
భారతీయులకు టీ అంటే ఒక ఎమోషన్. అయితే టీ తో పాటు స్నాక్స్ కూడా తినడం చాలామంది అలవాటు. టీ పాటు తీసుకునే స్నాక్స్ లో చాలా వరకు బిస్కెట్లు తినేవారు ఎక్కువ. అయితే పోషకాహార నిపుణులు మాత్రం ఈ టీ-బిస్కెట్ కాంబినేషన్ ను చాలా చెత్త కాంబో గా చెబుతున్నారు. టీ-బిస్కెట్ చాలా సింపుల్ గా రుచిగా అనిపిస్తుంది కానీ ఇది ఆరోగ్యాన్ని చాలా దారుణంగా దెబ్బతీస్తుందని అంటున్నారు. అసలు టీ-బిస్కెట్లు తీసుకోవడం వల్ల జరిగేదేంటి? పోషకాహార నిపుణులు ఏమంటున్నారు? తెలుసుకుంటే..
టీ-బిస్కెట్ కహానీ..
మార్కెట్లో లభించే ప్యాక్ చేసిన బిస్కెట్లు ఎక్కువగా పాశ్చరైజ్ చేయబడతాయి. వాటిలో శుద్ధి చేసిన పిండి అంటే మైదా, అధిక మొత్తంలో చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు, అనేక ప్రిజర్వేటివ్‌లు ఉంటాయి.
ఈ పదార్థాలు టీలోని కెఫిన్, టానిన్‌లతో కలిపినప్పుడు అది జీర్ణక్రియను చాలా ప్రభావితం చేస్తుంది. శరీరంలో అనవసరమైన చక్కెర, కొవ్వు పేరుకోవడాన్ని పెంచుతుంది. టీ-బిస్కెట్ తినడం అనేది రోజువారీ అలవాటుగా మారితే అది ఊబకాయం, మధుమేహం జీర్ణ సమస్యల ప్రమాదాన్ని చాలా సులువుగా పెంచుతుంది.
పోషకాలు జీరో..
మార్కెట్లో దొరికే బిస్కెట్లు మైదా నుండి తయారవుతాయి. వీటిలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఏమీ ఉండవు.ఇందులో జీరో కేలరీలు ఉంటాయి. టీతో వాటిని తినడం వల్ల అప్పటిక్పుడు ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది కానీ పోషకాహారం ఏమీ ఉండదు.
ట్రాన్స్ ఫ్యాట్స్..
బిస్కెట్లను క్రిస్పీగా చేయడానికి, వాటి షెల్ఫ్ లైప్ పొడిగించడానికి హైడ్రోజనేటెడ్ నూనెలు లేదా ట్రాన్స్ ఫ్యాట్‌లను ఎక్కువగా ఉపయోగిస్తారు. ట్రాన్స్ ఫ్యాట్‌లు గుండె ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఈ కొవ్వులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. మంచి కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది.
చక్కెర ..
బిస్కెట్లలో చక్కెర, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. వాటిని టీతో కలిపి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి, ఆపై పడిపోతాయి. ఈ హెచ్చుతగ్గులు ఎక్కువగా జరిగితే అవి శక్తి లేకపోవడానికి దారితీయడమే కాకుండా, దీర్ఘకాలంలో ఇన్సులిన్ నిరోధకతను పెంచడం ద్వారా టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా పెంచుతాయి.
జీర్ణక్రియ, యాసిడ్..
బిస్కెట్-టీల కాంబో జీర్ణవ్యవస్థపై ఒత్తిడిని కలిగిస్తుంది. శుద్ధి చేసిన పిండిలో ఉండే జిగట, టీలోని టానిన్లు కలిసి జీర్ణక్రియను నెమ్మదిస్తాయి. టీలోని ఆమ్లతత్వం, బిస్కెట్లలోని నూనె కడుపులో గ్యాస్, ఉబ్బరం, యాసిడ్ ఎఫెక్ట్ ను ఎక్కువ చేస్తాయి.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...




