Previous Page Next Page 
ది రైటర్ పేజి 36

    అదిగో___ఆవిడే ... అవిడలాగే ఉంది " వారపత్రిక అందుకున్నాడు బంకు మేనేజరు ముఖచిత్రం చూపిస్తూ అన్నాడు.
   
    అక్కడ అందరికంటెముందు మతిపోయింది ఏ.సి.పి.కి.
   
    తర్వాత ఆప్రమాడం అందరకీ ఏర్పడినట్లు అయి అప్రతిభుడౌ తుంటే 'దేమిట' కోపంగా పైకిలేచాడు ఏ.సి.పి.
   
    "కమాన్"
   
    బయటకి నడిచాడు.
   
    "వాడికి పిచ్చిపట్టింది......" కారిడార్ లో అడుగు పెడుతూనే కిరణ్ ని చూస్తూ ఆర్తనాదం చేశాడు. సో..... వాడు ఇచ్చిన ..... ఆనందరావు కారు దొంగిలించబడలేదు....." డిక్లేరు చేసాడు ఏ.సి.పి. జీపులో కూచుంటూ......
   
    బంకు మేనేజర్ నేరస్తురాలిగా గుర్తించింది మరెవర్ననో కాదు. కాంటాక్ట్ లెసెన్స్ పెట్టుకుని బాబ్ డ్ హెయిర్ తో మేకఫ్ చేయడ డివున్న ప్రఖ్యాత సినీనటీ దివ్యది.
   
                    *    *    *    *   
   
    వుదయం ఎనిమిది గంటలవేళ ___
   
    డ్రాయింగ్ రూమ్ లో కూచున్న వైధేయ రాస్తున్నాడు......
   
    అమ్తముండు రోజే వారపత్రికఎడిటర్ సేరియాల్ ఇన్ స్టాల్ మెంటు గురించి గుర్తు చేశాడు...
   
    అలా ఎప్పుడూ అతడు అడిగించుకోలేదు.......
   
    ధరావాహికంగా ప్రచురించబడుతున్న సీరియల్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరమో వైధేయకి తెలుసు....
   
     అన్నటైమ్ కి 'ఇన్ స్టాల్ మెంట్' అందించకపోయినా, మంచి ప్రాచుర్యాన్ని పొందిన సీరియల్ ఒక వారం ప్రచురింకపోయినా తన పేరు పాడవుతుందని వైధేయకి తెలియనిది కాదు.....
   
    అందుకే తెల్లవారుజామునే ఎలాగన్నా పూర్తీ చేయాలని కూర్చున్నాడు.......
   
     అయితే కధ ఓ పదిపేజీలకు మించి ముందుకు సాగాడంలేదు...... మరో అయిదు పేజీలురాసిఅనుకున్న చోట చాప్టర్ ముగిస్తే ఆ వారం గట్టెక్కినట్టే......
   
     అద్భుతంగా అలోచించగల ఒక కధకుడి మెదడులో హఠాత్తుగా ఇటువంటి 'వెక్యూమ్' క్రియేటయితే తప్పఅర్ధం కాని విషయం......
   
    అలా వైధేయ సంఘర్షణకి లోనుకావడానికి కారణం అతని ప్రస్తుత మానసిక స్థితి ఒక్కటే కాదు.....
   
    చాలా సేపటినుంచి వైధేయ దూరంగా అదేపనిగా తన గదిలోకి చూపు మరల్చకుండా పరీశీలించడం చాలా ఇబ్బందిగా అనిపిస్తూంది.
   
    క్రైం సాహిత్యం రాసి రాసి అతడి ఆలోచన లెంతటి అనుమానా స్పదంగా తయారయ్యాయంటే ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తున్నాడు.
   
    "ఇంకా పూర్తీ కాలేదా?"
   
    సమీపంలో నిలబడి అడిగింది రోషణి.....
   
     వైధేయ దృష్టి మరల్చి నేలవేపు చూస్తూనే లేదన్నట్టు తలూపేడ.
   
    "ఏంటి ఏదో పేజీదగ్గర ఆగిపోయావు" కలుపుగోలుగా అంది పక్కన అతడిపై ఒరిగి కూర్చుంటూ ......' అసలు ఎంతవరకు రాసేవు'
   
    "క్రితం వారం స్మశానంలో ధనుంజయ భార్య శవం కోసం సమాధి తవ్వడం మెదలు పెట్టాడుగా" అన్నాడు బడలికగా.
   
    "తవ్వదమూ ఆ శవం కనిపించకపోవడం కూడా రాసేవుగా...."
   
    "అవును ___"
       
    "మరి ఈ వారం ఆ శవం ఎలా మిస్సయిందో స్పష్టం చేస్తున్నావా"               
   
    అవునన్నట్టుగా తలూపి "స్మశానంలో ఓ మూల కాష్టం మండుతూందిగా ప్రత్యర్ధులు ఆమె శవాన్ని అక్కడ తగలబెడుతున్నారన్నమాట__ అది గుర్తించలేదు ధనుంజయ __" చెప్పాడు ___
   
    ఆమె భ్రుకటి ముడిపడింది "దానివలన ప్రత్యర్ధులకు ఒరిగేలాభం __"
   
    "అతడి భార్య శవం తమ దగ్గరే భద్రంగా ఉందని అతడ్ని ఫోన్ ద్వారా హెచ్చరించింది. తమకు సహకరించకపోతే ఆ శవాన్ని అటాప్సీ పోలీసులకు అందజేస్తానని బెదిరించి అతడిలో మాత్రమే సాధ్యమయ్యే ఓ పని కోసం అతన్ని వాడుకొబోతున్నారు__"
   
    "లవ్ లీ" నవ్వింది అతడి కళ్ళలోకిచూస్తూ"స్ట్రీటజీబాగుంది __ మరి రాయవేం __"
   
    నిట్టూర్చేడు "రాయలేకపోతున్నాను"
   
    "ఏం" అంటూ వైధేయ పరిశీలనగా చూస్తున్న వేపు తనూ చూసింది క్షణంపాటు"అర్దమైంది"
   
    అనుమానంగా చూశాడామేను __
   
    "వైదేయా! కిరణ్ మనమీద అప్పుడే దాడి మొదలు పెట్టాడు__" అంది సాలోచనగా బయట నిలబడ్డ వ్యక్తిని చూస్తూ __
   
    "ఇప్పుడెలా __'వైధేయమోహం వివర్ణమైపోయింది. రెండడుగులు ద్వారం వేపు నిశితంగా బయటకు చూస్తూ నిలబడింది ___
   
    ఆ వ్యక్తి (?) తనను గమనించేడన్నట్లు కదిలేడు. నిశ్శబ్దం మంచి ముందు తేరుకుంది రోషణి...... సాలోచనగా వైధేయనే చూస్తూ "ఈరోజుపేపర్ చూశారా" అంది.
   
    అందోళన్ని అదిమిపెడుతూ పేపరు అందుకున్నాడు.

 Previous Page Next Page