"అయ్.... నేనసలే చండశాసునుడ్ని"
సమయం గడుస్తున్న కొద్దీ అతనిలో సహనం చచ్చిపోతోంది.
తలవంచుకుని వీరుడిలా సూటిగా చూస్తూ మళ్ళీ నడక మొదలు పెట్టాడు......
నిముషాలు గడుస్తున్నాయి.
సమీపంలో స్ప్రీం గ్ డోర్స్ చప్పుడైంది.
"హూఈజ్ దట్" అరిచాడు తల తిప్పకుండానే.......
నేలపై బూటుకాలితో తన్నిన శబ్దానికి అమితంగా ఉలికిపడిన వాడై వెనువెంటనే పక్కకి తిరిగాడు.
ఎదురుగా ఎటెన్షన్ లో నిలబడి వున్నాడు యస్సయి.....
"సో..... దమయంతి ఆచూకీ దొరికిందా...."
"D" అంటే దమయంతి అన్న పేరుకు మొదటి అక్షరము కాబట్టి తప్పకుండా నేరం చేసింది ఆమె అయి ఉంటూ ఉంటుందన్న నమ్మకం పీడీస్తుంది. బంకుమేనేజర్ నేరస్థుల ఫోటోలు గుర్తించిన దగ్గర్నుంచీ.......
"సో....దమయంతి...."
"ఆచూకీ దొరికిందిసర్ " యస్ .ఐ. చెప్పాడు రెండోసారి.
"మరి అరెస్టుచేసి తీసుకొచ్చావా"
"నో సర్"
"వై.....నాట్" వాజవజా వణికింది ఏ.సి.పి మీసం రోషంగా.
"దమయంతి ఆర్నెల్లక్రితం చనిపోయిందట సర్"
"ఎందుకు .....ఎందుకు చనిపోయింది"
ఆ ప్రశ్నేమిటో అర్ధంకాని ఏస్.ఐ."జేబ్బుచేసి...." అన్నాడు.
"ఎందుకు జబ్బు చేసింది?"
ఏస్.ఐ.జవాబు చెప్పలేకపోయాడు.
"అప్సర్ టు ది పాయింట్" ఇది తెలిసిపొతే అసలు "క్లూ" దొరికిపోతుందన్నంత ధీమాగా నిలదీశాడు.ఏ.సి.పి
"కమాన్...... అసలే నేను చండాశాససుడ్ని....."
"తెలీదు సార్ ...."
"ఏంటీ..... నేను చండశాసుడ్నునా."
"కాదు సార్" త్రోటుపడ్డాడు. ఏస్.ఐ.
"ఎందుక్కాదు. మూమ్మాటికి నేను చండశాసుడ్నే." పెదవుల్నీ బిగపెట్టటంలో మీసాలు మరో అంగుళం పైకి లేచాయి.
"ఎస్సార్..."
"వై.... వై దిస్ కన్ ప్యూజన్. ఎ పోలీసాఫీసర్ యీజ్ సపోజ్ట్ టు హేవ్ క్లారిటీ ఇన్ హీజ్ థింకింగ్....."
నిజానికి ఇద్దరిలో ఎవరు కన్ ప్యూజన్ అవుతున్నారో అర్దంకాని ఏస్.ఐ మౌనంగా వుండిపోయాడు.
"సో..... అంతా సుదీర్ఘంగా పరిశీలిస్తే ఆబంకు మేనేజరు కన్ ప్యూజ్ అయ్యాడన్నమాట."
"ఎస్సర్...."
"దేర్......యూ ఆర్.... సో" ఎ.సి.పి అగేడు లాజిక్ పట్టేసిన దీమాతో
"సో....." అంటూ ఎ.సి.పి. మరేదో అనబోతుండగా ఇన్ స్పెక్టర్ కిరణ్ గదిలోకి వచ్చి శాల్యూట్ చేశాడు.....
ఆ చప్పిడికి చెప్పాలనుకున్నది మరచిన ఎ.సి.పి. "సో..... వాట్" అన్నాడు కిరణ్ని చూస్తూ.
కొన్ని క్షణాల క్రితమే తన స్టేషన్ లో అనందరావుని రమేష్ ని ఇంటరాగేషన్ చేసివచ్చాడు కిరణ్.
"నథింగ్ సర్..... " త్రోటుపడుతూ జవాబిచ్చాడు. కిరణ్.
"వాట్ నథింగ్...." ఎ.సి.పి కిరణ్ ని చూస్తూ "దేరీజ్ సం థింగ్.....కమాన్ " బారీగా అంగాలువేస్తూ బయటకి నడిచాడు ఎ.సి.పి.
కిరణ్ తో పాటు ఎస్ ఐ కూడా ఎ.సి.పి ని అనుసరించారు.....
మరో అరగంటలో పోలీసు ఆఫీసర్లు నర్సింగ్ హొమ్ కి చేరుకున్నారు.
"మిస్టర్ బంక్ మేనేజర్ ....!" గద్దించాడు ఎ.సి.పి.
బెడ్డుమీదున్న బంకు మేనేజర్ ఆ అరుపుకి అదిరిపడి "సర్" అన్నాడు లేచి కూర్చుంటూ......
"నువ్వు పొరపాటు పడ్డావు.___"
"దేని విషయంలో సర్" అర్ధం కానట్టుగా చూశాడు బంకు మేనేజర్.
"దమయంతీ బ్రతికిలేదు...." ఏ దమయంతో బోధపడక అతడు దిక్కులు చూస్తుంటే "అదే..... నువ్వు గుర్తుపెట్టిన నేరస్తురాలు ఆర్నెల్లక్రితమే చనిపోయింది" అన్నాడు ఏ.సి.పి......
"కమాన్..... బాగా మరోసారి గుర్తు చేసుకో ___ ఆమె ఎలా వుంటుంది....కావలిస్తే ఇంకోసారి ఆల్బమ్ చూడు...." తొందర చేశాడు.
అసలే అనారోగ్యంతో మంచంపట్టిన బంకు మేనేజరు ఈ రాద్దాంతానికి తలపట్టుకున్నాడు.
"పట్టుకోవాల్సింది తల కాదు...... నేరస్థురాల్ని....." హడావుడి చేశాడు. అసలే నేను చండశాసుడ్ని అన్నట్టుగా చూస్తూ....
సరిగ్గా అదే సమయంలో.......
బంకు మేనేజరు ద్రుష్ట హఠాత్తుగా ఓ వారపత్రిక ముఖచిత్రంపై పడింది. అది నర్సు అంతక్రితమే చదివి బెడ్డువారాన రెక్ పై ఉంచింది.
"సర్" అంటూ ముందు ఒకేక వేశాడు.
ఈసారి అతడికేకకి ఏ.సి.పి. అదిరిపడి "వ్వాట్" అంటూ సగం వంగేడు.....