Previous Page Next Page 
ది రైటర్ పేజి 22

    మరుక్షణం ఆమెరుపుని కప్పుతూ బోతాబోతా నీళ్ళు రాలుతుంటే నోట్ల నందించాడు......
   
    అమేతన సమీపంలో నిలబడ్డ వృద్ధుడ్నివైదేయిని మార్చిమార్చిచూసిందోక్షణం.....
   
    తర్వాత డబ్బులందుకుని కొంగున కట్టుకుంది.
   
    వృద్ధుడు అర్ధం కానట్టుగా చూసేడు ఎప్పటిలాగే.....
   
    వైధేయ లాంటి ఒక అపరిచితుడు ఆ పిచ్చిదానిపై చూపే ఆత్మీయత ఆ వృద్ధుడుకి అనూహ్యమయిన విషయం....
   
    అందుకే వైదేయ నందుమొగని దాటి వెళ్తుంటే రేప్పాలార్చకుండాచూస్తూ వుండిపోయాడు.
   
    ఏనాడో చాలా నిర్దాక్షిన్యంగా రాలిపోయిన అమ్మా గుర్తుకొచ్చి మాత్రమె కాదు ఆ పిచ్చిదానిపై వైధేయ జాలి చూపించేది......
   
    అదో బాధ్యత...... 
   
    తను ప్రస్థుతస్థితికి దాగాడానికి పరోక్షంగాఆ పిచ్చిదే కారణమన్న కృతజ్ఞత......
   
    ఒంటరితనం శాపంగా మారిన వైధేయ అనుక్షణం అమ్మగుర్టుకోస్తుంటే అంతఃమాధనాన్ని బహిర్గతం చేసుకునే మరో మార్గం లేక ఊరటకోసం తన కన్నీళ్ళకే అక్షరూపం ఇస్తూ రాసుకుపోయే వాడొకనాడు.
   
    ఆర్ధికమైన నిలకడలేక రకరకాల అవతారాలేత్తుతూ ఓ చిన్న గదిలో అద్దేకుంటూ, ఉన్న నాడు తింటూ లేనినాడు రాతలతో వేదాన్ని కప్పిపుచ్చుకుంటూ కాలాన్ని వెళ్ళబుచ్చేవాడు.
   
    ఇది శరణాలయం కాదన్నాడు ఇంటి యజమాని అద్దే చెల్లించలేక వైధేయని నిలదీస్తూ ___
   
    గది కెళ్ళాడానికి మొహం చెల్లని వైధేయపై మంటతో ఉన్నట్రంకు పెట్టెతోపాటు కాగితాల కట్టాల్నీబయటకి విసిరేశాడు.  
   
    గెంటేయాబదినందుకు వైధేయబాధపడలేదు. అసలు అవమానాలు అతనికి కొత్తాకావు కూడా.
   
    కానీ రాసుకున్న కాగితాలు ఎక్కడో జారినందుకు కలవరపడ్డాడు. గుండెవేదన్ని నివేదనగా మార్చుకుని కూర్చిన అక్షరాల తోరణాల్ని పోగొట్టుకున్నందుకు కుమిలిపోయాడు___
   
    సరిగ్గా అప్పుడే పరిచయమైండా పిచ్చిది ___
   
    మామూలుగా కాదు...... చెత్తకుండీలోదొరికిన కాగితాల్ని పిచ్చిగా చూస్తూ....   
   
    మిధులానగరం రాజుకిసీత లభ్యమైనట్టు అ పిచ్చిదానిమూలంగా వైధేయకితన "మైథలి" లభ్యమైంది.
   
    అ 'మైథిలే' ఆ తర్వాత అతన్ని రచయితగా మార్చిందికూడా.
   
    అదే ఆ పిచ్చిదానితోఉన్న బంధమూ అనుబందమూను.__
   
                    *    *    *    *   
   
    రాత్రి తొమ్మిదీ నలభై అయిదు.
   
    పదీ నలభైకల్లా వైధేయ ఓ కారును సంపాదించి దానితోపాటుసిటీ అవుట్ స్కర్ట్స్ లో వున్న పెట్రోలు బంక్ దాటిహైవేలోనిసంకేతస్థలం దగ్గర వేయిట్ చేస్తుండాలి.
   
    వైధేయ నడుస్తున్నాడు సాలోచనగా చుట్టూ పరికిస్తూ. అబిడ్స్ మెయిన్ రోడ్డు దీపాల కాంతిలో మెరిసిపోతూంది. భాగ్యనగరంలో చాలా ఖరీదైన సెంటరది. అందుకే ఆ సమయంలో కూడా పట్టపగల్లా జనంతో సందడిగా వుంది.
   
    జనం పలుచగా వున్న గన్ ప్రౌ౦డ్రీ వరకూ నడిచిన వైధేయఅక్కడ ఆగి వున్న కార్లను చూస్తూ నిలబడ్డాడు పుట్ పాత్ పై....
   
    అలవాటుని ఔపోసనం .... కొన్ని క్షణాలపాటు వచ్చే పోయే వాళ్ళను చూస్తూ వుండిపోయిన వైధేయ ధైర్యాన్ని కూడగట్టుకుని పార్కు చేయబడిన నాలుగు కార్లలో ఓ అంబాసిడర్చేరుకున్నాడు......
   
    అటూ ఇటూ ఓ మారు చూసి కేజువాల్ గా డోర్ హేండిల్ పట్టుకుని లాగేడు.  
   
    చేతులు వణుకుతూంటే డోర్ తెరిచాడు లోపల కూర్చోవాలన్నాఉద్దేశ్యంతో .....
   
    "క్యాహొనా'
   
    ఉలిక్కిపడ్డాడు......
   
    ఆ కంఠం వినిపించింది బయట నుంచి కాదు..... లోపలనుంచే......
   
    క్షణంలో గొంతు పిడచకట్టుకుపోయింది.
   
    "ఎవర్నువ్వు ___ఇది నా కారు ____" నిషాగా అన్నాడు వైధేయ తాగినట్టు నటిస్తూ___
   
    "మీ కార్నేంబరెంత ___" అడిగాడు ఓ భారీకాయుడు లోపల్నుంచి.
   
    "ఎడిటి ఇరవై రెండు షిక్సీత్రీ ...."
   
    "సారీసర్...... ఇది ఎబిక్స్ త్రిబులేయిట్ వన్ "
   
    "షారీ' తూలుకుంటూ తిలక్ నగర్ కు వెళ్ళే సందు వరకూ నడచి చీకట్లో నిలబడ్డాడు అలజడి చల్లారేవరకూ"డేమిట్..... ఆదిలోనే హంసపాదు"
   
    వాచీ చూసుకున్నాడు. పది కావోస్తోంది.
   
    అంటే మరో నలభైనిముషాలు __ ఏదో గగుర్పాటు శరీరంలో ___
   
     రామ్ కోట్ వెళ్ళే మార్గంలో చాలావేగంగా నడుస్తుంటే అక్కడ చీకటిలో వారగా ఓ కారు పార్కుచేసి వుంది. గోధుమ రంగు కారది.
   
    కణతలపై నుంచి ధారాపాతంగా కారుతున్న చెమటని కర్చీఫుతో తుడుచుకున్నాడు.
   
     టైమ్ దగ్గర పడుతున్నకొద్దీ టెన్షన్.

 Previous Page Next Page