Previous Page Next Page 
ది రైటర్ పేజి 23

    కారు దగ్గరకి నడవాలంటే కళ్ళలో వణుకు పుడుతోంది ___
   
    అయినా వెళ్ళాలి . ఏదో ఓ కారు దొంగిలించాలి.
   
    లేకపోతె ఆమె దృష్టిలో తనో వెధవాయి అయిపోతాడు.
   
    అసలు రోషిణిఈపాటికి తనకు అవసరమైన క్లారును ఎక్కడైనా సంపాదించి వుంటుందా?
   
    మేధస్సుతోపాటు అందాన్ని అయుధంగా వాడుకోగల రోషణికది సాధ్యం అయివుండదు.
   
    ఈపాటికి పెట్రోల్ బంక్ వేపు దూసుకుపోతూండవచ్చు.....
   
    పరిసరాల్లో మనుష్య సంచారం లేదు.....
   
    అటూ ఇటూ చూశాడు లైటర్ తో సిగరెట్ వెలిగిస్తూ.....
   
    సమయం గడుస్తున్న కొద్దీ సహనం చచ్చిపోతూంది....
   
    గట్టిగా రెండు సఫ్స్ లాగి సిగరెట్ విసిరేశాడు.....
   
    ఎవరో తరుముతున్నట్ట్లుగా కారును చేరుకున్నాడు
   
    డోర్ తెరుస్తుంటే చేతులు వణికాయి.
   
    ఆ డోర్ లాక్ చేసి వుండకపోవడంతోబాటు ఇగ్నిషన్ కీ కూడా కారులోనే వుండడాన్ని చూసి ఎంత ఆనందించాడంటే ఆ పుణ్యాత్ముడేవరో తన కోసం అమర్చి పెట్టిన అవకాశానికి మనసులోనే అభినందించాడు.
   
    ఇగ్నిషన్ కీ తిప్పగానే 'గర్ ర్ .....' మన్న శబ్దం రావడం తప్ప కారు స్టార్టు కావడంలేదు.
   
    రెండు నిముషాల సేపు ఆగకుండా ప్రయత్నించాడు.
   
    సరిగ్గా అప్పుడే గుర్తు కొచ్చింది!......
   
    ఇగ్నిషన్ కీ కారులోనే వదిలిపేట్టివెళ్ళాడూఅంటే కారు ట్రబుల్ ఇస్తున్నందుకుఒళ్ళు మండిన ఓనరు సమీపంలోని మెకానిక్ షాపుకైనా వెళ్లుండాలి......
   
    లేదాఇక్కడ దగ్గరలోనే ఏ స్నేహితుడింటికోలేక......
   
    తలపక్కకి తిప్పిన వైధేయకి ముచ్చెమటలు పోసాయి. 
   
    అతడికి సమీపంలో సుమారు పదిఅడుగుల దూరాన తననే గమనిస్తూ నిలబడ్డాడో వ్యక్తి.
   
    కొంపతీసి అతడే కారు ఓనరు కాదు కదా!
   
    ఎందుకిలా చూస్తున్నాడు తననే___
   
    ఇప్పుడేం చేయాలి _ _ లా   
   
    వైధేయ వెన్నులో సన్నగా చలి మొదలై క్రమంగా శరీరాన్నంతావ్యాపించింది ___
   
    కనీసం కారు స్టార్తయినా రయ్యిన దూసుకుపోయి ఎక్కడో ఏ మూలనో కారు వదిలి పేట్టి అతడు పోలీసు కంప్లయింట్ ఇవ్వకుముండే తను తప్పించుకునేవాడు.
   
    ఇప్పెదేలా .
   
    కనీసం వైధేయనే పరికిస్తున్న వ్యక్తి నెమ్మదిగా ముందుకు నడుచుకోస్తున్నాడు.
   
    స్టీరింగ్ చుట్టూ బిగుసుకున్నాయి వైధేయ చేతులు.
   
    అప్పటికే కారును చేరుకున్నాడు ఆ వ్యక్తి.
   
    లిప్తపాటులో దూకి పరుగెత్తుదామన్నంత దడపుట్టుకొచ్చి వైధేయ ఆ వ్యక్తి విండోలోంచి చేయిలోపలికి పెట్టగానే కాస్తా వేనక్కి జరిగాడు.
   
    విచిత్రం . ఆ వ్యక్తి వైధేయ కాలరు నట్టుకోవడం లేదు___
   
    మెచ్ బాక్స్ కావలన్నట్టు సౌ౦జ్జ చేస్తున్నాడు __
   
    అప్పుడు చూప్శాడు. ఆ వ్యక్తి నోట్లో అంటించని సిగరెట ని.
   
    "హమ్మయ్య" తేరుకుంటూ లైటర్ ని అందించాడు.....
   
    సిగరెట ముట్టించుకుని లైటర్ని పరీక్షగా చూస్తూ "చాలా బావుంది సార్.జపాన్ మేడ్ కదూ" అన్నాడు.
   
    "మరేం" అన్నట్టుగా తలూపెసాడు వైధేయ గండం గడిచినందుకు కాస్త రిలాక్సువుతూ___
   
    "ఎలా పోల్చాలో చెప్పమంటారా. మొన్న మా బామ్మర్ది దుబాయి నుంచి వస్తూ ఇలాంటిదే ఒకటి నాకోసం తెచ్చాడు లేండి. ఇంటి దగ్గరేవుంది __ మీరేన్ని చెప్పండి. ఫారెన్ గూడ్స్ కొనడమంటూజరిగితే జపాన్ వాటికే ప్రాముఖ్యతివ్వాలంటాను."  మీరేమంటారు."
   
    "ఈడియ్యట్ ___ ఇక్కడ హరికథ చెబుతున్నాడేమిటి లైటర్ వెనక్కీవ్వకుండా" అనుకున్న వైధేయ "మరేం?" బాంబే విమానాశ్రయంలో కస్టమ్స్ వాళ్ళు....."
   
    "ఎంత కష్టం తెచ్చి పెడుతున్నావురా రాస్కెల్ ___ అవతల కారు ఓనరుగానితిరిగిరాగలడు. వదిలిపెట్టారా వెంకటసుబ్బయ్యా" అనుకుంటూ అసహనంగా ఆ చివరి వాక్యం బయటికే అనేసాడు.
   
    అంతే.....
   
    లైటర్ అందించేసిన ఆ పెద్దమనిషి గోణుక్కుంటూ వెళ్ళి పోయాడు.....
   
    బహుశా చాలా హర్తాయిపోయుంటాడు.
   
    ఆ తర్వాత మరేమీ ఆలోచించలేని వైధేయ పట్టుదలని విక్రమార్కుడిలా ఓ రెండు నిముషాలపాటు ఇగ్నిషన్ ట్రైచేసాడు.
   
    బేటరీ నీకయినట్టుంది __ శబ్దం తప్ప స్టార్టు కావడంలేదు.
   
    ఇన్ని ఏర్పాటులు చేసి వదిలిపెట్టిన  ఆ కారు యజామాని బేటరీ విషయంలో కనబరిచిన ఆశ్రద్దకి వైధేయకి ఎంత కోపం వచ్చిందీ అంటే ఆవేశంతో ఇగ్నిషన్ కీ తీసుకుని బయటకి వచ్చేశాడు. ఉక్రోషంగా చీకట్లోకి విసిరేసాడు కీ బంచ్ ని __
   
    ఎందుకో ....కారు దొంగతనమున్నది తను రాసినంత సులభంగా లేదు ___
   
    వాచీ చూసుకున్నాడు అసంకల్పితంగా .....
   
    పదీ పదిహేను ___         

 Previous Page Next Page