Previous Page Next Page 
మిస్టర్ రాంగో పేజి 3

    "చెప్పు సులేమాన్ భాయ్...నన్నేం చేయమంటావ్?"
   
    అతను వెంటనే చెప్పలేదు.
   
    విషయం ఏమిటో తెలుసుకోకుండానే కిట్టూ అంత తొందరగా అంగీకారానికి రావడం అతనికి చాలా సంతోషంగా వున్నది. లేచి వెళ్ళి టేబుల్ మీదున్న బ్రీఫ్ కేసు ఓపెన్ చేసి....రెండు ఐదువందల రూపాయల బండిల్స్ తీసుకువచ్చి కిట్టూ చేతుల్లో పెట్టాడు.
   
    వాటివైపు విస్మయంగా చూశాడు కిట్టు.
   
    "ఈ రెండు లక్షల రూపాయలు పని పూర్తి చేయడానికి నీకు అడ్వాన్స్, నేను అప్పగించే వ్యవహారంలో నీకయ్యే ఖర్చులతో నాకు సంబంధం లేదు. దీనిలో నీవు కనీసం ఒక లక్షయినా ఖర్చు పెట్టవలసి వస్తుంది..."
   
    "ఎందుకు?"
   
    "ఎందుకంటే, ఆ పని నీ ఒక్కడివల్లనే కాదు....కనీసం ఇద్దరూ వ్యక్తులనూ నువ్వు తోడు తీసుకోవాలి. నేనెలా నీలా నమ్మకమైన వ్యక్తిని సెలక్టు చేసుకున్నానో, అలానే విషయాన్ని లీక్ చేయని ఇద్దరు నమ్మకస్తుల సహాయం తీసుకో...లక్ష రూపాయలకు బేరం సెటిల్ చేసుకో....రంగంలోకి నువ్వు దిగకుండా, తెర వెనుకనే వుండి వాళ్ళచేత పని చేయించడం సులువైన పని...ఇద్దరికీ చెరొక యాభై ఇచ్చినా నీకు లక్ష మిగులుతాయి..." వివరించాడు సులేమాన్.
   
    "అసలు విషయమేమిటో చెప్పు భాయ్...."
   
    "నువ్వు అర్జంటుగా బయలుదేరి విజయవాడ వెళ్ళాలి....ఒక నేల రోజులపాటు నీ మకాం అక్కడే..."
   
    "విజయవాడలోనా?"
   
    "అవును..."
   
    "అక్కడ ఏం చేయాలి?"
   
    "అదే చెప్పబోతున్నాను. తెలివిగా ప్లాన్ రూపొందించుకుని పూర్తి చేయవలసి వుంటుంది. పని పూర్తయిన వెంటనే నాకు ఇన్ ఫామ్ చేస్తే నేను దుబాయ్ నుంచి వచ్చి నాకు కావలసింది నేను తీసుకుని నీకు ఇవ్వ వలసిన తొంభై ఎనిమిది లక్షలు నీకు ఇస్తాను. బట్...ఇది చాలా కాన్ఫి డెన్షియల్....ఎవ్వరికి తెలియకుండా పని పూర్తి కావాలి....ఇక నువ్వు చేయవలసింది ఏమిటంటే...."
   
    సులేమాన్ చెప్పుకుపోతున్నాడు...
   
    కిట్టూ శ్రద్దగా వింటున్నాడు...
   
    ఆ క్షణంలో...ఆ గదిలో ... ఒక సరికొత్త సంచలనానికి నాంది ఆరంభమైంది.
   
                                      *    *    *

   
    "ప్రేమ అనేది ఒక ఆర్ట్...అది హార్ట్ కు సంబంధించింది." తన్మయత్వంగా చెప్పుకుపోతున్న ఆమెవైపు తదేక దీక్షతో చూస్తున్నాడతను.
   
    "సో....ఇప్పుడు నువ్వు అర్జంటుగా నన్ను ముద్దు పెట్టుకుంటున్నావు..."
   
    "ఎక్కడ పెట్టుకోవాలో నాకు తెలియదే..."
   
    "అంత చిన్న విషయం కూడా తెలియదా?..."
   
    ఊహు అన్నట్టు తలవూపాడతను.
   
    "నిజంగా తెలియదా...?"
   
    "నాకు పదిహేడు..."
   
    "నీకు పదహారే..."
   
    "కావచ్చు...కానీ నేను ఇంతవరకూ ఏ అమ్మాయినీ ముద్దు పెట్టుకోలేదే....ముద్దు ఎక్కడా పెట్టాలో తెలియడానికి..." అమాయకంగా చెప్పాడతను.
   
    "పిచ్చి మొద్దూ...ఆమాత్రం దానికి అనుభవం కావాలా....ఇంకానయం..." తరువాత మాటలను చెప్పలేక ఆపేసిందామె.
   
    "ఊ...ఏదో చెప్పబోయి ఆగిపోయావే.... చె...ప్పు.....ఏ...మి....టో... అ....ది?"
   
    "అది ఇప్పుడెందుకుగానీ....ఇక్కడ ముద్దు పెట్టగలవా....?"
   
    "ఓ....ఆనందంగా...."
   
    ఆమె చూపించిన చోట ముద్దు పెట్టాడతను.
   
              [3]

    "చాలదు....ఇంకా కావాలి...."
   
    మరో రెండు ముద్దులు....
   
    "లాభంలేదు...."
   
    ఈసారి నాలుగు ముద్దులు....
   
    "ప్చ్....ఇంకో నాలుగు...."
   
    "నథింగ్ డూయింగ్....ఇంక చాలు... ఇప్పటికే ఇంకా.... ఇంకా అంటూ మొఖం నిండా ముద్దులు పెట్టించుకున్నావు..." అంటూ ఆమెకు దూరంగా జరిగాడతను.
   
    సరిగ్గా ఆ సమయంలోనే కిచెన్ రూమ్ లో నుండి వృద్దాప్యంతో పండిపోయిన బామ్మగాదు ఆ ఇద్దరూ వున్న గదిలోకి వచ్చింది.
   
    చటుక్కున ఏదో జ్ఞాపకం వచ్చినదానిలా ఆ ఇద్దరినీ అనుమానంగా చూస్తూ.
   
    "ఇందాకటి నుండీ మీ ఇద్దరూ ఇక్కడే వున్నారా?"
   
    ఆమె చూపుల్లోనూ, మాటల్లోనూ అనుమానం అంతర్లీనంగా వుంది.
   
    "అవును బామ్మా...మాట్లాడుకుంటున్నాం...."
   
    చాలా సన్నగా....మృదువుగా వున్నది ఆ అమ్మాయి కంఠస్వరం....గొంతే కాదు....రూపు రేఖలు కూడా ముద్దుగా మురిపెంగా వున్నాయి.
   
    ఆమె పేరు....జాజిబాల!
   
    ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నది.
   
    ఆ చూపుల్లో జాబిలిలోని చల్లదనం....
   
    ఆ మాటల్లో జిలేబీలోని తియ్యదనం...
   
    ఆ రెండూ కలబోసిన బేలకన్నుల బాల....ఆ జాజిబాల!
   
    "అవునండీ....మాట్లాడుకుంటున్నాం...."
   
    సర్ది చెప్పాడతను.
   
    సరిగా రాని మీసకట్టు....
   
    ఆడపిల్లలా బుగ్గలు...చురుకైన కళ్ళు.....
   
    అతని పేరు రాంగోపాల్.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS