Previous Page Next Page 
అనైతికం పేజి 2

   
    అయితే బయటవాళ్ళకి (పాఠకులకి) ఇదంతా నాన్సెన్సుగానూ- చిరాగ్గానూ అనిపిస్తుంది. అహల్యమీద చిరాకు వేస్తుంది. ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తోందా అని కోపం వస్తుంది.

 

    "విజయానికి అయిదు మెట్లు" వ్రాసిన తరువాత రచయితగా వచ్చిన పరిణామం ఇది. మన ప్రవర్తనని ఇతరుల కోణంలోంచి చూస్తే- అది ఒక్కోసారి ఎంత అజ్ఞానంగానూ, అమాయకంగానూ, అసహ్యంగానూ, తర్కరహితంగానూ, అనాలోచితంగానూ కనపడుతుందో- ఈ నవలలో చూపించాను. మనం మన ప్రవర్తనని ఎంత కన్వీనియెంట్ గా సమర్ధించుకుంటామో, అహల్య కూడా అలాగే సమర్ధించుకుంటుంది. ఒక్కోసారి ఆత్మవిమర్శ చేసుకుంటుంది కూడా. కానీ ఆ ఆత్మవిమర్శ కేవలం 'కుక్క - దాలిగుంట' వ్యవహారంలా వుంటుంది. అందుకే ఈ పాత్ర తాలూకు కథ చదువుతున్నంతసేపూ- ఆమె వాదనలు వింటున్నంతసేపూ, మనసులో దేవేసినట్టు వుంటుంది. (అలా అనిపించినప్పుడు నవలని ఓ రెండు నిముషాలు పక్కనపెట్టి, వెతికితే- అహల్య ఛాయ ఏ మారుమూలో మన మనసులోనూ కనిపిస్తుంది.)

 

    ఇది అవినీతిని గ్లామరైజ్ చేయటం కాదు. వేదన యొక్క మూలాధారాన్ని భూతద్దంలో చూపే ప్రయత్నం! వేదనకి కారణం ఏమిటి? ఘర్షణ... ఘర్షణకి కారణం ఏమిటి? తప్పు చేస్తున్నామేమోనన్న ఫీలింగ్. తప్పు అంటే ఏమిటి? వేదన కలిగించేది.

 

    ఇదొక వృత్తం! ఎక్కడ మొదలైందో అక్కడికే వచ్చింది. ఇందులో వున్నవి- కేవలం ఘర్షణ ఫీలింగ్ మాత్రమే! అంటే...

 

    మన చర్యవల్ల అవతలివారికి నష్టం లేనప్పుడు- ఆ చర్య మనకేవిధమైన (శాశ్వతంగాగానీ, తాత్కాలికంగాగానీ) నష్టము కలిగించనప్పుడు- తప్పుకి అర్థాన్ని కేవలం మన "ఫీలింగే" నిర్దేశిస్తుందన్నమాట. అందుకే అహల్య ఏ స్టేజిలోనూ సుఖంగా వుండలేకపోయింది.

 

    ............

 

    ఈ విషయమే ఆ పాత్ర ద్వారా చెప్పదల్చుకున్నది.

 

    ఈ సీరియల్ ఆంధ్రప్రభలో సెప్టెంబర్ లో మొదలైంది. నవంబర్ లో ఒక వార్త వచ్చింది.
_________________________________________________________________
              BANGLADESH BANS BOOK ON WOMEN

 

    Dhaka. Nov. 22 [A.P.] : The Bangladesh Government on Tuesday banned a book on the grounds that it hurt Muslim sentiments with its claim that Islam considered women to be men's sex-slaves.

 

    Tthe author of the collection of essays said the government had bowed to pressure from Islamic fundamentalists, adding he would challenge the ban in court.

 

    The government ordered the confiscation and banning the sale, distribution or preservation of the book, women, because it attacked Muslims, basic beliefs, a Home Ministry statement said.   

 

    Mr. Humayum Azad, author of the 406- page collection, first published in 1991, said "It is ridiculous to ban a book of free thinking and views".

 

    Mr. Azad head of the Bengali Literature Department at Dhaka University, said in an interview that a 40 - page chapter in the book high-lighted treatment of women in Islamic, Christian, Hindu and Jewish societies. He claimed the Koran portrayed women as men's sex-slaves.
_________________________________________________________________


    తను ఊహించింది జరగటం రచయితకి గొప్ప థ్రిల్.

 

    గమ్మత్తుగా వుంది కదూ.

 

                                                       *    *    *

    ఇక కథాంశాని కొస్తే-

 

    నిజాని కిది నవల కాదు. రెండు పాత్రల ఆలోచనల్లో వచ్చిన పరిణామక్రమం. అందుకే ముగింపుగానీ, క్లైమాక్స్ గానీ వుండవు. అదే విధంగా- ఏ పాత్ర తన కథ చెపుతూంటే- ఆ పాత్ర తన స్వభావం ప్రకారం శైలిలో మార్పు వస్తూ వుంటుంది. అహల్య కథలో శైలి, అమాయకంగానూ- సరళంగానూ వుంటుంది. అచ్చమ్మ కథ ప్రారంభమే అదోలాటి 'కసి'తో మొదలవుతుంది. చిన్నతనం నుంచీ అనుభవించిన బాధలవల్ల వచ్చిన కసి అది!

 

    అహల్య కథలోనే 'బోస్నియా' యుద్ధం గురించి ప్రస్తావించటం జరిగింది. అంటే ఆమె కథ 1995 ప్రాంతాల్లో జరిగిందన్నమాట. ఆమె కూతురు కథ 2115 ప్రాంతం నాటిది. భూత, భవిష్యత్, వర్తమానాల గురించిన కథ ఇది. ఇది సరీగ్గా గ్రహించకుండా ఒక పాఠకుడు- అహల్య కాలంలో కెనెటిక్ హోండా ఎక్కడిది? అని విరుచుకుపడ్డారు.

 

    చివరగా ఒక మాట. ఇది స్త్రీ వాదాన్ని సపోర్ట్ చేసే నవలా? వ్యతిరేకించే ఛాందస రచనా? అన్న అనుమానం ఎవరికైనా కలిగితే దానికి రచయిత క్షమార్హుడు. స్త్రీ వాదమంటే వివాహరహితమైన జీవితమేనంటే- దానికిది వ్యతిరేకం. ఇకపోతే సమాన హక్కులు, స్త్రీ స్వతంత్రాల గురించి నవలలోనే వివరంగా చెప్పటం జరిగింది. జడ్జిమెంట్ పాఠకులదే.

 

    మరింతకీ రచయిత ఏ విధంగా భావిస్తున్నాడు? పురుషుడు తన వివాహేతర సంబంధాల్ని స్నేహితుల ముందు గర్వంగా చెప్పుకుంటాడు. అది చాలా మామూలు విషయంగా ఇంతకాలం పురుషాధిక్య సమాజం భావిస్తూ వస్తోంది. ఇంట్లో స్త్రీకి తెలిసినా తెలియనట్టే వుంటుంది. కారణం ఆర్థిక స్వాతంత్ర్యం లేకపోవటం కావచ్చు. సంసారాన్ని విచ్చిన్నం చేసుకోవటం ఇష్టంలేక కావచ్చు. కానీ ఇప్పుడిప్పుడు స్త్రీలు కూడా ఆ విషయాన్ని వెల్లడి చేస్తున్నా బ్రిటీష్ యువరాణి డయానా నుంచి నెల్సన్ మండేలా భార్య వరకూ ఇది ఇటీవలే జరిగింది. అంత సులభంగా జీర్ణం కాని ఈ చేదు వాస్తవం- పురుషాధిక్యతపై పోరాటమా- లేక- స్త్రీ స్వేచ్చకి మరో అర్థమా?...ఏది ఏమైనా ఇదొక కొత్తరకం ప్రారంభం. ఇబ్బందికరమైన ప్రారంభం.

 

                                                  నవలా రచనలో కూడా ఇదొక ప్రయోజనమే.

                                             అందుకే దీనికి 'అనైతికం' అని పేరు పెట్టడం జరిగింది.  

                                                               _ యండమూరి వీరేంద్రనాథ్


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS