాలను దెబ్బతీస్తుంది. • మందులను ఆపకండి: డయాబెటిస్ మందులు వాడితే కిడ్నీలు పాడవుతాయని చాలా మంది భయపడతారు. కానీ వాస్తవానికి మెట్‌ఫార్మిన్ వంటి మందులు కిడ్నీలను, గుండెను రక్షిస్తాయి. డాక్టర్ సలహా లేకుండా మందులు మానేయడం అత్యంత ప్రమాదకరం. • పాదాల నొప్పిని తక్కువ అంచనా వేయకండి: నడుస్తున్నప్పుడు పిక్కలు పట్టేయడం లేదా నొప్పి రావడం వంటివి రక్త ప్రసరణ తగ్గుతుందనడానికి సంకేతాలు. దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా? (How-to Guide) 1. క్రమం తప్పకుండా పరీక్షలు: సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా కంటి పరీక్ష (డయాబెటిక్ రెటినోపతి కోసం) మరియు కిడ్నీ పనితీరు తెలుసుకోవడానికి 'మైక్రో ఆల్బుమినూరియా' పరీక్ష చేయించుకోవాలి. 2. లక్ష్యాలను నిర్దేశించుకోండి: మీ రక్తపోటు (BP) 130/80 లోపు, ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ 100 కంటే తక్కువగా (వీలైతే 70 లోపు) ఉండేలా చూసుకోండి. 3. వ్యాయామం: రోజూ వ్యాయామం చేయండి. అయితే, పాదాల్లో నరాల సమస్య (Neuropathy) ఉన్నవారు నడక కంటే సైక్లింగ్ చేయడం ఉత్తమం, దీనివల్ల పాదాలపై ఒత్తిడి పడదు. 4. సరైన ఆహారం: ఆహారంలో ప్రోటీన్ల విషయంలో జాగ్రత్త వహించాలి. కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు ప్రోటీన్ తగ్గించాలి, కానీ పాదాలపై పుండ్లు ఉన్నప్పుడు అవి త్వరగా మానడానికి ప్రోటీన్ అవసరం అవుతుంది. తరచుగా అడిగే ప్రశ్నలు (Q&A) ప్రశ్న 1: డయాబెటిస్ మందులు కిడ్నీలను దెబ్బతీస్తాయా? జవాబు: లేదు. నిజానికి డయాబెటిస్ కంట్రోల్‌లో లేకపోవడం వల్లనే కిడ్నీ సమస్యలు వస్తాయి. మెట్‌ఫార్మిన్ మరియు కొత్తగా వచ్చిన SGLT2 ఇన్హిబిటర్స్ వంటి మందులు కిడ్నీలకు రక్షణగా నిలుస్తాయి. ప్రశ్న 2: కిడ్నీ సమస్యలను ముందే గుర్తించవచ్చా? జవాబు: అవును. 'యూరిన్ ఆల్బుమిన్ క్రియేటినిన్ రేషియో' వంటి పరీక్షల ద్వారా కిడ్నీ సమస్యలను 4-5 ఏళ్ల ముందే గుర్తించవచ్చు. ప్రారంభ దశలో వీటిని మందుల ద్వారా నయం చేసే అవకాశం కూడా ఉంటుంది. ప్రశ్న 3: గుండెను పదిలంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి? జవాబు: మొదట డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవాలి (HbA1c 6.5-7). బ్లడ్ ప్రెషర్ మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను డాక్టర్ సూచించిన పరిమితిలో ఉంచుకుంటూ, క్రమం తప్పకుండా ఎక్సర్‌సైజ్ చేయాలి. ముగింపు (Outro) మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. డయాబెటిస్ ఉన్నప్పటికీ సరైన జాగ్రత్తలు తీసుకుంటే మీరు ఎవరిపైనా ఆధారపడకుండా సంతోషంగా జీవించవచ్చు. భయం వదిలేయండి, అవగాహన పెంచుకోండి. ఆరోగ్యకరమైన రేపటి కోసం ఈ రోజే అడుగు వేయండి! మరిన్ని ఆరోగ్య రహస్యాల కోసం.. మీకు ఆరోగ్య సమస్యలపై ఇంకా లోతైన అవగాహన కావాలా? నిపుణులైన డాక్టర్ల సలహాలు, సూచనల కోసం మా TeluguOne Health YouTube ఛానల్ ను ఇప్పుడే సందర్శించండి. ఆరోగ్యమే మహాభాగ్యం - సబ్‌స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి! 👉 TeluguOne Health
read moreఏ లోపం వల్ల బట్టతల వస్తుంది తెలుసా?
నేటికాలంలో అబ్బాయిలను ఇబ్బంది పెడుతున్న సమస్య బట్టతల. తల మీద జుట్టు బాగా రాలిపోయి తల చర్మం బయటికి కనిపిస్తూ ఉంటే దాన్ని బట్టతల అని అంటారు. బట్టతల వచ్చాక ఆ ప్రాంతంలో ఇక వెంట్రుకలు తిరిగి పెరగవు. ఒకప్పుడు బట్టతల పెద్దవారికి మాత్రమే వచ్చేది. కానీ నేటికాలంలో మాత్రం అది పూర్తీగా విభిన్నంగా ఉంది. చిన్న వయసులోనే బట్టతలతో ఇబ్బంది పడేవారు ఉన్నారు. అయితే బట్టతల రావడానికి శరీరంలో కొన్ని లోపాలు కారణం అవుతాయి. అవేంటో తెలుసుకుంటే.. జుట్టు నిర్మాణం.. జుట్టు నిర్మాణం ప్రధానంగా ప్రోటీన్ తో రూపొందించబడి ఉంటుంది. ఆహారం సరిగా లేకపోయినా, సరైన ఆహారం తీసుకోకపోయినా, ఎక్కువ కాలం ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోయినా క్రమంగా జుట్టు పలుచబడి, రాలిపోవడానికి దారితీస్తుంది. ఇది ఎక్కువ కాలం సాగితే బట్టతలగా మారే అవకాశం ఉంటుంది. పురుషుల్లో బట్టతల.. పురుషుల్లో బట్టతల అనేది జన్యుశాస్త్రం, హార్మోన్ల మార్పుల మీద ఎక్కువ ఆధారపడి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. తండ్రి లేదా తాత వంటి వారికి బట్టతల ఉంటే.. కాలక్రమేణా పిల్లలకు బట్టతల వచ్చే అవకాశం ఉంటుంది. ఒత్తిడి సమస్యలు.. ఒత్తిడి, నిద్ర సమస్యలు ఉన్నవారిలో కూడా బట్టతల వచ్చే అవకాశం ఉంటుంది. ఒత్తిడి, ఆందోళన కారణంగా ఒత్తిడి హార్మోన్ పెరిగి జుట్టు రాలిపోవడానికి కారణం అవుతుంది. అలాగే శరీరంలో పోషకాలు లోపించినప్పుడు కూడా బట్టతలకు దారితీస్తుంది. విటమిన్స్.. ప్రోటీన్ మాత్రమే కాకుండా జుట్టు పెరుగుదలలో విటమిన్-డి, ఐరన్, జింక్, బయోటిన్ అని పిలువబడే విటమిన్-బి17 కూడా కీలకపాత్ర పోషిస్తాయి. ఇవి లోపించడం వల్ల కూడా బట్టతల వచ్చే అవకాశం ఉంటుంది. మగాళ్లకే కాదు.. బట్టతల అనేది మగాళ్లకు మాత్రమే వచ్చే సమస్య అనుకుంటే పొరపాటు. ఇది ఆడవాళ్లకు కూడా వస్తుంది. ఆడవాళ్లలో జుట్టు పలుచబడి, తలమీద చర్మం బయటకు కనిపిస్తూ, తల వెంట్రుకల మధ్య గ్యాప్ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఆడవాళ్లలో బట్టతలగా పరిగణిస్తారు. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read more








.webp)













